తప్పులో కాలేసిన టిడిపి(18 స్టే ల నిప్పు మాత్రం ఏమి చేయగలడు?)
హైదరాబాద్, సెప్టెంబర్ 8: హోదా బదులు ప్యాకేజీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించిన వైనం తమను ఆత్మరక్షణలో పడేసినట్టయిందని టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ జరిగే సమయంలో ప్రకటన చేయటం, దానిపై తమ అధినేత అర్ధరాత్రి స్పందించడం వ్యూహాత్మక తప్పిదమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. తమ నియోజకవర్గాల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనతో ఏమి చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం జైట్లీ ప్రకటనపై బాబు రాత్రికి రాత్రి స్పందించడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో తాము కచ్చితంగా తప్పులో కాలేశామని అంగీకరిస్తున్నారు. బాబుకు ఎవరు సలహాలిస్తున్నారో అర్ధం కావడం లేదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కాస్తంత ఆవేశపడ్డారు.
మరోవైపు తమ పార్టీ నియోజకవర్గ, మండల స్థాయి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమను అర్ధరాత్రి వరకూ ఫోన్లలో తినేశారని పలువురు ఎమ్మెల్యేలు లాబీ, మీడియా పాయింట్లో సహచరులు, మీడియా వద్ద వాపోయారు. ‘ఇప్పుడు జైట్లీ ప్యాకేజీ ప్రకటించాల్సిన పనేంటి? దానిమీద సార్ ఎందుకు మాట్లాడారు? మీరు సార్కు చెప్పరా? జైట్లీ ప్యాకేజీని స్వాగతిస్తున్నామని సార్ చెప్పిన తర్వాత ఇక మేం జనంలోకి ఎలా వెళ్లాల’ని అర్ధరాత్రి వరకూ ఫోన్లలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, సర్దిచెప్పలేక నానా తంటాలు పడాల్సి వచ్చిందని చెప్పారు.
http://www.andhrabhoomi.net/content/ap-1742
పవన్ , బాబు లాలూచీ పడ్డారా..!?
చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ వల్లించారన్న వాదన ఉంది. పవన్ కల్యాణ్ ప్రసంగం కూడా దానికి తగ్గట్టుగా సాగింది. ఇప్పుడు చంద్రబాబు వైఖరి దానికి తీసిపోని రీతిలో నడుస్తోంది. అంటే మొత్తంగా బాబు, పవన్ లాలూచీ పడి ప్రత్యేక హోదా వ్యవహారాన్ని నిజంగా పాచిపోయిన లడ్డూలుగా మార్చేస్తున్నారన్న సందేహాలు బలపడుతున్నాయి. కేంధ్రం ఇచ్చిన దానిని స్వాగతించిన చంద్రబాబుని కానీ, అసలు హోదా హామీ ఇచ్చి ప్యాకేజీతో ఐదు కోట్ల మందిని వంచించిన మోడీని గానీ పల్లెత్తు మాట అనని పవన్ ఏకంగా బంద్ విషయంలో కూడా స్పష్టత లేకపోవడం గమనిస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతోంది.
అందేలో భాగంగాపూ జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించొద్దని మంత్రులు , టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్టు సమాచారం.
http://telugu.updateap.com/politics/friendship-strengthen-between-babu-and-pawan/
పవన్ మావాడే అంటున్న పచ్చ పాత మీడియా
http://www.muchata.com/main-news/yellow-media-owns-pawan-kalyan-like-any-thing/