చంద్ర‌బాబు కేసులు- స్టేలు- చ‌ద‌వండి చ‌రిత్ర‌..!

చంద్ర‌బాబు కేసులు- స్టేలు- చ‌ద‌వండి చ‌రిత్ర‌..!
ఏపీ సీఎం నిప్పులాంటి వారు. అందుకే ఆయ‌న‌కు నీళ్లంటే భ‌యం. కోర్టుల్లో విచార‌ణ జ‌రిగితే ఆ నిప్పు ఎక్క‌డ ఆరిపోతుందోన‌న్న భ‌యం ఆయ‌న‌కు ఉన్న‌ట్టుంది. అందుకే బాబుకి మొద‌టి నుంచి ఒక అలవాటు న‌డుస్తోంది. ఎవ‌రైనా ఆయ‌న మీద ఆరోప‌ణ‌లు చేస్తే..ఆధారాలు చూపిస్తే ..చివ‌ర‌కు కోర్టుకెళ్లి నిరూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న మాత్రం అడ్డ‌దారిలో వెళ‌తారు. అలాంటి కేసుల‌ను నీరుగార్చాల‌ని చూస్తారు. అందుకోసం స్టే ఆర్డ‌ర్లు వెదుకుతారు. త‌న‌కు ఇబ్బందులున్నాయ‌ని తెలిస్తే విచార‌ణ ముందుకు సాగ‌కుండా అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు తాజాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచార‌ణ అడ్డుకోవాలంటూ ఆయ‌న హైకోర్ట్ లో స్టే కోసం వెళ్లిన నేప‌థ్యంలో ఆయ‌న కేసుల చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే ఇదే విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది.

ఏపీని దేశంలోనే ముందు పీఠిన నిలుపుతాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఇప్ప‌టికే అంద‌రిక‌న్నా ముందున్నారు. దేశంలోనే అత్య‌ధిక కేసుల్లో స్టే తెచ్చుకున్న నాయ‌కుడిగా క‌నిపిస్తున్నారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న మీద ప‌దికి పైగా కేసుల్లో స్టే న‌డుస్తోంది. అనేక మంది ఆధారాల‌తో న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తే ఆయ‌న మాత్రం స్టే ఆర్డ‌ర్ ద్వారా వాటి ఎంక్వైరీల‌ను అడ్డుకుంటున్న‌ట్టు ఇట్టే అర్థ‌మ‌వుతోంది. ఇక వాటి చ‌రిత్ర ఓమారు ప‌రిశీలించండి..

కేసు 1

చంద్ర‌బాబు అవినీతిపై ఆయ‌న అత్త‌గారు నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి కోర్టుకెళ్లారు. ఆధారాల‌తో కోర్టులో కేసు వేశారు. విచార‌ణ త‌ర్వాత కేసులో స‌రైనా ఆధారాలు చూపించ‌లేక‌పోతే కోర్ట్ ఆ కేసును కొట్టి వేస్తుంది. ఇప్ప‌టికే అనేక‌మంది మీద అలా కేసులు కొట్టివేసిన చ‌రిత్ర ఉంది. కానీ చంద్ర‌బాబు దానికి భిన్నం. 2005 సెప్టెంబ‌ర్ నాడు ల‌క్ష్మీపార్వ‌తి కోర్ట్ ను ఆశ్ర‌యిస్తే ఆ కేసులో ఇప్ప‌టికీ స్టే ఆర్డ‌ర్ న‌డుస్తుండ‌డం విశేషం.

కేసు 2
మార్చి 17 నాడు అదే సంవత్స‌రంలో చంద్ర‌బాబు అవినీతి వ్య‌వ‌హారాల‌పై మ‌రో కేసు వేశారు. అది కూడా పెండింగ్ లోనే ఉంది.

