చంద్రబాబుకు మోడీ ఆనందభంగం-తెలకపల్లి రవి

చంద్రబాబుకు మోడీ ఆనందభంగం
దేనికైనా ఘనత ఆపాదించుకునేముందు ఒకింత సహనం , మరింత నిబ్బరం అవసరం. అందులోనూ ప్రజలను ప్రభుత్వాలను నడిపించే నాయకులకు అనుభవజ్ఞులకు మరింత అవసరం. ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్ల సర్జికల్‌ స్ట్రయిక్‌ ఫలితాలపై సామాన్యులు కూడా సందేహాలు వెలిబుచ్చుతుంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఇది తన లేఖ ప్రభావానికి మచ్చుతునకగా చెప్పుకోవడానికి హడావుడి పడ్డారు. అంతేగాని పూర్వాపరాలు పర్యవసానాలు చూద్దామని కాస్తయినా నిరీక్షించలేకపోయారు. ఇప్పుడు జరిగిందేమిటి?

మొదటి విషయం- అసలు జరిగింది పెద్ద నోట్ల రద్దు కానేకాదు. కొత్త నోట్ల ముద్రణ మాత్రమే.

రెండవది- పెద్ద నోట్లు రద్దు చేయకపోగా మరింత పెద్ద నోటు ప్రవేశపెట్టారు. అది ఎందుకో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు గాని అవతలి వారి ఆలోచనే అది.

మూడవది- నిర్మాణాత్మక సన్నాహాలు లేకుండా ఈ నాటకీయ నిర్ణయం ప్రకటించడం వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని కాస్తయినా పరిగణనలోకి తీసుకోలేదు.

నాల్గవది- ప్రతిపక్షనేత జగన్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో పెట్టుకుని లేఖ రాసినా- చంద్రబాబుకు ముందే తెలుసనే విమర్శను కూడా ఎదుర్కోకతప్పని స్థితి. అస్మదీయులు ముందే సర్దుకోవడానికి, భూములు వగైరా కొనుగోళ్లు చేసి దాచుకోవడానికి ప్రభుత్వం సహకరించిందనే ఆరోపణలు కూడా మోయవలసిన పరిస్థితి!

అయిదు- ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం ధనం సమకూర్చడంలో తెలుగుదేశం అధినేతకే పెద్ద పేరుంది. అది కూడా చాలా పథకం ప్రకారం జరుగుతుందని ప్రతీతి. కాబట్టి ఈ విషయంలో బీద అరుపులు ఎవరూ వినే అవకాశం వుండదు.

ఆరు- ఈ తొందరపాటు ఆనందంతో చంద్రబాబు కేంద్రంలో తనకు పెద్దగా మాట లేదని తానే నిరూపించుకున్నట్టయింది.

ఏడు- అంతమంది మేధావులను సలహాదారులుగా పెట్టుకున్నా బాలయ్య బాబు డైలాగులాగా ఒకవైపే చూపిస్తున్నారు తప్ప రెండో వైపు చూడటం లేదనీ చూడనివ్వడం లేదనీ కూడా అర్థమై పోయింది.

పెద్దనోట్లపై పెద్దాయన కోరితెచ్చుకున్న ఆనందభంగం కాక ఇది మరేమిటి?
చంద్రబాబు సంగతి అలా వుంచి పొంగిపోయిన మీడియా కూడా వెనక్కు తిరిగిచూసుకోవలసిన స్థితి.

http://www.telakapalliravi.com/2016/11/10/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80-%E0%B0%86%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AD%E0%B0%82%E0%B0%97/ ]

11 Comments

Filed under Uncategorized

11 responses to “చంద్రబాబుకు మోడీ ఆనందభంగం-తెలకపల్లి రవి

 1. pavan kumar

  let us not lose sight the of special status and its associated benefits

 2. Kulam ……..Dhanam…….Manam ……..Jeevitham antu time waste chesethunna variki
  Life is short …do something good for others before you die.
  You take neither your caste nor your money with you.

 3. If 5 % caste fanatics from AP can use the Social media and Yellow media to spread hatred in the society ….
  Then what is the 95 % Public doing ? Watching the drama ??

  http://telugu.greatandhra.com/politics/gossip/cast-politics-in-tdp–75788.html

  Spare sometime ……..Clean AP from the Yellow Weed.

 4. Kondhari kosam AP ni thakattu pettina …..Andhra Hazare
  Andhari kosam Alupergani Poratam chesthunna …Oke Okkadu

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2494:2016-11-11-14-17-14&Itemid=665

 5. Kamma ga AP ni dochukuntu …..
  Jeethalu ivvalemu antunna …….Neethimalina Jathi

  http://www.ndtv.com/hyderabad-news/producers-of-blockbuster-hit-baahubali-raided-at-their-homes-in-hyderabad-1624352?pfrom=home-lateststories

  Mukalaku make up ….Vesedhi Devudi pathralu …chesedhi Bhookabjalu.
  Which GOD will forgive these unethical caste fanatics ??
  Social media is the weapon to uncover their true colours.

 6. Veera

  ప్రభుత్వం లో రాజకీయ అవినీతి పెరిగింది.TDP ఒక కులానికి ఒక ప్రాంతానికి పనిచేస్తోందన్న అబిప్రాయం ఏర్పడింది.ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ వాసుల‌కు అమ‌రావ‌తి త‌మ‌ది కాద‌నే భావం పెరిగింది, ప్రాంతాల మధ్య విభేదాలు వస్తున్నాయి.ప్రభుత్వం ఆలోచించుకోవాలి-పవన్

 7. Veera

  అమెరికా భారత్ సత్సంబంధాలు చెక్కు చెదరవు -మధులిక , YCP NRI Convener
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=6722071

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s