ఏకపక్ష నిర్ణయాలతో దారి తప్పుతున్న రాష్ట్రం-తెలకపల్లి రవి

ఏకపక్ష నిర్ణయాలతో దారి తప్పుతున్న రాష్ట్రం-తెలకపల్లి రవి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థత గురించి, దూరదృష్టి గురించి తెలుగుదేశం నేతలు వారి అనుకూల శక్తులు నిరంతర ప్రచారం హౌరెత్తిస్తుంటాయి. విజన్‌, విదేశీ యాత్రలతో ముచ్చట్లు చెబుతుంటారు. ఈ ప్రభుత్వ పదవీ కాలం ఇప్పటికే రెండోసగానికి చేరుకుంది. ఈ కాలంలో చెప్పిన మాటలూ చేసిన పనులూ చూస్తే అస్తవ్యస్తంగా అప్రజాస్వామికంగా తయారైనాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం అచ్చమైన సింగపూర్‌ రియల్‌ వెంచర్‌గా కనిపిస్తున్నది. తాత్కాలిక సచివాలయం తరలింపు తతంగం వాయిదాల ప్రహసనంగా మారిపోయింది. పదేళ్ల కాలం ఉమ్మడిగా అవకాశం సాధించుకున్నాక పది నెలల్లోనే రాజకీయ అభద్రతతో హడావుడి పడిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ఏడాది గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితికి కారకులైనారు.

ప్రజలకు, రాష్ట్రానికీ ఛాలెంజ్‌
రాజధాని నిర్మాణాన్ని అసెండాస్‌, సింగ్‌బ్రిడ్జి సెంబ్‌ కార్ప్‌ కూడిన కన్సార్టియంకు కట్టబెట్టేందుకు మంత్రి వర్గం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీనికి స్విస్‌ ఛాలెంజ్‌ అని పేరు పెట్టినా వాస్తవంలో ఆ నియమ నిబంధనలు రాష్ట్రానికి ప్రజలకూ ఛాలెంజ్‌గా వున్నాయి తప్ప కన్సార్టియం ఎదుర్కొంటున్న ఛాలెంజిలు ఏమీ లేవు. వాస్తవంగా మొదటి పోటీదారు ఆమోదించిన వివరాలన్నీ బయటపెట్టి వాటిని మించి చేయడానికి సిద్ధంగా వున్న ఇతరులను తమ ప్రతిపాదనలతో రమ్మని ఆహ్వానించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. కాని ఇక్కడ మొదటి సంస్థ కమిట్‌మెంట్లన్నీ గుట్టుగా అట్టిపెట్టి ఇతరులను చెప్పమంటున్నారు. ఇతరులు కోట్‌ చేసిన తర్వాత అవి లీక్‌ కావనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మొదటివారి వివరాలు తెలియవు గనక అంతకన్నా కాస్త తగ్గించి తర్వాత బయటపెట్టవచ్చు. పారదర్శకత లేనప్పుడు అలాటి అక్రమాలు అనివార్యం. వారు ఎంత పెట్టుబడిపెడతారో ఎప్పటిలోగా తీసుకొస్తారో తెలియదు. ఆదాయంలో వారి వాటా ఎంతో తెలియదు. రాజధాని అభివృద్ది సంస్థకు 48 శాతం వాటా అయితే ఈ కన్సార్టియంకు 52 శాతం వాటా వుంటుంది. అంటే ఎవరి మాట చలామణి అవుతుంది? పైగా వారికి 1690 ఎకరాల భూమి అప్పగించడమే గాక 5,500 కోట్ల ఖర్చుతో ఇన్‌ఫ్రా సదుపాయాలు కల్పించాలి. ఆ భూమి మొత్తం అమ్ముడయ్యే వరకు ఇతర చోట్ల అభివృద్ది చేసి అమ్మకూడదు. సీడ్‌ కాపిటల్‌ ప్రాంతంలో నివాసాల నుంచి శ్మశానాల వరకూ తొలగించి వారికి హస్తగతం చేయాలి. అనుకున్న ప్రకారం అమ్ముడై లాభాలు రాకపోతే బైబ్యాక్‌ పద్ధతిలో ప్రభుత్వమే తీసుకోవాలి. ఒప్పందంలో నిబంధనల గడువు నాటికి ఆ వసతులు కల్పించలేకపోతే ఎదురు నష్ట పరిహారం ఇవ్వాలి. ఇవీ ఇలాటివి అనేక ఏకపక్ష షరతులు నోటిఫికేషన్‌లో వున్నాయి. అసలు స్విస్‌ చాలెంజ్‌ విధానమే తప్పని కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్‌ కమిటీ చెప్పింది. ఏవో అసాధారణ నిర్మాణాలకు, మాత్రమే దాన్ని వినియోగిస్తారు. కాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ సూత్రాలను కూడా పాటించడం లేదు. ఈ విమర్శలన్నీ మీడియాలో వచ్చాక ప్రభుత్వం నష్టనివారణ(డామేజీ కంట్రోలు) మొదలు పెట్టింది. అగ్రశ్రేణిపత్రిక ఒకటి అసలు సీడ్‌ కాపిటల్‌ ఎందుకు ముఖ్యమో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది ప్రాణవాయువు గనక కఠిన షరతులు వుండొచ్చని వంతపాడే విధంగా రాసింది. ఈ ఛాలెంజ్‌లు ప్రజల జీతాలను మారుస్తాయి గనక, ఖజానాకు భారాలు గనక, రేపు రాజధాని నిర్మాణానికి గుది బండలు గనక వివరాలు ముందే బయటపెట్టాలని వెంటపడాల్సిందే. కాని భద్రతా లోపాలు ఏలిన వారు గుర్తించడం లేదు. పైగా ఎదురుదాడిలోనే తలమునకలవుతున్నారు. ఏవేవో వాయిదాలేస్తూ ఉద్యోగులు అధికారులను గందరగోళ పరుస్తున్నారు. దీనివల్ల కష్టనష్టాలతో పాటు విభజిత రాష్ట్రం ప్రతిష్ట నైతిక స్థయిర్యం కూడా దెబ్బతింటున్నాయి. జరిగిన భూ భాగోతం చాలనట్టు ఇప్పుడు సేకరణ కూడా ప్రారంభించారు. ఏదో రూపంలో గరిష్టంగా భూమిని లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. బందరు పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు, గన్నవరం ఎయిర్‌పోర్టు, కర్నూలు చిత్తూరు జిల్లాల్లో అన్ని చోట్లా భూములపై పడటమే!

