‘సింగపూరు’కు శృంగభంగం!‘

‘సింగపూరు’కు శృంగభంగం!‘
అమరావతి ప్రాంగణంలో పరిపాలన నగర నిర్మాణానికి నవంబర్ ఒకటవ తేదీన శ్రీకారం చుట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం నూతన రాజధాని అవతరణ క్రమంలో మరో శుభంకర ఘట్టం. రాజధాని నిర్మాణం కోసం ఆర్భాటంగా రూపొందిన ‘స్విస్ ఛాలెంజ్’ వాణిజ్య పథకాన్ని ఉపసంహరించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలియజేయడం అక్టోబర్ 26వ తేదీన సంభవించిన సమాంతార పరిణామం! అందువల్ల ‘పరిపాలన నగర’ నిర్మాణ కార్యక్రమాన్ని ఎలా అమలు జరుపనున్నారన్నది ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను కుతూహగ్రస్తులను చేస్తున్న మరో పరిణామం!

మొత్తం రాజధాని ప్రాంగణాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యతను సింగపూర్ దేశానికి చెందిన సింగపూర్ వాణిజ్య మండలి-సింగపూర్ కన్సార్టియమ్-అన్న బృహత్ సంస్థకు అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జూన్‌లో అప్పగించింది! వౌలిక రాజధాని నగర-సీడ్ కాపిటల్ నిర్మాణానికి,అభివృద్ధికి వీలుగా సింగపూర్‌కు చెందిన అసాండాస్ సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్‌డెవలప్‌మెంట్ లిమిటెడ్ అన్న విచిత్ర నామధేయాలు కల సంస్థల సమాఖ్య సమర్పించిన ప్రతిపాదనను గత జూన్‌లో రాష్ట్ర ప్ర భుత్వం ఆమోదించడంతో ఆర్భాటం మొదలైంది!

ఈ మొత్తం పథకం స్వరూప స్వభావాలు కాని, అమలు జరిగే తీరుకాని జనానికి అర్థం కాకపోవడం ఆర్భాటంలోని ప్రధాన ఇతివృత్తం! అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటే మాటలు చెప్పటం కాదు, అందరికీ అర్థమయినట్టయితే అది అంతర్జాతీయ స్థాయికి అవమానం. అందువల్ల అర్థం కాని జనం అనుమనాలను ప్రకటించలేదు. అర్థమైన కొన్ని ఇతర వాణిజ్య సంస్థలు మాత్రం ఇలా ఏకపక్షంగా ఒక విదేశీయ వాణిజ్య సమాఖ్యకు ఇంతటి బృహత్ నిర్మాణ బాధ్యతను అప్పగించడం పట్ల అభ్యంతరాలను తెలిపాయి.

హైకోర్టులో వివాదాన్ని దాఖలు చేశాయి. ఈ విజ్ఞాపన ప్రాతిపదికగా సెప్టెంబర్ 12న హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎమ్‌ఎస్ రామచంద్రరావు ఈ వాణిజ్య పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసారు.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాన్ని హైకోర్టు ధర్మాసనానికి నివేదించింది! వివాదాన్ని విచారిస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు తీర్పు చెప్పకపూర్వమే ఈ స్విస్ ఛాలెంజ్ పథకాన్ని విరమించుకుంటున్నట్టు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించడం వికసించిన విజ్ఞతకు నిదర్శనం! కానీ, సింగపూర్ ఘరానా వాణిజ్య సమాఖ్య రాజధానిని నిర్మించే ప్రతిపాదన రద్దు కావడంతో రాజధాని ప్రాంగణంలోని పరిపాలన నగరాన్ని ఎవరు నిర్మిస్తారన్నది సహజంగా స్ఫురిస్తున్న సందేహం..

