స్విస్‌ ఛాలెంజ్‌ ఎందుకు? ప్రజా రాజధానికి రహస్యమెందుకు? హైకోర్టు ప్రశ్న

స్విస్‌ ఛాలెంజ్‌ ఎందుకు? హైకోర్టు ప్రశ్న
– ప్రజా రాజధానికి రహస్యమెందుకు
– ప్రజా ధనానికి అధికారులు ధర్మకర్తల్లా పనిచేయాలి
– 26న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనుల కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి ఎందుకు అమలు చేస్తున్నారంటూ మంగళవారం హైదరాబాద్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు పలు అనుమానాల్ని లేవనెత్తింది. ప్రజలతో ముడిపడిన రాజధాని నిర్మాణం కోసం చేసే పనుల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ప్రశ్నించారు. టెండర్‌పై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనపై ఈ నెల 26వ తేదీన తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. అమరావతి నిర్మాణ టెండర్‌ విధానంలో పారదర్శకత లేనందున దానిని రద్దు చేయాలని, దేశంలో పలు ప్రతిష్టాత్మక కంపెనీలున్నా విదేశీ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా ఏపి సర్కార్‌ పత్రాల్ని రహస్యంగా ఉంచుతోందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.మల్లికార్జునరావు దాఖలు చేసిన కేసు విచారణ సమయంలో హైకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

రహస్యంగా అమలు చేసే స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ఎందుకని జడ్జి ప్రశ్నించారు. రహస్యంగా వివరాలు ఉంచే ఈ పద్ధతి కంటే సీల్డ్‌ టెండర్‌ విధానమే మేలనే భావన ఏర్పడుతోందని, చెబుతున్న దానికి ఆచరణ భిన్నంగా ఉరందని, ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంలా ఉందంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అనుమానాల్ని నివృత్తి చేయకుండా పత్రాల్ని ఇవ్వకుండా ఉంచడాన్ని బట్టే అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాధనంతో ముడిపడిన విషయంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని, అధికారులు కేవలం ధర్మకర్తలు (ట్రస్టీలు) మాదిరిగా ప్రజాపనులు చేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రజాధనంతో పనులు చేస్తున్నామని అధికారులు గుర్తెరగాలని, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని, రాజధాని పనులేమీ ప్రైవేటు ఆస్తులు కావని వ్యాఖ్యానించారు. ఆదాయ వివరాలు మినహా మిగిలిన సమాచారమంతా బహిర్గతం చేశామన్న ఏపి ప్రభుత్వ వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కీలక సమాచారం దాచేస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల రాజధాని నిర్మాణ విషయంలో అన్నింటినీ పారదర్శకంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ కంపెనీకి 42 శాతం లాభం వస్తుందో లేదోగానీ నష్టాన్నే మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

విదేశీ కంపెనీల లబ్ధి కోసమే..
ఏపి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసి, మొత్తం సమచారాన్ని రహస్యంగా ఉంచుతోందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదన సమయంలో ఆరోపించారు. విదేశీ కంపెనీలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలి. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన అసెండాస్‌-సెంబ్‌కార్ప్‌ సంస్థల కాన్సార్టియం స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో ఇచ్చిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సిఆర్‌డిఎ జులై 18న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్ల ప్రతిపాదనల సమర్పణకు తుది గడువు సెప్టెంబర్‌ 1వ తేదీ వరకే ఇచ్చారు. టెండర్‌ నిబంధనల్లో భారతదేశం బయట నిర్మాణ రంగంలో అనుభవం ఉండాలన్న షరతును బట్టి విదేశీ కంపెనీల పట్ల పక్షపాతం కనబడుతోంది. దేశంలో నిర్మాణం చేసిన అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకపోవడమే ప్రభుత్వ పక్షపాతం తెలుస్తోంది. బిడ్డర్లు బిడ్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.25 లక్షలు, బిడ్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.6.35 కోట్లు చెల్లించాలి. ఇంత భారీ ప్రాజెక్టుకు గడువు నెలన్నర రోజులే ఇవ్వడం కూడా అన్యాయమే. అదే సింగపూర్‌ కన్సార్జియానికి ప్రతిపాదనల సమర్పణకే దాదాపు పది నెలల గడువు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన బిడ్‌ సమావేశం జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో పిటిషనర్‌తోపాటు పలువురు డెవలపర్ల సందేహాల్ని ఇప్పటి వరకు ఏపి నివృత్తి చేయలేదు. అనుమానాలు నివృత్తి కాకుండా బిడ్డర్లు బిడ్‌లు దాఖలు చేయడానికి సాహసం చేయలేకపోతున్నారు. అందుకే పిటిషనర్‌ బిడ్‌ దాఖలు చేయలేకపోయారు. రహస్యంగా ఉంచిన పత్రాలన్నింటినీ బహిర్గతం చేయకపోవడం, అనుమానాల్ని నివృత్తి చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వం విదేశీ కంపెనీ మోజులో ఉందని స్పష్టం అవుతోంది… అని వాదించారు. టెండర్‌ గడువు పెంచాలి. విదేశీ కంపెనీల మోజులో ఉన్న ప్రభుత్వ చర్య తప్పని వెల్లడించాలి. దేశీయ కంపెనీల అనుభవాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సింగపూర్‌ కన్సార్టియానికి అనుకూలంగా చేయాలన్న ప్రభుత్వ విధానం తప్పని వెల్లడించాలి… అని ప్రకాష్‌రెడ్డి వాదించారు.