భూ లాభానికే వింత నిబంధనలు
ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు కూడా ఈ కోవలోనే వున్నాయి. ఒక్క ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు ఈ స్థలాలు వాటికి అప్పగిస్తారు. ఆ పార్టీ రంగంలో ఉంటే 99 ఏళ్ల వరకైనా లీజు పొడగిస్తామంటున్నారు. గతంలోనూ దేశ రాజధాని ఢిల్లీలోనూ, రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందిన పార్టీలకు సమాన ప్రాతిపదికన స్థలాల కేటాయింపు జరిగింది. తీసుకోవడం ఆయా పార్టీల నిర్ణయమైనా సమానతా సూత్రం ప్రజాస్వామ్య బద్దం. కాని ఇక్కడ శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి అసెంబ్లీలో 50శాతం పైగా స్థానాలు కలిగిన పార్టీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాలు, 25నుంచి 50 శాతం సీట్లు గల పార్టీకి రాజధానిలో అర ఎకరం, జిల్లా కేంద్రాల్లో 1000 చదరపు గజాలు ఇవ్వాలని పేర్కొంటున్నది. సభలో ఒక్క సభ్యుడు మాత్రమే ఉంటే ఇంకా చాలా తక్కువ లభిస్తుంది. ఈ నిబంధనల వల్ల మెజారిటీ కలిగిన పాలకపార్టీకే అత్యధిక ప్రయోజనం కలుగుతుంది. 25 నుంచి 49.9 శాతం వరకు స్థానాలున్నా ఇచ్చే భూమి మాత్రం ఎనిమిదవ వంతుకు తగ్గిపోతుంది. ఇక సభలో ప్రస్తుతం సభ్యత్వం లేని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు స్థలాల ప్రసక్తే వుండదు. ఎన్నికల బలాబలాలు మారిపోతే ఏం చేస్తారు? భూములు మార్పిడి చేస్తుంటారా? భూ సేకరణ జ్వరం శ్రుతిమించి రాజకీయంగానూ పాలకపక్షం మైండ్‌సెట్‌ ఎలా మారిపోయిందో దీన్నిబట్టే తెలుస్తుంది. చెన్నైలోని సదావర్తి భూముల కారుచౌక సమర్పణం విషయంలో బోనులోచిక్కినా బుకాయిస్తున్నది.

