అరుణ్‌జైట్లీ ఆర్ధరాత్రి దాకా సాగదీసిన తర్వాత టీవీ9లో చర్చ ప్రసారమైంది. చాలా కాలం తర్వాత సిఇవో రవిప్రకాశ్ నిర్వహించారు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుతో బిజెపి ఆడుకుంటున్నదని, గుజరాత్‌కు ఎపి పోటీ అవుతుంది గనకే హౌదా నిరాకరించారని ఏవేవో తమవైన సిద్ధాంతాలూ గుమ్మరించారు. చంద్రబాబు మీద జాలి కలగడం లేదా అని చర్చలో పాల్గొన్న బిజెపి నేతను పదే పదే అడిగారు. ఈ తతంగం ముగిసేలోగానే చంద్రబాబు నాయుడు మీడియాగోష్టి పెట్టి ఇచ్చిన దానికి స్వాగతం పలికేయడంతో ఈ జాలి పాటలూ చెలగాటాలు అపహాస్యంగా మారాయి. మరోవైపున మామూలుగా కాషాయ నేతల భావాలను బలపర్చే ఆంధ్రభూమి సంపాదకుడు ఎం.వి.ఆర్.శాస్త్రి ఆంధ్రకు సాయం అబ్రకదబ్ర అంటూ వున్న మాట చెప్పేయడం విశేషం. బిజెపి టిడిపినాయకులు వూరించి వూరించి విశ్వాసాన్ని వమ్ము చేసినతీరును ఆయన బాగా ఎండగట్టారు. ఆఖరుకు నమస్తే తెలంగాణ పత్రికలోనూ ఢిల్లీ ప్రతినిధి జగదీష్ సమతుల్యంగా వ్యాఖ్యానం రాశారు. ఇలా చెప్పుకోవలసినవి ఇంకా వున్నా అన్నిటిని మించి పోయింది ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్తపలుకు. చాలా సార్లు విషయాన్ని సూటిగా చెబుతారని పేరున్న ఆయన ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలన్ని ఏకపక్షంగానూ బిజెపి టిడిపిలకు వంతపాడేవిగా వున్నాయి
http://www.prajasakti.com/Article/Neti_Vyasam/1841910
ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో టి.కి 3 ర్యాంక్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే రాష్ట్రాలలో సులభ వాణిజ్యంలో తెలంగాణకు మూడో స్తానం వస్తే ఎపి కి పదకుండో స్థానం వచ్చింది.
మొదటి స్థానం చత్తీస్ గడ్ కు వస్తే రెండో స్థానం గుజరాత్ కు వచ్చింది.తెలంగాణ 75.90 శాతం మార్కులు సాధిస్తే, ఎపికి 65.66 శాతం మార్కులు వచ్చాయని సమాచారం. గతంలో ఎపి మూడో స్థానంలో ఉందంటూ పెద్ద ఎత్తున ఎపి ప్రభుత్వం , ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడి చేశారు. టిడిపి అనుకూల మీడియాలో సైతం దాంతోనే అంతా అయిపోయిందన్నట్లుగా ప్రచారం జరిగింది.కాని తాజాగా వచ్చిన ర్యాంకింగ్ లో పదకుండో స్థానానికి ఎందుకు పడిపోయిందో విశ్లేషణలు కనిపించలేదు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160914_6.php?p=1473848363866
Kula gajji tho brastupattisthunnaru …….JC
@ JC garu ….Ippatikanna thelusukunndhauku dhanyavadhalu.
Neethimalina Paccha Jathi tho …..Jara Jagrattha.
