హైదరాబాద్, ఆగస్టు 12: ఇంతకూ ఆంధ్రప్రదేశ్‌కు హోదా కావాలా? వద్దా? మీడియా ముందుకువచ్చి ఏం చెప్పాలి? ఈ విషయంలో పెదబాబు మాట వినాలా? చినబాబును అనుసరించాలా? ఇదీ తెలుగుదేశం పార్టీ నాయకుల సందేహం. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఢిల్లీ వరకూ తీసుకువెళ్లి, దాని కొనసాగింపుపై స్పష్టత లేకపోవడాన్ని జగన్ సద్వినియోగం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు తెదేపా వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా అంశంలో ఎవరి మాట వినాలన్న చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ పార్టీ విధానం హోదా కావాలన్నట్లుగానే ఉంది. దానికోసమే కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, లేకపోతే సెంటిమెంటయిన ఈ అంశం ప్రజాగ్రహంగా మారితే పార్టీకి నష్టమన్న భావన కూడా ఉంది. బిజెపికి రాష్ట్రంలో బలం లేనందున, హోదాపై ఆ పార్టీకి వచ్చిన నష్టమేమీలేదని, కానీ హోదా సెంటిమెంటుగా మారినందున, అది ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో చాలా కష్టపడవలసి ఉంటుందని తెదేపా నాయకత్వం అసలు ఆందోళన.
తమ పార్టీ హోదాపై అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిపక్షాలు నిశితంగా పరిశీలిస్తున్నందున, ఆ అంశంలో విపక్షాల చేతికి దొరకకుండా ఉండటంతోపాటు, వారి రాజకీయ లబ్థిపొందకుండా ఉండటం కూడా ప్రధానమన్న వ్యూహంతో ఉంది. అస్పష్టతతో కాకుండా ఒకే విధానం అనుసరించాలన్న వాదన వినిపిస్తోంది.
తాజాగా హోదాపై దూకుడుగా వెళుతున్న వైసీపీ అధినేత జగన్‌కు అవకాశం ఇచ్చే అస్త్రాలిస్తున్న తమ నాయకత్వ వైఖరిపై తెదేపా నేతల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. హోదా తీసుకున్న రాష్ట్రాల్లో ఐదువేల ఉద్యోగాలు కూడా రాలేదని, జగన్ హోదా సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని తమ పార్టీ యువనేత లోకేష్ వ్యాఖ్యానించటం వల్ల తమ పార్టీ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తోందన్న సంకేతాలు జనంలోకి వెళ్లాయని విశే్లషిస్తున్నారు.
లోకేష్ వ్యాఖ్యలతో రాష్ట్రానికి హోదా అవసరం లేదన్న సంకేతాలు వెళ్లిపోయాయని, వైకాపా దానిని సద్వినియోగం చేసుకునే పనిలో ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా లోకేష్ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పార్ధసారధి, అసలు హోదాపై తెలుగుదేశం విధానమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి, కొడుకులు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ హోదాపై కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని విమర్శలు కురిపించారు. హోదా పొందిన రాష్ట్రాలు ఐదు వేల ఉద్యోగాలు కూడా పొందలేకపోయాయంటే దానర్ధం ఏపికి హోదా వద్దనా? అని వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. పార్లమెంటులో హోదా కోసం పోరాడి వారం కూడా కాకముందే మళ్లీ హోదా వల్ల ప్రయోజనం ఏమిటన్న కోణంలో తమ పార్టీ నాయకత్వమే మాట్లాడితే, ఇక విపక్షాలపై ఎదురుదాడి ఎలా సాధ్యమని నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తమ పార్టీ కేంద్రంతో కుమ్మక్కయి, హోదా ఇవ్వకపోయినా ఏదో ప్యాకేజీతో సరిపెట్టుకునేందుకు సిద్ధంగా ఉందన్న భావన ప్రజల్లోకి వెళితే కష్టమని విశే్లషిస్తున్నారు. ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న సంకేతాలు వచ్చినందున, కనీసం ఆ కోణంలో మాట్లాడితే తప్పులేదంటున్నారు. అప్పుడు హోదా గురించి మాట్లాడకుండా, ప్యాకేజీ వస్తేనే రాష్ట్ర ఆర్ధిక సమస్యలు తక్షణం పరిష్కారమవుతాయని చెబితే ప్రజలు అర్ధం చేసుకుంటారని చెబుతున్నారు. ఆవిధంగా కాకుండా, హోదా వచ్చినా లాభం లేదని లోకేష్ స్థాయి నాయకుడే చెబితే, ఇక విపక్షాలకు అస్త్రం ఇవ్వడమే అవుతుందంటున్నారు. ఇప్పుడు తెదేపాకు హోదా కావాలా? ప్యాకేజీ కావాలా? అని విపక్షాలు నిలదీస్తే ఏమి జవాబు చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
69 years of Indian Independance ..not one medal in olympics !!
Mera Bharath Mahan ?
A country divided in the name of caste, religion and ruined by selfish and corrupt politicians, industrialists , reel heros etc etc. Shame on them.
http://www.nbcolympics.com/medals
Tdp programmes in KDP bhavan ….
Fanatics taking all other communities in AP for a ride.
Use the Social media to expose this Weed destroying AP.
http://telugu.greatandhra.com/politics/gossip/atp-kamma-bhavan-73530.html