అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఏ రేంజ్‌లో దుమారం రేపుతున్నాయో చూస్తున్నాం. చివరకు ఆయన సొంత పార్టీ వాళ్లే ట్రంప్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పించాలన్న డిమాండ్ చేస్తున్నారు. నోటి దూల ఉంటే పరిస్థితి అలాగే ఉంటుంది మరి. అయితే ట్రంప్ కంటే ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాసార్లు చేశారు. అయినా ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి, మీడియా అంతా తన వాళ్లది కాబట్టి ఆయన పదవిలోనే దర్జాగా ఉండగలుగుతున్నారు. ఒక సారి ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలను గమనిస్తే….
1. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు?…. ప్రెస్‌మీట్ పెట్టి మరీ దళితులను అవమానించిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు మాత్రమే గొప్పకులంలో పుట్టి సమాజాన్ని ఉద్దరిస్తున్నట్టుగా దళితుల్లో పుట్టాలని ఎవరు మాత్రం అనుకుంటారు అని ప్రశ్నించారు. అందరూ రాజుల కుటుంబంలోనే పుట్టాలనుకుంటారని వ్యాఖ్యానించి దళితులను తక్కువ చేసి మాట్లాడారు. దానిపై కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు చంద్రబాబు.
2. అత్త-కోడలు- మనవడు- ఆడ పిల్లల పుట్టుక తగ్గిపోతున్న వేళ అమ్మాయిలను కనాల్సిందిగా ప్రభుత్వాలు ఒకవైపు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఆడ బిడ్డ పుట్టిన ఇంటికి ప్రత్యేక పథకాలు కూడా ప్రకటిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం ఆడ పిల్ల కంటే మగపిల్లాడు పుట్టడమే గొప్ప అని సెలవిచ్చారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై పెద్దెత్తున దుమారం రేగినా కనీసం పశ్చాత్తాపం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగో మహిళా సంఘాలు కూడా ఆయనకు అనుకూలమైనవే కాబట్టి పెద్దగా ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు.
3. కుల, లింగ భేదాలే కాదు… చంద్రబాబుకు ఆయన పుట్టిన ప్రాంతం కూడా నచ్చలేదు. ఎవరైనా ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడు పుట్టిన ప్రాంతంలోనే పుట్టాలనుకుంటారు. చంద్రబాబు మాత్రం ఎక్కడ పుట్టాలన్నది కోరుకునే అవకాశం ఉంటే తాను అమెరికాలో పుట్టాలని కోరుకుంటానని బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. పైగా తన చెలికాడు వెంకయ్యనాయుడుతో కలిసి అమెరికాలో పుట్టాలనుకుంటానని సెలవిచ్చి జన్మభూమిని అవమానించిన మహానుభావుడు చంద్రబాబు. ఇక్కడ పుట్టడమే ఇష్టం లేనివాడు ఈ రాష్ట్రాన్ని ఏం ప్రేమిస్తాడు? ఈ దేశాన్ని ఏం ప్రేమిస్తాడు? ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఆయనకు ఉందా?
4. ముఖ్యమంత్రిగా ఉంటూ సొల్లు సలహాలు కూడా చంద్రబాబు చాలానే ఇచ్చారు. రాజ్యంలో ప్రజలు చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని రాజ్యం ఏలే వాళ్లు ఆకాంక్షిస్తారు. చంద్రబాబు మాత్రం రోజు సాయంత్రం ఒక పెగ్ తాగి, కాసేపు పేకాట ఆడితే మనసు ప్రశాంతంగా ఉంటుందని జనానికి సలహా ఇచ్చారు గతంలో.
5. ప్రపంచానికి ఇంజనీరింగ్ పాఠాలు నేర్పిన ఘనత మన ఇంజనీర్లది. మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాంటి గొప్ప ఇంజనీర్ పుట్టిన నేలపై పుట్టిన చంద్రబాబు… ఇక్కడ ఇంజనీర్లను మాత్రం బురదపాముల్లా చూశారు. రాజధాని నిర్మాణానికి మన ఇంజనీర్లు సరిపోరా అని ప్రశ్నిస్తే… మన వాళ్లు మురికివాడలు కట్టేందుకు మాత్రమే పనికొస్తారని తీర్మానించారు ది గ్రేట్ దేశభక్త చంద్రబాబు.
6.ఈయనగారి అసహజ స్టేట్‌మెంట్‌లకు ఇక లెక్కేలేదు. వరదలొస్తే రాజధాని ప్రాంతం 20 అడుగుల మేర నీట మునుగుతుందని గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తే… ఆ మేరకు రాజధాని భూమిని 25 అడుగుల మేర ఎత్తు పెంచుతామని చెప్పించిన అసాధారణ తెలివితేటలు చంద్రబాబు నాయుడివే.
