రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కన్సార్టియం సమర్పించిన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సమర్పించేవారి కోసమని టెండరు ప్రకటన జారీచేసింది. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను పరిశీలిస్తే వీటిలో ఎక్కడా ఛాలెంజ్ అనేదే కనిపించటం లేదు. ఛాలెంజ్ చేసేవారు తాము అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యంగా రాజధాని నిర్మాణం చేస్తామని, తనకన్నా తక్కువకు చేసేవారుంటే రావచ్చునని ప్రకటిస్తే అది ఛాలెంజ్ అవుతుంది. కానీ సింగపూర్ సంస్థలు తాము అత్యంత ఎక్కువ లాభం పొందేలా ప్రతిపాదనలు రూపొందించి, మరెవరూ పోటీకి రావటానికి వీలులేని విధంగా ప్రభుత్వంతో నిబంధనలు రూపొందింపజేసి, తాము ఛాలెంజ్ చేస్తున్నామనటం హాస్యాస్పదం. సింగపూర్ సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనలను యథాతథంగా పెట్టి ప్రభుత్వ నిబంధనలను ఉపసంహరించుకుంటే దేశీయంగా అనుభవం ఉన్న ఏ నిర్మాణ సంస్థ అయినా వారి ప్రతిపాదనలను ఛాలెంజ్ చేయగలదు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూ సమీకరణ ప్రారంభించినప్పటి నుంచి సింగపూర్ సంస్థలే రాజధాని నిర్మాణం చేస్తాయని పదేపదే చెబుతున్నది. ఆ దేశ కంపెనీలే రాజధాని నిర్మాణం చేసేలా సింగపూర్ ప్రభుత్వంతో గతంలోనే రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సింగపూర్ కంపెనీలు తీసుకురావని ప్రభుత్వం వెల్లడించిన ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అప్పులు, ఈక్విటీల రూపంలో సమకూర్చుకుంటాయి. రుణాలు పొందటం కోసం ఆర్థిక సంస్థల వద్ద భూములను తనఖా పెట్టుకోవటానికి వీలుగా ప్రభుత్వం జిపిఎ ఇస్తుందని చెప్పారు. దీనితోనే సింగపూర్ సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా వందల కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. పిపిపి ప్రాజెక్టులలో ప్రయివేటు కంపెనీలు ఖర్చును 50 శాతం వరకు ఎక్కువగా చూయించి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందుతాయి. అందువల్ల అవి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకముందే వాటికి లాభాలు వస్తాయి. దేశీయ సంస్థలే ఈ విధంగా చేస్తుంటే ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టుకున్న సింగపూర్ సంస్థలు మరెంత ఎక్కువకు తమ ప్రతిపాదనలు రూపొందించి ఉంటాయో ఊహించుకోవచ్చు
ప్రాజెక్టుకు మధ్యలో విఘాతం కలిగితే ఎవరెంత పరిహారం భరించాలని చెప్పిన విషయాలు చూస్తే సింగపూర్ కన్సార్టియం దోపిడీ స్వభావం బయటపడుతుంది. రాజకీయేతర కారణాలతో ప్రాజెక్టు నిలిచిపోతే అప్పు, ఈక్విటీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. పరోక్ష రాజకీయ కారణాలైతే అప్పుతో పాటు 110 శాతం ఈక్విటీ చెల్లించాలి. ప్రత్యక్ష రాజకీయ కారణాలైతే అప్పుతో పాటు 150 శాతం ఈక్విటీ 16 శాతం వడ్డీ చెల్లించాలి. సింగపూర్ కన్సార్టియం, సిసియండిసియల్ (రాజధాని నగర అభివృద్ధి నిర్వహణ కార్పొరేషన్ లిమిటెడ్) సంయుక్తంగా ఏర్పాటుచేసే (అమరావతి డెవలప్మెంట్ పార్టనర్) ఎడిపి విఫలమైతే ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు 100 శాతం, వాటా మూలధనం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రాజెక్టు రద్దయితే అప్పుతో పాటు 150 శాతం ఈక్విటీ 16 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి. వీటిలో ఏ ఒక్క డిమాండూ సమంజసంగా లేదు. వ్యాపారం చేసేవారెవరైనా లాభాలతో పాటు నష్టాలకు కూడా సిద్ధపడాలి. కానీ పైన చెప్పినవాటిలో ఏ కారణాలతో సంస్థకు నష్టాలు వచ్చినా సింగపూర్ కన్సార్టియానికి రూపాయి కూడా నష్టం రాదు. నష్టాలొచ్చే వాటన్నింటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పటంతో పాటు, అందులో కూడా వీరు లాభాలను వెదుక్కొంటున్నారు