కేసు 3

ఆపద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉండి క్యాబినెట్ తీర్మానం కూడా లేకుండా ఐఎంజీకి భూములు కేటాయించిన వ్య‌వ‌హారంపై కూడా కోర్టులో కేసు న‌డుస్తోంది. దానిపై కూడా కోర్టులో పెండింగ్ ఉంది.

కేసు 4

ఏలేరు కుంభ‌కోణం పై అప్ప‌ట్లో విప‌క్ష నేత‌గా ఉన్న పి. జ‌నార్థ‌న్ రెడ్డి పెద్ద పోరాటం చేశారు. ఒక‌రి పొలాన్ని..వేరొక‌రు అమ్మేసుకుంటే..మ‌రొక‌రికి డ‌బ్బులిచ్చిన వ్య‌వ‌హారం ఆధారాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డంతో ఏకంగా జిల్లా కోర్ట్, హైకోర్ట్, హైకోర్ట్ బెంచ్, చివ‌ర‌కు సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్లి చంద్ర‌బాబు స్టే తెచ్చుకున్నారు.

ఇదే కేసులో జ‌స్టిస్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ వెలువ‌రించిన తీర్పు కూడా స్టే లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కేసు 5

మ‌ద్యం ముడుపుల కేసులోనూ అదే తంతు. ప‌దేళ్లు దాటిపోయినా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌కుండా స్టే ఆర్డ‌ర్ల‌తో అడ్డుకున్నారు.

కేసు 6 …

చంద్ర‌బాబు అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత తెలంగాణా రాష్ట్రానికి చెందిన పాల్వాయి గోవ‌ర్థ‌న్ రెడ్డి కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఆ కేసులో కూడా స్టే ఉండ‌డం విశేషం.

కేసు 7 …

హెరిటేజ్ ఫుడ్స్ కేసు. గ‌తంలో సీఎంగా ఉండి ఆయ‌న సొంత‌కంపెనీకి ప్ర‌యోజ‌నాలు క‌ట్ట‌బెట్టిన వ్య‌వ‌హారంపై కేసు న‌డుస్తోంది. సేల్ ట్యాక్స్ రూపంలో 14 కోట్ల‌కు పైగా రాయితీలు, సబ్సిడీల పేరుతో మ‌రో 76 ల‌క్ష‌లు క‌ట్ట‌బెట్ట‌డంపై కోర్టులో కేసు వేశారు.

కేసు 8

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా హెరిటేజ్ వాటాల విష‌యంపై కోర్టుకెళ్లారు.

ఇక చంద్ర‌బాబు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన్న‌ట్టు ఆయ‌న‌పై మూడు కేసులున్నాయి. ఇత‌ర కేసుల్లో కూడా చంద్ర‌బాబు వ్య‌వ‌హారం క‌నీసం విచార‌ణ‌ను ఎద‌ర్కోక‌పోవ‌డం విశేషం. ఇప్పుడు ఓటుకు నోటులో కూడా ఆయ‌న‌పై పున‌ర్విచార‌ణ జ‌ర‌పాల‌ని కోర్ట్ చెప్ప‌డం..ఆ వెంట‌నే బాబుని నిందితుల జాబితాలో చేర్చ‌డానికి సిద్ధ‌ప‌డ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న హైకోర్ట్ లో స్వాష్ పిటీష‌న్ ద్వారా విచార‌ణ నిలుపుద‌ల కోర‌డం గ‌మ‌నిస్తే ఆయ‌న నైజం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న నిప్పు పాఠం ఎన్ని మార్లు చెప్పిన‌ప్ప‌టికీ నిజాలు వేరుగా ఉన్నాయ‌న‌డం మాత్రం అంగీక‌రించాల్సిందే.

http://telugu.updateap.com/politics/chandrababu-case-history/

9 Comments

Filed under Uncategorized

9 responses to “చంద్ర‌బాబు కేసులు- స్టేలు- చ‌ద‌వండి చ‌రిత్ర‌..!

