అంధకారంలో ఆంధ్ర-అయోమయంలో జనం

ప్రపంచస్థాయి అదుÄ్భత రాజధాని, కోస్టల్‌ కారిడార్‌లు, విమానాశ్రయాలు, పోర్టులు, స్మార్ట్‌ సిటీస్‌, హైటెక్‌ ప్రపంచం, బాక్సైట్‌ మైనింగ్‌ లాంటి కార్యక్రమాల పేరుతో ప్రజలకు రంగు రంగుల కలలు చూపిస్తున్నారు. నిజానికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్‌ కి అనుభవం కలిగిన చంద్రబాబుని గెలిపిస్తేనే కేంద్రం నుండి నిధులు రాబట్టగలరు అని నమ్మిన జనం ఆయనకు అధికారం అప్పచెప్పారు. పదిసంవత్సరాల ప్రతిపక్ష స్థానం తరువాత అధికారం చేపట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన రోజునే రుణమాఫీ, వృద్ధాప్య వికలాంగ ఫించన్లు పెంపు, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో రూ.2 కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌, బెల్టు షాపుల రద్దు, పదవీ విరమణ వయస్సురెండేళ్ళ పెంపు అంటూ ఆర్భాటంగా ఐదు హామీలపై సంతకాలు చేసారు.

వీటిలో పదవీ విరమణ వయస్సు పెంపు మినహా మిగతా అన్ని హామీలు నెరవేర్చడంలో ఆయన విఫలమైనట్లే.

ముఖ్యంగా బెల్టు షాపులు రద్దు చేస్తామన్న చంద్రబాబు నేడు రాష్ట్రాన్ని మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయం తోటే నడుపుతూ మహిళలకు మాత్రం పసుపు-కుంకుమ పేరుతో నగదు జమచేస్తామని హామీ ఇవ్వడం విడ్డూరం.

ఇక రైతు రుణమాఫీ మరొక మాయాజాలం. ఎన్నికలలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చినవెంటనే కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరకు కుటుంబానికి 1.5 లక్షలు, స్కేల్‌ అఫ్‌ ఫైనాన్స్‌ అంటూ రూ. 84 వేల కోట్ల విలువైన రుణాల సంఖ్యను భారీగా తగ్గించారు. 2014 డిసెంబర్‌ 30 నాటికి వ్యవసాయ రుణాల మొత్తం బకాయిలు రూ. 99,555 కోట్లని స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొనగా ఐదేళ్ళలో విడతలవారీ సర్కారు మాఫీ చేసేది రూ. 15,991కోట్లు మాత్రమే. రైతులపై ఇంకా రూ. 83,564 కోట్ల రుణ భారం అలానే వుంది. వాటిపై వడ్డీలు, చక్రవడ్డీలు, అపరాధ వడ్డీలు అదనం. మొత్తం రైతు ఖాతాలు కోటీ 15 లక్షలు వుండగా బ్యాంకులు అప్‌ లోడ్‌ చేసింది కేవలం 82 లక్షల 66 వేల ఖాతాలు మాత్రమే. దాంట్లో 51లక్షల 70వేల ఖాతాలకు మాత్రమే అర్హత వుండగా, సుమారు ముప్పై లక్షల ఖాతాలకు చంద్రబాబు సర్కారు మొండి చేయి చూపింది. ప్రభుత్వం మూడు విడతలుగా విడుదల చేసింది ఇంచుమించు రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇదీ చంద్రబాబు గారి రుణమాఫీ మాయాజాలం.

చంద్రబాబు గారు అంతర్జాతీయ రాజధాని పేరుతో అంతులేని కుంభకోణానికి తెరతీశారు. రైతుల నుండి 34 వేల ఎకరాలు, 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములనూ సేకరించారు. శంకుస్థాపనలు, సభలు జరిపారు కానీ ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. శిలాఫలకాలు మిగిలాయి. పైగా రైతుల భూమిని 99 ఏళ్ళు ప్రవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే ఉత్తర్వులు విడుదలచేయడంతో ఇదంతా ఒక రియల్‌ ఎస్టేట్‌ తతంగంగా మారిపోయిందన్న విమర్శలు నిజమైనాయి.

చంద్రబాబు గారు పదవిలోకి వచ్చిన వెంటనే రాయితీలు ఇచ్చి రాష్ట్రాన్ని పరిశ్రమలతో పరుగులు పెట్టిస్తానన్న ప్రకటనలు ఒట్టి మాటలే అని తేలిపోయాయి. పారిశ్రామిక మిషన్‌ స్థాపించి పరిశ్రమలకు 10 లక్షల ఎకరాల భూమిని ఇస్తామని ప్రకటించినా ఫలితం మాత్రం శూన్యం.