పక్షపాతం లేదు.. పారదర్శకంగా పనులు
దీనిపై ఏపి ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, సమాచారాన్ని రహస్యంగా ఉంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు. వివరాలు రహస్యంగా ఉంచవచ్చునని గతంలో తీర్పులు కూడా ఉన్నాయని చెప్పారు.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1833698

2 Comments

Filed under Uncategorized

2 responses to “స్విస్‌ ఛాలెంజ్‌ ఎందుకు? ప్రజా రాజధానికి రహస్యమెందుకు? హైకోర్టు ప్రశ్న

  1. Veera

    AP ప్రభుత్వ రహస్య సర్వే
    -ఇప్పుడు ఎన్నికలు జరిగితే 51 సీట్లలో (మొత్తం175 సీట్లు) గెలుస్తారట
    మొఖమాటానికి 51 ఇచ్చి ఉంటారు కానీ 20-30 సీట్లకు మించి రావు టీడీపీ కి
    http://kommineni.info/articles/dailyarticles/content_20160823_24.php?p=1471966907044

  2. Veera

    ఒలింపిక్స్‌ అంటే ఏంటో.. చంద్రబాబుకు చెప్పండ్రా బాబూ
    (టాయిలెట్ లు లేవు మహాప్రభో అని ఉద్యోగులు అంటుంటే మీకెందుకు 2018 లో ఒలింపిక్స్ పెడతా అంటున్నాడు ప్రపంచ మేధావి
    2008 లో చైనా బీజింగ్ లో జరిగిన ఒలంపిక్స్ ఖర్చు 2.73 లక్షల కోట్లు అదే ఇప్పడు అయితే కనీసం 6 లక్షల కోట్లు కావాలి. 2016 ఒలంపిక్స్ అయిపోయాయి, ఇంకా 2020 లో టోక్యోలో జరుగుతాయి. 2024 ఒలంపిక్స్
    కోసం పెద్ద దేశాలు బిడ్స్ వేశారు కూడా.ఒలంపిక్స్ నిర్వహించిన 10 దేశాలు తరువాత దివాళా దిశగా వెళ్లాయి అని ఎకనామిస్ట్ లు చెబుతున్నారు)

    చంద్రబాబు టింగు మంటే అమరావతిలో ఈసారి ఒలింపిక్స్‌ నిర్వహించేస్తా అనే డైలాగును సంధిస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ డైలాగును ఆయన చెప్పిన సభలో ఉండే జనం ఉగ్గబట్టుకుంటున్నారు గానీ, టీవీల ముందు కూర్చుని ఆయన నోట్లో ఆ డైలాగు విన్న ప్రజలు ఫక్కున నవ్వుకుంటున్నారు.

    ఒలింపిక్స్‌ అంటే ఏమిటో, వాటిని నిర్వహించడం ఏమిటో.. దానికి ఎలాంటి అర్హతలు ఉండాలో.. తదితర వ్యవహారాలు ఏమిటో చంద్రబాబుకు అసలేమైనా తెలుసా? లేదా, ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి చందంగా.. పీవీ సింధుకు ఒలింపిక్స్‌ పతకం వచ్చిందని అనగానే.. ఆ ఒలింపిక్స్‌ ఏదో ఈసారి మన అమరావతిలోనే పెట్టేద్దాం.. మన పిల్లలకు ఎక్కువ పతకాలు వచ్చేస్తాయ్‌ అని ఆయన అనుకుంటున్నారో ఏంటో అర్థం కావడం లేదు.

    ఆలూలేదు చూలూ లేదు అన్నచందంగా అమరావతి నగరం పరిస్థితి కునారిల్లుతోంది. ఈ నగరంలో ఈసారి ఒలింపిక్స్‌ పెట్టేస్తాం అంటూ చంద్రబాబు సెలవిచ్చారు. ఏదో తెలియక చెప్పార్లే.. ఆ తర్వాత ఎవరైనా ఆయనకు అవగాహన కల్పించి ఉంటారని సర్దుకుంటే.. తాజాగా పీవీసిందు సన్మానంలో కూడా అదే మాట అన్నారు. అందుకే అసలంటూ ఒలింపిక్స్‌ గురించి చంద్రబాబుకు ఏమైనా తెలుసా.. లేకపోతే ఎవరైనా చెప్పండ్రా బాబూ అనిపిస్తోంది.

