తప్పులో కాలేసిన టీడీపీ

ఊర్లలో ఉండే టీడీపీ నాయకులు ఫోన్ చేసి బాబు ఇలా చేశాడేంటి అని వాపోతున్నారు- టీడీపీ MLA లు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=6273418

చంద్రుడిపై రవి జాలి! -తెలకపల్లి రవి
చాలా కాలం తర్వాత టీవీ9లో ప్రత్యేక హౌదాపై చర్చ చేసిన మిత్రులు రవి ప్రకాశ్‌ పదే పదే చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది. మీరెందుకు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని బిజెపి నాయకుడు రఘునాఘబాబాను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ధ్వనించింది. ఇది తెలుగుదేశం నాయకులు రోజూ వినిపిస్తున్న రికార్డును తలపించింది. ఇకపోతే చంద్రబాబుకు రాజకీయ వ్యూహాలు లేవని ఈ దాగుడు మూతల్లో ఆయనకు భాగం లేదని భావించాలా? ఆయనపై జాలి పడాలా ఆగ్రహించాలా? రాజకీయ నేతల ప్రభుత్వాధినేతల తప్పిదాలను అవకాశవాదాలను ఎండగట్టే రవి ప్రకాశ్‌కు ఇప్పుడు ఇంత జాలి కలగడానికి హేతువేమిటో అంతుపట్టని ఆశ్చర్యంగా మిగిలింది. జాలి పడాల్సింది చంద్రబాబుపైనా మోసపోయిన రాష్ట్రంపైనా లేక ప్రజలపైనా? కాక ఎవరు నిజంగా తప్పు చేశారో తెలుసుకోలేని లేదా తెలిసినా చెప్పలేని మీడియాపైనా?

http://www.telakapalliravi.com/2016/09/07/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/

పక్కా స్క్రీన్‌ప్లే! టక్కరి సినిమా! యాంటీ క్లైమాక్స్‌!!-తెలకపల్లి రవి
ప్రత్యేక హౌదాకు మంగళం అనే ప్లాప్‌ సినిమాకు పక్కా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటివి చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. ఈ విషయమై నా విమర్శలు నిరంతరం చేస్తూనే వున్నాను.

హౌదాకు కృష్ఫార్పణం, ప్యాకేజీకి పిండ ప్రదానం జరిగిపోయిందని గతంలోనే రాశాను. కాకుంటే ఆ యాంటీక్లైమాక్స్‌కు ఈ రోజు రంగం సిద్ధం చేశారు. బలిపీఠం ఎక్కించే ప్రాణికి అలంకారం చేసినట్టు “అనుకూల మీడియాలో” అలరించే కథనాలు, వ్యాఖ్యానాలు స్క్రోలింగులతో హౌరెత్తిస్తున్నారు. దీన్నే తెలుగులో చావుకబురు చల్లగా చెప్పడానికి ఇంత సన్నాహం నా నలభై ఏళ్ల రాజకీయ పాత్రికేయ జీవితంలో చూసి వుండను. దీనిపై మొన్న ఎన్‌టివి చర్చలో నేను చేసిన వ్యాఖ్యలపై చాలానే దుమారం రేగింది. హౌదా అనేది సెంటిమెంటు కాదు, అయింట్‌ మెంట్‌ కాదు కమిట్‌మెంట్‌ అన్నాను. హౌదాపై రాజీ లేదంటూనే ఎందుకు తెలుగుదేశం సన్నాయినొక్కులు నొక్కింది? రక్తం మరిగిందన్నవారు ఎందుకు కరిగిపోయారు అని ప్రశ్నించాను. సీనియర్‌ నాయకులు వెంకయ్య నాయుడు బొంకయ్య అనిపించుకోరాదని ఆకాంక్షించాను. దీనిపై బిజెపి టిడిపి నాయకులు విపరీతంగా రభస చేశారు గాని అక్కడ శ్రోతల నుంచి రాష్ట్రంలో ప్రేక్షకుల నుంచి కూడా నాకు చాలా అభినందనలు వచ్చాయి. నా మాటల్లో సత్యమేమిటో, ఇతరుల వాగ్దానాలు ఎలా బొంకుగా మారిపోయాయో ఈ రోజే రుజువవవున్నది.
ప్రత్యేక హౌదాకు స్వస్తి చెప్పామనే చేదునిజం ప్రకటించేబదులు దానికి ప్యాకేజీ పంచదార పూత పూస్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ విభజన చట్టంలోనూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటనలోనూ వున్నవే. ఆయన అందులో ప్రత్యేక హౌదా ప్రతిపత్తితో పాటు మరో అయిదు అంశాలు కూడా లిఖిలపూర్వకంగా అందజేశారు. అవే పన్ను రాయితీలు, కోరాపుట్‌ బోలాంగిర్‌ కల్హండి(కెబికె) ప్యాకేజీ,పోలవరం, సిబ్బంది పంపిణీ, వెనకబడిన జిల్లాలకు సహాయం. ఇవన్నీ ఆనాడే ప్రకటించినా అమలు చేయని దోషం బిజెపి కేంద్ర ప్రభుత్వానిది కాగా భాగంపంచుకున్న దోషం టిడిపిది ప్రభుత్వానిది. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ తతంగాన్ని ప్రజలతో మింగించే ప్రహసనం మాత్రమే.

http://www.telakapalliravi.com/2016/09/07/%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87-%E0%B0%9F%E0%B0%95%E0%B1%8D/