అణు కుంపట్లకు ఆహ్వానం
ఐటి టూరిజం ఫార్మా తదితర అనేక హబ్‌లు కారిడార్ల పేరిట ఊరించిన తెలుగుదేశం ప్రభుత్వం చివరకు రాష్ట్రాన్ని ప్రళయ భీకరమైన అణుశక్తి అడ్డాగా మార్చివేయడం మరో విపరీతం. దేశంలోనే న్యూక్లియర్‌ హబ్‌గా ఎపి మారబోతున్నట్టు అదికారికంగా ప్రకటిస్తున్నారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మితి వర్ధిలో నెలకొల్పదలచిన వెస్టింగ్టన్‌ హౌస్‌ అణు విద్యుత్‌ ప్రాజెక్టు(ఎన్‌పిపి)ను ఉత్తరాంధ్రలోని కొవ్వాడకు తరలించడం మొదలైంది. అక్కడే గాక తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ఇలా ఎక్కడికక్కడ ప్రజల ప్రభుత్వాల వ్యతిరేకత కారణంగా చుక్కెదురైన అణు కర్మాగారాలన్నిటినీ ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచింది. రష్యా నుంచి అమెరికా వరకూ కొన్ని అగ్రదేశాల నుంచి వచ్చే అణు విద్యుత్‌ పరికరాల వల్ల మొత్తం 63 వేల మెగావాట్లఉత్పత్తి జరుగుతుందంటే ఇందులో సగం అంటే 30 వేల మెగావాట్ల వరకూ ఎపిలోనే రాబోతున్నాయి. గతంలో చెర్నొబిల్‌ ఇటీవల ఫుకుకషిమా అణు కేంద్రాల ప్రమాదాల తర్వాత ప్రపంచం ఈ విషయమై చాలా ఆందోళన చెందుతున్నది. అందుకే తోషిబా వెస్టింగ్టన్‌ హౌస్‌ లకు గుజరాత్‌లో ప్రతికూలత ఎదురైంది. అయితే వాటిని కోరి కొవ్వాడలో పెట్టేందుకు అనుమతి లభించింది. 1100 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు రియాక్టర్లను స్థాపించడానికి 700 ఎకరాలకు పైగా భూమి సేకరించినా రానున్న ఎన్నికల రీత్యా మోడీ నాయకత్వం వెనకంజ వేసింది. ఇదేగాక ఇప్పటికే అక్కడ ఈ వ్యాపారంలో వున్న అదానీ టాటా ఎస్సాఆర్‌ వంటి కంపెనీలు కూడా ఇందుకు వ్యతిరేకత ప్రకటించాయి. గుజరాత్‌లో ప్రైవేటు విద్యుత్‌ వినియోగం అత్యధికం అనేది తెలిసిందే. ఇక రష్యన్లు సరఫరా చేసే వెవెర్‌ రియాక్టర్లు ఆరు బెంగాల్‌లోని హరిపూర్‌లో నెలకొల్పాలన్న ఆలోచన అమలు కాక ఎపికి మరల్చారు. పరిహారం బాధ్యత మాది కాదని విదేశీ కంపెనీలు ముందస్తు షరతు పెట్టి ఆమోదింపచేసుకున్నాయి. కనుక రెండు జిల్లాలకు ఒక్కోటి చొప్పున రాబోతున్న ఈ అణుకుంపటి అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం.

