గురితప్పిన గన్‌

గురితప్పిన గన్‌
– కరువుపై మాటల యుద్ధమే
– నీళ్లు లేక నిష్ఫలం
– ఎండిపోయిన 80 శాతం వేరుశనగ పైరు
– ఉన్న పైరూ దిగుబడి ప్రశ్నార్థకమే!
– ఎండిన పైరు పీకడానికీ రైతుకు డబ్బు ‘కరువు’
రెయిన్‌గన్‌ గురి తప్పింది! ఆలస్యంగా ప్రారంభించడంతో అట్టహాసపు ప్రచారమే మిగిలింది. ఊడ దిగని పైరును గన్‌లతో తడిపినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎండిపోయిన పైరును పీకించడానికి కూడా రైతుల చేతిలో డబ్బు లేకుండా పోయింది. పైరూ పొగొట్టుకొని, పీకించేందుకు డబ్బూ చేతిలో లేకా వేరుశనగ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 13.50 లక్షల ఎకరాల్లో వేెరుశనగ ఎండిపోయింది. కళ్లముందే పంట ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయులుగానే రైతన్నలు మిగిలారు. వాస్తవం ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ ‘కరువుపై గన్‌’ శీర్షికతో క్షేత్రస్థాయి నివేదిక పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిలువెత్తు చిత్రంతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. రాయలసీమలో కరువుపై యుద్ధం ప్రారంభమైందని, ఎండిపోతున్న పంటకు జీవమొచ్చిందని, నీళ్లు నిండిన రైతు కళ్లలో ఆనందం కనిపిస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించింది. ఈ అంశాలను ప్రజాశక్తి పరిశీలించింది. పుస్తకంలో పేర్కొన్న కొందరు రైతులతో మాట్లాడింది. రాయల సీమలో మాటలకే పరిమితమైన ‘కరువుపై యుద్ధం’లోని క్షేత్రస్థాయి వాస్తవాలను సేకరించింది.

ప్రజాశక్తి – రాయలసీమ యంత్రాంగం
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 28 లక్షల ఎకరాలు. అయితే 22.13 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అనంతపురం జిల్లాలో 15 లక్షలు, కర్నూలు జిల్లాలో 2.93 లక్షలు, చిత్తూరు జిల్లాలో 3.20 లక్షలు, కడప జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగయింది

వాస్తవం ఇలా…
నాకున్న ఆరు ఎకరాల పొలంలో వేరుశనగ పంట సాగు చేశాను. రెయిన్‌ గన్లు మాకు ఇవ్వలేదు. సకాలంలో రెయిన్‌గన్లు అందించి ఉంటే పంటను కాపాడుకునే వాళ్లం. అర్హులైన వారికి రెయిన్‌గన్లు ఇవ్వలేదు. పంట ఎండిపోతోంది. కనీసం పంటపెట్టుబడులు కాదుకదా పశుగ్రాసం కూడా దక్కని పరిస్థితి నెలకొంది.
– భూమన్న గారి నారాయణ

టిడిపి పుస్తకంలో ఇలా …!
ఇట్లా పంటలు కాపాడుకోవచ్చని తెలిస్తే ఆ పని చేసుకునే వాళ్లం. జీవితకాలం వేరే పార్టీకి పనిచేసినా పట్టించుకోకుండా సర్పంచ్‌ రెయిన్‌గన్లు పెట్టించారు. సిఎం సారు చెప్పినాడు కానీ మేము పంటకుంటలు పెట్టించలా. పెట్టుంటే బాగుండేది. వచ్చే సంవత్సరం మరిన్ని గన్లు పెడితే బాగుంటుంది.

ముఖ్యమంత్రి వెళ్లగానే తీసేశారు..
గంగరత్నమ్మ, మహిళా రైతు. ఉప్పునేసినపల్లి, ధర్మవరం మండలం, అనంతపురం జిల్లా
ప్రశ్న : మీకు ఎన్నెకరాల పొలముంది?
గంగరత్నమ్మ : నాలుగెకరాలు
ప్రశ్న : రెయిన్‌గన్‌లు ఎన్నెకరాలకు వాడారు?
గంగరత్నమ్మ : నాలుగెకరాలకు వాడాము.
ప్రశ్న : ఎంత తడిసింది?
గంగరత్నమ్మ : కేవలం రెండు ఎకరాలకు అరకొరగాతడిసింది.
ప్రశ్న : కారణమేంటి ?
గంగరత్నమ్మ : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు ఆర్భాటంగా మూడు రెయిన్‌గన్‌లు, 10 స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. అయితే సిఎం వెళ్లిపోగానే అవి తీసుకెళ్లిపోయారు. దీంతో రెండుఎకరాల్లో మాత్రమే కొద్దిగా తడి అందింది.
ప్రశ్న : రెయిన్‌గన్‌లు మీకేమైనాఉపయోగపడ్డాయా ?
గంగరత్నమ్మ : రెయిన్‌గన్‌ల వల్ల తమ పంటకు ఎటువంటి ఉపయోగం కలగలేదు. అప్పటికే పంట ఎండిపోయిందని అయితే అధికారులు ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో ఆర్భాటంగా రెయిన్‌గన్‌లు, స్ప్రింకర్లు ఏర్పాటు చేసి రెండు రోజులు మాత్రమే రక్షక తడులు అందించారు. ముఖ్యమంత్రి వెళ్లిపోగానే అవి తీసుకెళ్లిపోయారు. రెండు రోజులు తడి ఇస్తేనే పంటకు ఏమి లాభం చేకూరుతుంది. అప్ప టికే పంటఎండిపోవడంతో వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. మిగిలిన రైతుల పంట పొలాల మాదిరేతమపంట కూడా దిగుబడి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

