స్విస్ ఛాలెంజ్‌పై 20 ప్రశ్నలు- ముఖ్యమంత్రికి CPM బహిరంగ లేఖ
3. సింగపూర్ కంపెనీలు రాజధానికి, రాష్ట్రానికి, ప్రజలకు చేసే మేలేమిటి? 1691 ఎకరాల్లో ప్లాట్లు వేసుకుని అమ్ముకుని లాభాలు గడించడం తప్ప వేరే బాధ్యత వారికి వుందా? ఇది రియల్ఎస్టేట్ వ్యాపారం కాదా?
4. స్విస్ ఛాలెంజ్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం అన్ని అంశాలు పారదర్శకంగా బహిర్గత పరచాల్సి ఉండగా ప్రభుత్వానికి చెల్లించే ఈక్విటీ మొత్తం సీల్డ్ కవర్లో ఉంచి రహస్యంగా ఉంచడం పోటీకి ఇతర సంస్థలు రాకుండా నిరోధించడం కాదా? సింగ్‌పూర్ కంపెనీలకు మేలు చేయడం కాదా?
5. ఛాలెంజ్ చేసే ఇతర కంపెనీలు మెరుగైన ఆర్థిక ప్రతిపాదనలు చేస్తే వారికి ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమా? సింగపూర్ కన్సార్టియం ముందు ఇతర కంపెనీల ప్రతిపాదనలను ఉంచి సింగపూర్ సంస్థలకే అవకాశం ఇచ్చే నిబంధనలు పెట్టడం మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? స్విస్ ఛాలెంజ్ కాకుండా ఓపెన్ బిడ్ విధానానికి ప్రభుత్వమెందుకు వెనకాడుతోంది ?
6. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని విభజన చట్టంలో పేర్కొనబడటం, మౌలిక సదుపాయాల పేరుతో స్టార్టప్ ఏరియాలో 5,500 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే.. ప్రైవేట్కంపెనీల అవసరమేమిటి ?
7. 1691 ఎకరాల భూమి ప్రైవేట్ కంపెనీలకు దఖలు చేస్తున్నందున వాటి విలువను అమరావతి డవలప్మెంట్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వ వాటాగా ఎందుకు పరిగణించరు? కారు చౌకగా భూములను కన్సార్టియంకు ఎందుకు అప్పచెప్పాలి? సిసిడిఎమ్సి వాటా 42 శాతంగానే ఉంచటం అన్యాయం కాదా?
8. ఎడిపి చైర్మన్‌గా కన్సార్టియం సూచించిన వ్యక్తిని నియమించాలనడం, వివాదాలు లండన్ కోర్టులో తేల్చుకోవడం, ప్రాజెక్టు నిలిచిపోతే ప్రభుత్వం పెనాల్టీలు చెల్లించడం తదితర విషమ షరతులు ఆమోదించడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదా?
9. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఎంత ఆర్ధిక సహాయం చేస్తుంది? అసెండాస్, సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కావా? వీటిని సింగపూర్ ప్రభుత్వ సంస్థలుగా మీరు చెప్పడం అవాస్తవం కాదా?
10. కన్సార్టియం సంస్థలకు మూల సంస్థ టెమశాక్ కంపెనీలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రజల పెట్టుబడులు ఉన్న మాట నిజం కాదా? ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు వాటాలు లేవని చెప్పగలరా?
11. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చారని మీరు ప్రకటించారు. సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీకి రూ14 కోట్లు సిఆర్డిఎ చెల్లించడం నిజమా? కాదా?
12. ఛాలెంజ్‌లో పాల్గొనే కంపెనీల అర్హతలకు పెట్టిన నిబంధనలు (1000 హెక్టార్ల ప్రాజెక్టు అభివృద్ధి, 2 వేల కోట్ల రూపాయల నికర ఆదాయం, 50 లక్షల చదరపు అడుగుల నిర్మాణ అనుభవం, 25 వేల మందికి ఉపాధి కల్పన, ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం) సింగపూర్ కన్సార్టియమే రూపొందించగా వాటిని ప్రభుత్వం ఆమోదించడం ఏకపక్షం కాదా? ఇతర స్వదేశీ, చిన్న సంస్థలకు అవకాశం లేకుండా చేసి సింగపూర్ సంస్థలకు మేలు చేయటం కాదా?
15. రాజధానిలో త్యాగం చేసి భూములిచ్చిన రైతులకు 18 నెలలుగా ప్లాట్లు కేటాయించకపోవడం, 3 సంవత్సరాల తరువాత ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని నిబంధనలు విధించిన ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు మాత్రం 24 నెలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఇస్తామనడం రాజధాని రైతులకు ద్రోహం కాదా?