http://www.sakshi.com/news/district/jc-diwakar-reddy-takes-on-anantapur-mla-mayor-municipal-commissioner-399120?pfrom=home-top-story
Murali Buddha
హోదా లేదు ప్యాకేజి నట
ఈ మాట వినగానే నా రక్తం సలసల కాగుతోంది -బాబు
ఆంధ్రకు ప్యాకేజి -జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్
ఇంత చెత్త ప్రెస్ కాన్ఫరెన్స్ నా జీవితం లో ఇదే మొదటి సారి చూడడం – టీవీ 9 రవి ప్రకాష్
ఆంధ్రకు అన్యాయం – తెలుగు మీడియా విశ్లేషణ
ఆంధ్రాలో విప్లవం ఖాయం అనిపించింది టివి లు పత్రికలూ చూస్తే
ఒక రోజు విరామం – ఢిల్లీ పెద్దలు ఏం మంత్రం వేశారో
ప్యాకేజి కి స్వా గతం – బాబు
హోదా వల్ల నష్టం ఎక్కువ – టిడిపి నేతలు
హోదా వద్దే వద్దు అంటున్న ప్రజలు – తెలుగు మీడియా సర్వేలో కళ్ళు చెదిరే విషయాలు బయట పడ్డాయి
– విమర్శ వదిలేయండి దేశం లో ఇంత శక్తివంత మైన మరో పార్టీ ఉంటె చూపగలరా ? తాము రక్తం సల సల అంటే మీడియా సల సల కాగి పోతుంది .. తాము స్వాగతం పలికితే మీడియా స్వాగతం పలుకుతుంది .. ఇంత దమ్మున్న పార్టీ మరోటి లేదు అంతే
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
అంతే,,,అంతే,,,
పచ్చనాయుడూ,పచ్చడి మీడియా ఏది చెబితే అదే నిజం !
గతం లో NTR స్త్రీ లోలుడు,,,ఇప్పుడు యుగపురుషుడు !
ప్రత్యేక హోదా వద్దు,,,ప్యాకేజీ ముద్దు !
అంతే,,,అంతే మాబోటి పచ్చడి మొహాలకి పచ్చనాయుడు,పచ్చడి మీడియా చెప్పిందే వేదం !
Sryinivas Madisetty
ఈ సారి బాబు రాడు,ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేఖత వస్తుంది,
ప్రజల మధ్య తిరుగుతుంటే వారి ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోతున్నాము,
కులం ఫీలింగ్ విపరీతంగా ఉంది,కానీ రాజశేఖరరెడ్డి పరిపాలనలో అందరికీ సమాన అవకాశాలుండేవి.
ఇది ఓ కరుడు గట్టిన తెలుగు దేశం అభిమాని మరియు రాజధాని ప్రాంత MLA ముఖ్య అనుచరుడు మరియు స్నేహితుడు చెప్పిన మాటలు.
నిరాడంబర రాజధానికి దారేదీ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన నిరాడంబరత్వాన్ని ఆవిష్కరిచారు. చలన చిత్ర నటుడు పవన్ కల్యాణ్ కూడా తన నిరాడంబరత్వాన్ని అనావరణం కావించడం తెలుగునేలపై సంభవించిన సమాంతర పరిణామం. అంతరం లేకపోలేదు. సుదీర్ఘరాజకీయ ప్రస్థాన స్మృతులు చంద్రబాబు భావోద్వేగానికి గురిచేశాయి. చేశాయని ప్రచారమైంది. ఇటీవలికాలంలో చంద్రబాబు నాయుడు తరచు భావోద్వేగానికి గురి అవుతున్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అద్వితీయ స్థానంలో నిలబెట్టడానికై నడుం బిగించి సింగపూర్‌కు చైనాకు వెళ్లి, ఇతరేతర దేశాలకు వెళ్లి పరిశోధనలు చేసి వస్తున్న ముఖ్యమంత్రి ఆయా దేశాల అనుభవాల మూటలను మోసుకొని వస్తున్నారు. ఈ అనుభవాలు, రాజధాని నిర్మాణపు అనుభూతులు కలసికట్టుగా వారిని భావోద్వేగాలకు గురి చేస్తుండవచ్చు. చంద్రబాబు రాజకీయ జీవన ప్రస్థానం మొత్తం భావోద్వేగాల భరితమని నిర్ధారించిన నిపుణులు కూడ లేకపోలేదు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం అతిపిన్నవయసులో మంత్రికావడం, తెలుగుదేశంలోకి చేరిపోవడం, ఒక ముఖ్యమంత్రిని పదవినుంచి తొలగించి తాను ముఖ్యమంత్రి కావడం, ప్రధానమంత్రి పదవిని స్వీకరించరాదని ప్రతిజ్ఞచేయడం-వంటివి ఆయన నిరాడంబర జీవన గమనంలో అతికొద్ది భావోద్వేగ ఘట్టాలు కావచ్చు. అందువల్ల చంద్రబాబు ఆవిష్కరించిన నిరాడంబరత్వానికి భావోద్వేగ పరంపర మాత్రమే ప్రాతిపదిక. ఆయన నిరాడంబర జీవన పద్ధతిని అందరూ అంగీకరించి తీరాలి, ఆత్మకథలో ఎవ్వరూ అబద్ధం చెప్పరు.