పుస్తకంలో ఇలా
రెయిన్‌గన్ల వాడకంతో పూర్తిపంటను చూస్తామన్న నమ్మకం కలిగినట్టు టిడిపి ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. ‘సిఎంగారు రెయిన్‌ గన్లు పెట్టుమన్నారు. క్వారీ గుంతలో నీళ్లనా ఆలోచన రాలా.. ఇప్పుడు ఆ నీళ్లు పెట్టుకుంటున్నాము. మా పంట బతికింది’ అని గంగరత్నమ్మ చెప్పినట్లు ప్రచురించారు.

పంటంతా నష్టపోయా. ఆదుకోవాలి!
బోయ బుడిగే మారెక్క, మల్లాపురం, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా
ఈ ఏడాది అదునులో వర్షం కురవక పోవడంతో మరోసారి పెట్టిన పెట్టుబడులు రాక పోగా అప్పుల్లో కూరుకు పోయాం. నాకున్న మూడెకరాల సొంత పొలంతోపాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. మొత్తంగా రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టాను. ఆరంభంలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో సంతోషపడ్డాను. మడకలు తోలడం, ఎరువులు, కూలీల ఖర్చులకు భారీగా వ్యయం పెరిగింది. రెయిన్‌గన్లతో పంటను కాపాడుకోవాలనే విషయం మాకు ఏ అధికారీ చెప్పలేదు. ఈ ఏడాది పెట్టిన పంట పెట్టుబడులు కూడా రావు. పంట మొత్తం నష్టపోయాను. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
పుస్తకంలో ఇలా …!
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్న పుస్తకంలో రెయిన్‌గన్‌లు భరోసా ఇచ్చాయని, రక్షక్షతడితో ఉపయోగం ఉందని, ఆ మేరకు తనకు అర్ధమైనట్టు చెప్పారని పేర్కొన్నారు.

ట్యాంకర్లతో నీరు తెచ్చుకోమన్నారు
మాకున్న రెండెకరాలకుతోడు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాం. ఎకరానికి పది వేలు కౌలు, మరో పదివేలు ఖర్చు చేసి వేరుశనగ సాగు చేశాం. వర్షం లేక పైరు ఎండిపోయింది. పెట్టుబడి కూడా వస్తుందో రాదో?. సిఎం మా పొలంలోనే రెయిన్‌గన్‌ను ప్రారంభించారు. సిఎం వెళ్లిన వెంటనే ట్యాంకర్లు లేక రెయిన్‌గన్‌లు వృథాగా ఉన్నాయి. అధికారులను అడిగితే ట్యాంకర్లతో నీరు తెచ్చుకోండన్నారు.
గీత(కౌలురైతు), అరికెర, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా

తాగడానికే నీరులేదు.. పొలానికి ఎక్కణ్నుంచి తెచ్చేది?
తాగడానికే నీరులేదు. అధికారులేమో ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకోండి ఆయిల్‌ ఇంజన్లు, రెయిన్‌గన్లు ఇస్తాము అనిజెప్పారు. నీరు ఎక్కడి నుంచో తెచ్చుకోలేక చేను ఎండిపాయే. 936 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు పడలేదు. దరిదాపుల్లో నీటి కుంటలు, చెరువులు లేవు. పొలాలు తడిపేందుకు ఎలా తెచ్చుకోవాలి. నాకున్న సాగు చేసిన వేరుశనగ, ఉల్లి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. గ్రాసం కూడా చేతికిరాలేదు. పంట ఏడుదశలో నీరు పెట్టినా పంట చేతికిరాదని తెలిశాక వదిలేశాం.
మల్లయ్య, అరికెర, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1851804

3 Comments

Filed under Uncategorized

3 responses to “గురితప్పిన గన్‌

  1. Veera

    ట్రాన్స్ స్ట్రాయ్ రాయపాటి చౌదరి కోసం ‘చంద్రబాబు బరితెగింపు’-వాసిరెడ్డి శ్రీనివాస్ చౌదరి
    ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కోసం ప్రపంచ బ్యాంకు ఇచ్చే 200కోట్ల రూపాయల నిదులు వదలుకోవడానికి కూడా సిద్దమయ్యారంటూ తెలుగుగేట్ వే డాట్ కామ్ లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఒక స్టోరీ ఇచ్చారు. అది ఆసక్తికరంగా ఉంది.ఆ కదనాన్ని యధాతదంగా ఇస్తున్నాం. చదవండి