పరిష్కారాలకు బదులు వివాదాలు
ఈ నేపథ్యంలోనే తెలంగాణతో అపరిష్క్రత సమస్యలపై కూడా వుండాల్సిన చొరవ కొరవడుతున్నది. నదీజలాల వివాదాల పైన, హైకోర్టు సమస్యపైన, 9,10 షెడ్యూలుసంస్థల విభజన పైన ఇటీవల కాలంలో న్యాయస్థానాలు హేతుబద్దమైన తీర్పులే ఇచ్చాయి. కేంద్రం జోక్యం చేసుకుని ఉభయుల మధ్య అవగాహన తీసుకురావాలని ఆదేశించాయి. దీన్ని ఆధారం చేసుకుని త్వరితంగా నిర్దిష్టంగా అడుగులు వేయడం రాష్ట్రానికి చాలా అవసరం. కాని అనేక విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం వేడి పెంచుతుంటే ఆంధ్ర ప్రదేశ్‌ తన వైపునుంచి ఒక సమగ్ర పరిష్కార ప్రణాళిక ప్రకటించడం లేదు. హైకోర్టు విషయంలో తన ఆలోచనే బయిటపెట్టడం లేదు. భాగస్వామ్య పక్షాలుగా వున్న టిడిపి, బిజెపి దాగుడుమూతలాడుతున్నాయని ప్రత్యేకహౌదా బిల్లు వెనక్కు పోయిన తీరులోనే స్పష్టమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బదులు రాజకీయ కోణంలో ప్రతిపక్షాలపై ప్రజా ఉద్యమాలపై దాడి చేయడమే ప్రభుత్వ వ్యూహంగా వుంది. ఈ ధోరణి ఎంతో కాలం సాగబోదని ఇప్పటికే అర్థమవుతున్నది. ఏలినవారు గ్రహించకపోతే ఏం జరుగుతుందో చూడకతప్పదు.

http://www.prajasakti.com/Article/Neti_Vyasam/1819907

8 Comments

Filed under Uncategorized

8 responses to “ఏకపక్ష నిర్ణయాలతో దారి తప్పుతున్న రాష్ట్రం-తెలకపల్లి రవి

  1. Kulam …..Manam……Dhanam…….Jeevitham
    Rastram lo …..Gajji/ Gaja dongalu.

    http://telugu.greatandhra.com/politics/political-news/venkayya-em-bonkarayya-73152.html

  2. Tax payers money for providing security to these very poor in India …

    http://www.sakshi.com/news/business/nita-ambani-gets-y-category-security-cover-368750?pfrom=home-top-story

    What did Dhirubhai take with him ? Two strokes on his final journey to the hospital ?? His crores could not save him.

  3. Veera

    అవినీతిలో ,రైతుల అప్పుల్లో AP No 1-కేంద్ర గణాంకాలు
    నెల క్రితం అవినీతిలో AP నంబర్ వన్ అని కేంద్ర ఎకనామిక్ సర్వే చెప్పింది ఇప్పుడు అప్పుల ఊబిలో దేశం లోనే అత్యధికంగా AP రైతులు ఉన్నారు
    నిప్పు ఉదయం లేస్తే నంబర్ వన్ చేస్తా నంబర్ వన్ చేస్తా అని నిజం చేసాడు
    AP-93%,Telangana-89%,TN-83%,kerala-78%,Karnataka-77%
    Rajasthan-62%,
    http://telugu.updateap.com/politics/ap-on-top-place-in-farmers-loans/

  4. Veera

    నో టాయిలెట్స్-30 years ఇండస్ట్రీ నిప్పు ఇక్కడ !!!
    [నో టాయిలెట్స్ గురూ..వెలగపూడి సెక్రటేరియట్ లో
    నో టాయిలెట్స్ గురూ!వెనక్కి వచ్చిన మరో బ్యాచ్ సిబ్బంది -ఇది ఒక ఆంగ్ల పత్రిక పెట్టిన శీర్షిక.ఇది ఎక్కడ అనుకుంటున్నారు?విజయవాడ సమీపంలోని తాత్కాలిక సచివాలయం వెలగపూడిలోని పరిస్తితి . మరో బ్యాచ్ సిబ్బంది సుమారు ఏభై మంది వెలగపూడి వెళ్లడం, అక్కడ ఏమీ లేదని తిరిగి రావడం జరిగింది.

    విజిలెన్స్ కమిషనర్ ఎస్.వి ప్రసాద్ తన కార్యాలయాన్ని ప్రారంబించడం మాత్రమే జరిగింది.తాత్కాలిక సచివాలయ భవనంలో టాయిలెట్లు,డ్రైనేజీ సదుపాయం ఇంతవరకు ఏర్పాటు కాలేదట.

    ఒక అదికారి రెస్ట్ రూమ్ కోసం కారులో వెలగపూడి నుంచి విజయవాడకు వెళ్లవలసి వచ్చిందట.

