టిడిపి తరగతుల్లో సణుగుళ్లు, సందేహాలు-తెలకపల్లి రవి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన డాష్‌ బోర్డు అనేక విషయాల్లో క్రాష్‌ లాగా మారిందని తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారు.దాంట్లో లెక్కల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అన్నిటినీ దాంట్లో చూసి రేటింగులు షంటింగులు ఇవ్వడం మొదలుపెడితే గందరగోళం తప్పదని వారు చెబుతున్నారు. ఈ బోర్డు ప్రకారం అన్ని జిల్లాలు ఏదో విభాగంలో గొప్ప ఫలితాలు చూపిస్తున్నాయి. శాఖలు మెప్పుకోసం అంకెల గారడీలకు పాల్పడుతున్నాయి. అసలు రాష్ట్రం 12.26శాతం అభివృద్ధి రేటు సాధించిందనే లెక్కనే కీలక బాధ్యతలు నిర్వహించిన ఒక ఐఎఎస్‌ అధికారి తీవ్రంగా ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర బాధ్యుడైన తన పూర్వ సహచరుడిని కూడా ఆయన ప్రశ్నిస్తే నవ్వారట. అధికారులు ఏవో లెక్కలు ఇచ్చేస్తే వాటిని పూర్తిగా నమ్మి చంద్రబాబు నాయుడు పరిస్థితి గొప్పగా వుందనుకుంటున్నారట.ఈ డాష్‌ బోర్డు చూసి ప్రజలు అమిత సంతోషంగా వున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధ్వాన్నంగా వుందని ఒక సీనియర్‌ ఎంఎల్‌ఎలే అంటున్నారు. నిజంగా దీన్నే నమ్మితే రేపు వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తింటామని ఒక ఎంఎల్‌ఎ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ఓటర్లు వున్న చోట కూడా తమకు ఆదరణ లభిస్తున్నదని వైసీపీ నేతలు చెబుతుంటే కొత్త వర్గాలను కూడా చేరువ చేసుకున్నామని చంద్రబాబు ఈ తరగతుల్లో ప్రకటించారు. ఇవన్నీ వివరించేందుకు జనచైతన్య యాత్రలుగా వెళ్తే విమర్శలు రావచ్చని వారిలో కొందరు సందేహిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా పూర్తి చేయొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్‌లు వాస్తవాలపై మరింత శ్రద్ద పెడితే బాగుంటుందని అందుకు బదులుగా అంతా బావుందనే భ్రమలో వుండిపోతున్నారని ఒక నాయకుడు చెప్పారు.

అవినీతిపై సూక్తులు వృథా!
కాల్‌మనీ, ఇసుక దందా, ముడుపులు, దాడులు ఇలా తప్పులు చేసి దొరికి పోయిన ఒకరిపైనైనా చర్య తీసుకోకుండా దూరం పెట్టకుండా అవినీతి లేని పాలన అంటే అర్థం ఏముంటుందని అమరావతి శిక్షణా తరగతుల్లో ఒక యువ ఎంఎల్‌ఎ ఆవేశపడ్డారు. కాగా అసలు అవినీతి లేనిదెవరిలో అని రాయలసీమ సీనియర్‌ ఎంపి ఒకరు కుండబద్దలు కొట్టారు. అవినీతి నిర్వచనం చాలా విస్త్రతమైంది గనక అనేక రూపాల్లో వుండవచ్చని దాన్ని ఉపేక్షించడమే మంచిదని కూడా ఆయన సుభాషితం వినిపించారట.క్షేత్రస్థాయిలో ఎదురీతగా వున్న తమ పరిస్థితిని గమనించకుండా తాడూబొంగరం లేని ర్యాంకుల పేరిట మమ్ముల్ను వేటాడితే ఎంతకాలం తట్టుకోగలమని కూడా కొందరు చాటుమాటుగా మాట్లాడుకున్నారు. తక్కువ ర్యాంకు వచ్చిన వారి స్థానంలో ప్రత్యామ్నాయాలు చూసేందుకు వెనుకాడబోమని నాయకత్వం ప్రకటిస్తే మేము మాత్రం చూసుకోలేమా అని మరో ఎంఎల్‌ఎ ఎదురు ప్రశ్న వేశారు.