‘మీరు పప్పులు తీసుకురండి. మేం పొట్టు తెస్తాం. ఇద్దరం కలిసి ఊదుకుతిందాం’ అన్న చందంగా సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలున్నాయి. సింగపూర్ కన్సార్టియం వల్ల ఏదైనా నష్టం జరిగితే వారెంత పరిహారం చెల్లిస్తారో ఎక్కడా చెప్పలేదు. వ్యాపారంలో ఇద్దరూ భాగస్వాములైనప్పుడు ఒకరు నష్టాలు భరించటం, ఇంకొకరు లాభాలు పోగుచేసుకోవటం సమంజసమేనా? ఇందులో ఛాలెంజ్ ఎక్కడుంది? నిర్మాణ సంస్థలో సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం, సిసియండిసియల్కు 42 శాతం వాటాలుంటాయి. మూడో దేశం నుంచి భాగస్వామిని చేర్చుకున్నా సిసిడియంసియల్కు 26 శాతం వాటాకు తగ్గరాదని చెప్పారు. అంటే సింగపూర్ కన్సార్టియం వాటా తగ్గదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా తగ్గిన మేరకు ఆదాయం కూడా తగ్గుతుంది. ఆదాయం కోసమే రాజధాని నిర్మాణం సింగపూర్ కంపెనీకిచ్చామని చెబుతున్నారు. మూడొంతుల వాటా ఇతరుల చేతికి పోయిన తర్వాత ప్రభుత్వానికొచ్చే ఆదాయం ఏముంటుంది? ఆదాయ పంపకంలో ఎవరి వాటా ఎంత అనేదానిపై సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనను రహస్యంగా ఉంచారు. సింగపూర్ కన్సార్టియంకు ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తేనే కదా ఆ సంస్థ ప్రతిపాదనలను ఛాలెంజ్ చేసేవారికి స్పష్టత వచ్చేది. ఆదాయ వాటాలను బయట పెట్టటానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను ఛాలెంజ్ చేయవచ్చని చెప్పిన ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ప్రభుత్వం ఆ సంస్థకే కాంట్రాక్టును ఖరారు చేస్తుందని స్పష్టం చేస్తున్నాయి. పోటీకి వచ్చే సంస్థలు సంవత్సరానికి రూ.600 కోట్ల చొప్పున వరుసగా మూడు సంవత్సరాలు ఆదాయం పొంది ఉండాలి. 2,500 ఎకరాలను ఇప్పటికే అభివృద్ధిచేసి, 750 ఎకరాలను మార్కెటింగ్, 50 లక్షల చదరపు అడుగులలో నిర్మాణాలు చేసి ఉండాలి. 25 వేల మందికి ఉపాధి కల్పించి ఉండాలని, ప్రభుత్వంతో కలిసి దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో కనీసం రెండు జాయింట్ వెంచర్లు చేసి ఉండాలి. ఈ షరతులతో ఏ సంస్థ అయినా పోటీకి అర్హత సంపాదిస్తుందా? నిర్మాణ సంస్థల చరిత్ర తెలుసుకొని, ఏ సంస్థా పోటీలోకి రావటానికి వీలులేని విధంగా నిర్మాణరంగంలో నిపుణులుగా ఉన్న వారు రూపొందించిన నిబంధనలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని రూపొందించిందని చెబుతున్నా వాస్తవంలో వీటిని కూడా సింగపూర్ కన్సార్టియమే రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చి ఉంటుంది. ఈ షరతులకు సింగపూర్ కన్సార్టియం కూడా క్వాలిఫై కాదు. మూడు సంస్థలు కలిసి నిన్నగాక మొన్న ఏర్పడిన సింగపూర్ కన్సార్టియంపై నిబంధనలలో ఏ ఒక్కదానికీ అర్హత సాధించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని నగర అభివృద్ధి నిర్వహణ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మాత్రం ఆ అర్హత ఎక్కడిది? ఈ రెండూ కలిసి ఏర్పాటు చేసిన ఎడిపికి మాత్రం ఆ అర్హత ఎలా వస్తుంది? తమ అనుయాయులైతే ఏ అర్హతలూ అవసరం లేదా? ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనలే స్విస్ ఛాలెంజ్ అంతా బోగస్ అని స్పష్టం చేస్తున్నది.
సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను ఛాలెంజ్ చేయటానికి టెండర్లు పిలిచామని చెబుతున్న ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం, రాజధాని నగర అభివృద్ధి నిర్వహణ కార్పొరేషన్ లిమిటెడ్‌లు కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్‌ను ఏర్పాటు చేస్తామని ఎలా ప్రతిపాదించింది? రేపు సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను మించి మరో కంపెనీ ప్రతిపాదనలు చేస్తే వారే కదా ప్రధాన అభివృద్ధిదారుగా ఉండేది. అలాంటప్పుడు అప్పుడే ఛాలెంజ్ అయిపోయినట్లు, సింగపూర్ కన్సార్టియమే తుదకు నిలబడినట్లు ప్రభుత్వం ఎలా చెబుతుంది? అంతగట్టిగా ప్రభుత్వం చెప్పటమనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది, ఇతరులెవరూ పోటీచేయలేని విధంగా ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం ముందుగానే ప్లాన్ ప్రకారం నిబంధనలు రూపొందించి ఉండాలి. రెండవది, ఎవరైనా పోటీకి వచ్చి మెరుగైన ప్రతిపాదనలు సమర్పించినా వారికి సహకరించబోమని బెదిరించి వారంతటవారు వదులుకొని పోయేలా చేయగలమనే నమ్మకం ఉండటం అయినా కావాలి. ఏ విధంగా చూసినా ప్రభుత్వం సదుద్దే శంతో వ్యవహరించటం లేదని స్పష్టమౌతున్నది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగ ఫలితాన్ని, ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని సింగపూర్ కన్సార్టి యంకు ధారపోయటానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిం చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక విదేశీ ప్రయివేటు కంపెనీకి ఆయాచిత లబ్ధి కలిగించేలా ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ కంపెనీ నుంచి పెద్దమొత్తంలో లంచాలైనా తీసుకొని ఉండాలి లేదా ఆ కంపెనీలో వీరికి పెద్దమొత్తం వాటాలైనా ఉండి ఉండాలి. వీటిలో ఏది కారణమైనా నేరస్తులే అవుతారు. ఒకవైపు తమ స్వప్రయోజనాల కోసం నేరపూరితంగా వ్యవహరిస్తూ, తమ విధానాలను వ్యతిరేకించేవారంతా అభివృద్ధి నిరోధకులని ప్రభుత్వం ముద్రవేస్తున్నది. ప్రజలు ఈ మోసపూరిత ప్రచారాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలి.
Kulam …..Manam……Dhanam……Jeevitham ?
Neethimalina Jathi ……Siggumalina panulu.
Please use the Social media to expose this unethical yellow weed.
http://www.sakshi.com/news/district/tdp-mp-galla-jayadev-house-owner-met-cm-chandrababu-naidu-over-house-dispute-366135?pfrom=home-top-story
కుమ్మేయ్ బాబూ !!!
సగటున థర్మల్ మెగా వాట్ కు అయ్యే ఖర్చు కోట్లలో
-India- 3.74, Telangana -4.62, AP- 5.975
AP లో అదనపు ధర చెల్లించడం ద్వారా నిప్పు నారా బాబు జేబులోకి 2,302 కోట్లు
APలో కొత్తగా ఆరు అణు విద్యుత్ కేంద్రాలు
ఇతర రాష్ట్రాలు మాకొద్దు ఈ అణు విద్యుత్ కేంద్రాలు అని గోల చేస్తే తెచ్చి AP లో పెడుతున్నారు ఇవి మాత్రం కృష్ణ గుంటూరు లో పెట్టరు దయగల ధర్మ ప్రభువులు,మిగితా జిల్లాలలో పెడతారు.ఏమైనా అణు ప్రమాదాలు జరిగితే పోయేది మిగితా కులాల వారే కదా !!!
http://kommineni.info/articles/dailyarticles/content_20160722_5.php?p=1469165873842