తెలుగుదేశం పార్టీతో ఏ మాత్రం సంబంధం లేకుండా.. ఎవరు చేయిస్తున్నారనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా ఒక థర్డ్ పార్టీ ద్వారా నారా బ్రహ్మణి ఈ సర్వేను చేయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వే లో తెలుగుదేశం పార్టీని కలవర పెట్టే ఫలితాలే వచ్చినట్టుగా మీడియా వర్గాల మధ్య ప్రచారం జరుగుతోంది. ఇప్పటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 57 సీట్లకు మించి సాధించదని.. ఈ అధ్యయనం తేల్చిందని సమాచారం.
అత్యంత విశ్వసనీయ వర్గాలు ఇస్తున్న సమాచారం ఇది. మీడియా ప్రతినిధులకు కూడా ఈ వివరాలపై స్పష్టత ఉంది. ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయకపోవడం, రాజధాని అంశం పూర్తిగా గందరగోళంగా మారడం, అవినీతి తారాస్థాయికి చేరడం.. కరువు పరిస్థితులు.. ఇవన్నీ కూడా బాబు పాలనపై వ్యతిరేకతను పెంచుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు కూడా.
మరి అనుకూల మీడియాను ఆధారంగా చేసుకుని.. ఇంతలా ప్రచారం చేయించుకుంటున్నా, అంతా అదిరిపోతోందని అని చెప్పుకుంటున్నా.. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ విదేశాల పేర్లు వల్లెవేస్తున్నా.. రెండున్నరేళ్లలోనే 57 సీట్ల స్థాయికి వచ్చిందంటే.. పాలన ఎలా సాగుతోందో.. దీనిపై ప్రజలు ఏమని ఫీలవుతున్నారో.. బాబుకు కూడా పూర్తిగా స్పష్టతే వచ్చి ఉండాలి.
http://telugu.greatandhra.com/politics/political-news/bramhani-survey-results–75034.html
ట్రాన్స్ స్ట్రాయ్ ‘చంద్రబాబు బరితెగింపు’
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కోసం ప్రపంచ బ్యాంకు ఇచ్చే 200కోట్ల రూపాయల నిదులు వదలుకోవడానికి కూడా సిద్దమయ్యారంటూ తెలుగుగేట్ వే డాట్ కామ్ లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఒక స్టోరీ ఇచ్చారు. అది ఆసక్తికరంగా ఉంది.ఆ కదనాన్ని యధాతదంగా ఇస్తున్నాం. చదవండి
పనులు చేయని కాంట్రాక్టర్ ఎంత పెద్ద వారైనా ఉపేక్షించి లేదు. బ్లాక్ లిస్టులో పెట్టేయండి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే.’ ఇవీ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు. వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. కాంట్రాక్టర్ మనవాడైతే చాలు..కొన్ని సంవత్సరాలు అయినా..పనుల్లో జాప్యం ఉన్నా సరే చర్యలు వద్దు. కాంట్రాక్టర్లను శత్రువులుగా చూడొద్దు..వారికి మొబైలైజేషన్ అడ్వాన్స్ లు కూడా సర్దుబాటు చేయండి. ఇదీ చంద్రబాబు అసలు తీరు. ఇది ఎంపిక చేసిన వారికి మాత్రమే సుమా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థ కోసం ఎంత బరితెగించారు అంటే..ఏకంగా ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన 200 కోట్ల రూపాయల రుణాన్ని కూడా వదులుకున్నారు. ఓ వైపు రాష్ట్రం అసలే కష్టాల్లో ఉంటే..ఎప్పుడో ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటు కు రోడ్డు ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి వస్తే…పనులు చేయని కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయ్ పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఏకంగా…ఈ ప్రాజెక్టు ను మీరు వదులుకోండి అన్నారు.
సీఎం తీరు చూసి సీఎంవోలోని అధికారులు కూడా అవాక్కవుతున్నారు. కాకినాడ-రాజమండ్రి రోడ్డు ఏపీలో అత్యంత కీలకమైనది. ఈ రోడ్డు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబునుకలసి కోరగా..మీకు ఇంకా పనేమి లేదా…ఇదొక్కటేనా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అవాక్కవటం వారి వంతు అయింది. మూడేళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ రోడ్డు ప్రాజెక్టును ట్రాన్స్ స్ట్రాయ్ దక్కించుకుంది. 200 కోట్లు ఈ ప్రాజెక్టు వ్యయం.. ప్రాజెక్టు దక్కించుకుని మూడేళ్ళు దాటినా ఇప్పటి వరకూ కేవలం ఆరు శాతం మాత్రమే పనులు ముందుకు సాగాయి. ఈ సంస్థకు కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. ఏ మాత్రం పనులు ముందుకు సాగని ఈ ప్రాజెక్టు నుంచి ట్రాన్స్ స్ట్రాయ్ ను తప్పించాలని ప్రపంచ బ్యాంక్ పలుమార్లు కోరింది. అధికారులు ఫైలును సీఎంకు పంపినా..ఆయన ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. పలుమార్లు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ నే తప్పించారు. అదీ చంద్రబాబు నిఖార్సుతనం.
http://www.telugugateway.com/transtroy-chandbrabau-favour-wb-mou-cancel/
ట్రంప్‌కు ఇప్పుడున్న భార్య నాలుగో ఆవిడ-చంద్రబాబు
ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికాకు నాయకత్వ లోపం ఉందనిపిస్తోందని కూడా చంద్రబాబు చెప్పారు. సరే ట్రంప్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తప్పే. మరి విలువలున్నాయని చెప్పుకునే కుటుంబంలో పుట్టిన బాలకృష్ణను ఏమనాలో!. “అమ్మాయిలు వెంటపడితే ముద్దాయినా పెట్టాలి లేదంటే కడుపైనా చేయాలంటూ” ఇద్దరు కూతుర్లకు తండ్రి మరియు తాత కూడా అయి ఉండి కూడా నీచమైన వ్యాఖ్యలు బహిరంగంగా చేసిన ఆంధ్రా ట్రంప్ బామ్మర్ధిని చంద్రబాబు ఒకరోజైనా మందలించారా?.
అమెరికాలో చదువుకునేందుకు వెళ్లి మందు కొడుతూ, అమ్మాయిలతో జలకాలాడుతూ, పరవశించిన సొంత తనయుడిని మందలించారా?. మా అబ్బాయిని క్రమశిక్షణతో పెంచానని అసెంబ్లీ వేదికగా చెప్పిన చంద్రబాబు… మరి అమెరికా హాట్ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతైనా లోకేష్ ఎక్కడ దారి తప్పారా గుర్తించారా?. అయినా చంద్రబాబు నీతులు ఎదుటివారికేనన్న విషయం మనకు తెలియదా ఏంటి?. ఇప్పుడు ట్రంప్ కూడా అక్కడి ఎన్నికల్లో వెనుకబడ్డాడని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ట్రంపే గెలుస్తున్నారని సర్వేలు చెప్పి ఉంటే ట్రంప్ కూడా తన విధానాలే ఫాలో అవుతున్నారని ఈ పాటికి ఓ పది సార్లు చెప్పి ఉండేవారు చంద్రబాబు.