అమరావతి నిర్మాణ మోసాలపై కోర్టు కెక్కనున్న రిటైర్డ్ IAS అధికారి EAS శర్మ
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5902228
ఎందుకీ రహస్యం?
రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా అభివృద్ధికి వివాదాస్పద స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో ప్రహసనానికి తెరలేపిింది. అత్యంత విలువైన భూములను నామమాత్రపు ధరకే సింగపూర్ కన్సార్షియంకు కట్టబెట్టి, పన్నుల్లో రాయితీలిచ్చి, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చి, వాటి లాభాలకు గ్యారంటీ ఇచ్చే విధానానికి ఇంత బాహాటంగా ప్రభుత్వం మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో చాలా రాష్ట్ర రాజధానులను నిర్మించారు. కానీ, అమరావతి నిర్మాణం పేరుతో సృష్టించినంత హైప్ ఎవరూ సృష్టించలేదు. విదేశీ కంపెనీలతో కుమ్మక్కై, వాటి గొంతెమ్మ కోర్కెలన్నిటినీ తీర్చడానికి చంద్రబాబు మోకరిల్లినంతగా ఎవరూ మోకరిల్లలేదు.
అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మించడానికి బదులు కార్పొరేట్ల కోసం విదేశీ కంపెనీల చేత నిర్మించే సాహసం ఈయన చేసినంతగా ఎవరూ చేయలేదు. గత నెలలో సింగపూర్ కన్సార్షియం ముసాయిదా ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినప్పుడు ఈ కన్సార్షియంలో సింగపూర్ ప్రభుత్వ వాటా 75 శాతం దాకా వుంటుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు దాని గురించి కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. ఆనాడు సింగపూర్ కంపెనీలు 42 శాతం ఈక్విటీ కోరగా, ఈనాడు దానిని 58 శాతానికి ప్రభుత్వం పెంచేసింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో సింగపూర్ కంపెనీల వాటా 306 కోట్లు అయితే, ప్రభుత్వ వాటా 221 కోట్లు. దీనిపై వచ్చే రెవిన్యూలో ఎవరి వాటా ఎంత అన్నదగ్గరకొచ్చేసరికి అంతా గోప్యం అంటున్నారు. సింగపూర్ కన్సార్షియంలో భాగస్వాములైన రెండు ప్రధాన సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు అసెండాస్ సింగ్ బ్రిడ్జి, సెంబో క్రాప్ డెవలప్మెంట్ లిమిటెడ్‌లతో ప్రభుత్వం కుమ్మక్కైందనడానికి ఇదొక నిదర్శనం.
అసలు ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతే లోపభూయిష్టమైనది. రాజధాని నిర్మాణం కోసం బహిరంగంగా టెండర్లను ఆహ్వానించి, అందులో తక్కువ రేటు కోట్ చేసినవారిని ఎంపిక చేయడం ఉత్తమ మైన పద్ధతి, ఎంతోకాలంగా అందరూ ఆచరిస్తూ వస్తున్న పద్ధతి. అటువంటి పద్ధతిని పక్కన పెట్టి వివాదాస్పదమైన స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నట్లు? వామపక్షాలతో సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం అటువైపే ఎందుకు పరుగులు తీస్తున్నట్లు ? మహారాష్ట్రలో ఎన్రాన్ అనుభవం కళ్లెదుట వున్నా విదేశీ కంపెనీలకు రాయితీలు, చౌకగా భూములు కట్టబెట్టేందుకు ఎందుకు సిద్ధపడుతున్నారు? వీటికి చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పారదర్శకత గురించి గొప్ప గా చెప్పే చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్షియం స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసి నిర్మాణ కట్టడాలు, ప్ల్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటా పంపిణీకి సంబంధించిన ప్రతిపాదనలను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటి? ఈ వివరాలను బహిర్గత పరిస్తే గ్లోబల్ బిడ్డింగ్ కంపెనీలు పోటీపడి అంతకన్నా మెరుగైన ప్రతిపాదనలతో ఎక్కడ ముందుకొస్తాయోనన్న భయంతోనే ఈ పని చేశారా? ఈ మొత్తం వ్యవహారంలో సింగపూర్ కన్సార్షియం తీరు చూస్తుంటే ‘మా ఇంటికొస్తే ఏం తెస్తావ్, మీ ఇంటికొస్తే మాకేం ఇస్తావ్’ అన్న నానుడిని గుర్తు చేస్తోంది. నిర్మాణం చేపట్టక ముందే ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోతే, రద్దయితే దానికి పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి, ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని భారతీయ కోర్టుల్లో కాకుండా లండన్ కోర్టులో పరిష్కరించుకోవాలని షరతుల మీద షరతులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపాల్సిందిపోయి, దానికి జీ హుజూర్ అనడం చాలా సిగ్గు చేటు.
ఇది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టడమే. సీడ్ కేపిటల్ ఏరియా అభివృద్ధికి అడ్డంకిగా వున్న శ్శశానాలను, ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తొలగించి ఒకే చోట 1600 ఎకరాల భూమి ఇవ్వాలని, విద్యుత్, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని సింగపూర్ కంపెనీలు కోరితే దానికి సంతోషంగా ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వచ్చే ఆదాయంలో ప్రభుత్వ వాటా గురించి మాట్లాడకపోవడం విచిత్రంగా వుంది. రాష్ట్ర వనరులు, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును విదేశీ కంపెనీలకు కట్టబెట్టి ప్రపంచంలోనే గొప్ప రాజధానిని నిర్మిస్తామంటే ప్రజలు దానిని హర్షించరు. రాష్ట్ర ప్రయోజనాలను విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతికి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పాలి.
Alupergani Praja Poratam chesthunna …..Oke Okkadu
Annallu brathikamu anedhi kadhu …
Brathikinnannallu ala brathikamu anedhi mukhyam – YS JAGAN
Neethimalina Jathi ki …..Nythika viluvalu andhuku vuntayi ??
http://telugu.greatandhra.com/politics/political-news/chandrababu-di-naithika-otami-72965.html
Kulam…..Dhanam……Manam……..Jeevitham …..Antham ?
What a waste of human life ??
Guntur aa …..Manavadu kadha ?……aithe manaku andhukula ?
Adhe manvadu aithe ……Inko Padma award ??
Chee …chee….kondhari siggumalina brathukulu.
http://www.sakshi.com/news/sports/robbed-the-olympic-legend-of-an-indian-swimming-hero-364336?pfrom=home-top-story
AP లో సోలార్ ప్లాంట్ పెట్టాలని ముందుకు వస్తే 15 కోట్లు లంచం అడిగారు
-అమెరికా సంస్థ సన్ ఎడిషన్
ఇటీవలే అవినీతి లో AP నంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే తేల్చి చెప్పింది
ఎవరక్కడ,30 Years ఇండస్ట్రీ నిప్పు రాజ్ ఇక్కడ !!!
http://teluguglobal.com/sun-edition-solar-plant-tg/
విశాఖ లో జగన్ ను అవమానించిన బాబు సర్కారు -కడుపు మంట మరి
http://teluguglobal.com/ys-jagan-vishaka-tour/