7. ఒలింపిక్స్ టీవీల్లో చూసి 2018లో అమరావతిలో నిర్వహిస్తామని చెప్పి నవ్వులపాలైనప్పటికీ సీఎంగా కొనసాగే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు మాత్రమే. సింధుకు ఆట నేర్పింది చంద్రబాబే. సత్యనాదెళ్లకు ఉపాది దొరికిందంటే అందుకూ తానే కారణమంటారు చంద్రబాబు.
8. 400 ఏళ్ల నాటి హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు చెప్పుకుంటుంటారు. చంద్రబాబు సెల్ఫ్ డబ్బా చూసిచూసి అలసిపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు హైదరాబాద్‌ను చంద్రబాబే నిర్మించారని ఒప్పేసుకుంటే ఓ పనైపోతుందన్న భావనకు వచ్చేలా చేయగలిగారాయన.
9. ఏపీలో మూడు నెలల నుంచి సాధికారిక సర్వేను పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతున్నప్పటికీ… ప్రపంచానికి ఐటీని పరిచయం చేసింది మాత్రం తానేనని చెబుతుంటారు చంద్రబాబు.
10. చంద్రబాబు మీటింగ్‌ల్లో ప్రసంగించే సమయంలో ఎవరైనా సెల్‌ఫోన్ బయటకు తీస్తే అంతే సంగతి. తమ్ముళ్లు ఆ సెల్‌ఫోన్ నేను కనిపెట్టి తీసుకొచ్చా అని మోహమాటం లేకుండా చెబుతుంటారు చంద్రబాబు.
11. పైగా తాను ఎస్వీ వర్శిటీలో పీహెచ్ డీ చేశానని పచ్చి అబద్ధం బహిరంగ సభలో చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే.
12. రెయిన్ గన్స్ తో రెండు, మూడు రోజుల్లో నాలుగు లక్షల ఎకరాల పంటను రకించానని ఆయన చెప్పడం, ఎల్లో మీడియా తానా తందానా అనడం సరే? ఒక్క రైతుతో అయినా నా పొలం ఒక్క ఎకరా అయినా రెయిన్ గన్స్ తో నీళ్లు వచ్చి పండింది అని ఈ ఎల్లో మీడియా చెప్పించగలదా?
రెయిన్ గన్స్ తో అనంతపురంలో కరువును తరిమేసిన చంద్రబాబూ నీకు ఇష్టమైన కృష్ణ జిల్లాలో ఏడాదినుంచి ఒక్క పంట వేయడానికైనా చుక్క నీళ్లు లేక నీ రైతులు అల్లాడిపోతుంటే ఆ రెయిన్ గన్స్ ఈ జిల్లాకు తేవేమి? ఇక్కడ రెయిన్ గన్స్ డ్రామాలు చేస్తే నీ బండారం బయటపడుతుందనా?
13. ఇన్ని నోటి దూల మాటలు మాట్లాడిన చంద్రబాబు… గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయం దండగ అని మాత్రం అనకుండా ఉంటారా?. అప్పట్లో ప్రత్యర్థి మీడియా లేకపోవడం, టీవీ చానళ్లు లేకపోవడం, ముఖ్యంగా సోషల్ మీడియా లేకపోవడంతో తొమ్మిదేళ్లు గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా దర్జాగా ఏలేశారు బాబు. అయినా ఇన్ని అసహజ ప్రకటనలు, వ్యవహారాలు నడుపుతున్నప్పటికీ ఆయన్ను ముఖ్యమంత్రిగా భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఓర్పున్న వారే. అయితే చంద్రబాబు చెబుతున్నట్టు ఆయన అమెరికాలో పుట్టి ఉంటే ఇలాంటి ఇలాంటి ప్రకటనలు చేసినందుకు అక్కడి చట్టాలు ఏం చేసేవో!.
14. అందుకే స్విడ్జర్లాండ్ మంత్రి నీ మాటలన్నీ విని ఇలాంటి వ్యక్తి మా దేశంలో ఉంటే పిచ్చి ఆసుపత్రికైనా పంపిస్తారు, జైలులోనైనా పెట్టిస్తారు అని ఊరికే అన్నాడా? ….
మన సామాజిక వర్గం, మన మీడియాతో హాయిగా బతికిపోతున్నావు కదా..!
http://teluguglobal.in/telugu/a-detailed-study-on-chandrababu-naidu-controversial-comments/