బాబు పాలనపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనపై మెగా బ్రదర్ నాగబాబు ఒక ఇంటర్వ్యూలో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్‌ పరిపాలన చాలా బాగుందన్నారు. కేసీఆర్‌ పాలనను విమర్శించేందుకు ఏమీ లేదన్నారు. అంతా డీసెంట్‌గా చేసుకుపోతున్నారని అభిప్రాయపడ్డారు. అందరికీ ఉపయోగపడాలన్న తపన కేసీఆర్‌లో కనిపిస్తోందన్నారు. అంతా పద్దతి ప్రకారమే జరుగుతున్నట్టుగా తనకు అనిపించిందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణకు ఆదాయం తగ్గిపోతోందని కేసీఆర్‌ చెప్పడంలో తప్పులేదన్నారు. ఒక ముఖ్యమంత్రిగా సమస్యలను కేంద్రానికి వివరించే ప్రయత్నంచేశారని నాగబాబు వ్యాఖ్యానించారు.

మరి ఏపీలో పరిపాలనపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా… నాగబాబు నెగిటివ్‌గా స్పందించారు. చంద్రబాబు పరిపాలనపై తనకు సంతృప్తి లేదన్నారు. పరిపాలన బాగోలేదని వ్యాఖ్యానించారు. భారీగా అవినీతి జరుగుతోందన్న అభిప్రాయం ఉందన్నారు. పరిపాలన ఏ మాత్రం బాగోలేదన్నారు. తనకు ఏపీపై ఆసక్తిపోయేలా చంద్రబాబు పరిపాలన ఉందన్నారు. టీడీపీ నేతలు భారీగా అవినీతి చేస్తున్నట్టు తెలియగానే ఏపీ రాజకీయాలపై ఆసక్తే తనకు లేకుండాపోయిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన ఏపీ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దును తొలుత సమర్ధించి తర్వాత చంద్రబాబు వ్యతిరేకించడం పద్దతిగా లేదన్నారు నాగబాబు.

http://teluguglobal.in/telugu/naga-babu-comments-on-chandrababu-naidu-government/

4 Comments

Filed under Uncategorized

4 responses to “బాబు పాలనపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

  1. Veera

    కమ్మ కులంలో పుట్టడమే మన అదృష్టం-TRS మంత్రి తుమ్మల చౌదరి
    ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తాము కమ్మటి కమ్మ కులంలో పుట్టడమే తమ అదృష్టమని, కమ్మ కులం లాంటి గొప్ప కులం ప్రపంచంలో మరొకటి లేదని, కమ్మవారికి ఎవరూ సాటి రారని, అన్ని రంగాలలోనూ కమ్మవారికి ఎదురే లేదని, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది కమ్మ జాతేనని, కమ్మకుల ఆధిపత్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, కమ్మల ఔనత్యాన్ని ఎవరూ తగ్గించలేరని….. ఇలా కమ్మవాళ్ల గొప్పదనం గురించి రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రసంగాన్ని ఈ వీడియోలో చూడండి….
    http://teluguglobal.in/telugu/minister-tummala-nageswara-rao-about-greatness-of-kamma-caste/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s