మరోమారు హైకోర్టు మొట్టికాయ- స్విస్‌ ఛాలెంజ్‌పై ప్రశ్నల వర్షం

మరోమారు హైకోర్టు మొట్టికాయ- స్విస్‌ ఛాలెంజ్‌పై ప్రశ్నల వర్షం
– ఆదాయ వివరాల గోప్యతపై విచారణ నేటికి వాయిదా
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం ఎంచుకున్న స్విస్‌ఛాలెంజ్‌ విధా నంలో ఆదాయ వివరాల్ని రహస్యంగా ఉంచడం పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం పలు సందేహాల్ని లేవనెత్తింది. ఆదాయ వివరాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 12న స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఏపి మున్సిపల్‌ శాఖ, సిఆర్‌డిఎ సవాల్‌ చేసిన రిట్‌ పిటిషన్లను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌రంగనాథన్‌, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. విచారణ
మరోమారు

హైకోర్టు మొట్టికాయ
మంగళవారం కూడా కొనసాగనుంది. విచారణ సందర్భంగా ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను న్యాయపరమైన అనేక ప్రశ్నలు వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ప్రభుత్వానికే తెలియకపోతే ఎలా? ఇంతవరకు సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ఎన్ని బిడ్స్‌ వచ్చాయి? సింగపూర్‌ కన్సార్టియం సీల్డు కవర్‌లో ఆదాయ వివరాలు ఉంచితే, రహస్యంగా ఉండాలని ఆ సంస్థ కోరినా, కనీసం ప్రభుత్వానికైనా ఆదాయ వివరాలు తెలియాలి కదా? ప్రభుత్వానికే ఆదాయ వివరాలు తెలియవంటే ఎవరైనా విస్తుపోతారు కదా? నిజంగానే సింగపూర్‌ కన్సార్టియం ఆదాయ ప్రతిపాదనలు లాభదాయంగా ఉంటే సరే, లేకుంటే లాభదాయం కాదనిపిస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే జరిగితే రద్దు చేస్తామనే ఏజి వాదన ప్రకారం ఇంతవరకు జరిగిన ప్రక్రియ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా? అదే ఆదాయ వివరాలు ముందుగానే తెలుసుకుని ఉంటే కాలంతోపాటు ఖర్చులు కలిసివస్తాయి కదా? పారదర్శకంగా ఉన్నట్టు అవుతుంది కదా? నేటి వరకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదని ఏజి చెబుతున్నదాన్ని బట్టి, ఆయన కోరుతున్నట్టుగా సింగిల్‌ జడ్జి విధించిన స్టే ఉత్తర్వుల్ని ఎత్తేస్తే. ప్రభుత్వం నేరుగా సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందం చేసుకునేందుకు అడ్డుంకులు లేనట్టే అవుతుంది కదా? ఆదాయం ఎంత రావచ్చునో అంచనా లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ అంచనాలతో ప్రభుత్వం సంతృప్తి చెందకపోతే ఏం చేస్తారు? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాల్ని రహస్యంగా ఎందుకు ఉంచాలి? గోప్యంగా ఉంచాలని చట్టం ఏమైనా ఉందా? ఆదాయ వివరాలు లేకుండా ఏ కంపెనీ అయినా బిడ్‌ దాఖలు చేస్తుందా? ఇలా పలు ప్రశ్నలతో హైకోర్టు సర్కార్‌ను నిలదీసింది. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ, ఆదాయ వివరాల్ని అందరికీ ఇవ్వొద్దని సింగపూర్‌ కన్సార్టియం కోరిందని, అందుకే రహస్యంగా ఉంచామన్నారు. సాంకేతిక బిడ్డింగ్‌లో అర్హత పొందిన కంపెనీలకే ఆదాయ వివరాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇంతవరకు ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదని తెలిపారు. సింగిల్‌ జడ్జి ఐక్యాచ్‌ కమ్యూనికేషన్స్‌-ప్రకాష్‌ ఆర్ట్స్‌ కేసులో హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును ఆధారం చేసుకున్నారని, ఈ కేసుకు ఆతీర్పు వర్తించదని, టెండర్‌ నిబంధనలు ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వానికే విచక్షణాధికారం
ఉందని వాదించారు.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1844284

కృష్ణాగోదావరులు -ఇకపై పట్టిసీమ కు ఉపనదులు
http://www.muchata.com/cocktail/satire-on-chandrababu-brain-child-pattiseema-river/

5 Comments

Filed under Uncategorized

5 responses to “మరోమారు హైకోర్టు మొట్టికాయ- స్విస్‌ ఛాలెంజ్‌పై ప్రశ్నల వర్షం

 1. Kotla mandhi ……Gundechappudu

 2. Neethimalina Jathi ….Kulanni Kalanni addam pettukuni Rastranni dochukuntunta …
  Rastram kosam …….Aluperagani Prajaporatam chesthunna..Oke Okkadu

 3. Veera

  2 కళ్లు 4 నాలుకల సిద్ధాంతి ఈ బాబు- జగన్
  1) హోదా 10కాదు 15 ఏళ్ళు కావాలి
  2) హోదా సంజీవనా?
  3) మేము హోదాకోసం 23 సార్లు డిల్లీ పోయా
  4) హోదా వల్ల ఏమొస్తది చెప్పండి
  -Bhaskar Reddy.

 4. Veera

  విశాఖ లో లోకేష్‌ వెయ్యి కోట్ల కుంభకోణాన్ని వారంలో బయటపెడుతా
  -వైసీపీ గుడివాడ అమరరనాధ్

  http://teluguglobal.in/%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B5%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AD%E0%B1%82%E0%B0%95/

 5. Veera

  ఏపీలో ఎయిర్ పోర్టుల అనుసంధాన‌మ‌ట‌..!
  ఆత‌ర్వాత పోర్టులు,
  బ‌స్టాండులు కూడా అనుసంధానం ఉంటుంది
  అప్ప‌టి వ‌ర‌కూ మీరంతా వేచి చూడండి..!
  -Va Sam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s