ఈ ‘స్విస్ ఛాలెంజ్’ అన్నది మరో విచిత్రమైన పదజాలం! అమరావతి నిర్మాణంలో నెలకొన్న అయోమయంలో ఇది భాగం! నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన ప్రభుత్వేతర సంస్థలను ఎంపిక చేసే సాధారణ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలులో ఉంది! ఈ జాతీయ ప్రక్రియలో భాగంగా ప్రతిపాదన-టెండర్‌లను సమర్పించవలసిందిగా ప్రభుత్వేతర సంస్థలను కేంద్ర,రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చడంలో పథకాలను అమలు జరపగల, నిర్మించగల, నిర్వహించగల ప్రభుత్వేతర సంస్థలకు ఆయా పథకాలను ఆయా ప్రభుత్వాలు అప్పజెపుతున్నాయి. కానీ ఈ జాతీయ ‘ప్రక్రియ’కు భిన్నంగా అంతర్జాతీయ ‘విక్రియ’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంకురార్పణం చేయడం అమరావతి ప్రాభవానికి దాపురించిన అపశ్రుతి! ఈ అంతర్జాతీయ ‘విక్రియ’లో భాగంగా మొదట సింగపూర్ కన్సార్టియమ్‌ను ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎంపిక చేసారు! ఈ సింగపూర్ కన్సార్షియం వారి కంటె తక్కువ వ్యయంతో, మెరుగైన రీతిలో సీడ్ కాపిటల్‌ను నిర్మించగల సంస్థలున్నట్టయితే ముందుకు రావాలని అంతర్జాతీయంగా ప్రకటించారు. ఇదన్నమాట ‘స్విస్ ఛాలెంజ్’! ఇది ప్రభుత్వానికి పరీక్షా? లేక అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు పరీక్షా? ఎవరిని ఎవరు ఛాలెంజ్ చేయాలి? పైగా ఇలా సింగపూర్ సంస్థతో పోటీ పడే ప్రక్రియకు ‘స్విస్ ఛాలెంజ్’ అన్న పేరెందుకు పుట్టుకొచ్చింది. ‘స్విస్’ అంటే స్విట్జర్లాండు దేశమా? లేక మరో నిగూఢార్థం ఏమైనా ఉందా? ఇవేవీ తేలలేదు!

రాజధాని నిర్మాణం అడుగడుగునా అంతరాలను ఎదుర్కొనడం మాత్రమే జనానికి తెలిసిన సమాచారం!
రాజధాని నిర్మాణం జమా ఖర్చులకు సంబంధించిన కేవల వాణిజ్య ప్రక్రియ కాదు! రాజధాని నిర్మాణం చారిత్రక భౌగోళిక రాజనైతిక సామాజిక సాంస్కృతిక మహా పరిణామం! అంతర్జాతీయ స్థాయి ఆర్భాటం పేరుతో పాలకులు ఈ చారిత్రక సాంస్కృతిక జాతీయతా నిష్ఠను నీరుకార్చడం అమరావతి ప్రస్థానాన్ని నిలదీస్తున్న విషాదం!

దేశంలోని సంస్థలను, వ్యవస్థలను కించపరిచే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాహకులు రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.. విదేశీయ సంస్థలకు వాటి నైపుణ్య, పాటవ, ప్రతిభ, చోరకళా గరిమలను ఘనతకు సంకీర్తన చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాహకులు సరిపెట్టుకోలేదు! స్వదేశీయ సంస్థలను, స్వదేశీయ పరిజ్ఞానాన్ని అపహాస్యం చేసారు, అవమానించారు!

సింగపూర్ నిజానికి ఒక ప్రత్యేక జాతి కాదు. ప్రత్యేక దేశం కాదు. ప్రత్యేక సంస్కృతికి, నాగరికతకు ప్రతీక కాదు. మలయా ద్వీపకల్పంలో శతాబ్దులుగా భాగం. పాశ్చాత్య దేశాల, చైనా వంటి ప్రాచ్య దేశాల వాణిజ్య సామ్రాజ్య వాద విస్తృతిలో భాగంగా మాత్రమే సింగపూర్ నగరం ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది! వాస్తవంగా సింగపూర్ ప్రపంచ దేశాల సంత.. వాణిజ్యపు వాటాలు, దళారీ వ్యాపారం ప్రాతిపదికగా సింగపూర్ ఆర్థిక వ్యవస్థ రూపొందింది! ‘కుంజర యూధమ్ము దోమకుత్తుక చొచ్చిన’ రీతిలో ఇంత పెద్ద భారతదేశం సింగపూర్ ఎదుట వాణిజ్య సాష్టాంగ వందన ప్రదర్శన చేయడం విచిత్రమైన వ్యవహారం. సింగపూర్ సంస్థల ప్రమాణాలకు దీటుగా నిర్మాణాలు చేయగల సంస్థలు మన దేశంలో లేనే లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిశోధించి నిగ్గుతేల్చిన అంతర్జాతీయ రహస్యం.. మన సంస్థలు చేస్తున్న నిర్మాణాలు మురికివాడలకంటె గొప్పగా లేవు.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాక్రుచ్చినట్టు గత జూన్‌లో ప్రచారమైంది! ఇంతటి ఆర్భాటంతో మొదలుపెట్టిన ‘స్విస్ ఛాలెంజ్’ విధానాన్ని ఇప్పుడు రద్దు చేసుకొనడం ‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు వ్రాసి, దిద్దుకుంటున్నారు..’ అన్న సామెతకు మరో ఉదాహరణ…

