పీవీ సింధు కేరాఫ్ చంద్రబాబు..!
ఒలింపిక్స్ లో పతకాల కోసం అర్రులు చాస్తున్న భారతదేశ ఆశలు పండించిన పీవీ సింధుని కూడా చంద్రబాబు తన ఖాతాలే వేసేసుకున్నారు. గతంలో సత్య నాదెండ్ల సహా అనేకమంది ప్రముఖులు కూడా నా వల్లనేని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు పీవీ సింధు పతకం కూడా తన వల్లేనని ప్రకటించడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయినా ఆయన మాత్రం తగ్గడం లేదు. రియోలో ఇండియన్ మెడల్ క్రెడిట్ గేమ్ లో తానే ముందుంటానని ఆయన ప్రకటించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోపీచంద్ అకాడమీకి స్థలం కేటాయించడం వల్లే ఇప్పుడు పతకాలు వచ్చాయని ఆయన చెప్పుకోవడం విశేషం.
ఏపీలోక్రీడాభివృద్ధికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబు పుష్కరాల పేరిట కోట్ల రూపాలయు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తూ చైతన్య, నారాయణ సంస్థలకు వంతపాడుతున్నారన్న వాదన ఉంది. తద్వారా ఆసలు ఆటస్థలం గానీ, ఆటలు అనే మాట గానీ వినిపించని దుస్థితికి కారణం చంద్రబాబు వేసిన పునాదే అన్నది కాదనలేని సత్యం. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఒలింపిక్ మెడల్ ఘనత తనకే దక్కుకుతుందని, అదే సమయంలో క్రీడలను ప్రోత్సహిస్తే అత్యుత్తమ ప్రతిభావంతులు పైకొస్తారని చెప్పడం విశేషంగా భావించవచ్చు. క్రీడలన్నీ సర్వనాశనం అవుతూ..కెరీరిజం పెరగడానికి మూలమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆయన ఇప్పుడు నీతులు వల్లించడం వింతగా మారుతోంది.
గతంలో సాఫ్ట్ వేర్ సృష్టికర్తను తానేనని ఆయన అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే పట్టాలు పుచ్చుకున్న సత్య నాదెళ్ల వంటి వారు తన చలవే అని చెప్పుకోవడానికి కూడా సాహసించారు. మీడియా కూడా వంతపాడడంతో వాస్తవాలు మరుగునపడి ఆయనకే క్రెడిట్ దక్కింది. హైటెక్ సిటీకి మూలం నేదురమల్లి జనార్థన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమని, సాఫ్ట్ వేర్ రంగాభివృద్ది కోసం ఆయన పాలనలోనే పలు ప్రాజెక్టుకులకు శ్రీకారం పడిందన్న వాస్తవం జనానికి చెప్పినా ఇప్పుడు నమ్మలేని పరస్థితి దాపురించింది. ఇక ఇప్పుడు అదే స్థాయిలో క్రీడలకు కూడా తానే మూలం అన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి గోపీచంద్ అకాడమికి చంద్రబాబు స్థలం కేటాయించిన మాట వాస్తవం. ఆతర్వాత వైఎస్ కాలంలో ఆ స్థలం వెనక్కి తీసుకుంటామని నోటీసులు కూడా ఇచ్చారు. గోపీచంద్ అకాడమీకి ఇచ్చిన స్థలంలో కార్యక్రమాలు జరగకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు తర్వాత గోపీచంద్ స్పందించడం, ప్రభుత్వం సహకరించడంతో గచ్చిబౌలీలోని గోపీచంద్ అకాడమీ ప్రారంభోత్సవం ఆతర్వాతే జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ సాయంతో ఆనాడు గోపీచంద్ అకాడమీ వైఎస్ హయంలోనే ప్రారంభోత్సవం జరిగింది. 2003లో స్థలం కేటాయిస్తే 2008లో ప్రారంభోత్సవం జరగడం విశేషం. కానీ చంద్రబాబు మాత్రం తనవల్లే అంతా అయిపోయిందన్నట్టుగా ప్రచారం ప్రారంభించడం ఆయన నైజానికి నిదర్శనంగా ఉంది. ఏమైనా క్రీడలను కూడా వదిలిపెట్టని క్రెడిట్ గేమ్ లో మన నేతల తీరు నవ్వు పుట్టిస్తోంది.

http://telugu.updateap.com/politics/chandrababu-is-main-reason-for-pv-sindhu-success/