‘చంద్ర’ప్రభ మసకబారుతోందా..?

‘చంద్ర’ప్రభ మసకబారుతోందా..? ఆంధ్రభూమి
గత రెండున్నరేళ్లలో అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందన్న భావన, దానివల్ల తమ జీవనోపాధి పోతోందన్న ఆగ్రహం రైతుల్లో మిగిలిపోయింది. బందరు పోర్టుకు 2 వేల ఎకరాలు చాలన్న బాబు ఇప్పుడు తానే అంతకు మూడింతల భూసేకరణకు ఉబలాటపడుతున్నారు. ఇది అవసరమా? ఇచ్చిన ఐదేళ్ల కాలానికి భవిష్యత్తు పేరుతో భూములు లాగేసుకుంటే రైతులు దూరమవడం సహజమే కదా?

చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులతో ‘తెలుగు’ వెలుగు తగ్గిపోతోందన్న ఆందోళన బహిరంగమే. వైసీపీ నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలలో మళ్లీ గెలిచే ముఖాలు రెండు, మూడు కూడా కనిపించవు. మరి దానివల్ల వచ్చే లాభమేమిటో పక్కనపెడితే, ఆయా నియోజకవర్గాల్లో ముఠా తగాదాలు రావణకాష్టంలా సాగుతున్నా ఎవరినీ పిలిచి హెచ్చరించిన దాఖలాలు లేవు. ఇద్దరు నేతలు రోడ్డున పడితే పిలిచి హెచ్చరించి, అవసరమైతే వేటు వేయాల్సిన అధినేతలో మొహమాటం పోకడలు మొత్తం పార్టీకే చేటు తెస్తున్నా చంద్రబాబులో చలనం లేదు.

ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో 80 శాతం మందిపై అవినీతి మరకలున్నాయన్నది బహిరంగమే. మళ్లీ వారిలో గెలిచే ముఖాలు సగం కూడా ఉండవన్నది కాదనలేని నిజం.

పదేళ్ల ప్రతిపక్షంలో భుజాలు పుండ్లు పడేలా పనిచేసిన కార్యకర్తల స్థానంలో పైరవీలు, కాంట్రాక్టర్లు, రెండున్నరేళ్ల క్రితం ఎవరినైతే రాబందులంటూ రచ్చ చేశారో ఇప్పుడు అవే ముఖాలు పాలకుల చుట్టూ దర్శనమిస్తున్న వైనాన్ని శ్రేణులు మెచ్చవు. సచివాలయం నుంచి క్యాంపు ఆఫీసు వరకూ పార్టీ కార్యకర్తలకు ప్రవేశం, బాబు-చినబాబు దర్శనభాగ్యం దుర్లభమవుతోంది. ఇలాంటి చర్యలతోనే కదా 2004లో బాబు ఒకసారి ఓడిపోతే తెలిసొస్తుందని కొందరు, తమ ఎమ్మెల్యే ఈసారి ఓడిపోతే సరిపోతుందని మరికొందరు కోపంతో సొంత పార్టీనే ఓడించింది?! అదొక్కటేకాదు. అధికారులకు పెత్తనమిచ్చి పార్టీని మరుగుజ్జును చేసిన వైనం కూడా బాబు నాటి అధికార వియోగానికి ఒక ప్రధాన కారణమే కదా? ఆ గుణపాఠాలేవీ ఈ రెండున్నరేళ్లలో నేర్చుకున్నట్లు లేదు.

వైఎస్ తొలి సంతకంతోపాటు, తనతో కష్టాల్లో ఉన్న వారిని మొదటి రోజునుంచి, చనిపోయే గంట ముందు వరకూ ఏదోరకంగా ఆదుకున్నారు. పిలిచి మరీ ఆయన సాయం చేసిన వైనాన్ని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. బాబు ఆ విధంగా ఎంతమందిని పిలిచి భుజం తట్టారన్న ప్రశ్నలు గత రెండున్నరేళ్ల నుంచి ఇప్పటికీ వినిపిస్తుండటంపై ఆత్మపరిశీలన అవసరం

రెండున్నరేళ్లలో తాను చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులు మీదేసుకుని కష్టాలు కొనితెచ్చుకోవడం స్వయంకృతమే.
పెద్దనోట్ల రద్దుపై బిజెపి ముఖ్యమంత్రులే వౌనంగా ఉన్న సమయంలో, అది తన ఘనతేనని ప్రచారం చేసుకుని తప్పులోకాలేసిన తెలుగుదేశాధీశుడు జనాగ్రహాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు. వచ్చిన ఇబ్బందులను అధిగమించేందుకు రోజూ రాత్రి పది వరకూ అధికారులతో సమీక్షలు పెట్టి లేని తలనొప్పి కొనితెచ్చుకున్నారు.

