పచ్చని పంటపొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారంటూ కొంత మంది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ( NGT ) గడపతొక్కారు. ఈ అంశంపై దేశ రాజధానిలో NGT నిన్న( 15.9.16 ) మరో దఫా విచారణ చేపట్టింది. రాజధాని నిర్మించదలచిన ప్రాంతానికి వరద ముప్పు ఉందని ఈ సందర్భంగా పిటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. కొండవీటి వాగు ముంపుకు గురయ్యే 10 వేల ఎకరాల భూమిని ఏకంగా 25 మీటర్ల ఎత్తుకు లేపి రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం ఆచరణయోగ్యంగాని ప్రతిపాదన చేస్తోందనీ కోర్టుకు వివరించారు. అవునా ? అదెలా సాధ్యం ? అంత భారీ స్థాయిలో భూమిని అంత ఎత్తుకు ఎలా లేపుతారు ? ..అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
✪ ఈ వార్తలో ముఖ్య విషయం ఏమిటి ? 10 వేల ఎకరాలను , 25 మీటర్ల మేర ఎత్తు ఎలా పెంచుతారు …? అంటూ అమరావతి నిర్మాణంపై NGT రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఈ విషయాన్నే తెలుగు పత్రికలు , ఇంగ్లీష్ పత్రికలూ ప్రధానంగా చెప్తూ వార్తలు ఇచ్చాయి. ఫోటోలో వివరాలు చూడగలరు .
ఐతే ఈనాడు , ఆంధ్రజ్యోతి మాత్రం అసలు విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా తప్పుడు వార్త ఇచ్చాయి.
✪ ” వరదను ఒడిసి పడితే తప్పేంటి ..?” అన్నహెడ్డింగ్ తో… ఆంధ్రజ్యోతి మరీ అడ్డగోలుగా తప్పుడు వార్త ఇచ్చింది. కోర్టులో న్యాయమూర్తులు ఈ ప్రశ్న అడిగిన మాట వాస్తవమే. ఐతే …ఒడిసి పడితే తప్పు లేదండీ …కానీ 10 వేల ఎకరాలను 25 మీటర్ల ఎత్తు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేస్తానంటోంది , ఇది అసాధ్యం అని పిటీషనర్లు చెప్పారు. అప్పుడు కోర్టు ..అంత ఎత్తు పెంచడం ఎలా సాధ్యం ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆంధ్రజ్యోతి మాత్రం అడ్డగోలుగా అసలు విషయాన్ని దాచేసింది.
✪ ఇక ఈనాడు ఐతే …అసలు జర్నలిజం అంటే ఏంటో , వార్త ఎలా రాయాలో కూడా మర్చిపోయింది. ( అంటే …మనల్ని మభ్య పెట్టింది ..) .. ” అమరావతి విచారణ నేటికి వాయిదా ” ..ఇది ఈనాడు హెడ్డింగ్. కేసు విచారణ వాయిదా పడటం వార్తా ? లేక ..విచారణలో కోర్టు చేసిన వ్యాఖ్యలు వార్తా ? అసలు విషయాన్ని మాత్రం జాగ్రత్తగా ఈనాడు దాచిపెట్టింది..
✪ అదిగో అమరావతి , ఇదిగో అమరావతి అంటూ ప్రజలకు రంగురంగుల చిత్రాలను మొదటి పేజీల్లో చూపే పత్రికలు ..ఇంతటి ముఖ్యమైన వార్తను ఖూని చేసిన తీరు చూస్తే ఏమి అర్ధమౌతోంది ?… 10 వేల ఎకరాలను 25 మీటర్ల మేర ఎత్తు పెంచడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది ఏ విపక్షమో కాదు. స్వయంగా గ్రీన్ ట్రిబ్యునల్. మరి ఇలా కోర్టులు చేసే విమర్శలు, వ్యాఖ్యలను కూడా ఖూనీ చేస్తారా ? ప్రజల కోసం వార్తలు రాయడం అంటే ఇదేనా ??…
http://telugu.updateap.com/media-discussons/eenadu-andhrajyothy-diverting-ngt-comments/
దిగుబడి క్షీణత
కనిపించని ‘డబుల్ డిజిట్’ లక్ష్యం
– సాగు విస్తీర్ణంలో కోత తగ్గిన 28 లక్షల టన్నుల
– ఆహారధాన్యాల ఉత్పత్తి బియ్యం లోటు 20 లక్షల టన్నులకుపైనే
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1843862