ఈ పరిణామాల ఫలితం రాజధాని నిర్మాణంలో జాప్యం.. నవంబర్ ఒకటవ తేదీన ప్రభుత్వమే స్వయంగా నిర్మాణ కార్యక్రమం మొదలుపెడుతుందా? ఎందుకంటె కొత్తగా టెండర్లను పిలవడం, ఆమోదించడం ఈలోగా సాధ్యమయ్యే పనికాదు! అమరావతి నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతోందన్న ప్రచారం జరిగింది! ఒక్కొక్కరు ఒక ఇటుకను సమర్పించే కార్యక్రమం కూడా విజయవంతమైంది! ప్రధానమంత్రి సైతం ఇటుకను సమర్పించాడు! కానీ, విదేశీయ సంస్థలు మాత్రమే రాజధానిని నిర్మించాలని కోరుకోవడం ఈ స్ఫూర్తికి విఘాతకరం కాదా??

http://www.andhrabhoomi.net/content/edit-127

చంద్రబాబుకు ఏమైంది? పాతనేతల ప్రశ్న! తెలకపల్లి రవి
తెలుగుదేశం అద్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో వచ్చిన అనూహ్యమైన మార్పులకు కారణమేమిటని పాత తరం నేతలు ప్రశ్నవేస్తున్నారు. లేదంటే తమలో తాము అనుకుంటున్నారు. ప్రస్తుతం ఏవో మంచి పదవుల్లోనే వుంటూ కాస్త పట్టు చూపించగల నాయకులు అధినేత అనవసరమైన వ్యవహారాలతో ఎందుకు హైరాన పడుతున్నారని ఆశ్చర్యపోతున్నారు.
గతంలోని స్తిమితం ఓర్పు నేర్పు తగ్గి వృథా వ్యవహారాలు పెరిగాయని పార్టీ వారే వాపోతున్నారు. వయసును గమనించని పరుగులు తీయడం వల్ల మానసికంగా శారీరకంగా అలసి పోవడమే గాక అతిశయోక్తులతో కాలం గడపాల్సి వస్తుందంటున్నారు. ‘గతంలో ఏదైనా చెబితే వినేవారు.విమర్శలకు ఎక్కువ విలువ నిచ్చేవారు. ఇప్పుడు మాట్టాడే సమయమే ఇవ్వరు. ఇచ్చినా వినరు’ అని ఒక సూపర్‌ సీనియర్‌ నాయకుడన్నారు.
మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపి సిఎంరమేష్‌లు మరోవైపు బిజెపి సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు మాటలు తప్పమరెవరివి వినే పరిస్థితి కనిపించడం లేదట.
వెంకయ్యకు మోడీ దగ్గర పెద్ద పట్టు లేకపోయినా అక్కడ ఏదో చూపించుకోవడం కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిపగ్గాలు వేస్తూ అంతా తన గొప్పగా చెప్పుకుంటున్నారట. ప్రత్యేకహౌదా విషయంలో కూడా చేయాల్సినంత చేయలేదని ఢిల్లీ వ్యవహారాలతో బాగా సంబంధం వున్న నాయకులొకరు వ్యాఖ్యానించారు.
అమరావతి విషయంలో ఇంత గందరగోళం గజిబిజి ఎందుకు పెట్టుకున్నారో అంతిమంగా ఎవరికి లాభమో అర్థం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అయితే మరోవైపున యువతకేమైనా స్వేచ్చ నిస్తున్నారా అంటే లోకేశ్‌ స్పీడు తగ్గిందంటూ ఆయనే వ్యాఖ్యానిస్తారని తను ఏదైనా చేయబోతే బ్రేకులు వేస్తారని కూడా తెలుగు దేశం కీలక నేతల కథనం. దీనంతటిలోనూ అభద్రత కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నదనే నిజాన్ని కూడా వారు ఒప్పుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇది మరింత పెరగవచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

6 Comments

Filed under Uncategorized

6 responses to “‘సింగపూరు’కు శృంగభంగం!‘

  1. Devudu bhoomulu kuda ….vadhalani
    AP ni……….KAMMA ga dochukuntunna ………Neethimalina Jathi
    Chee …chee……………..kondhari siggumalina brathukulu.

    http://www.sakshi.com/news/top-news/dispute-between-endowments-department-siddhartha-academy-about-durga-temple-lands-417196?pfrom=home-top-story

    Please use the Social media to expose these unethical yellow caste fanatics from AP.
    Please Post the above article on all social media platforms.