 1. Whilst some shameless yellow leaders are busy looting AP and getting Court stay for their unethical practices …

  A young and Dynamic Leader is busy fighting for the rights of the farmers .

 2. Veera

  పట్టిసీమ బోగస్‌ ప్రాజెక్టే-ఉండవల్లి
  గోదావరి జలా లను కృష్ణాకు తరలిస్తున్నామని చెబుతున్నదంతా అబద్ధమేనని ప్రభుత్వం నిర్వ హించే రిజర్వాయర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ లెక్కలే చెబుతున్నాయని అన్నారు.

  పట్టిసీమ ద్వారా 80 TMC ల నీళ్లు అనేది పచ్చి అబద్దం , దీనికి 1600 కోట్లు వృధా.
  గోదావరి లో నీళ్లున్నప్పుడే కృష్ణ లో కూడా నీళ్లుంటాయి అని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి

  జూన్‌ 6న చంద్రబాబు పట్టిసీమ పంపులు స్విచ్ఛాన్‌ చేశారని తెలిపారు. జులై 13 నుంచి 17 తేదీల్లో, ఆగస్టు 11, 12 తేదీల్లో తప్ప కృష్ణా బ్యారేజీలో మిగిలిన రోజులన్నీ ఓవర్‌ఫ్లో ఉందన్నారు. (Only 7 days)

  గోదావరి వరదలో ఉన్నప్పుడే కృష్ణాకు నీరు తరలిస్తామంటున్నారని అన్నారు.
  గోదావరికి వరద ఉన్న ప్పుడు కృష్ణాకు వరద ఉంటుందని, అప్పుడు ఏవిధంగా నీరు పంపుతారని ప్రశ్నించారు.

  http://www.prajasakti.com/Article/AndhraPradesh/1837805

 3. A dynamic leader , professional and a humble Human being who never forgot his friends or his word for the poor.

  http://www.sakshi.com/news/family/ysr-was-given-a-treat-dinner-to-his-classmates-after-posting-as-health-minister-391348?pfrom=home-top-story

  Kondharu itharulkosam jeevistharu …
  Mare kondharu itharulanu dochukuntu jeevistharu .
  Pulivendula Puli ki …….Naravarepalli Nakka ki theda ledha ??

 4. Raja ki ……….Neethimalina NARA kasurudiki theda ledha ??

 5. Veera

  ట్రూ లీడర్ వైఎస్ఆర్..!!
  స్టే లీడర్ చంద్రబాబు..!!
  -Dave Dave

  నయీమ్ ను ఎందుకు ఎన్కౌంటర్ చేశారు?
  బయపడి
  నయీమ్ కా?
  కాదు స్టేకు..
  -Murali Buddha

  ఆయన ‘C’BN కాదు,.. ‘Stay’BN.
  -Kalyan AnnapaReddy

 6. Veera

  నేడు YS వర్ధంతి సందర్బంగా …
  తెలుగు CM లు అందరిలో YS నిస్సందేహంగా గొప్పవాడు-1
  1.నేను అధికారం లోకి వస్తే YS లాగా పరిపాలిస్తా అని ప్రజలకు చెప్పు నాయనా అని 2009 ఎన్నికలకు ముందు ఆశీర్వాదం కోసం నారావారిపల్లె వెళ్ళిన బాబు తో సొంత చిన్నాన్న అన్న మాటలు (సోర్స్ ఆంధ్రజ్యోతి కథనం )

  2. కాంగ్రెస్ మోడీ YS అని India Today కవర్ పేజి స్టొరీ వ్రాసింది
  అప్పట్లో గుజరాత్ CM గా మంచి ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఉండేవాడు మోడీ ,కాంగ్రెస్ లో అలా ప్రజాదరణ ఉన్న బలమైన నాయకుడు YS అని వ్రాసింది

  3. 2009 ఎన్నికల అనంతరం అప్పటి TDP నాయకురాలు రోజా YS ను కలిసింది
  ఆరోజున ఐ న్యూస్ చానల్ చర్చ లో సీనియర్ విలేకరి పాశం యాదగిరి గారిని ఐ న్యూస్ వాళ్ళు అడిగారు YS కు బాబు కు ఉన్న తేడా ఏమిటి అని?

