ఆత్మరక్షణలో టీడీపీ లో చేరిన వైసీపీ మ్మెల్యే లు, టీడీపీ లో చేరి తప్పు చేశామా?

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5975003

3 Comments

Filed under Uncategorized

3 responses to “ఆత్మరక్షణలో టీడీపీ లో చేరిన వైసీపీ మ్మెల్యే లు, టీడీపీ లో చేరి తప్పు చేశామా?

  1. Veera

    మీడియాలో ప‌ట్టు కోసం చంద్ర‌బాబు స్కెచ్..!
    (ఈనాడు/ETV, జ్యోతి/ABN,TV9,NTV,TV5,Express TV,MahaNews,Gemini News, కూడా బాబు కులస్థులవే , అను కుల భజన మీడియా నే )

    ఏపీలో కొత్త త‌తంగం మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే స‌ర్కారు దానికి శ్రీకారం చుట్టింది. రెండు మూడు ముహూర్తాలు దాటిపోయాయి. అయితే ఇక వ‌చ్చే ఆగ‌ష్ట్ త‌ర్వాత ఎప్పుడైనా ఈ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఓ ప్ర‌జ‌లంద‌రికీ ఎంతో ప్ర‌యోజ‌నం అని చెబుతూనే మ‌రోవైపు త‌మ అనుకూల సంస్థ‌ల చేతుల్లోకి మొత్తం మీడియాను తీసుకొచ్చే స్కెచ్ తో చంద్ర‌బాబు సాగుతున్నారు. ఫోర్త్ ఎస్టేట్ పూర్తిగా త‌న గుప్పిట్లోనే ఉండేలా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు.

    ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి కంట‌గింపుగా మారింద‌న్న నేప‌థ్యంలో ఓమారు ఎన్టీవీని కి తెర‌దించేశారు. సుమారు నెల రోజుల పాటు ఆ చానెల్ ప్ర‌సారాలు ఆగిపోయాయి. చివ‌ర‌కు ప్ర‌భుత్వంలో రాజ్యాంగేత‌ర శ‌క్తిలా వ్య‌వ‌హ‌రిస్తున్న వారితో రాజీప‌డ‌డంంతో వారికి మెక్షం ల‌భించింది. ఆ త‌ర్వాత ముద్ర‌గ‌డ ఉద్య‌మం సంద‌ర్బంగా సాక్షిచానెల్ క్లోజ్ అయ్యింది. ఉద్య‌మం సాగించ‌డంతో చివ‌ర‌కు అవ‌కాశం దొరికింది. అయితే అదంతా కేబుల్ ఎమ్ఎస్వోల మీద ఆధార‌ప‌డి చేయాల్సి వ‌చ్చింది. ప్ర‌భుత్వం ఆదేశాల‌తో చానెల్ ప్ర‌సారాలు ఆపాల్సి వ‌చ్చింది. కానీ కొంద‌రు ఎమెస్వోలు అక్క‌డ‌క్క‌డా నిలిపివేయ‌కుండా అప్ప‌ట్లో ఎన్టీవీని, ఆత‌ర్వాత సాక్షిటీవీని ప్ర‌సారాలు చేశారు. దాంతో ఇక మొత్తం వ్య‌వ‌హారం త‌న చేతుల్లోకి తీసుకునే ప‌థ‌కంలో భాగంగా చంద్ర‌బాబు ఫైబ‌ర్ గ్రిడ్ ను తెర‌మీద‌కు తెచ్చారు.