సమాంతరంగా పవన్ కల్యాణ్ అనే చిత్ర ప్రముఖుడు చిత్ర విచిత్రంగా తన ఆత్మకథను కూడ అనావరణం చేసేశాడు. ఆయనది కూడ గొప్ప నిరాడంబరత్వం. ఎటొచ్చీ ఆయనకు రాజకీయ జీవితపు భావోద్వేగాలు లేవు. ఉండడానికి వీలులేదు. ఎందుకంటె అతగాడు ఇంకా రాజకీయా లలోకి రాలేదు. మరి ఆయన నడిపిస్తున్న ఈ మొత్తం వ్యవహారం ఏమిటి? దానిపేరే ‘‘నిరాడంబరత్వం!’’ అందువల్ల ఆయనకు రాజకీయ భావోద్వేగాలు లేవు. ఉన్నవి చిత్ర జగతికి సంబంధించిన భావోద్వేగ అభినయ విన్యాసాలు మాత్రమే..
అందువల్ల పవన్‌కల్యాణ్ నిరాడంబరత్వపు ఆవిష్కరణకు, ‘అభినయ ఆవేశం’ మాత్రమే ప్రాతిపదిక.
చంద్రబాబు నిరాడంబరత్వానికి, పవన్ కల్యాణ్ నిరాడంబరత్వానికి ఇది ప్రధానమైన భేదం. పవన్ కల్యాణ్ సినిమాలను వదలివేస్తే అ మరుసటిరోజునుంచి ఆయనను జనమే పోషించాలట. అంతటి నిరుపేదతనం ఆయనది…అందువల్ల సినిమాలలో నటించడం మానుకోమంటారా? అని ఆయన అభిమానులను ప్రశ్నించిన ఘట్టం ఈ ఆవేశానికి పరాకాష్ఠ, ‘‘వదిలేయమంటారా..?’’ అని అభిమానులను మామూలుగా ప్రశ్నించి ఉండవచ్చు… మైకులు ఎలాగూ ఉన్నా యి కాబట్టి అందరికీ వినబడితీరుతుంది. కానీ పవన్ కల్యాణ్ ఆకాశానికి చిల్లులు పడే స్థాయిలో ఆవేశంగా అరిచాడు. ‘‘వద్దిద్ది లేయ్యయ్య మంఠారా’’ అని ఆయన అరవడం అభిమానులు ‘‘వద్దువద్దు’’ అని సమాధానం చెప్పడం ప్రజాభిప్రాయ సేకరణ ప్రహసనం. ఆ ఒక్క సభలో ఉన్నవారే సమస్త ప్రజానీకం..అందువల్ల ఆయన చలనచిత్రాలలో నటించడం కొనసాగిస్తాడట. అక్కడున్న జనం ‘‘మానెయ్’’ అని అరచి ఉంటే ఆయన సినిమాలను మానేసి ఉండేవాడు కాబోలు. కాకినాడలో సభ జరిగింది. పవన్ కల్యాణ్ సినిమాలలో నటించడం కొనసాగించాలా? వద్దా? అన్న ‘మహా విషయం’ నిర్ధారించడానికికన్నది అభిమానులకు అర్థమైన సంగతి. సభ వెనకాల ఉండిన కొందరు ‘వదిలేయ్’ అని కూడా అరచినట్టు గిట్టనివాళ్లు ప్రచారం చేశారు. సినిమాలను వదిలివేసిన వెంటనే పవన్ కల్యాణ్ అభిమానులు వంతులు వేసుకొని పూటకొకరి ఇం ట్లో భోజనం పెట్టాలి. ఎందుకంటె సినిమాలలో నటించడం మానేసిన తక్షణం ఆయన నిరుపేద! ఈ సంగతి స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. ఇన్ని రోజులూ ఆయన సినిమాలలో నటించి సంపాదించినదంతా భోజనానికి సరిపోయిందన్నమాట! ఏమీ మిగలలేదు. లేదా భోజనానికి సరిపోయినంత పారితోషికం మాత్రమే తీసుకొని ఆయన ఇన్ని రోజులూ నటించేశాడు. అదీ నిరాడంబరత్వం. అది నిజమైతే సర్వోత్కృష్ట, ఆర్థిక నీతిని పవన్ కల్యాణ్ నిజజీవితంలో అమలు పరిచాడన్నమాట..