‘దీపం ఉండగనే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న’ సామెతను తెలుగు తమ్ముళ్లు బాగా వంట బట్టించుకున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖ అంతర్జాతీయంగా పాపులారిటీ సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా, విలువైన భూముల ఆక్రమణలకు తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. ఈ ఆక్రమణల పర్వాన్ని చూసి విశాఖ వాసులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రజాశక్తి – విశాఖపట్నం ప్రతినిధి
దసపల్లా హిల్స్‌పై పచ్చ డేగలు కన్నేశాయి. ప్రభుత్వ భూమిని ప్రయివేటు భూమిగా చూపిస్తూ, దానికి తాము వారసులమని వాదిస్తూ.. అమాంతంగా మింగేయటానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. అధికార పార్టీ అండతోనూ, పెద్ద పెద్ద వ్యవహారాలు చూస్తున్న చిన్న బాసు సలహా సహకారాలతోనూ స్వాహాయానికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. కొంతమంది బినామీలను ఇందుకు సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో పరిశ్రమల కోసం సేకరించే భూములకు ‘భూ బ్యాంకు’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. మరి తెలుగు తమ్ముళ్ల బినామీ బాగోతాలతో అన్యాక్రాంతం చెయ్యాలనుకునే దానికి ఏ పేరు పెట్టాలన్నది బాబే చెబుతారేమో!.
‘కొండ’ంత అవినీతి..
విశాఖనగరం గవర్నర్ బంగ్లా (సర్క్యూట్ హౌస్) దసపల్లా హిల్స్‌గా పిలువబడే ఈ స్థలం ఎత్తయిన ప్రాంతం. ఇక్కడ గజం రూ.2 లక్షలపైనే విలువ చేస్తుంది. అలాంటి ప్రాంతంలో రూ.1500 కోట్లపైగా విలువ చేసే 60.30 ఎకరాల భూముల అన్యాక్రాంతానికి తాజాగా స్కెచ్ వేశారు. వాటాలు వేసుకుని పంచుకునేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు.
వాస్తవానికి ఈ భూమంతా ప్రభుత్వ కొండపోరంబోకుగా తేలింది. గతంలో విశాఖ జిల్లాకు కలెక్టర్‌గా చేసిన డాక్టర్ ఎన్.యువరాజ్ సర్వే నెంబరు 1027, 1028, 1029, 1196, 1197ల్లో గల ఈ భూములను కొండపోరంబోకుగా గజిట్ విడుదల చేస్తూ నోటిఫై చేశారు. డిసెంబరు 2015లో ఆర్సి నెంబరు 3795/2008ఇ1 (సెక్షన్ 22ఎ)ను జారీచేశారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలపాలని దాంట్లో పేర్కొన్నారు. అంతకు ముందెవరూ ఈ ప్రయత్నం చేయలేదు. దీంతో 2012లో బినామీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టుకు ప్రభుత్వ అధికారులెవరూ వెళ్లకపోవడంతో సుప్రీంకోర్టు ఎక్స్‌పార్టీ చేసింది. బినామీలు రెచ్చిపోయేందుకు ఇది దోహదపడింది. కానీ గతంలో వుడా కూడా ఈ లేఅవుట్ గల ప్రాంతంలో ఒక నీటి ట్యాంక్‌ను నిర్మించింది. ఈ ఏడాది మే 7న ప్రజాశక్తిలో ఈ భూముల కబ్జాకు జరుగుతోన్న యత్నాలపై కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.
రాణీ కమలాదేవి పేర స్వాహా!
రాణీ కమలాదేవి తెరపైకి రాకుండానే ఆమె పేర దసపల్లా కొండభూముల కథను తెలుగుదేశం పార్టీ బినామీలు నడుపుకుంటూ వస్తున్నారు. దసపల్లా హిల్స్‌లో పైన తెలిపిన ఈ 60 ఎకరాలూ చెముడు ఎస్టేట్‌కు చెందిన రాణీ కమలాదేవికి చెందినదని, కొంతమంది వ్యక్తులు ఆమెనుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించుకుని 20 ఏళ్లుగా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో తప్పుడు వాదనలతో నెగ్గుకుంటూ వచ్చారు. గత కలెక్టర్ ఎన్.యువరాజ్ కాకుండా 2015 వరకూ ఈ భూమి ప్రభుత్వ కొండ పోరంబోకుగా కోర్టుల్లో పత్రాలు ఏ అధికారీ సమర్పించలేదు. ఇదే వారికి అదునుగా మారింది. దీంతో బినామీలు ఈ భూముల్లో చెలరేగిపోయి ఇక్కడ అపార్ట్మెంట్లు నిర్మిస్తూ… ఏడాది క్రితం నుంచీ లే అవుట్లు వేసి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు.
