AP లో 23,280 కోట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు స్కామ్

AP లో 23,280 కోట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు స్కామ్
-TDP మాజీ MP నామా చౌదరి కి దోచి పెడుతున్న బాబు
బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 2 రూపాయలు కానీ నామా చౌదరి కి రూ. 4.43 చొప్పున ఇస్తున్న AP,ఇప్పటికే AP లో మిగులు విద్యుత్ ఉంది , ప్రభుత్వ జెన్ కో లో ఉత్పత్తి తగ్గించి మరీ ప్రైవేటు నుంచి కొంటున్నారు చౌదరి కి లాభం చేయాలనీ.

ఇప్పటికే మిగులు విద్యుత్ లో ఉన్నామని చెబుతున్న ఎపి ప్రభుత్వం తెలుగుదేశం నేత నామా నాగేశ్వరరావుకు చెందిన పవర్ ప్రాజెక్టు నుంచి, మరో ప్రాజెక్టు నుంచి విద్యుత్ ను కొనుగోళ్లు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.బయట మార్కెట్ లో తక్కువ దరకు లభిస్తుండగా అదిక ధరపెట్టి ప్రైవేటు విద్యుత్ కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయవద్దని చెప్పినా ఎపి ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం చేసుకుంది

జెన్ కో లో ఉత్పత్తి తగ్గించి మరీ ప్రైవేటు నుంచి కొంటున్నారన్నది అబియోగం గా ఉంది. ఇలాంటి ఒప్పందాల వల్ల రాష్ట్రంపై ఆర్దిక బారం తీవ్రంగా ఉంటుందన్నది ఆ వార్త సారాంశం. దీనిపై ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి.

ఇప్పుడు జరిగిన పీపీఏలు రూ. వేల కోట్లు ఖరీదైనవి. 600 మెగావాట్ల విద్యుత్‌ను 85 శాతం పీఎల్‌ఎఫ్‌తో తీసుకోవాలనేది ఒప్పందం. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొనుగోలు చేస్తారు. దీనికి యూనిట్‌కు రూ. 4.43 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 5.31కోట్లు. ఏడాదికి రూ. 1,940 కోట్లు. 12 ఏళ్ల పాటు తీసుకునే ఈ విద్యుత్‌కు రూ. 23,280 కోట్లు ప్రజల సొమ్ము నామా సంస్థలకు దోచిపెడుతున్నారు. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా విదేశీ బొగ్గుతో నడిచేవి కావడం మరో విశేషం. అంటే, విదేశీ బొగ్గు దిగుమతిలో తేడాలు వస్తే చర వ్యయం పెరిగే వీలు కూడా ఉంది. ఇప్పటికే ఏపీ డిస్కమ్‌లు రూ. 4 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. వీటిని పూడ్చుకోవడానికి కొత్తగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. క్విడ్ ప్రో కో కోసం నామాకు దొడ్డిదారిన ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ఒప్పందాలు జరిగినట్టు తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

జెన్‌కో ఉత్పత్తి నిలిపేసి…
డిమాండ్ లేదంటూ ఒక పక్క జెన్‌కో ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. 1600 మెగావాట్ల సామర్థ్యంగల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో గత రెండు నెలలుగా ఒక యూనిట్‌లో తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కడపలోని ఆర్టీపీపీలో ప్రతీ రోజు మూడు యూనిట్లను బ్యాకిం గ్ డౌన్ చేస్తున్నారు. డిమాండే లేని పరిస్థితి ఒకపక్క, మిగులు విద్యుత్‌ను అమ్మలేని పరిస్థితి మరోపక్క ఉంటే… నామా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక దోచిపెట్టడం తప్ప మరోటి లేదని అధికారులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 2లకే లభిస్తోంది. అవసరమైతే జెన్‌కో థర్మల్ ప్లాంట్లను కూడా తగ్గించి ఈ విద్యుత్‌ను తీసుకోవాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తన వారి ప్రయోజనం కోసం విద్యుత్ సంస్థలను నిండా ముంచేస్తోంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20160923_9.php?p=1474609704638

అనర్హతపై ఏపిలో టెన్షన్!
హైదరాబాద్, సెప్టెంబర్ 22: పార్టీ మారిన 12 మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు ఏపిలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోంది. 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో మొదలయింది. హైకోర్టు ఆదేశం మేరకు 90 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తన వద్ద ఉన్న అనర్హత పిటిషన్లు విచారించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఈ వ్యవహారం ఏపిలో పార్టీ మారిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తోంది. హైకోర్టు తీర్పు ప్రభావం ఏపిలో కూడా ఒకేలా కనిపిస్తుంది కదా? అన్న ఆందోళన మొదలయింది.

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=6380072

2 Comments

Filed under Uncategorized

2 responses to “AP లో 23,280 కోట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు స్కామ్

  1. Investigate the theif …….SC

    http://www.greatandhra.com/politics/political-news/sc-shock-to-naidu-wants-probe-into-cash-for-vote-77108.html

    Next ….Mana kulam varu SC lo vunnaru kadha ….kapadataniki ??
    Chee chee…..ee Gajji / Gaja Dongalu.
    They are a disgrace to Humanity.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s