బిజెపి సీనియర్ల విశే్లషణ ప్రకారం చూసినా పవన్ బిజెపికి దూరమవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని బిజెపిని విమర్శిస్తున్నారని, విభజనలో తెదేపాతో సహా అన్ని పార్టీల పాత్ర ఉండగా పవన్ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు. విభజనకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు లేఖ ఇవ్వడంతో పాటు నాటి ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా ‘మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, మేం మద్దతునిస్తామ’ని సవాల్ విసిరిన విషయాన్ని పవన్ ఎందుకు తన సభల్లో ప్రస్తావించడం లేదో అర్థంకావడం లేదంటున్నారు.
చంద్రబాబంటే ఇప్పటికీ తనకు నమ్మకం, అభిమానం ఉందని చెబుతున్న పవన్ వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బిజెపి అగ్రనేత ఒకరు అన్నారు. తన ప్రసంగంలో పైకి తెదేపా ఎంపీలను విమర్శిస్తున్న పవన్, అసలు పార్టీ విధానాన్ని నిర్దేశించే అధ్యక్షుడు చంద్రబాబు జోలికి మాత్రం వెళ్లకపోవడానికి కారణాలు సులభంగా అర్థం చేసుకోవచ్చని విశే్లషిస్తున్నారు.
కాగా ఈ నెల 10న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో కూడా ఆయన బిజెపినే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తారని సమాచారం. పవన్ ఇప్పటివరకూ కాకినాడ, తిరుపతిలో నిర్వహించిన సభల్లో కూడా ప్రత్యేక హోదాపై బిజెపినే లక్ష్యంగా చేసుకుని విమర్శించిన విషయం తెలిసిందే. అనంతపురంలో కూడా అదే ధోరణి కొనసాగిస్తారని తెలుస్తోంది.
బిజెపి వర్గాల సమాచారం ప్రకారం పవన్ ఆ పార్టీ నేతలను జనసేనలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జగన్ కేసులో శరవేగంగా స్పందించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఒక అధికారితో రెండుసార్లు భేటీ అయ్యారని, ఆయనను తన పార్టీలో చేరి కీలకపాత్ర పోషించాలని అభ్యర్థించినట్లు తమకు సమాచారం ఉందంటున్నారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ ప్రముఖులను కూడా జనసేనలో చేర్పించే ప్రణాళికలో ఉన్నారని, ఈమేరకు పలువురు నేతలతో ఆయన టచ్లో ఉన్నారనే సమాచారం తమకు ఉందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో జనసేన తెదేపాతో కలిసి వెళుతుందన్న సమాచారం తమకు ఉందని, కాపుల ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలన్న వ్యూహంతోనే ఈ సమీకరణలు జరుగుతున్నాయంటున్నారు
These guys make Vijaykanth seem like a vote catcher
Veedoka joker….veediki antha scene ledu….he probably can influence 5-10% of actual voting…on his own he is even less of a political force than his brother