ఇద్దరూ బెదిరిస్తారా?
తెలుగుదేశం శిక్షణా తరగతులకు మొదటి రెండు రోజులు ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రాకపోవడంపై చాలా వూహలు నడిచాయి. కథనాలూ వచ్చాయి. కొద్దికాలం కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన స్పీడు తగ్గిందని వ్యాఖ్యానించినట్టు చెప్పుకున్నాము. దానికి తోడు దసరాకు జరిగిపోతుందన్న మంత్రి వర్గ విస్తరణ ఆలస్యమై లోకేశ్‌ మంత్రిపదవి కూడా అనిశ్చితిలో వుండిపోయింది. ఈ కారణాలే గాక చంద్రబాబు అదేపనిగా చెప్పిందే చెబుతుంటారని కూడా కుమారుడు కొంత భాగం స్కిప్‌ చేసివుండొచ్చు. ఎందుకు రాలేదన్నది ఒకటైతే వచ్చిన తర్వాత ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మాత్రం ఒకింత నిరసన వ్యక్తమవుతున్నది. బాగా పనిచేస్తేనే పదవులు లేకుంటే ఇంటికి అంటూ హెచ్చరించడం ముఖ్యంగా సీనియర్లకు మింగుడుపడలేదు.చంద్రబాబు హెచ్చరికలంటే సరే, ఈ యువ నేత కూడా అదే పాట పాడితే మేమంతా ఏమై పోవాలని వారు కినుక వహించారు. ఓటుకు నోటులో వేసిన తప్పటడుగు కన్నా తలవంపులు ఏముంటాయని కూడా కొందరు ఆక్షేపించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకమైన నిర్ణయాలు నియామకాలు ఏవీ లోకేష్‌కు తెలియకుండా జరగనప్పుడు ఆయనే మరెవరిని విమర్శిస్తారని కూడా ఒక సీనియర్‌ ఎంఎల్‌ఎ ఆగ్రహం వ్యక్తం చేశారు.లోకేశ్‌ మాత్రమే గాక ఆయన చుట్టూ వున్నవారి జోక్యం కూడా పెరిగిపోతున్నదని అసమ్మతి వ్యక్తం చేశారు.

బిజెపి వలలో పడిపోయాం
ప్రత్యేక హౌదా బదులు ప్యాకేజీ మెరుగని ఎంత బోధ చేసినా ప్రజల సెంటిమెంటులో పెద్ద మార్పులేదని ప్రజా ప్రతినిధులు కొందరు నివేదించారు. గతంలో కనీసం బిజెపిని విమర్శించి మనం తప్పుకునే అవకాశం వుండేది. ఇటీవల బిజెపి దూకుడు పెరిగి మనం కూడా సమర్థించాల్సిన పరిస్థితిలో పడ్డాం. హౌదా నిరాకరించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు వూరూరా సన్మానాలు చేస్తుంటే మనం మొహం చూపించలేకపోతున్నాం. చెప్పాలంటే మన ముఖ్యమంత్రి కన్నా ఆయన హడావుడి ఎక్కువై పోయింది. బిజెపిలోనే ఆయనపై అసంతృప్తి వుంది గాని మనం ఎందుకు ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్నామో తెలియడం లేదు అని టిడిపిలో వివిధ స్థాయి బాధ్యతలు నిర్వహించడమే గాక ఇప్పుడు కూడా కీలక స్థానంలో వున్న ఒక నాయకుడు విమర్శించారు.