5 Comments

Filed under Uncategorized

5 responses to “తప్పులో కాలేసిన టీడీపీ

 1. Veera

  తమ్ముడు ఆ విధంగా ముందుకు పోతున్నాడు
  http://www.muchata.com/main-news/what-pawan-kalyan-wanted-to-say-in-kakinada-meeting/

 2. @ PK …..are you OK ? Do you understand what you talk ??
  Jara grathha ….Chiru ni thokkesinatlu ..ninnu kuda Kamma ga thokkestharu.

  http://www.sakshi.com/news/state/narendra-modi-gave-spoiled-ladus-to-us-says-pawan-kalyan-394506?pfrom=home-top-story

 3. Veera

  ఆలోచించు తమ్ముడూ !!!
  1.పాచి లడ్లు ఇచ్చిన బీజేపీ ని అన్నావు కానీ మహాప్రసాదం అంటూ తీసుకున్న బాబు ను ఏమీ అనలేదేంటి తమ్ముడూ ?
  2.కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచింది అన్నావు మరి పేగులను కూడా పీకిన TDP ని వదిలేసావు ఎందుకో? ఎప్పుడో జరిగిన విభజన గురించి ఎందుకు? విడగొట్టమని 2 లేఖలు ఇచ్చిన TDP ని, 1987 లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్న బీజేపీ కి మద్దతిచ్చావు ఇంతెందుకు అన్నయ్య చిరంజీవి కూడా తెలంగాణ కు ఓకే అన్నాడు కదా?
  3.తిరుపతి లో రోడ్ల మీదకెళ్ళాలి పోరాటాలు చేయాలి అన్నారు మూడంచెల పోరాటం అన్నావు రేపు హోదా కోసం విపక్షాలు బంద్ పాటిస్తుంటే బంద్ లు వద్దు అంటావు , ఏంటో
  4.బాబు చేసే అరాచకాలను ఒక్కటి కూడా అడగలేదు
  5.ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా గొడవెందుకు ?
  తెలంగాణ AP ప్రజలు చాల సంతోషంగా ఉన్నారు
  Request-No bad comments/Words please !!!

 4. Veera

  నాయుడు బ్ర‌ద‌ర్స్ న‌య‌వంచ‌న‌!(కులం కోసం కలిసికట్టుగా ఆ విధంగా ముందుకు)
  చంద్ర‌బాబు, వెంక‌య్య జోడీ చేస్తున్న ప్ర‌య‌త్నాలతో న‌వ్యాంధ్ర మ‌రోమారు న‌య‌వంచ‌న‌కు గురికావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌త్యేక తెలంగాణా ఉద్య‌మానికి బీజం వేసింది హైద‌రాబాద్ అభివృద్ధి అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అస‌మ‌గ్ర అభివృద్ధి మూలంగానే ఇలాంటి ప‌రిస్థితి దాపురించింద‌న్న‌ది అంద‌రూ వాదించిన స‌త్యం. అందుకే కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అలాంటి అనుభ‌వాల‌తో అభివృద్ధి కేంధ్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు ఆచ‌ర‌ణ‌లో చంద్ర‌బాబు మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పాత మోడ‌ల్ తో కొత్త వివాదాల దిశ‌గా తీసుకెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

  ఇప్ప‌టికే రాజ‌ధాని చుట్టూ అభివృద్ధి కేంధ్రీక‌రించ‌డంపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఎయిమ్స్ , హైకోర్ట్ స‌హా అన్ని ర‌కాల కీల‌క సంస్థ‌ల‌ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. దానికితోడుగా ఇప్పుడు రైల్వేజోన్ కూడా విశాఖ నుంచి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించ‌డానికి నాయుడు బ్ర‌ద‌ర్స్ ప్ర‌య‌త్నించ‌డంపై చాలామంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా త‌మ సొంత సామాజిక‌వ‌ర్గ ప్ర‌యోజ‌నాల కోస‌మే బాబు, వెంక‌య్య క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి అన్యాయం చేసే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

  వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌ను వంచించి విశాఖ రైల్వేజోన్ ను విజ‌య‌వాడ‌కు త‌ర‌లించాల‌న్న ప్ర‌య‌త్నంపై ఇప్ప‌టికే ప‌లువ‌రు భ‌గ్గుమంటున్నారు. విశాఖ‌లో చివ‌ర‌కు టీడీపీ ఎంపీ కూడా దీక్ష‌కు దిగ‌డం విడ్డూర‌మే అయిన‌ప్ప‌టికీ అంతా చంద్ర‌బాబు వ్యూహాంలో భాగంగానే జ‌రుగుతుంద‌న్న‌ది ప‌లువురి వాద‌న‌. అదే స‌మ‌యంలో విశాఖ‌, విజ‌య‌వాడ మ‌ధ్య తంపులు పేరుతో కాల‌యాప‌న చేసే వ్యూహం కూడా ఇందులో ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు.

  http://telugu.updateap.com/politics/no-polavaram-and-railway-zone-for-ap/

 5. Veera

  నాయుడు అంటే నాయకుడు-వెంకయ్య నాయుడు
  హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి-పార్లమెంటులో వెంకయ్య నాయుడు
  హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి-2014 తిరుపతి ఎన్నికల సభలో బాబు
  హోదా ఎమన్నా సంజీవనా-నా ఆవినీతి మీద విచారణ వద్దు అని కోర్ట్ నుంచి 18 సార్లు స్టే తెచ్చుకున్న నిప్పు/ స్టే BN
  ఇద్దరు నాయుళ్లు రాష్ట్రాన్ని ముంచేశారు-ప్రజలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s