    పనులు చేయని కాంట్రాక్టర్ ఎంత పెద్ద వారైనా ఉపేక్షించి లేదు. బ్లాక్ లిస్టులో పెట్టేయండి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే.’ ఇవీ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు. వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. కాంట్రాక్టర్ మనవాడైతే చాలు..కొన్ని సంవత్సరాలు అయినా..పనుల్లో జాప్యం ఉన్నా సరే చర్యలు వద్దు. కాంట్రాక్టర్లను శత్రువులుగా చూడొద్దు..వారికి మొబైలైజేషన్ అడ్వాన్స్ లు కూడా సర్దుబాటు చేయండి. ఇదీ చంద్రబాబు అసలు తీరు. ఇది ఎంపిక చేసిన వారికి మాత్రమే సుమా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థ కోసం ఎంత బరితెగించారు అంటే..ఏకంగా ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన 200 కోట్ల రూపాయల రుణాన్ని కూడా వదులుకున్నారు. ఓ వైపు రాష్ట్రం అసలే కష్టాల్లో ఉంటే..ఎప్పుడో ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటు కు రోడ్డు ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి వస్తే…పనులు చేయని కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయ్ పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఏకంగా…ఈ ప్రాజెక్టు ను మీరు వదులుకోండి అన్నారు.

    సీఎం తీరు చూసి సీఎంవోలోని అధికారులు కూడా అవాక్కవుతున్నారు. కాకినాడ-రాజమండ్రి రోడ్డు ఏపీలో అత్యంత కీలకమైనది. ఈ రోడ్డు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబునుకలసి కోరగా..మీకు ఇంకా పనేమి లేదా…ఇదొక్కటేనా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అవాక్కవటం వారి వంతు అయింది. మూడేళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ రోడ్డు ప్రాజెక్టును ట్రాన్స్ స్ట్రాయ్ దక్కించుకుంది. 200 కోట్లు ఈ ప్రాజెక్టు వ్యయం.. ప్రాజెక్టు దక్కించుకుని మూడేళ్ళు దాటినా ఇప్పటి వరకూ కేవలం ఆరు శాతం మాత్రమే పనులు ముందుకు సాగాయి. ఈ సంస్థకు కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. ఏ మాత్రం పనులు ముందుకు సాగని ఈ ప్రాజెక్టు నుంచి ట్రాన్స్ స్ట్రాయ్ ను తప్పించాలని ప్రపంచ బ్యాంక్ పలుమార్లు కోరింది. అధికారులు ఫైలును సీఎంకు పంపినా..ఆయన ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. పలుమార్లు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ నే తప్పించారు. అదీ చంద్రబాబు నిఖార్సుతనం.
    http://www.telugugateway.com/transtroy-chandbrabau-favour-wb-mou-cancel/

  2. Kulashitha manushulu …….Kalushitha manushulu……Kalushitha manasulu

    http://www.sakshi.com/news/hyderabad/ambati-rambabu-takes-on-cm-chandrababu-naidu-410184?pfrom=home-top-story

    In whch other community will a human get his daughter married to the son of the man who killed his father ??
    Reel Heros……..Attempted murderers……Murderers…All in the family ?

  3. Veera

    నీ సెక్యూరిటీ ఆఫీసర్ ముద్రగడ నాగేంద్ర ఎందుకు అదృశ్యమయ్యాడో చెప్పు బాబు?
    చంద్రబాబు దగ్గర మొన్నటి వరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్నా ముద్రగడ నాగేంద్ర ఇటీవల కనిపించకపోవడాన్ని అంబటి రాంబాబు లేవనెత్తారు. కేవలం ముద్రగడ అన్న ఇంటి పేరు ఉన్నందుకే నాగేంద్రను చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పదవి నుంచి తొలగించారని అంబటి చెప్పారు. ఈ విషయంలో కొందరు మంత్రులు సీఎంను కలిసి ”ముద్రగడ నాగేంద్రకు ముద్రగడ పద్మనాభానికి ఎలాంటి సంబంధం లేదని… తొలి నుంచి నాగేంద్ర ఒక పార్టీ అభిమానిగా మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉన్నారని” నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చంద్రబాబు వినలేదన్నారు. ”మీకు తెలియదు ఎవరినీ నమ్మడానికి వీల్లేదు” అని మంత్రులతో చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

    లోకేష్‌కు రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉందో రాజప్ప ఎపిసోడ్‌ నేపథ్యంలో ఆయన విడుదల చేసిన వీడియోను బట్టే అర్థమవుతోందని అంబటి ఎద్దేవా చేశారు. చినరాజప్పను దబాయిస్తున్న ఫోటోను లోకేషే తన ఫేస్‌బుక్‌లో విడుదల చేసి… ఇప్పుడు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటని అంబటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

    http://teluguglobal.in/telugu/ambati-ram-babu-sensational-comments-on-chandrababu-naidu/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s