  ఇద్దరు రాయలసీమ వారే కాబట్టి వారి ప్రాంత బాషలో చెబుతాను
  YS బెంగళూరు వంటి వాడైతే బాబు పుంగనూరు లాంటివాడు, ఎన్ని పుంగనూరులు కలిస్తే బెంగళూరు అవుద్ది. బాబు క్యారెక్టర్ చాలా వీక్ , YS ముందు బాబు తెలిపోతాడు అన్నారు

  4.అప్పటి HMTV CEO శ్రీరామచంద్రమూర్తి గారు 2009 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సర్వే చేసి YS నాయకత్వం లోని కాంగ్రెస్ అధికారం లోకి వస్తుంది అన్నారు
  బాబుకు YS కు తేడా అయన మాటల్లో
  “YS ప్రజల మద్య ఉండి యుద్ధం చేస్తాడు, ప్రజా నాయకుడు కానీ బాబు అలా కాదు పత్రికలు చానళ్ళ వెనకాల దాక్కొని యుద్ధం చేస్తాడు”

  5.బలమైన నాయకుడు YS మరణం, ప్రతిపక్ష నాయకుడు బాబు విభజన లేఖలు తెలంగాణా ఏర్పాటుకు కారణం-ప్రో నాగేశ్వర్

  6.ఎవరైనా సరే 5 సం పాలించిన తరవాత అధికారం లోకి వస్తే అది గొప్ప విషయమే
  1995 లో NTR ను వెన్ను పోటు పొడిచి అధికారం లోకి వచ్చిన బాబు 1999 లో ఎన్నికలు వెళ్ళాల్సి వచ్చింది, అప్పటి సర్వేలు బాబు ఓడిపోయి కాంగ్రెస్ అధికారం లోకి వస్తుంది అని చెప్పాయి

  ఆ సమయములో దేశము లో వాజపేయి గారి గాలి, BJP కార్గిల్ యుద్ద విజయం వలన రాష్ట్రం లో BJP గాలి వీస్తోంది

  1998 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్టం లో BJP ఒంటరిగా పోటీ చేసి 6 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది, అలాగే 42 పార్లమెంటు స్థానాల పరిధి లోని 60 అసెంబ్లీ స్థానాల్లో BJP మొదటి స్థానం లో ఉండి, రాష్ట్ర వ్యాప్తంగాBJP కి 18 శాతం వోట్లు వచ్చాయి

  దానితో BJP గాలి అర్ధం అయిన అప్పటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయిన బాబు కమ్మ్యూనిస్తులను వదిలేసి BJP తో పోట్టుపెట్టుకొని 1999 లో గెలిచాడు కాని లేకపోతె ఓడిపోయేవాడు అప్పుడే, బాబు 2 వ సారి గెలిచిన 2014 ఎన్నికల్లో కూడా పవన్ మోడీ వల్లనే. బాబు 2 సార్లు(1999,2014) గెలిచింది సొంత బలం తో కాదు.

  NTR సైతం 5 సం పాలించిన తరవాత 1989 లో ఘోరంగా ఓడిపోయాడు ,NTR MLA గా మహబూబ్ నగర్ కల్వకుర్తి లో లో పోటీ చేసి కాంగ్రెస్ కు చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయాడు కూడా.