    అందులో భాగంగా ఇంట‌ర్ నెట్, టీవీ, ఫోన్ కేవ‌లం 149 రూ.ల‌కే అందిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ఓ వైపు ఉదార‌త‌ను చాటుకుంటూనే మ‌రోవైపు అదే స‌మ‌యంలో రాష్ట్ర‌మంతా కేబుల్ ప్రసారాల‌ను త‌న కంట్రోల్ కి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా తాజాగా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం 5 జీవీ కెపాసిటీతో 15ఎంబీపీఎస్ స్పీడ్ తో నెట్ ను అందిస్తామ‌ని ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే సంస్థ చెబుతోంది. నెట్ వినియోగ‌దారులు ఎవ‌రికీ 5 జీబీ ఏమాత్రం స‌రిపోదు. దాంతో త‌ర్వాత ప్యాకేజీ కి వెళ్లాలంటే భారీగా వ‌సూలు చేసే వ్య‌వ‌హారం సిద్ధం అవుతోంది. ఇక టీవీ చానెళ్ల‌లో కూడా అంతే. ప్ర‌స్తుతం 200రూ.ల‌కే కేబుల్ ద్వారా అన్ని చానెళ్లు ప్ర‌సారమ‌వుతున్నాయి. రాష్ట్ర‌మంతా 1500రూ.ల చొప్పున ఖ‌ర్చు చేసి దాదాపు సెట‌ప్ బాక్సులు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు 149 రూ.ల‌కే అన్ని చానెళ్లు ఇస్తామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం అవి కేవ‌లం ఫ్రీ చానెళ్లు మాత్ర‌మేన‌ని కండీష‌న్ పెడుతోంది. అంటే జెమీని, జీ తెలుగు వంటి చానెళ్లు కావాలంటే మాత్రం నెక్ట్స్ ప్యాకేజీలో భారీగా చేతి చ‌మురు వ‌దిలించుకోవాల్సిందే.

    క‌థ అంత‌టితో ఆగ‌లేదు. ఇప్పుడు నెట్, టీవీ చానెళ్లు ఒకే కేబుల్ కావాల‌నుకునేవారంతా తొలుత రెండు బాక్సులు తీసుకోవాల్సి వుంటుంది. ఇప్ప‌టికే సెటాప్ బాక్సులు తీసుకున్న వాళ్లు కూడా కొత్త బాక్సుల కొనుగోలుకి సిద్ధం కావాలి. వాట‌న్నింటిక‌న్నా కీల‌కంగా మొత్తం టీవీ చానెళ్ల ప్ర‌సారాల‌న్నీ త‌మ చేతుల్లో పెట్టుకోవ‌డం ద్వారా ఇప్పుడు కేబుల్ ఆపరేట‌ర్ల ద్వారానే వ‌సూళ్ల ప్ర‌క్రియ న‌డ‌ప‌డానికి ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. త‌ద్వారా ఓవైపు ప్ర‌జ‌ల‌కు చౌక‌గా నెట్, టీవీ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పుకోవ‌డం..మ‌రోవైపు మీడియాను త‌న కంట్రోల్ లోకి తెచ్చుక‌వోడం ..అదే స‌మ‌యంలో త‌మ అనునాయుల‌కు భారీగా లాభాలు సంపాదించే మార్గాలు సిద్ధం చేయ‌డం అనే త్రిముఖ వ్యూహంతో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది

    http://telugu.updateap.com/politics/fibre-grid-will-useful-to-control-media/

  2. Veera

    బిజెపిపై బాబు ద్విముఖ వ్యూహం
    (వెన్నుపోటు వ్యూహం, చలసాని శ్రీనివాస్ చౌదరి బాబు మనిషే అని BJP భావన)
    హైదరాబాద్, జూలై 29:ప్రత్యేక హోదా అంశంలో ఏపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బిజెపిపై ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తుతున్నారు. రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలకు హోదాతో బ్రేకులు వేసి ఆ పార్టీని బలహీనపరచడం, తాము మిత్రపక్షమైనా కేంద్రంతో పోరాడుతున్నామన్న సంకేతాలివ్వడం ద్వారా పూర్తి రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరించాలని టిడిపి నిర్ణయించుకుంది. అందుకే తరచూ మీడియా ముందుకొచ్చే పార్టీ అధికార ప్రతినిధులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు హోదా అంశంలో బిజెపిపై విమర్శలు చేసేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    బిజెపిలో కూడా బాబు వైఖరిపై అసంతృప్తి కనిపిస్తోంది. మేధావుల ఫోరంతోపాటు, కెవిపి ప్రైవేటు బిల్లు వెనుక బాబు ఉన్నారని, ఆయనే తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని బిజెపి నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తొలుత కెవిపి ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చిన సమయంలో బిజెపికి చెందిన ఓ ప్రముఖుడు ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

    ప్రభుత్వం మీడియాను సింగపూర్‌కు తీసుకువెళ్లిన బృందంలో ప్రస్తుతం హోదాపై పోరాడుతున్న నేతను కూడా చేర్చారని, ఢిల్లీలో ఆ బృందం తరచూ చేసే హడావిడి వెనుక, రాష్ట్రంలో చేస్తున్న ఆందోళన వెనక బాబు ఉన్నారంటూ ఆ బిజెపి ప్రముఖుడు తమ నాయకత్వానికి లేఖ కూడా రాశారు.