బాబును ఆకాశానికెత్తి, అందుకు ఫలితంగా అన్ని ప్రయోజనాలు దండుకున్న నయా మీడియా రాజగురువులుంగారు కూడా, ఈ మధ్య ప్లేటు మార్చడం బట్టయినా ‘తెలుగు’ వెలుగు తగ్గుతోందని గ్రహించాలి కదా?!
మునుపు జగన్ దీక్ష చేసినా, ఇడుపులపాయలో నెలవారీ ప్రజాదర్బార్లు నిర్వహించినా, ధర్నాలు చేసినా, బాబుకు లేఖలు రాసినా పట్టించుకోని బతకనేర్చిన సదరు మీడియా, ఇప్పుడు హఠాత్తుగా జగన్‌కూ ప్రముఖ స్ధానం ఇవ్వడం ప్రారంభించిందంటే, జనంలో అధికార పార్టీ ప్రభ తగ్గుతుందన్న సంకేతమే కదా?! మరి కళ్లెదుట కనిపించే ఇన్ని లోపాలు, బలహీనతలు సరిదిద్దుకోకుండా మరో పదేళ్ల ‘దూరాలోచన’ బాబుకు లాభమా? నష్టమా??

12 Comments

Filed under Uncategorized

12 responses to “‘చంద్ర’ప్రభ మసకబారుతోందా..?

  1. 95 % Public ni mosam chesthu …..Kamma ga AP ni dochukuntunna Gaja / Gajji dongalu.

    http://telugu.greatandhra.com/politics/political-news/kaamma-politics-in-ananatapur–76706.html

    If we do not use the Social media to expose these unethical fanatics there is very little future for AP.

  2. Annallu Brathikamu anedhi kadhu …
    Brathinannallu ala brathikamu anedhi mukhyam ….YS JAGAN

    Pulivendula Puli bidda ki ….Neethimalina Nara jathiki theda ledha ??

  3. Kasu Mahesh speech ….
    His grandfather ruled the state with ethical values in his blood.

  4. Gajji / Gaja dongalu plan choodandi …..
    KAMMA ga AP ni dochukuntunnaru.
    Please use the Social media to expose these unethical caste fanatics looting AP in different forms.

    http://www.sakshi.com/news/national/need-worldbank-loans-mp-galla-jayadev-asks-center-432036?pfrom=home-top-story

    Spare sometime in your life ……Save AP

  5. JAGAN in Ongole …
    Aluperagani Praja Poratam

  6. Veera

    బాహుబలి గ్రాఫిక్స్‌.. ప్రపంచ బ్యాంకు రీమిక్స్‌.. అమరావతి అప్పుల ప్రాబ్లమ్స్‌
    -తెలకపల్లి రవి
    ప్రపంచ బ్యాంకుకు చాలా ఇష్టమైన ముఖ్యమంత్రిగా గతంలో చంద్రబాబు నాయుడు పేరు సంపాదించుకున్నారు. దాన్ని సంతృప్తి పర్చడం కోసం తీసుకున్న చర్యలతో ప్రజా వ్యతిరేకత పెంచుకుని చివరకు అధికారం కోల్పోయారు. ఇప్పుడు మరో రూపంలో ప్రపంచ బ్యాంకు జోక్యం పెరుగుతుందని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాజధాని నిర్మాణం, సమస్త అభివృద్ధి ప్రాజెక్టులు, పెన్షన్లు,వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా నివేదించాలని బ్యాంకు ప్రతినిధులు పట్టుపడుతున్నారట. దీనిపై కమిషనర్‌స్థాయి అధికారి ఒకరు అసహనం వ్యక్తం చేసినట్టు ప్రజాశక్తి కథనం ప్రచురించింది. అమరావతిపై రూపొందించిన కొన్ని నివేదికలు తమకన్నా ముందే ప్రపంచ బ్యాంకు చేతుల్లోకి పోతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఆ ప్రతినిధులు చెప్పినట్టే చేయాల్సి వస్తున్నందుకు క్రిడా అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారట. అసలు అప్పు ఇచ్చేది తేలకముందే అన్నీ వారి చేతుల్లో పెట్టడమెందుకుని వారి ప్రశ్న. రాజధానిలో చైనా తరహా రోడ్ల నిర్మాణం జరగాలంటున్న ముఖ్యమంత్రి దానికోసం ప్రపంచ బ్యాంకుకు అనుబంధమైన ఎడిబి నుంచి అప్పురావాలంటే ఇవన్నీ తప్పనిసరి అనే భావనలో వున్నట్టు కనిపిస్తుంది. ప్రజలు వ్యతిరేకి స్తున్న కొవ్వాడ అణుపార్కు,గోదావరి ఫుడ్‌పార్కు వంటివాటిపైనా ప్రపంచ బ్యాంకు నివేదికలు తెప్పించుకుంది.

