రాజధాని దారెటు..! శాశ్వత నిర్మాణ పనుల ప్రారంభానికి తీవ్ర జాప్యం
-2019కి తొలిదశ పూర్తి కాదు, కనీసం పనులైన చేపడట్టగలరా?
– ఆర్కిటెక్ట్ కోసం అక్టోబరులో మరోసారి టెరడర్లు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
అమరావతి నవ్యాంధ నిర్మాణాలు 2019కి కల్లా తొలిదశ పూర్తవుతాయని సర్కారు చెబుతున్నా , అప్పటికి కనీసం ఆ పనులు ప్రారంభమైనా అవుతాయా? అనేది సందేహాస్పదంగా మారింది. హైదరాబాద్‌లోని ఏపి సచివాలయ ఉద్యోగులు వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి తరలిపోయే క్షణాలైతే దగ్గర పడ్డాయి. కానీ అక్కడ శాశ్వత రాజధాని నిర్మాణంపై మాత్రం నేటికీ సందిగ్ధత తొలగలేదు. మాస్టర్ ప్లాన్ ఖరారు కాకపోవడం, భవన నిర్మాణాలకు మురదుకొచ్చిన ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్ మధ్యలో వెనుదిరిగిపోవడం వంటి అరశాలు రాజధాని నిర్మాణంపై ప్రభావం చూపుతున్నట్లు భావిస్తున్నారు.
ప్రధానంగా సిరగపూర్ సంస్థ ఇచ్చిన స్విస్ ఛాలెరజ్‌లో ప్రభుత్వం అనుసరిరచిన విధానాలపై హైకోర్టు నురచి మొట్టికాయలు పడుతున్నాయి. ప్రభుత్వం తరఫున నిర్దిష్ట మొత్తంతో మురదస్తు ప్రకటన లేకుండానే సూమోటోగా సిరగపూర్ సంస్థల కూటమి టెరడర్‌ను దాఖలు చేయడంపై కూడా కోర్టు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. సింగపూర్ సంస్థల కూటమి ప్రతిపాదనలు పంపిరచడం, వాటిని ప్రభుత్వం వెరటనే ఆమోదిరచడం విమర్శలకు తావిస్తోరది. ఆ ప్రతిపాదనలను ఛాలెరజ్ చేసేరదుకుగాను ఇతర సంస్థలకు తగిన సమయం ఇవ్వకపోవడంతో వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిరచారు. ఆ పిటిషన్లు, ఆపై స్టే, స్టేను తొలగింపజేయడానికి ప్రభుతం వేసిన అప్పీల్ పిటిషన్ హైకోర్టు స్విస్‌ఛాలెంజ్ విషయంలో పలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రశ్నలను సంధించింది. ఇదంతా స్విస్‌ఛాలెరజ్ ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియకు ప్రారంభంలోనే పెను జాప్యానికి కారణమవుతోరదని అధికారులే అంగీకరిస్తున్నారు.
జపాన్‌కు చెరదిన మాకీ సంస్థ కూడా అర్ధారతరంగా అర్కిటెక్ట్ బాధ్యతల నురచి తప్పుకోవడం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరచుతోరది. మొత్తం భవనాలకు నమూనాలు ఇచ్చేరదుకు ఈ సంస్థ రూ.95 కోట్లు డిమారడ్ చేసిరది. ఆ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణంగా ఆ మొత్తాన్ని చెల్లిరచేరదుకు ప్రభుత్వం నిర్ణయిరచిరది. అయినా స్థానిక పరిస్థితుల కారణంగా మాకీ సంస్థ వెనుదిరిగి పోవడాన్ని జీర్ణిరచుకోలేని మంత్రులు, అధికారులు హుటాహుటిన ప్రత్యేక విమానంలో టోక్యో చేరుకుని ఆ సంస్థ అధినేతలతో మంతనాలు కూడా చేశారు. కేవలం మూడు గంటలపాటు జరిగిన ఆ మంతనాలూ విఫలం కావడంతో అదే రోజు తిరుగుముఖం పట్టాల్సి వచ్చిరది.
ఇప్పుడిక కొత్త ఆర్కిటెక్ట్ కోసం మళ్లీ టెరడర్లు పిలవాల్సిన పరిస్థితి నెలకొరది. వచ్చే నెలలో దీనిపై కొత్త టెరడర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తోరది.
ఈసారి కూడా గ్ల్లోబల్ టెరడర్లు ఆహ్వానిస్తామని, ఈ ఏడాది చివరిలోగా ఆర్కిటెక్ట్‌ను ఖరారు చేస్తామని మౌలికాభివృద్ధి సంస్థలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడిరచారు.
ఇన్ని అడ్డంకులు ఒకదానికొకటి మీదపడుతుండటంతో నూతన రాజధాని శాశ్వత భవనాల నిర్మాణంలో జాప్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోరది. అందువల్ల మొదటి దశ నిర్మాణాల పూర్తి అటుంచి, కనీసం పనుల ప్రారంభమైనా ఇప్పట్లో ఉంటుందా? అనేది అందర్నీ వేధిస్తోంది.
Alupergani Praja poratam ….
http://www.sakshi.com/news/top-news/ys-jagan-fires-on-chandrababu-about-farmers-403688?pfrom=home-top-story
I am డాక్టర్ బాబు, MA Ph.D -పిట్టల దొర
Nice to meet you,I am డాక్టర్ బాలి, MBBS FRCS (London)-అలీ