పట్టు జారిపోతుందా?

హైదరాబాద్, అక్టోబర్ 3: తెదేపా అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పార్టీపై పట్టుతప్పుతోందా? పదేళ్లు కష్టపడి సాధించిన అధికారానికి ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల తీరుతో ప్రమాదం వచ్చి పడిందా? ఎమ్మెల్యేల అడ్డగోలు దోపిడీతో సొంత పార్టీనేతలే దెబ్బతింటున్నారా? కోస్తాలో పెరుగుతున్న కులముద్ర మిగిలిన కులాలను ఏకం చేస్తోందా? వైసీపీ నేతల చేరికలు నిజంగానే కొంప ముంచనున్నాయా?.. రెండున్నరేళ్లుగా కార్యకర్తల్లో బలంగా నాటుకున్న ఇలాంటి వాదన, వేదన నేపథ్యంలో నేటి నుంచి నాలుగురోజుల పాటు జరగనున్న తెదేపా శిక్షణ శిబిరాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇవి వాస్తవాలు చర్చించుకుని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు అక్కరకొస్తాయా? లేక నాయకత్వాన్ని కీర్తించేందుకు పరిమితమవుతాయా? అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదరించిన ఉభయ గోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కార్యకర్తల పరిస్థితి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పని చేసిన వారికి గుర్తింపు లేకపోగా, పార్టీ పదేళ్లు కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని వారు, ఎన్నికల సమయంలో టికెట్లు తీసుకుని ఎమ్మెల్యే, మంత్రులుగా వచ్చి తమపై కర్ర పెత్తనం చేస్తున్నారన్న ఆగ్రహం ఉంది.

గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారని క్వారీలు, వైన్‌షాపులు, రెస్టారెంట్ల వ్యాపారం చేసుకునే తమ నుంచి కూడా వాటాలు పిండుతున్నారంటున్నారు. గుంటూరు జిల్లాలో ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 14 క్వారీలుండగా, అందులో 11 కమ్మ వర్గానికి చెందిన పార్టీ నేతలవే.

అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు మంత్రిగారు మైనింగ్ అధికారులపై ఒత్తిడి చేసి వాటిని మూయించారు. మంత్రిగారికి కొడుకు లాంటి వ్యక్తికి వాటిని తక్కువ ధరకు అమ్మేయమంటున్నారని, ప్రతి ఎన్నికల్లో సొంత డబ్బుపెట్టి పనిచేసే తమకు, పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదని వాపోతున్నారు. ఇదే మంత్రిగారి భార్య ప్రకాశం జిల్లాలోని క్వారీ దరఖాస్తుదారుడిని పిలిపించి అది తమకు స్వాధీనం చేయమని ఒత్తిడి చేస్తున్నారంటున్నారు.
గుంటూరు జిల్లాలో ఎక్కువ సార్లు గెలిచి, మంత్రి పదవి రాని ఒక ఎమ్మెల్యే, తన నియోజకవర్గంలోని క్వారీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే కబ్జా చేసుకుని, అనధికార మైనింగ్ చేస్తున్నా అడిగే దిక్కు లేదంటున్నారు. జిల్లాలో పోలీసు నియామకాలన్నీ ఆయనకే అప్పగించారని, దానితో సాంబశివరావుకు డిజిపి పదవి రాకుండా ప్రయత్నించే స్థాయికి ఎదిగారంటున్నారు.

కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ప్రతిదానికి రేట్లు నిర్ణయించి, డబ్బులు ఇచ్చిన తర్వాతనే లెటర్లు స్వాధీనం చేయమని పీఏలను ఆదేశిస్తున్నారు. మరో మంత్రి భార్య దూకుడుకు పార్టీ కార్యకర్తలు హడలిపోతున్నారు. ఇంకో మంత్రి అవగాహనా రాహిత్యం, అహంకారంతో పార్టీ నేతలు దూరమయ్యే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో పార్టీలో చేరిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మకుటంలేని మహారాజు. తన మాట వినలేదన్న కారణంతో ఇటీవల ఒక చిన్న దుకాణం చుట్టూ చెత్త పోయించారన్న విమర్శలున్నాయి. ఇసుకలో సోదరులిద్దరూ దన్నుకుంటు, పోలీసులను లెక్క లేకుండా మాట్లాడుతున్నా అడిగే దిక్కులేదు.
పార్టీని కష్టకాలంలో ఆదుకోవడంతోపాటు, ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన అనంతపురం జిల్లా కార్యకర్తలు పార్టీ అధికారంలోకి రాకముందే తమకు గౌరవం ఉండేదని భావిస్తున్నారు. ఒక్కరికీ పదవులివ్వకపోగా, సమస్యలు వినే నాథులు లేకుండా పోయారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

గతంలో సీనియర్లు తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పేవారని, ఇప్పుడు వారంతా ఏదో ఒక ప్రయోజనం పొంది వౌనంగా ఉంటున్నందున పార్టీకి నష్టం జరుగుతోందంటున్నారు. బాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీనియర్ల అభిప్రాయాలు వినేవారని, ఇప్పుడు అలాంటి వాతావరణం లేదంటున్నారు. కొత్తగా ఏడాదిన్నర నుంచి కోస్తాలో ఒక కులం పెత్తనం పెరిగిపోవడం మిగిలిన కులాల్లో అసంతృప్తి రగిలిస్తోంది. కీలక పోస్టింగులతోపాటు, అన్ని కాంట్రాక్టులూ వారికే దక్కుతున్నాయని, కొత్తగా పోస్టింగు తెచ్చుకున్న వారిని ఆరునెలలకు మించి పని చేయనీయడం లేదన్న ప్రచారం విస్తృతంగా ఉంది.

కొత్తగా కనిపిస్తున్న ఈ కుల ముద్రకు తెర దించకపోతే, దీనిని ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు చక్రవడ్డీతో సంపాదించుకోవాలని భావిస్తున్నందుకే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనికి తెరదించకపోతే పార్టీ పుట్టిమునిగిపోతుందంటున్నారు.
ఒకవైపు బాబు అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఎమ్మెల్యేలు బరితెగించి సంపాదనకు పాల్పడుతుంటే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయని ప్రశ్నిస్తున్నారు.

http://www.andhrabhoomi.net/content/state-4478

700 కోట్ల పత్తి కుంభకోణం లో నిందితులను మంత్రి భార్య రక్షిస్తోందా ?
అసలు మంత్రుల భార్యలు కౌంటర్ లు తెరిచి వసూళ్లు చేస్తున్నారా?

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=6462232

4 Comments

Filed under Uncategorized

4 responses to “పట్టు జారిపోతుందా?

 1. Veera

  తెలంగాణ అంతా బతుకమ్మ
  తమిళనాడు అంతా బతుకు అమ్మా
  ఆంధ్రా అంతా బతుకు కమ్మా
  -WhatsApp Message
  Request-No bad words/comments please !!!

  • Veera

   కమలంలో కుమ్ములాటలు-ఆంధ్రభూమి
   (AP బీజేపీ ని ఒక కుల పార్టీగా మార్చేశారంటున్న ఇతర కులాల కమలనాధులు
   హైదరాబాద్, అక్టోబర్ 4: ఏపి బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డెక్కాయి. విజయవాడ నగర బిజెపి అధ్యక్షుడు, బీసీ వర్గానికి చెందిన డాక్టర్ ఉమామహేశ్వరరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలాకాలం నుంచి ఒక వర్గాన్ని సవాల్ చేస్తున్న రాజును వ్యూహాత్మకంగా తప్పించారని, ఇది మిగిలిన సామాజిక వర్గాలను అణచివేసే కుట్ర గానే బిజెపి సీనియర్లు భావిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో పార్టీకి అన్యాయం జరుగుతోందని, బెజవాడ కనకదుర్గ ఆలయ కమిటీలో పార్టీ నేతలకు స్థానం కల్పించలేని మంత్రులు రాజీనామా చేయాలంటూ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాష్ట్ర కార్యాలయంలో హల్‌చల్ చేశారు. కుర్చీలు పగులగొట్టారు. దీనికి స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆ ఘటనకు నగర పార్టీ అధ్యక్షుడు రాజును బాధ్యుడిగా చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారం చాలాకాలం నుంచి రాష్ట్ర బిజెపిలో నెలకొన్న వర్గ రాజకీయాలను బట్టబయలు చేసింది.