‘‘యావత్ బ్రియేత జఠరం తావత్ స్వత్వం హిదేహినామ్, అధికం యోభిమనే్యత సస్తేనో దండీమర్హతి..’’ అని మనువు చెప్పిన మాట. ఈ ఉదాత్తమైన ఆర్థిక నీతి. ‘‘ఆకలి తీర్చుకోవడానికి అవసరమైనంత మాత్రమే సంపాదించాలి. ఎక్కువ సంపాదించి నిలువచేసేవాడు దొంగ, వాడు శిక్షార్హుడు..’’ అందువల్ల సినిమాలలో నటించడం మానిన తక్షణం నిరుపేదగా మారిపోనున్న పవన్ కల్యాణ్ ఈ పరమోన్నత సామాజిక న్యాయసూత్రాన్ని పాటిస్తున్నాడన్నమాట! లేకపోతే ‘‘అక్కా అన్నంపెట్టు’’ అని ‘‘నటుడు కాని’’ పవన్ కల్యాణ్ ఇంటింటికి తిరగవలసిన అవసరం ఏముంది?? ఇదీ నిర్బంధ నిరాడంబరత్వం.
సంపన్నులు నిరాడంబరంగా ఉండడం గొప్ప. అందువల్ల చంద్రబాబునాయుడి నిరాడంబరత్వం స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది. ఆయన తాను చేసే సాదాసీదా భోజనం గురించి ఇతరేతర నిరాడంబరాల గురించి చెప్పుకున్నారు. ఖద్దరు కట్టుకుంటున్నారా లేక ఖద్దరు ధరించడం ఖరీదైన వ్యవహారం కాబట్టి మిల్లు బట్టలనే ధరిస్తున్నారా? వివరాలు మాత్రం చంద్రబాబు ఆవిష్కరించినట్టు ప్రచారం కాలేదు. ఏమయినప్పటికీ ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, పవన్‌కల్యాణ్ వలె నిరుపేదలు కాజాలరు. నిరుపేదలు నిర్బంధ నిరాడంబరత్వాన్ని పాటిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్న స్వచ్ఛంద నిరాడంబరత దేశంలోని కనీసం రాష్ట్రంలోని సంపన్నులకు, కనీసం సంపన్న కార్యకర్తలకు ఆదర్శం కావచ్చు. ఆయన స్ఫూర్తితో కొన్ని లక్షల మంది సంపన్నులు నిరాడంబరంగా జీవించినట్టయితే దానివల్ల రెండు రకాల లాభాలు చేకూరవచ్చు
ఇప్పు డు చంద్రబాబు మళ్లీ నిరాడంబరం గురిం చి తపిస్తున్నారు. ఈ వ్యక్తిగత నిరాడంబరత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడ వర్తింపచేస్తే, హతమై పోనున్న ఆకుపచ్చని పొలాలు మళ్లీ కృతమవుతాయి. గిరివ్రజం, పాటలీపుత్రం, ఉజ్జయిని, హంపీ, ఓరుగల్లు-వీటిని భారతీయులు నిర్మించారు… సింగపూర్ వారు కాదు, టింబక్టూవారు కాదు.
http://www.andhrabhoomi.net/content/editorial-519
దసరాకు ముహూర్తం!