    మరోవైపున నోట్లరద్దుతో రియల్‌ రంగం కుదేలై పోవడం అమరావతిలో ప్రైవేటు పెట్టుబడుల ఆశలను ఆవిరి చేస్తున్నది. వీటిని డెవలప్‌ చేసి ఇవ్వడానికి 35 వేల కోట్లు కావాలని అంచనా.ఇక ఆ పైన రైతులకు ఇచ్చే పదివేల ఎకరాల ప్లాట్లను పరోక్షంగా రియల్టర్లే తీసుకుంటారని అనుకున్నది నిజమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి లక్షకోట్లపైనే కావాలి. ఇది గాక వ్యాపారపరమైన మరో 2100 ఎకరాల అభివృద్ధికీ కూడా దాదాపు 42వేల కోట్లు కావాలట. ఈ లెక్కలనీ బాగానే వున్నాయి గాని డబ్బు మాత్రం లేదు. హడ్కో మాత్రం 7500 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. అప్పులు రాక, వ్యాపారవర్గాలు ఉత్సాహం చూపక అమరావతి ప్రణాళికలు ఆచరణకు రావడం కష్టసాధ్యమై పోతున్నది.

    రాజధాని నిర్మాణ నమూనాలకు దర్శకుడు రాజమౌళిని సంప్రదించడం కూడా హాస్యాస్పదంగా వుంది.ఆయన దర్శకత్వ నైపుణ్యాన్ని గౌరవించాల్సిందే గాని బిల్డింగ్‌లకు సెట్టింగ్‌లకు హస్తిమశకాంతరం తేడా. నిజానికి కె.రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌తో తీసిన సింహబలుడు, రాజమౌళి రామ్‌ చరణ్‌తో తీసిన మగధీర సెట్టింగులు పక్కనపెట్టుకుంటే మహిష్మతి చాలా వరకూ అర్థమవుతుంది. అయినా ఒక రాష్ట్ర రాజధానిని గ్రాఫిక్‌ల కింద చూస్తున్న తమాషా ఇక్కడే సాధ్యం. నేను మొదట్లో సరదాగా అనేవాణ్ని బాహుబలి సెట్టింగులు అని. అదే నిజం చేస్తారని మాత్రం వూహించలేదు.

    చివరి విషయం ఏమంటే – రాజధాని టెండర్ల విషయంలో స్విస్‌ చాలెంజికి కోర్టు తిరస్కరణ తర్వాత ప్రభుత్వం కాస్త అటూ ఇటూ చేసి ఒక్క నిబంధన మినహా పాత ఫక్కీలోనే ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. టెండరుదార్లకు సమయం ఇవ్వడం తప్ప తక్కినవన్నీ సేమ్‌ టు సేమ్‌ అంటున్నారు. ఇది కూడా సమస్యలకు దారితీయొచ్చు. బహుశా ఆ పేరుతో మరింత ఆలస్యం చేయాలని ప్రభుత్వ వ్యూహం కావచ్చు

    http://www.telakapalliravi.com/2016/12/10/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AB%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%97%E0%B0%BF%E0%B0%AE/

  7. Veera

    జడ్జీలను అంటారా? చిన రాజప్ప
    (తెలుగు దేశం జెండాలు మోసినవాళ్లు, పార్టీ ఎలక్షన్ ఏజెంట్ లుగా కూర్చున్నవాళ్ళు జడ్జీలుగా ఉంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సాక్షి టీవీ చర్చ లో రైతు బిడ్డ YCP MLA ఆళ్ళ రామకృష్ణ రెడ్డి)
    ఏమప్పా రాజప్ప ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు, ఇటీవల మీ టీడీపీ MPమురళీ మోహన్ చౌదరి YS జడ్జీలను మేనేజ్ చేసుకొని ఔటర్ రింగ్ రోడ్ విషయం లో నా మీద కేసు గెలిచాడు అని అనలేదా?
    ఇంతెందుకు అప్పటి CM NTR అవినీతికి పాల్పడినట్టు ప్రాధమిక అధరాలు ఉన్నాయి అని 1987 లో హై కోర్ట్ చెప్పగానే జడ్జీలు అంతా కాంగ్రెస్ ఏజెంట్లు అని రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చి బస్సులు తగలబెట్టించింది బాబు కాదా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s