అమరావతి భారం
తమాషా ఏమంటే చాలా కాలం తర్వాత తెలుగుదేశం నేతల్లో అమరావతిని అనవసరంగా తలకెత్తుకున్నామనే భావన వ్యక్తమవుతున్నది. విజయవాడ పరిసరాల్లో నూజివీడు వంటి చోట అయితే ఎప్పుడో దూసుకుపోయేవాళ్లం. యాభై వేల ఎకరాలుకూడా వుండేది. ఇప్పుడు ఇక్కడ ఎంతకాలం పడుతుందో చివరకు ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. ఆ సింగపూర్‌ వాళ్లను నమ్మడం వాళ్ల పేర మనమే ఇక్కడ చేసుకోవడం.. ఆయన చుట్టూ వున్న వారికి తప్ప ఒక్కరికి ఒక్క ముక్క తెలియదు. ప్రతిపక్షాల నోళ్లు మూయించవచ్చు గాని మాలో మాకు కలిగే సందేహాలు ఎలా తొలగిస్తారు? అని ఒక సూపర్‌సీనియర్‌ నాయకుడు ప్రశ్న వేశాడు.
పెద్ద విషయమేమీ లేకుండా గంటలతరబడి వూకదంపుడు వినిపించేందుకు ఎందుకు పిలిపిస్తారో తెలియడం లేదని తరగతులతో సంబంధం వున్న అధికారులు, నాయకులు కూడా ఆశ్యర్యపోయారు.

http://www.telakapalliravi.com/2016/10/07/%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%A3%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B3%E0%B1%8D/

6 Comments

Filed under Uncategorized

6 responses to “టిడిపి తరగతుల్లో సణుగుళ్లు, సందేహాలు-తెలకపల్లి రవి

  1. Veera

    కష్టపడి పైకి వచ్చాను,జగన్ లా కాదు-లోకేష్ కామెడీ
    1.తండ్రి చనిపోయాక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోజుకు 16 గంటలు చొప్పున దాదాపు 2 సం జగన్ఓ దార్పు యాత్ర లో నిరంతరం ప్రజల్లో ఉన్నాడు, తరువాత కూడా దాదాపు రోజుకు 10 గంటలు ప్రజల మద్యే ఉన్నాడు
    2.సోనియా ను ఎదిరించినందునుకు 18 నెలలు జైల్లో ఏంటో కష్టపడ్డాడు
    (సోనియా చెబితేనే నేను జగన్ మీద కేసు వేసాను-శంకర్ రావు
    కాంగ్రెస్ లో ఉంది ఉంటె జగన్ కేంద్ర మంత్రి తరువాత సీఎం అయ్యేవాడు-గులాం నబీ ఆజాద్
    జగన్ తో నా మాటగా చెప్పు సాయి, కాంగ్రెస్ ను వదిలేస్తే నేను జగన్ మీద కేసులు పెడతాం- టీడీపీ లో చేరినప్పుడు కాంగ్రెస్ ఎంపీ సాయి ప్రతాప్ ABN లో ఓపెన్ హార్ట్ విత్ RK లో చెప్పిన మాటలు)
    3.ఒక కులానికి చెందిన 2 పేపర్లు 10 టీవీ చానళ్ళు వేటాడినాయి అయినా మొక్కవోని దైర్యం తో నిరంతరం పోరాడుతున్నాడు
    4.ఒంటరిగా పొతే చేసి గుంపులు గుంపులుగా (బాబు, పవన్, మోడీ) కలిసి వచ్చిన కూడా కేవలం 1 శతం ఓట్లతో ఒడినాడు అంతే కానీ వెన్ను చూపలేదు

    మరి మీరు ఏమి కష్టపడ్డారు లోకేష్?