  బాబు సొంత జిల్లా చిత్తూర్ లో 1999 నుంచి TDP ఓడిపోతూనే ఉంది, బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో 1989 నుంచి ఇప్పటికి ఒక్కసారే TDP గెలిచింది కాని కడప జిల్లాలో 1999 నుంచి ఎప్పుడూ YS దే హవా

  2004 ఎన్నికల్లో గెలవడం కంటే 2009 ఎన్నికల్లో గెలవడం నిజంగా గొప్ప విజయం YS కు.
  మొదట కాంగ్రెస్ ఒప్పుకుంటే కాంగ్రెస్ తో కలిసి వెళతా ఎన్నికలకు అని KCR ఆఫర్ ఇస్తే YS నో చెప్పాడు అంత నమ్మకం తన పాలన మీద ఆయనకు.
  ఒక వైపు మహాకూటమి (TDP +TRS +CPI +CPM) ,మరో వైపు సినిమా దేవుడు చిరంజీవి PRP పార్టీ పెట్టి అప్పటిదాకా కాంగ్రెస్ కు కాపుకాస్తున్న కాపు సోదరుల వోట్లను తీసుకెళ్ళినా కూడా ఒంటి చేత్తో 33 పార్లమెంటు సీట్లు గెలిపించాడు YS .TDP కి 6 TRS కు 2 MIM కు 1, PRP 0 వచ్చాయి

  (గమనిక: 2009 ఎన్నికలు జరిగన రోజు సాయంతం చిరు ప్రెస్ మీట్ పెట్టి నేను కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటె కాంగ్రెస్ కు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేయి అని చెప్పాడు
  అలాగే అప్పటి NDTV సర్వే కాంగ్రెస్ కు 33 MP సీట్లు వస్తాయి కాని ప్రజారాజ్యం పార్టీకి ఒక్క MP సీటు కూడా రాదు అని చెప్పింది చిరంజీవి పార్టీకి మొత్తం 17 శాతం వోట్లు వస్తాయి కాంగ్రెస్ నుంచి 12 శాతం TDP నుంచి 5 శాతం వోట్లు వస్తాయి అని చెప్పింది, ఫలితాలు అదే నిజం అని తేల్చింది.
  కాకపోతే తన ఓటమికి చిరు కారణమని బాబు కుంటి సాకులు చెబుతాడు అదే వేరే విషయం)

  7.పేదలకు ఇందిరమ్మ ఇల్లు పేద విద్యార్ధులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ,ఉచిత కరెంటు ,వ్యవసాయానికి నీళ్ళు ఇలా చెప్పుకొంటూ పొతే చాలా ఉన్నాయి

  నెహ్రూ తరువాత ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్నఅపర భగీరధుడు Dr YS

  జలయజ్ఞం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందలేదు, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం -బాబు

  ముని శాపం , నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అని , పాపం బాబు మాత్రం ఏమి చేస్తాడు

  ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారికంగా శాసన సభకు సమర్పించిన నివేదికలోనే జలయజ్ఞం ద్వారా 19 లక్షలకు పైగా ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి లభించింది. మరో మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. అంటూ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చారు.

  కాంగ్రెస్ జలయజ్ఞానికి చంద్రబాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్ ఇది
  -ప్రో నాగేశ్వర్

  ఇప్పుడు చెప్పండి నా మాటలు నిజమా కాదా?

  8.YS మరణం, బాబు ఇచ్చిన 2 విభజన లేఖలు KCR కు కలిసివచ్చి తెలంగాణ వచ్చింది -ప్రో నాగేశ్వర్
  YS బ్రతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు అని నాతో అనేకమంది TDP నాయకులు సైతం అన్నారు.సింహం లేనప్పుడు నక్క రాష్ట్రాన్ని నాశనం చేసింది తన స్వార్ధం కోసం .