  2. Veera

    చంద్ర‌బాబు ది అతి విన‌య‌మా..?అవ‌స‌రార్థ‌మా.!?
    ఈ మ‌ధ్య‌కాలంలో ఢిల్లీ నుంచి ఎవ‌రు వ‌చ్చినా చంద్ర‌బాబు సిద్ధ‌మైపోతున్నారు. ప‌దే ప‌దే రాష్ట్రానికి వ‌చ్చే వెంక‌య్య నాయుడే కాదు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ వ‌చ్చినా చంద్ర‌బాబు అక్క‌డే వాలిపోతున్నారు. ఇక ఆహ్వానం మన్నించి అమ‌రావ‌తి వ‌స్తే వారికి వంగి వంగి స‌లాం చేస్తున్నారు. తాజాగా అరుణ్ జైట్లీ ముందు బాబు ప్ర‌వ‌ర్త‌న చూసిన చాలామంది ఇప్ప‌టికే సెటైర్లు వేస్తున్నారు. మ‌రీ అంత‌గా జైట్లీ ముందు బాబు విన‌యం ప్ర‌ద‌ర్శించ‌డం విడ్డూరంగా ఉందంటున్నారు.

    గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి ఈరీతిన వ్య‌వ‌హరించిన చ‌రిత్ర లేద‌ని అనుభ‌వ‌జ్ఞుల మాట‌. ఇంకా చెప్పాలంటే చెన్నారెడ్డి, వెంగళరావు, జనార్దన్ రెడ్డి, కోట్ల లాంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజుల్లో అయితే కేంద్రమంత్రులు ఎవరైనా రాష్ట్రానికి అధికార పర్యటన కు వస్తే వారిని ముఖ్యమంత్రులు అసలు పట్టించుకునే వారు కారు. ఆ మంత్రులు వీలు చూసుకుని ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా ఓ అయిదు నిముషాలు కలిసి వెళ్ళిపోయే వారు. పూర్వ‌పు సీఎం వైఎస్ విష‌యంలోనూ కూడా ఇలాంటి అనుభ‌వాలు అనేకం ఉన్నాయి.

    రాష్ట్ర ముఖ్యమంత్రి ది కేంద్ర కేబినెట్ మంత్రిది సమానమైన హోదా. ఒకరి కంటే ఒకరు అధికులు కారు. తక్కువ వారు కారు. అలాంటి స‌మ‌యంలో స‌మాన‌హోదా ఉన్న‌వారితో వ్య‌వ‌హరించే స‌మ‌యంలో త‌న హోదా ద‌గ్గ‌కుండా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. కానీ జైట్లీ ముందు బాబు తీరు దానికి భిన్నంగా ఉండ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి , కొంద‌రిని విస్మ‌యానికి గురిచేసింది.

    ఏదో విదేశీ సామ్రాజ్యాధినేత‌ను తీసుకోస్తున్న రీతిలో చంద్రబాబు ఆయన బృందం వ్యవహరించి ఆంధ్రుల ఆత్మగౌరవం ను మంట గలిపేశార‌నే వాద‌న సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేస్తుండగా చంద్రబాబు అందరినీ అడ్డు తప్పుకోమని ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు లా చేతులను వేగంగా ఊప‌డం దిగ‌జారుడ‌త‌నానికి నిద‌ర్శ‌నంలా ఉందంటున్నారు. అరుణ్ కర్టెన్ పూర్తిగా తొలగించే వరకు చంద్రబాబు అలా జనం వైపు తిరిగి చేతులు ఊపుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి అది తగిన పనేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

