బి కేటగిరి జాబితా అందించండి : హైకోర్ట్
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
మెడికల్ యాజమాన్య కోటా (బి కేటగిరి) సీట్ల భర్తీ కోసం ఎంపిక చేసిన అర్హుల జాబితాను తమ ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తులు రామసుబ్రహ్మణియన్, అనిస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల సంఘం సెలక్షన్ కమిటీ కన్వీనర్, సంఘ కార్యదర్శులను ఆదేశించింది. నీట్లో అర్హత సాధించకపోయినా ఆ సంఘం ఎంబిబిఎస్ సీట్లు కేటాయిస్తోందని, తనకు ఎంబీబీఎస్ సీటుకు అర్హత ఉన్నా బీడీఎస్ సీటు తీసుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు చెబుతున్నారని ఒంగోలుకు చెందిన సీహెచ్ఎస్ రవీంద్రరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఏపి పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పదేళ్లపాటు ప్రాధాన్యత ఇవ్వాలని, 85 శాతం సీట్లు కేటాయించాలని, అయితే కోట్ల రూపాయలకు ఇతర రాష్ట్రాల వారికి సీట్లు అమ్మేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
637 సీట్లలో వందకుపైగా సీట్లను అమ్మేశారని వాదించారు. దీనిపై హైకోర్టు బెంచ్ స్పందిస్తూ యాజమాన్య కోటా కింద ఎంపిక చేసిన అర్హుల జాబితాను తమ ముందుంచాలని, జాబితాను పరిశీలించి, విచారించి తగిన ఆదేశాలు వెలువరిస్తామని తెలిపింది. తదుపరి విచారణ 8కి వాయిదా పడింది.
బి కేటగిరి జాబితా అందించండి : హైకోర్ట్
Filed under Uncategorized
http://www.telakapalliravi.com/2016/09/07/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/
http://www.telakapalliravi.com/2016/09/07/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AE%E0%B1%81%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF/
ఓ స్త్రీ రేపు రా .. అప్పు రేపు.. హోదా ‘రేప్’ ఆ విధంగా ముందుకు ….!!!-GA
ఆ విధంగా అనంత కరువును జయించిన బాబు
http://teluguglobal.in/chandrababu-rain-guns/
11 వేల కోట్ల విలువ చేసే రిలయన్స్ దొంగతనం నిజమే
– కెజి బేసిన్లో గ్యాస్ తస్కరణను నిర్ధారించిన జస్టిస్షా కమిటీ
– 11 వేల కోట్ల విలువ చేసే 1100 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అక్రమ తరలింపు
కెజి బేసిన్లో రిలయన్స్ సంస్థ మూడో కంటికి తెలియకుండా ఆరేళ్ల పాటు ఒఎన్‌జిసి క్షేత్రం నుండి 1100 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను దొంగిలించింది. ఈ చేదు నిజాన్ని జస్టిస్షా కమిటీ ధృవీకరించి.. కేంద్ర చముర శాఖ మంత్రికి గతనెల 31న నివేదిక సమర్పించింది. ఈ నివేదికను అందుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నెల రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
రిలయన్స్ దోపిడీ
ఏప్రియల్ 2009 నుండి మార్చి 2015 మధ్య కాలంలో 1100 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఒఎన్‌జిసి క్షేత్రం నుండి రిలయన్స్ అక్రమంగా తోడుకుంది. దీని విలువ రూ.10వేల కోట్లకు పైమాటే. దీనిపై దర్యాప్తు జరిపిన జస్టిస్ షా కమిటీ రిలయన్స్ దోపిడీని బట్టబయలు చేసింది. రిలయన్స్ పరిహారం చెల్లించాల్సిందేనంటూ నివేదికలో స్పష్టం చేసింది. ఒన్‌జిసి, గెయిల్ పాత్రలను కమిటీ తప్పుపట్టింది. ఎప్పటికప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్లకు సమాచారం అందివ్వటంలో విఫలమయ్యాయని తేల్చింది.
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1839153