రిలయన్స్‌ భారీ దోపిడి

రిలయన్స్‌ భారీ దోపిడి
– కేజి బేసిన్‌లో 9,500 కోట్ల అదనపు వసూళ్లు
– బట్టబయలుచేసిన కాగ్‌
– సర్కారుతీరుపై ఆగ్రహం
న్యూఢిల్లీ: కేజి బేసిన్‌లో రిలయన్స్‌ భారీ దోపిడికి పాల్పడుతోంది. ఇంధన ఉత్పత్తికోసం వాడని బ్లాకులపై కూడా భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించి వేల కోట్ల రూపాయలను స్వాహా చేసింది. కొన్ని సంవత్సరాల నుండి నిరాటంకంగా సాగుతున్న ఈ దోపిడి విలువ అక్షరాల 9,500 కోట్ల రూపాయలు. కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అవుతున్న ఏమాత్రం స్పందించని ప్రభుత్వ తీరుపట్ల కాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాస్ట్‌ రికవరీ పేరుతో రిలయన్స్‌ చేసిన నిర్వాకాన్ని లోతుగా పరిశీలన చేయాలని సూచించింది. ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని బ్లాక్‌లకు తరలించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్‌కు సమర్పించిన కాగ్‌ నివేదిక రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)తో పాటు సర్కార్‌ తీరును తప్పుపట్టింది. మరోవైపు కేజీ-డీ6 బ్లాక్‌లో డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి లేకున్నా 2013-14లో వాటిపై వెచ్చించిన వ్యయాలనూ ఆర్‌ఐఎల్‌ రికవర్‌ చేసిందని పేర్కొంది. కాంట్రాక్టును అనుసరించి 6198 చదరపు కిలోమీటర్లను తన పరిధి నుంచి వదిలివేయాలని ఆర్‌ఐఎల్‌ను చమురు, సహజవాయు మంత్రిత్వ శాఖ కోరినా 831 చదరపు కిమీ ప్రాంతాన్ని తన ఆధీనంలోనే ఉంచుకుందని కాగ్‌ పేర్కొంది. ఈ 831 చదరపు కిలోమీటర్లను ఆర్‌ఐఎల్‌ నుంచి వెనక్కితీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం గ్యాస్‌ నిక్షేపాలను కనుగొనేందుకు అవసరమైన వ్యయాన్ని సదరు బ్లాక్‌ నుంచి ఉత్పత్తయిన గ్యాస్‌, ఆయిల్‌ విక్రయాల నుంచి రికవర్‌ చేసుకునేందుకు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది. మరోవైపు స్వతంత్ర నిపుణులతో
కూడిన డీఅండ్‌ఎం కమిటీ 2015 మార్చి 31న నిగ్గుతేల్చిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక ప్రకారం ఓఎన్‌జీసికి చెందిన రెండు బ్లాక్‌ల నుంచి ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తున్న కేజీ-డీ6 బ్లాక్‌కు గ్యాస్‌ను మళ్లించారని వెల్లడైంది. 2019 సంవత్సరాంతానికి గ్యాస్‌ మళ్లింపు మరింతగా పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలను ప్రభుత్వం అంగీకరిస్తే ఆర్‌ఐఎల్‌ తన బ్లాక్‌ల నుంచి అంతే మొత్తంలో గ్యాస్‌ను ఓఎన్‌జీసీకి మళ్లించేలా చూడాలని కాగ్‌ పేర్కొంది. ప్రయివేట్‌ సంస్ధకు గ్యాస్‌ మళ్లింపును అనుమతిస్తే అది ప్రభుత్వ రంగ చమురు సంస్ధల ఆర్థిక పురోగతిపై పెనుప్రభావం చూపుతుందని తెలిపింది.

సర్కార్‌పై కాగ్‌ ఆగ్రహం

కేజీ-డీ6 బ్లాక్‌పై పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు సరైన నియంత్రణ, నిఘా లోపించిందని గత నివేదికలో కాగ్‌ పేర్కొంది. ప్రభుత్వ అజమాయిషీ కొరవడటంతో ప్రయివేట్‌ ఆపరేటర్లు వ్యయం ఎక్కువగా చూపించి అధిక రికవరీలకు పాల్పడేందుకు ఆస్కారం ఏర్పడిందని వాపోయింది. ప్రొడక్షన్‌ షేరింగ్‌ కాంట్రాక్ట్‌ (పీఎస్‌సీ) ప్రకారం ప్రభుత్వంతో లాభాలు పంచుకునేముందు ఆపరేటర్‌ తాను వెచ్చించిన ఖర్చును వసూలుచేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిబంధన కంపెనీలకు వరంగా మారిందని కాగ్‌ ఎత్తిచూపింది. కంపెనీలు అధిక వ్యయం చూపుతూ లాభాలు తగ్గించి తద్వారా ప్రభుత్వ రాబడికి గండికొడుతున్నారని గుర్తించింది.