కోర్టులో కేసుండగానే చంద్రబాబు జిఒ
1196 సర్వే నెంబరులో తెలుగుదేశం విశాఖ పార్టీ కార్యాలయానికి 2000 గజాల స్థలాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కేటాయిస్తూ జీవో నెంబరు 556ను 2002 సెప్టెంబర్ 13న విడుదల చేసింది. కోర్టులో కేసుండగా జీవో ఎలా విడుదలవుతుందన్నది ప్రశ్న. లేదంటే రాణీగారికి తెలుగుదేశంపై ప్రేమ ఎందుకు? ప్రభుత్వ పోరంబోకు భూములను కట్టబెట్టినందుకు గిఫ్ట్‌గా ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వ కొండ పోరంబోకు గాకుండా ఈ సర్వే నెంబర్లలో టిడిపి కార్యాలయానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఎలా జీవోను విడుదల చేస్తుందంటూ తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆ బినామీలు టిడిపికి కానుకగా ఇచ్చాయంటూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడు అమర్నాథ్ బుధవారం విశాఖలో ప్రెస్ కాన్ఫరెన్సులో ఎద్దేవా చేశారు. ఆర్టిఐ ద్వారా తమకు ఈ సమాచారం లభించిందని చెప్పారు. ప్రభుత్వ భూమిగా తేటతెల్లమవ్వడంతో నగరంలోని 50 మంది పెద్దలు, చంద్రబాబు కుమారుడు లోకేష్‌తో కలిసి 60.30 ఎకరాలు లూటీ చేస్తున్నారని, అందుకే ఫైళ్లు కూడా నేడు లే అవుట్లు వేసి అమ్మకాలు వేగంగా సాగుతున్నాయని వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపించారు.
ధ్రువీకరించిన సబ్ రిజిస్ట్రార్‌ను ఇంటికి పంపారు!
మొత్తంగా 60.30 ఎకరాలు భూమి దసపల్లా హిల్స్ కొండపోరంబోకుగా గతంలో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన పోతురాజు ధ్రువీకరించారు. అందుకని ఆయనపైకి చంద్రబాబు ప్రభుత్వం ఎసిబిని వదిలి కేసు బుక్ చేయించి ఇంటికి పంపిందంటూ తాజాగా రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిలోనే 35.45 ఎకరాల్లో 20 ఏళ్ల క్రితం వుడా లే అవుట్లు వేసి అమ్మిందని పోతురాజు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. పక్కా ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అవ్వడంతో కోర్టుల చుట్టూ తిరిగే తెలుగుదేశం పార్టీ రియల్ దందాకోర్లకు ఏ ఆధారం లేనందున.. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన యువరాజ్‌ను కూడా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దగ్గర పిఎస్‌గా నియమించిందన్నది తాజాగా జిల్లాలో చర్చనీయాంశమైంది. దసపల్లా హిల్స్ కొండపోరంబోకుపై విశాఖ నగరంలో తాజాగా వాడీవేడిగా చర్చ జరుగుతోంది. వైసిపి, సిపిఎం కూడా పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
తండ్రికి తలవంపులు తెచ్చే పని చేయను-మాలోకం
అంటే ఓటుకు 5 కోట్లు కాకుండా10 కోట్లు ఇస్తావా?
Rajakeeyallo….Andharu Neethimalina varu kadhu kadha mare ?
Sontha prajalanu …..Dochukovataniki ??
http://www.sakshi.com/news/vedika/people-leader-gudibandi-venkata-reddy-of-a-genuine-person-408659?pfrom=home-top-story
A city in limbo(భ్రమరావతి పేరుతొ దోచుకో దాచుకో ను ఎండకట్టిన ఇండియా టుడే )
A controversy over the award of the Amaravati contract puts paid to Chandrababu Naidu’s hopes of having his dream capital up and running before the 2019 polls.
http://indiatoday.intoday.in/story/amravati-consortium-swiss-challenge-chandrababu-naidu/1/775831.html