    హోదా సెంటిమెంటుగా మారితే పార్టీ నష్టపోతుందని గ్రహించిన బాబు, ఆ సెగ పార్టీకి తగలకుండా సురక్షితంగా బయటపడేందుకు బిజెపిని ముద్దాయిగా నిలబెట్టే వ్యూహానికి తెరలేపినట్లు పార్టీ ఎంపిల వ్యవహారశైలి, విమర్శల ధోరణి స్పష్టం చేస్తోంది.

    శుక్రవారం ఎంపిలంతా బిజెపికి వ్యతిరేకంగానే మాట్లాడటం బాబు వ్యూహాత్మక నిర్ణయాలను స్పష్టం చేస్తోంది. చంద్రబాబు నేరుగా బిజెపిని విమర్శించకుండా ప్రభుత్వాధినేతగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానన్నారు. మరోవైపు తన పార్టీ నేతలతో బిజెపిపై రాజకీయంగా విమర్శలు చేయిస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా హోదా సహా అన్ని అంశాలపై చర్చించామని మీడియాకు చెబుతున్నారు. ఇవన్నీ కూడా హోదాపై తెదాపా తప్పిదం లేదన్న సంకేతాలే ఇస్తున్నాయి.

    http://www.andhrabhoomi.net/content/state-3420

  3. Veera

    మీరు టిడిపి సానుభూతిపరులా..అయితే చదవండి
    టిడిపిలో పదవుల పందేరంపై పలువురు సీనియర్లు సెటైర్లువేస్తున్నారు..పార్టీలో మొదటినుంచి ఉన్నవాళ్లను కాకుండా ఎన్నికలకు ఆర్నెల్లు ముందు వచ్చినవారికి, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    ఎపి సర్కారులో నామినేటెడ్ పదవులు పొందాలంటే సభ్యత్వం ఉంటే ఇబ్బందులు వస్తాయని, మెంబర్ షిప్ లేనివారే అర్హుల జాబితాలో ఉంటారని విమర్శిస్తున్నారు.

    అటువంటి వారిలో ఇరవై సూత్రాల అమలు కమిటి చైర్మన్ సాయిబాబా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, జూపూడి ప్రభాకర్ , ఎపిఐఐసి ఛైర్మన్ కిష్టయ్య, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు,లక్ష్మీనారాయణ తదితరులకు అటువంటి అర్హత ఉండబట్టే పదవులు కట్టబెట్టారని అంటున్నారు.

    పైగా ఇటీవల రెన్యువల్ చేసిన జాబితాలో కంభంపాటి రామ్మోహన్ లేకపోవడం కూడా అలాంటి ఉదాహరణేనని వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి..కుటుంబరావు, పరకాలకు మెంబర్ షిప్ లేదు కనుకే రెన్యువల్ ఇచ్చారని, కంభంపాటి ఎప్పటి నుంచో పార్టీలో ఉండటంతో అనర్హతగా భావించి రెన్యువల్ చేయలేదని అంటున్నారు.

    మరోవైపు నామినేటెడ్ పదవులు రావాలంటే కృష్ణా జిల్లాలో పుట్టినవారికి ఎక్కువ మార్కులు వేస్తారని, మిగతా జిల్లాల్లో పుడితే పదవుల ఎంపికలో తక్కువ మార్కులేనని అంటున్నారు.

    ఇలాంటి ఈక్వేషన్స్ తో టిడిపి నాయకులు కాస్త సరదాగా, ఆవేదనగా మాట్లాడుకుంటుడం విశేషం..ఇలాంటి కామెంట్లే సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తున్నాయి

    http://kommineni.info/articles/dailyarticles/content_20160729_32.php?p=1469811038777

Leave a Reply to Veera Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s