  9.YS హయాములో శరవేగంగా హైదరబాద్ అభివృద్ధి -JNTU శాస్త్రవేత్తలు
  గత 40 సం లలో YS హయాములోనే (2004-2009) హైదరబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది source: kommineni,Deccan chronicle

  10.పెట్టుబడులు అకర్శించదములొ ఘోరంగా విఫలమైన విజన్ 2020 నేత బాబు
  -భారత పరిశ్రమల సమాఖ్య (CII )

  పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రగతిశీల రాష్ట్రాల జాబితాలో బాబు అద్వర్యం లోని AP 12 వ స్థానం లో ఉంది అని భారత పరిశ్రమల సమాఖ్య (CII ) చెప్పింది

  డిల్లి మొదటి స్థానం లో ఉంటె పశ్చిమ బెంగాళ తర్వాత 12 వ స్థానం లో AP ఉంది

  ఇదీ బాబు చేసిన అభివృద్ధి .నేతి బీరకాయలో నేతి ఎంత ఉందొ, బాబు చెప్పే అభివృద్దిలో నిజం కూడా అంటే ఉంది

  11.YS స్వర్ణ యుగం- With Facts and Figures
  జాబు రావాలంటే బాబు రావాలి అనడం ఎంత సత్యదూరమో చూడండి

  1994 కంటే ముందు అంటే కాంగ్రెస్ హయాములో ఉపాధి కల్పన పెరుగుదల రేటు 2.3 శాతం ఉండగా బాబు CM అయిన 9 సం లకు అది 0.3 శాతానికి పడిపోయింది అని ప్లానింగ్ కమిషన్ చెప్పింది

  ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రద్దు చేస్తూ బాబు G.O 94,Employment Exchange లను రద్దు చేస్తూ G.O 246,ఉద్యోగుల వయోపరిమితి తగ్గిస్త్తూ G.O 426 CM బాబు ఇచ్చాడు.

  బాబు హయాములో యువత కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న కొద్దిపాటి పరిశ్రమలను తన మనుషులకు ఛీప్ గా అమ్మడం లేదంటే మూసివేయంచడం వలన ఉన్న ఉదోగాలు కూడా కోల్పోయారు
  అందుకే ఉపాధి కల్పన పెరుగుదల రేటు కాంగ్రెస్ హయాములో ఉన్న 2.3 శాతం కాస్త 0.3 శాతానికి పడిపోయింది.

  Employment Growth:బాబు కంటే ముందు Employment Growth 2.3 ఉంటే బాబు హాయములో 0.29 కు పడిపోయింది.

  మరి ఇటువంటి బాబు మరలా వస్తే ఉద్యోగాలు వస్తాయనడం ఎంత హాస్యాస్పదమో!

  12.IT Exports
  బాబు హయములో 6 శాతం, వైయెస్ హయములో 15 శాతం
  బాబు హయాములో IT Exports లో AP 4 వ స్థానం లో ఉంది, బాబు కు ముందు 3 వ స్థానం లో ఉంది, ఇప్పుడు కూడా 4 వ స్థానం లో ఉంది.మరి ఇందులో బాబు గొప్ప ఏమిటి ?

  బాబు హయాములో 85 వేల 945 IT ఉద్యోగాలు లబిస్తే YS హయాములో 2 లక్షల 51 వేల 786 IT ఉద్యోగాలు లబించాయి

  13.ఆస్తులు:అప్పులు
  బాబు కు ముందు :101:100
  బాబు హయములో :45:100
  YS హయములో:120:100

  14.GDP: బాబు కు ముందు రాష్ట్ర GDP 6 శాతం,బాబు హయములో రాష్ట్ర GDP 5.6 శాతం , వైయెస్ హయాములో GDP 9 శాతం

  15.వ్యవసాయ అభివృద్ది: వైయెస్ హయములో 6.82 శాతం, More than national average

  16.Chandrababu: Image and reality
  On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath

  P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
  He is the Rural Affairs Editor at The Hindu.

  • samanth

   In a day and age, when even wives and husbands view their relationships through a transactional prism, YSR was a man of emotions, affections and generosity. As Dr. Subba Reddy mentioned, he was like a “pedda nayina” ….people saw him as one….again, in a day and age where politicians prided themselves on exclusivity and privilege, he opened his heart out to people…we will be lucky to see another like him in our lifetime.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s