    ప్రస్తుతం 2016 ఒలింపిక్స్‌ పూర్తయిపోయాయి. ఇక 2020లో ఒలింపిక్స్‌ జరుగుతాయి. వాటికి టోక్యో నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఈ నగరాన్ని వేదికగా ఎంపిక చేయడం అనేది 2013లో జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే.. ఒలింపిక్స్‌కు 7 ఏళ్ల ముందే నగరం ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత 2024లో ఒలింపిక్స్‌ జరుగుతాయి.

    దీనికి సంబంధించి నగరాల బిడ్డింగ్‌ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. లాస్‌ ఏంజిలస్‌, హాంబర్గ్‌, రోమ్‌, బుడాపెస్ట్‌, పారిస్‌ నగరాలు ఈ రేసులో ఉన్నాయి. ఈ అయిదింటిలో ఒక నగరాన్ని వచ్చే ఏడాది (2017)లో పెరూలో జరిగే సమావేశంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. ఇక చంద్రబాబునాయుడు అమరావతికి ఒలింపిక్స్‌ను తీసుకురావడానికి 2028 అప్పటి ఒలింపిక్స్‌ ఉన్నాయి. వాటికి ఆయన తమ నగరం తరఫున దరఖాస్తు చేసుకోవాలి.

    ఎటూ అప్పటిదాకా అమరావతి నగరం అంటూ ఏ నిర్మాణాలూ జరగబోయేది కూడా ఉండదు కదా.. అని చంద్రబాబు తనను తాను సమాధాన పరచచుకుంటే ఎవరూ చేసేదేమీ లేదు.

    నిర్వహించదలచుకున్న వారు ముందు ఐఓసీకి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు దానిని అప్లికెంట్‌ సిటీ అని పిలుస్తారు. ఆ తర్వాత పది నెలల పాటూ ఆ నగరానికి అర్హతలు ఉన్నాయో లేదో.. ఆ కమిటీ వారు పరిశీలిస్తారు.

    ఇక నగరం ఎంపిక ఎలా జరుగుతుందో చూద్దాం. నిర్వహణకు చాలినం పెద్ద నరగం తమది అని వారు నిరూపించుకోవాలి. పెద్దసంఖ్యలో వచ్చే టూరిస్టులు, అంతర్జాతీయ ప్రముఖులు, ఆటగాళ్లు, మీడియా అందరికీ సరిపోయేంత నగరం అనే భావన కలిగించాలి. అన్ని రకాల రవాణా వ్యవస్థలు గట్రా పుష్కలంగా ఉన్నాయని నిరూపించాలి. (2) ఒలింపిక్స్‌ నిర్వహణ వలన అయ్యే అదనపు ఖర్చుకి తగినట్లుగా స్థానికుల మీద అదనపు పన్నులు పడతాయి గనుక.. వాటికి అనుకూలంగా స్థానిక ప్రజలను ఒప్పించాలి. నగర అభివృద్ధి, ఉపాధుల కల్పన ఉంటుందని వారిని ఒప్పించాలి. (3) ఆ నగరానికి విపరీతమైన మీడియా ప్రచారం ఉండాలి.

    ఈ మూడు అంశాలు బాగున్నట్లు ఐఓసీ తేలిస్తే.. ఆ తర్వాత దాని అప్లికేషన్‌ ను ఆమోదించినట్లు లెక్క. అప్పుడు దానిని కాండిడేట్‌ సిటీ అంటారు. ఎంపికలో రెండో దశలోకి ప్రవేశించినట్టు లెక్క. తర్వాత అప్లికేషన్‌ ఫీజు కట్టాలి. ఐవోసీ న్యాయనిర్ణేతలు నగరాల్ని పరిశీలించి ఒక దానిని ఎంపిక చేస్తారు. అప్లికేషన్‌ ఫీజునే దాదాపు కోటి రూపాయలకు పైగా చెల్లించాలి.

    ఒలింపిక్స్‌ అంటే ఇన్ని కథలున్నాయి.

    మరో పన్నెండేళ్ల తర్వాత.. అంటే మళ్లీ కృష్ణాపుష్కరాలు వచ్చే సమయానికి ఒలింపిక్స్‌ పెట్టేస్తా. అని వాటికి తగ్గ స్టేడియంలు గట్రా కట్టేస్తా.. అని ప్రగల్భాలు పలకడానికి ముందు.. పుష్కరాల ఘాట్‌లలో టైల్స్‌ ఎగిరిపోతున్నయి.. కోట్లు తగలేసి కట్టారు.. వాటిని చిక్కదిద్దడం గురించి చంద్రబాబు పట్టించుకుంటే మంచిది.

    http://telugu.greatandhra.com/politics/gossip/tell-mr-cbn-what-is-olympics-73790.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s