    Request-No bad comments/words

  2. Veera

    హ హ హ -బాబు బెటాలియన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్
    విజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం. బయట ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ వుంది. లోపలంతా గంభీర వాతావరణం నెలకొనివుంది. అప్పుడే లోపల నుండి చంద్రబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప, పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చె న్నాయుడులు వచ్చారు. అందరూ ముఖా లకు కందెన పూసుకుని పారా కమెండోల డ్రెస్‌లు వేసుకుని వున్నారు. అందరి ముఖాల్లోనూ కసి, గెలిచితీరాలన్న తపన కనిపిస్తోంది. అప్పుడే లోకేష్‌ వచ్చి… నాన్నా, ఈ సర్జికల్‌ స్ట్రైక్‌లో నేను కూడా పాల్గొంటాను అని అడిగాడు. అందుకు కమాండర్‌ చంద్రబాబు… వద్దు బాబు, ఈ ఆపరేషన్‌ చాలా కష్టంతో కూడు కున్నది, లోయల్లో దిగాలి, బురద గుంటల్లో పొర్లాడాలి, అక్కడ పాము లుంటాయి, కప్పలుంటాయి, ఒక్కోసారి బురదగుంటల్లోనే కూర్చుని ఆహారం తినాల్సి వుంటుంది, అదీగాక ఈ ఆప రేషన్‌లో పొరపాటున మాకు గాయాలై ఆసుపత్రి పాలైతే, మేము కోలుకునేదాకా ఈ ప్రభుత్వాన్ని నువ్వే నడపాల్సి ఉం టుంది. కాబట్టి నువ్వు ఇక్కడే వుండు… మా నెత్తిమీదున్న హెల్మెట్లకు కెమెరాలు అమర్చుకున్నాం, మా సాహసోపేతమైన సర్జికల్‌ ఆపరేషన్‌ను నువ్వు టీవీలో చూసి ఆనందించు అని చెప్పాడు. తర్వాత భువనేశ్వరీదేవితో పాటు తెలుగు మహిళా నాయకురాళ్లు పీతల సుజాత, కిమిడి మృణాళిని, కొత్తపల్లి గీత తది తరులు వచ్చి బాబు బెటాలియన్‌కు.