http://www.prajasakti.com/Article/National/1824411

11 Comments

Filed under Uncategorized

11 responses to “రిలయన్స్‌ భారీ దోపిడి

 1. Andharki Dhana picchi vunta …
  Mari padhi mandhiki vupayoga pade mandhulu kannukunedhi avaru ?

  http://www.greatandhra.com/movies/movie-news/prof-samba-reddy-in-8203indian-8203science-history-76208.html

 2. Manam Kamma ga vunta chalu ….
  AP atla potha manaku anti ??

  Neethimalina Jathi ………Siggumalina panulu.

  http://www.sakshi.com/news/national/is-sujana-chowdary-dont-want-to-special-status-to-ap-375586?pfrom=home-top-story

  Please use the Social media to expose this 5% unethical Weed ruining the state. It only takes a few minutes of your life and is as good as visiting a temple, church or mosque.

 3. Veera

  జగన్ పై కేసు పెట్టాలి ఎందుకంటే-Siva Racharla
  http://www.muchata.com/main-news/chandrababu-should-file-a-conspiracy-case-on-jagan/

 4. Veera

  హైద్రాబాద్ లో ఉన్న బాబు ఆఫీస్ ఊడవడానికి సంవత్సరానికి కేవలం 2 కోట్లు మాత్రమే
  మంత్రి దేవినేని ఉమా చౌదరి రోజుకి ప్ర‌యాణ ఖ‌ర్చు 56 వేల రూపాయ‌లు. ఒక్క ఏడాదికి 2.06 కోట్లు. ఎక్క‌డ తిరిగార‌ని మాత్రం అడ‌గొద్దు. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి వారు డ్రా చేసిన లెక్క‌ల‌వి.

  అసలు దేన్నీ వదిలిపెట్టడం లేదు విచ్చలవిడిగా దోచుకొంటున్నారు అందుకే మొన్న అవినీతిలో ఇండియా లో AP నంబర్ 1 అని కేంద్ర ఎకనామిక్ సర్వే National Council for Applied Economic Research (NCAER ) చెప్పింది

  అయన నిప్పండీ నమ్మండీ !!!
  http://telugu.updateap.com/politics/chandrababu-office-house-keeping-cost-in-high-level/

 5. Veera

  అవ్వ, రవి ప్రకాష్ చౌదరి కి చెందిన TV9 లో బాబు కు వ్యతిరేకంగా వార్త ,ఏందీ చోద్యం
  ABN,TV9,NTV,TV5,ETV,,ల భజన చూసే చూసి చిరాకేస్తుంది
  http://www.muchata.com/main-news/chandrababu-lost-his-grip-on-administration/

 6. Veera

  సినిమా సింహం గర్జించింది ఇక దిబిడి దిబిడే మోడీజీ !!!
  http://www.muchata.com/cocktail/balakrishna-ignorant-comments-on-special-status/

 7. Veera

  రాష్ట్రంలో హిట్లర్ పాలన-బీజేపీ మ్మెల్యే లు విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ
  హిట్లరా పాలనే కాదు తుగ్లక్ పాలన కూడా !!!
  చేయాలి చెల్లి పెళ్లి మల్లీ మళ్ళీ అని తనికెళ్ళ భరణి అన్నట్టుగా ఒక్కో దాన్ని 5,6 సార్లు శంఖుస్థాపనలతో హోరెత్తిస్తున్నారు
  http://teluguglobal.in/bjp-leaders-vishnu-kumar-raju-and-akula-satyanarayana-fire-on-chandrababu-naidu/

 8. Mana Kulam kamma ga vunta chalu …
  AP atla potha manaku andhuku ??
  Neethimalina Jathi ……Siggumalina panulu.
  They will all Rot in Hell.

  http://www.sakshi.com/news/vedika/opinion-on-ap-cm-chandrababu-standing-on-special-status-by-mlc-ramachandraiah-374625?pfrom=home-top-story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s