బీసీ, రెడ్డి వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత ఏడాది నుంచి కమ్మ వర్గం అధిపత్యం పెరిగిందన్న భావన ఇతర కులాల్లో బలంగా నాటుకుపోయింది
హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఏపి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల సమీకరణలతో కసరత్తు చేస్తున్నారు. బాబుకు సెంటిమెంటయిన దసరా రోజునే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఆయా కులాలకు ఉన్న ప్రాధాన్యం ప్రకారం కేబినెట్‌ను విస్తరించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. బీసీ, రెడ్డి వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి సిఎం కుమారుడు లోకేష్ మినహా కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చంటున్నారు. గత ఏడాది నుంచి కమ్మ వర్గం అధిపత్యం పెరిగిందన్న భావన ఇతర కులాల్లో బలంగా నాటుకుపోయింది. దానికితోడు ముద్రగడ దీక్ష తర్వాత ఇలాంటి ప్రచారాన్ని ప్రత్యర్థి సామాజిక వర్గాలు బలంగా ప్రచారం చేశాయి. దీంతో లోకేష్‌కు మినహా ఇతరులకు స్థానం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి
ఇక రెడ్లను ఆదరించడం ద్వారా జగన్‌ను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో వెళుతున్న నాయకత్వం సీమ, నెల్లూరు జిల్లాల్లో ఆ వర్గాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కడప నుంచి ఎవరికీ కేబినెట్లో చోటు లేదు. ఒకవేళ ఆ జిల్లాకూ స్థానం కల్పించాలని నిర్ణయిస్తే, అక్కడ కౌన్సిల్ వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, లేదా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఇక కర్నూలులో భూమా కుటుంబానికి మంత్రిపదవి ఖాయమంటున్నారు.
నెల్లూరు-ప్రకాశం జిల్లాకు కలిపి ఒక రెడ్డికి ఇవ్వవచ్చన్న చర్చ జరుగుతోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు నుంచి సోమిరెడ్డి, ప్రకాశం నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మాగుంటది నెల్లూరు నేపథ్యమే అయినప్పటికీ, నెల్లూరుకు ఫుల్‌టైమ్ మంత్రి అవసరం ఉందన్న భావన ఉంది. ప్రస్తుతం నారాయణ కూడా పెద్దగా సమయం కేటాయించడం లేదన్న అసంతృప్తి ఉంది. అందువల్ల రెండు జిల్లాలకు కలిపి ఒక రెడ్డికి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అవసరమైతే ప్రకాశం నుంచి మాగుంటకు, నెల్లూరు నుంచి సోమిరెడ్డికీ ఇవ్వాలన్న సూచనలు అందుతున్నట్లు సమాచారం. తాజాగా మాగుంట బాబును కలిసినా అది వ్యాపారానికి సంబంధించిందేనని అంటున్నారు.
ఇక కాపులను కేబినెట్లోకి తీసుకునే విషయంలో కుల సమీకరణలు కుదురుతున్నట్లు కనిపించట్లేదు. జ్యోతులనెహ్రును క్యాబినెట్లో తీసుకుంటే తూర్పుగోదావరి నుంచి ఇద్దరు కాపులవుతారు. దానివల్ల బీసీలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావుకు ఆయన మరదలు మృణాళిని స్థానంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
కళా బీసీ తూర్పుకాపు. కోస్తాలో కళాను కాపుగా గుర్తించే పరిస్థితి లేదు. అదే రాజప్పకు అధ్యక్ష పదవి ఇస్తే కాపులకు పార్టీ అధ్యక్ష పీఠమే ఇచ్చారని ఆ వర్గాన్ని సంతృప్తి పరచవచ్చని పార్టీ ఆలోచిస్తోంది. దానికి తోడు బీసీ కమిషన్ నివేదిక ఆలస్యం అవుతుండటం వల్ల రాజప్ప మంత్రిగా కంటే, పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నచ్చచెప్పడం వల్ల ఎక్కువ ఫలితాలుంటాయంటున్నారు.
ఇక బీసీలను విస్మరిస్తున్నారన్న అపనింద ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. పశ్చిమగోదావరి, అనంతపురం, శ్రీకాకుళం నుంచి బీసీలకు స్థానం దక్కవచ్చు. అనంతలో బోయ కుల జనాభా ఎక్కువగా ఉన్నందున ఈసారి ఆ వర్గానికి స్థానం ఖాయమంటున్నారు. అందులో భాగంగా చీఫ్‌విప్, బాబుకు విధేయుడయిన కాలవ శ్రీనివాసులు, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరికైనా స్థానం ఖాయమంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు శెట్టిబలిజ కోటాలో బెర్త్ లభించవచ్చు.
http://www.andhrabhoomi.net/content/pradesh