    ఇదే జైట్లీ త‌మిళ‌నాడు గానీ, బీహార్ వంటి రాష్ట్రాల‌కు గానీ వెళితే ఆయా సీఎంలు క‌నీసం మొఖం కూడా చూపించ‌రు. ఇంకా చెప్పాలంటే ఈ కేంద్ర‌మంత్రులే జ‌య‌ల‌లిత వంటి వారి ద‌ర్శ‌న కోసం పోయెస్ గార్డెన్ కి పోయి రావాల్సి ఉంటుంది. అలాంటిది ఇక్క‌డ చంద్ర‌బాబు మాత్రం అరుణ్ జైట్లీకి అంతం దాసోహం కావ‌డ‌మే దారుణ‌మంటున్నారు. గట్టిగా ఒక రొట్టె కూడా తినలేని అత‌ని కోసం కోసం యాభై నాలుగు రకాల శాకాహార, మాంసాహార వంటకాలు ఎందుకు చేయించాల్సి వ‌చ్చిందంటూ నిల‌దీస్తున్నారు. ప్ర‌జాధానం దుర్వినియోగం కాదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

    ప్రెసిడెంట్, ప్ర‌ధాని వంటి వారు వ‌చ్చిన‌ప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వ్య‌వ‌హ‌రించినా ఫ‌ర్వాలేదు గానీ ఇలాంటి వ్య‌వ‌హారాలు ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌వంటున్నారు. ఇటీవ‌లే అరుణ్ జైట్లీ బాస్ అమిత్ షా హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ అయితే క‌నీసం మొఖం కూడా చూపించ‌లేదు. అలా అని ఆ రాష్ట్రానికి నిధులు ఆగే అవ‌కాశం కూడా లేదు. అందుకే ఇప్పుడు చంద్ర‌బాబు చేసిన హంగామా అంతా రాష్ట్ర అవ‌స‌రాల కోసం కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఓటుకు నోటు వ్య‌వ‌హారం త‌ర్వాత అనేక‌మంది నేత‌ల వ‌ద్ద అణిగిమ‌ణిగి వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు ఇప్పుడు అరుణ్ జైట్లీ ముందు పూర్తిగా సార్ సార్ అంటూ దాదాపు మొక్కుకున్నంత ప‌ని చేయ‌డం ద్వారా మోక‌రిల్లిన్న‌ట్టువుతోంద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఇది పూర్తిగా ఏపీ ప్ర‌జ‌లను చిన్న‌బుచ్చ‌డ‌మే అంటున్నారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం పుట్టిన పార్టీలో మ‌రీ ఇంత‌గా ఆంధ్రుల పౌరుషాన్ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు పాద‌క్రాంతం చేయ‌డం త‌గ‌ద‌ని సూచిస్తున్నారు. మ‌రి బాబు అతి విన‌యంతో గానీ..ఆయ‌న అవ‌స‌రార్థం గానీ ఏవిధంగా అలా ప్ర‌వ‌ర్తించినా ఏపీ ప్ర‌జానీకానికి సిగ్గుచేట‌నే చెప్ప‌వ‌చ్చు.

    http://telugu.updateap.com/politics/chandrababu-overaction-with-jaitly/

    • Vijay

      Abaddala Koru Dramoji! Anjayya Garu okasari ila Rajiv to vunte, one week dabba kotti Telugodi ATMA poindi ani sacchadu! Eppudu deni daggara Nidrotunnodo!

  3. Veera

    పోలవరం కాంట్రాక్టర్ అయినా TDP MP రాయపాటి చౌదరి కంపెనీ అయినా ట్రాన్స్ ట్రాయ్ కి D గ్రేడ్ ఇచ్చిన కేర్ సంస్థ
    మనవాళ్ళు అయితే మురికి వాడలు కడతారు అని బాబు , భారతీయులు గాడిదల్లాంటివారు మాకు విదేశీ గుర్రాలే కావాలి అని కోర్ట్ లో AP అడ్వకేట్ జనరల్ చెప్పారు మరి భారతీయుడు ముక్యంగా మనవాడు అయిన రాయపాటి చౌదరి కి పోలవరం కాంట్రాక్టు ఎందుకు? ఓహో మన కులపోల్లు అయితే OK నా?
    http://www.muchata.com/main-news/can-a-d-grade-company-built-prestigious-polavaram/