    మంగళం, జయమంగళం

    వీరాధివీరులకు శుభమంగళం

    తెలుగు వీరులకు వందనం

    తెగించిన సూరులకు శుభవందనం

    ఆంధ్రా లెజెండ్‌లకు జయం జయం

    అంటూ పాట పాడి మంగళహారతు లిచ్చారు. చంద్రబాబు బెటాలియన్‌ బయటకొచ్చింది. అక్కడేవున్న ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి… సార్‌, యుద్ధానికి వెళ్లేముందు దున్నపోతును బలి ఇవ్వడం మన రాజుల కాలం నుండి వస్తున్న సాంప్రదాయం, ఇటీవల ‘బాహుబలి’ సినిమాలో కూడా ఆ సీన్‌ చూసాను, మొన్న వెంకటగిరి జాతరలో మిగిలిపోయిన దున్నపోతు ఒకటుంటే తెచ్చాను. బలివ్వండి సార్‌… అని అడి గాడు. దానికి చంద్రబాబు… ఈరోజు శనివారం, నేను ఎటువంటి జీవహింస చేయను అని అన్నాడు. అప్పుడు సోమిరెడ్డి మనసులో… జీవహింస చేయవా, మరి సర్జికల్‌ స్ట్రైక్‌కు వెళ్లేది చెక్కభజన చేసు కోవడానికా…? అని అనుకున్నాడు. అప్పుడే మున్సిపల్‌ శాఖ కార్యదర్శి గిరిధర్‌ వచ్చాడు. ఒక పెద్ద మ్యాప్‌ తీసి ఆయన ముందు పెట్టి… సార్‌, మనం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా గుర్తించిన ఈ ప్రాంతాల మీద దాడి చేస్తే చాలు, శత్రువులను సమూలంగా నిర్మూ లించవచ్చు. మనకు స్వదేశీ టెక్నాలజీ మీద అంత నమ్మకం లేదు కాబట్టి ఇస్రోను నమ్ముకోకుండా అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఉపగ్రహాలు తీసిన ఫోటోలు తెప్పించాను, అవి తీసిన ఫోటోలలో శత్రు శిబిరాలు క్లియర్‌గా కనపడుతున్నాయి. మనం ఖచ్చితంగా లక్ష్యాలను గురి చూసి కొట్టొచ్చు అని చెప్పాడు. మిషన్‌లన్నీ బాగా పనిచేస్తు న్నాయిగా, అన్నీ రెడీగా పెట్టారుగా అని చంద్రబాబు అడిగాడు. అందుకు మున్సి పల్‌ కార్యదర్శి గిరిధర్‌… అన్నీ హెలి కాఫ్టర్‌లో రెడీగా పెట్టాం సార్‌, ఇందు కోసం ఇజ్రాయిల్‌ నుండి దిగుమతి చేసు కున్న అత్యాధునిక వెపన్స్‌ను అందు బాటులో ఉంచామన్నాడు. వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులందరూ చంద్ర బాబు బెటాలియన్‌కు పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు, పులిహోర, బిర్యానీ ప్యాకెట్లు అందిస్తూ… ఈ ఆపరేషన్‌ మొదలైతే మీకు తిండి కూడా దొరకదు. దారిలో తినడానికి ఇవి ఉంచండని చెప్పారు. చంద్రబాబు హెలి కాఫ్టర్‌ ఎక్కే ముందు ప్రధాని నరేంద్ర మోడీతో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాము సర్జికల్‌ ఆపరేషన్‌కు బయల్దేరుతున్నట్లు చెప్పాడు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని మీరు చేస్తున్నారు. భవి ష్యత్‌లో కూడా సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన ఏకైక ముఖ్యమంత్రిని నేనే అని మీరు చెప్పు కోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆపరేషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను… బెస్టాఫ్‌లక్‌ అని వారు ఫోన్‌లో చెప్పారు. అప్పుడే ఏపి ఎల్లో ఛానెల్స్‌లో చంద్రబాబు సర్జికల్‌ ఆప రేషన్‌పై ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ వార్తలు రాసాగాయి. ఏబిసిడి ఛానెల్‌ అయితే ఈ సర్జికల్‌ స్ట్రైక్‌లో చంద్రబాబు సక్సెస్‌ అవుతారని మీరు భావిస్తున్నారా? అంటూ పాఠకులకు ఒక ప్రశ్న వదిలింది. ఒక్క నిముషంలోనే సక్సెస్‌ అవుతారని 99 శాతం మంది, ఫెయిలవుతారని ఒక్క శాతం మంది అభిప్రాయాలు పంపినట్లు కూడా ఫలితాలు ఇచ్చేసింది.

    తెలుగు నాయకులు కార్యకర్తలందరూ జాతీయ పతాకాలతో పాటు, పార్టీ జెండాలు కూడా ఊపుతుండగా బాబు బెటాలియన్‌ హెలికాఫ్టర్‌ ఎక్కి సాహస యాత్రకు బయలుదేరింది.

    విజయవాడలోని సిఎం ఇంట్లో లోకేష్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు కూర్చుని టెన్షన్‌గా చూస్తున్నాడు. హెలికాఫ్టర్‌ వెళ్తున్నదంతా అందులో వస్తుంది. హెలికాఫ్టర్‌ ఓ చోట ఆగింది. అక్కడంతా చిమ్మ చీకటిగా వుంది. చంద్రబాబుతో పాటు మిగతా కమెండోలు పారాచూట్లతో హెలికాఫ్టర్‌ నుండి కిందకు దూకసాగారు. ఆ దృశ్యాలు చూస్తుంటే లోకేష్‌ ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకోసాగాయి. అతనిలో టెన్షన్‌ పెరిగింది. పారా చూట్లతో అందరూ ఓ బురదగుంటలో దిగారు. ఆ గుంటలో పందులు కూడా వున్నాయి. వీటిని లెక్కచేయకుండా చంద్రబాబు బెటాలియన్‌ అందులో దిగింది. కమాండర్‌ చంద్రబాబు మిగతా కమెండోలను… పొజిషన్‌ తీసుకోండి అని ఆదేశించాడు. అందరూ తమ చేతుల్లో వున్న మిషన్‌లను బురదగుంటలవైపు ఎక్కుపెట్టారు. చంద్రబాబు ఇక ఆలస్యం చేయకుండా ‘ఎటాక్‌’ అంటూ అరిచాడు. అంతే కమెండోలంతా తమ చేతుల్లో వున్న మిషన్‌లను గట్టిగా కొట్టసాగారు. ఆ మిషన్‌ల గొట్టాల్లోంచి పెద్దఎత్తున పొగ రాసాగింది. ఆ పొగ ధాటికి ముదురు దోమలు ‘జుయ్‌’ అంటూ లేచాయి. ఆ పొగ దెబ్బకు అవి అక్కడే ఛస్తున్నాయి. స్క్రీన్‌ మీద ఆ దృశ్యాలు చూస్తున్న లోకేష్‌కు ఏమీ అర్ధం కాలేదు. సర్జికల్‌ స్ట్రైక్‌ అంటే పాకిస్థాన్‌లో వున్న ఉగ్రవాదులను చంప డానికేమోననుకున్నా… శ్రీకాకుళంలో