   రాష్ట్రంలో బిజెపిని కులపార్టీగా మార్చి, తెదేపాకు తోకపార్టీగా మారుస్తున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. అన్ని జిల్లా పార్టీల్లోనూ ఈ వర్గమే పెత్తనం చేస్తోందని, మిగిలిన కులాలను పైకి రానీయకుండా అణచి వేస్తుందన్న విమర్శలూ లేకపోలేదు. ముఖ్యంగా మిగిలిన కులాలు, ప్రముఖ నేతలు పార్టీలోకి రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. ఆ వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా నేత తెరపైకి వస్తే, వారికి వ్యతిరేకంగా ఆ వర్గ మీడియాలో వ్యతిరేకంగా కథనాలు రాయించడం, రాష్ట్ర స్థాయిలో అణచివేయడం రివాజయిందని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వంటి ఇతర కులాలకు చెందిన వారు ప్రతిభ, సమర్థత ఉన్నా ఇంకా ఎదగకపోవడానికి కారణం, ఈ కుల రాజకీయమేనన్న వ్యాఖ్యలు పార్టీలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు సొంత సామాజికవర్గమే అయినప్పటికీ వారిద్దరూ చంద్రబాబుకు వ్యతిరేకమయినందున, వారిని కూడా దూరంగా పెడుతున్న పరిస్థితిపై పార్టీలో చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వర్గాన్ని వ్యతిరేకిస్తున్న రాజును సస్పెండ్ చేయడంతో అవి ముదురుపాకాన పడినట్టయింది.

   బీసీ కులానికి చెందిన రాజు చాలాకాలం నుంచి అంకితభావంతో పనిచేస్తూ, ఎన్నికల్లో గెలిచిన నేతను షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆందోళన ఘటన సాకుగా తీసుకుని రాజును సస్పెండ్ చేయడం ద్వారా, ఒక వర్గం తన ప్రతీకారం తీర్చుకుందని పార్టీ సీనియర్లు విశే్లషిస్తున్నారు. ఈ విధంగా బీసీ వర్గానికి చెందిన నేతపై వేటు వేయడం ద్వారా, పార్టీ బీసీలకు వ్యతిరేకమన్న సంకేతాలు వెళితే ప్రజలకు బీసీలు ఎలా చేరువవుతారని ప్రశ్నిస్తున్నారు.

   తాజా ఘటనను నిరసిస్తూ, రాష్ట్ర పార్టీలో నెలకొన్న కుల రాజకీయాలను వివరిస్తూ పార్టీ సీనియర్లు ఢిల్లీకి ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. ఒక వర్గానికి ధారాదత్తం చేస్తే ఎన్ని దశాబ్దాలయినా పార్టీ ఎదగదని, వీరి నీడ నుంచి పార్టీని తప్పిస్తే తప్ప మనుగడ కష్టమని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేయడంతోపాటు, రాజుపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి బీసీల్లో వ్యతిరేకత రాకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ముగిసినందున, ఆయనకు సస్పెండ్ చేసే అధికారం లేదని కూడా తమ ఫిర్యాదులో స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

   http://www.andhrabhoomi.net/content/ap-2062

 2. Veera

  Intelligence Report-TDP కి ఎదురుగాలి
  APలో 175 అసెంబ్లీ సీట్లలోTDPకి కేవలం 56 చోట్ల మాత్రమే సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చాయి
  గుంటూరు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లలో ఎదురుగాలి ,విశాఖ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అట
  http://kommineni.info/articles/dailyarticles/content_20161004_20.php

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s