  4. Veera

    తెలుగు మీడియాలో స్విస్ ఛాలెంజ్..!
    (ఏబీఎన్, టీవీ9, ఎన్టీవీ, ఈటీవీ, టీవీ5 స‌హా అన్ని ప్ర‌ధాన చానెళ్లు ఇప్పుడు చంద్ర‌బాబు చెప్పిందే వేదంగా భావిస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లున్నాయి.)
    తెలుగుమీడియా తీరు కొన్ని సార్లు ఆశ్చ‌ర్య‌క‌రంగానూ, మ‌రికొన్ని మార్లు ఆందోళ‌న‌క‌రంగానూ సాగుతోంది. తాజాగా స్విస్ ఛాలెంజింగ్ విధానంపై హైకోర్ట్ తీర్పు త‌ర్వాత మీడియా చానెళ్లు, తెలుగు ప‌త్రిక‌లు వ్య‌వ‌హ‌రించిన తీరు గ‌మ‌నిస్తే ప్ర‌జాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పుకోవ‌డానికి సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి దాపురించిందన‌వ‌చ్చు. అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణం అంటే ఏపీ వ్య‌వ‌హారాల‌లో కీల‌కం. రాష్ట్రానికి రాజ‌ధాని న‌గ‌రం ప్ర‌జ‌లంద‌రికీ సంబంధించిన విష‌యం. అలాంటి విష‌యంలో ప్ర‌భుత్వానికి మొట్టి కాయ‌ప‌డింది. ఏకంగా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది. విధానాన్ని ఉప‌సంహ‌రించుకోవాల్సి వ‌చ్చింది. ఇది చంద్ర‌బాబు స‌ర్కారు కి పెద్ద చెంప‌దెబ్బ‌గా భావించాలి. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో స‌ర్కారు దూకుడుకి న్యాయ‌వ్య‌వ‌స్థ మూలంగా బ్రేకులు ప‌డిన‌ట్టే భావించాలి.

    అయితే ప్ర‌భుత్వం తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఉమ్మ‌డి హైకోర్ట్ పిటీషన్ ను కొట్టివేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. అంటే అభ్యంత‌రానికి మూల‌మైన నిర్ణ‌యం మార్చుకోవ‌డానికి స‌ర్కారు సిద్దం కావ‌డం వెన‌క‌డుగు వేసిన‌ట్టే భావించాలి. అలాంటి కీల‌క‌స‌మ‌యంలో సర్కారుకి త‌గిలిన ఎదురుదెబ్బ విష‌యంలో మీడియా వ్య‌వ‌హారం విడ్డూరంగానూ, విచిత్రంగానూ క‌నిపిస్తోంది. ఏకంగా పిటీష‌న‌ర్ దే త‌ప్ప‌న్న‌ట్టుగా చిత్రీక‌రించ‌డానికి కొంద‌రు, స‌ర్కారుకి అనుకూలంగా తీర్పు వ‌చ్చిన‌ట్టు మ‌రికొంద‌రు క‌థ‌నాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌త‌నానికి ప‌రాకాష్ట‌గా భావించాలి.

    అంతేగాకుండా చిన్న చిన్న అంశాల‌నే భూత‌ద్దంతో చూస్తూ చ‌ర్చ‌లు నిర్వ‌హించే టీవీ చానెళ్ల‌లో ఇంత కీల‌క‌మైన అంశం మీద ఒక్క‌రు కూడా ముందుకు రాక‌పోవ‌డం విశేషం. కేవ‌లం సాక్షి వాళ్లు రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా చ‌ర్చ నిర్వ‌హించారు. మిగిలిన వాళ్లంతా మౌనం పాటించ‌డం గ‌మ‌నార్హం. ఏబీఎన్, టీవీ9, ఎన్టీవీ, ఈటీవీ, టీవీ5 స‌హా అన్ని ప్ర‌ధాన చానెళ్లు ఇప్పుడు చంద్ర‌బాబు చెప్పిందే వేదంగా భావిస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇప్పుడీ విష‌యంలో వారంద‌రి తీరు గ‌మ‌నిస్తే అదే నిజ‌మ‌నిస్తోంది. రాష్ట్ర ప్రజ‌ల భ‌విష్య‌త్తుకి సంబంధించిన విష‌యంలో స‌ర్కారుకి త‌గిలిన ఎదురుదెబ్బ విష‌యాన్ని క‌ప్పిపుచ్చ‌డానికి స‌ద‌రు సోకాల్డ్ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌కులంతా ప్రేక్ష‌కులుగా మిగిలిపోవ‌డ‌మే దానికి నిద‌ర్శ‌నం. మీడియా తీరును గ‌మ‌నిస్తున్న జ‌నాలు ఇంత ప‌చ్చ‌పాతం చూప‌డం మీద నివ్వెరుపోతున్న మాట కూడా కాద‌న‌లేం.
    http://telugu.updateap.com/media-discussons/high-court-effect-on-telugu-media/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s