    ఉండే దోమలను చంపడానికా వీళ్లు వెళ్లింది, ‘దోమలపై దండయాత్ర’ పేరుకు సర్జికల్‌ స్ట్రైక్‌ అన్న ముసుగు తగిలించారా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడే కంప్యూ టర్‌ స్క్రీన్‌ మీద చంద్రబాబు ఫాగింగ్‌ మిషన్‌ను గాల్లోకి విజయగర్వంతో లేపి… ఢిల్లీలో వున్న వెంకయ్యనాయుడుకు ఫోన్‌ చేసి… సార్‌, మా సర్జికల్‌ స్ట్రైక్‌ సక్సెస్‌. శ్రీకాకుళం జిల్లాలో వున్న ముదురు దోమల శిబిరాలన్నింటినీ ధ్వంసం చేసా మన్నాడు. అవతల నుండి వెంకయ్య నాయుడు… వెరీగుడ్‌ చంద్రబాబు, ఏదైనా నీకే సాధ్యం అంటూ అభినం దించాడు. (..ఇంకా వుంది)

    http://lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2443:2016-10-07-10-35-15&Itemid=697

  3. JAGAN in Jammalamadugu ………Neerajanam

  4. Veera

    పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2 సం లలోనే 16 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు ఎలా పెంచుతారు?రిటైర్డ్ IAS EAS శర్మ గారు
    (నిజమే సర్ స్టీల్ సిమెంట్ ధరలు బాగా తగ్గాయి , పైగా ఇసుక ఫ్రీ
    ఇప్పటి ధరల ప్రకారం అయితే 10 వేల కోట్లకు పోలవరం పూర్తవుతుంది కానీ కాంట్రాక్టర్ TDP MP రాయపాటి చౌదరి కదా, అందుకే ఒక 20 వేల కోట్లు పెంచి పంచుకొంటారు.అందుకే కదా పోలవరం కేంద్రం కడతా అంటే వద్దు మాకు ఇవ్వండి అని తీసుకుంది నిప్పు )
    http://kommineni.info/articles/dailyarticles/content_20161008_13.php?p=1475903380258

  5. Veera

    మునిసిపోరులో విజ‌య‌మెవ‌రిది? Update AP స‌ర్వే..!
    UpdateAP నిర్వ‌హించిన స‌ర్వేలో ఒక విషయం స్ప‌ష్ట‌మ‌య్యింది. ముఖ్యంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మాత్రం ప్ర‌జ‌ల్లో క‌నిపించింది. అటు కేంధ్రం, ఇటు రాష్ట్రం కూడా ప్ర‌జా స‌మ‌స్య‌లు విస్మ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపించింది.
    రాబోయే మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రికి ఎక్క‌డ అవ‌కాశాలుంటాయ‌న్న అంచ‌నాల ప్రకారం..!
    TDP: విశాఖ‌, గుంటూరు
    YCP: క‌ర్నూలు
    హోరా హోరీ: కాకినాడ‌, ఒంగోలు, తిరుప‌తి
    Note:దేశ వ్యాప్తంగా అధికారం లో ఉన్న పార్టీ కి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి
    http://telugu.updateap.com/politics/muncipal-elections-2016-survey/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s