    ఇప్పటికి ఏడోసారి సచివాలయం టైమ్ డెడ్ లైన్ మిస్ అయందని మరో పత్రిక రాసింది.అక్కడ ఇంటరీయర్ పనులు పూర్తి కాలేదు.కరెంటు పనులు కూడా కాలేదు. సరైన సదుపాయాలే లేవు.అయినా ప్రబుత్వం ఎందుకు హడావుడి చేసి ఉద్యోగుల తరలింపు అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందో తెలియడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20160724_14.php?p=1469357435239%5D

  5. Veera

    ముద్దాయిలుగా మిగిలామా? బిజెపి అంతర్మధనం
    కాంగ్రెస్-బిజెపి కలసి కుట్ర, అవగాహనతో బిల్లును అడ్డుకున్నాయని తెదేపా ఎంపి సీఎం రమేష్ ఆరోపణ చేసినా, ఒక్కరూ స్పందించలేదంటే రాష్ట్రంలో పార్టీ దుస్థితి ఏమిటో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
    అసలు తమ పొత్తు పార్టీతోనా? కులంతోనా అన్నది అర్ధం కావడం లేదని మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ‘మా నేతల్లో కొందరికి తెదేపాతో మొహమాటమో, మరొక అభిమానమో ఉండవచ్చు. తప్పులేదు. మా మంత్రిగారొకాయనయితే మానసికంగా తెదేపా నేతగానే పనిచేస్తున్నారు. కానీ, హోదాపై పార్టీ తప్పులేదని, విభజనకు టిడిపి కూడా కారణమేనని చెప్పాలి కదా?

    http://www.andhrabhoomi.net/content/ap-1279

  6. Veera

    తుగ్లక్ పాలన కానీ సూపర్ అంటూ అను కుల మీడియా ABN/Jyothy, ETV/Enadu,TV9,NTV,TV5 డప్పు
    [పాపం అధికారులు..! గంట భేటీకి రెండ్రోజుల నిరీక్షణ
    – విజయవాడలో నిత్యం ఇదే పరిస్థితి
    వారంతా సీనియర్‌ అధికారులు. వారు కదిలి వస్తురటే ఇతరులంతా పక్కకు వైతొలగుతారు. అరత పవర్‌ఫుల్‌ వారంతా. ఇది హైదరాబాద్‌లోనే. వీరు విజయవాడ వెళ్లారంటే సాధారణ ఉద్యోగుల స్థాయికి చేరిపోతూ వరండాలకే పరిమితం కావాల్సి వస్తోరది. చిన్న ఉద్యోగులతో పాటు వారు కూడా కాలం వెళ్లదీయాల్సి వస్తోరదట. ఇది ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల పరిస్థితి. ఇక చిన్న చిన్న ఉద్యోగులు, అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.తాత్కాలిక రాజధాని విజయవాడగా మారినప్పటి నురచి అన్ని కీలక సమావేశాలు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటున్నాయి. ప్రతి సమావేశానికి హైదరాబాద్‌ నురచి ముఖ్యమైన అధికారులంతా తరలివెళ్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా అనేక సమావేశాలు నిర్వహిస్తురడడంతో అధికారులు హడావుడిగా విమానాల్లో విజయవాడకు చేరుకోవాల్సి వస్తోరది. అనుకున్న సమయానికి సమావేశాలు జరగకపోవడం, కొన్ని సమావేశాలు అసలు లేకుండానే వాయిదాలు పడడంతో అధికారులు ఇబ్బరదులు పడుతున్నారు. ఒక్కోసారి రెండేసి రోజులు సమావేశాలు వాయిదా పడి అధికారులు విజయవాడలోనే ఉరడిపోవాల్సి వస్తోరది. ఆ సమయమంతా వారు కారిడార్లలోనే గడపాల్సి వస్తోరది.

    తాజాగా రాష్ట్రంలో అమలు చేసే వివిధ ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు నిధుల అరశంపై వివిధ శాఖల అధికారులు విజయవాడకు తరలివెళ్లారు. అయితే గంట సేపు సాగే ఈ సమీక్ష కోసం అక్షరాలా రెరడు రోజులపాటు వేచి చూడాల్సి వచ్చిరదట. చివరకు సమీక్ష లేకుండానే వెనుదిరిగారు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు అనేకం అంటున్నారు. ఒక సమావేశానికి అధికారులకు సమయం ఇచ్చి, వారంతా సిద్ధంగా ఉన్న సమయంలో వేరే శాఖతో సమావేశాలు నిర్వహిరచడం, మురదుగా అనుకున్న సమీక్షను వాయిదా వేయడం పరిపాటైంది.

    http://www.prajasakti.com/Article/AndhraPradesh/1819966

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s