ఎన్నికల సమయంలో ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అనే నినాదం విపరీతంగా ప్రచారం చేసారు. నిజానికి బాబు వస్తే జాబు వచ్చేది దేవుడెరుగు,వున్న జాబు ఊడిపోయే పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొని వున్నాయి. కనీసం నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోండి అంటూ నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు

అంగన్‌ వాడీలు, డ్వాక్రా మహిళలు కూడా రోడ్లపైకి వచ్చే దుస్థితి నెలకొని వుంది. ఉద్యోగుల విషయంలో నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ చండశాసనుడిలా వుండే చంద్రబాబు గారు ఈసారి దానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుండడం గమనించాల్సిన విషయం.

ఆఖరికి విభజన సమయంలో పార్లమెంట్‌ లో హామీ ఇచ్చినట్లు ప్రత్యేక తరగతి హౌదా అయినా సాధిస్తారేమో అని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. ఇచ్చిన ఎంతో కీలకమైన హామీని నెరవేర్చకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ క్రీడ ఏపీ ప్రజలను ఎంతో ఆవేదనకు గురిచేస్తోంది. అనేక సాంకేతిక కారణాలు చెప్పి చివరకు హౌదా కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నామని కేంద్రం ప్రకటించడం, దాన్ని చంద్రబాబు గారు ఆహ్వానించడం, ఇది చాలా గొప్ప సాయమంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు తెలుగునాట సన్మానాలు పొందడం చూసి ప్రజలు అయోమయానికి గురయ్యారు. పారిశ్రామిక రాయితీలు ప్రత్యేక తరగతి హౌదాలో భాగమేనన్నది నిర్వివాదంగా అందరూ అంగీకరించాల్సిన విషయం. ప్రత్యేక తరగతి హౌదా రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీల వల్ల సంక్లిష్ట పరిస్థితులున్న కాశ్మీర్‌ మినహాయించి మిగిలిన అన్ని ‘ప్రత్యేక’ రాష్ట్రాల్లో పరిశ్రమలు,ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయన్నది కూడా గణాంకాలు చెబుతున్న వాస్తవం. అయితే హౌదా వచ్చిన రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అబద్ధపు ప్రచారాలు చేయడం దారుణం..

ఇలా అన్ని రంగాల్లోనూ వైఫల్యాలు కనిపిస్తున్నా విచిత్రంగా చంద్రబాబు ఈ వైఫల్యాలన్నింటికీ విభజనే కారణ మంటూ బుక్‌ లెట్లు, కరపత్రాలతో ప్రచారం చేసుకోవడమే ఆశ్చర్యకరం. తాను చేసే పనులన్నింటినీ పబ్లిసిటీ చేయడానికి ఏకంగా 25 మంది మేళాన్ని నెలకి రూ. 51,468 రూపా యలకు పైనే జీతం ఇచ్చి పెట్టుకున్నారు. వారికి ‘జర్నలిస్టులు’ అని పేరుకూడా పెట్టారు. మొత్తానికి రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీల విషయంలో కేంద్రం పై పోరాడకుండా తన వైఫల్యా లను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలని ఎప్పుడూ మత్తు లోనే, సం బరాల్లోనో ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎన్ని కల హామీలలో విఫలం చూస్తుంటే ఆయనకి ఆయనే మళ్ళీ ప్రతి పక్ష స్థానానికి మార్గం సుగమం చేసుకొంటున్నట్లుగా ఉంది.

-కూసంపూడి శ్రీనివాస్‌, లోక్‌ సత్తా పార్టీ అధికార ప్రతినిధి

http://www.prajasakti.com/Article/Neti_Vyasam/1877609

1 Comment

Filed under Uncategorized

One response to “అంధకారంలో ఆంధ్ర-అయోమయంలో జనం

  1. Look at these unethical caste fanatics and their priorities ….
    SHAME on them….. when the common man is struggling in the state and across the country standing for hours and days to get their own money out of the banks or deposit their own money in a bank.

    http://www.sakshi.com/photos/photo/album-gowthami-putra-satakarni-audio-release-function-5535?pfrom=home-top-photos

    Their hearts ate filled with hatred towards fellow human beings and their minds are unethical and poisonous …..but they have a common destiny to Rot in Hell.
    One man is a central minister but shamelessly attends all yellow caste fanatic functions.
    One man is in charge of AP ….killed his own father in law and was caught red handed buying Telangana MLA’s.
    The other man is an attempted murderer who says that you have to either kiss a heroine or get her pregnant to become a Hero !!
    Then there are 5% blind narrow minded caste fanatics claiming to be hardcore supporters for the above. What do these people learn from their parents and teachers ?? What do they teach their children ???
    Manam ….Kulam…….Dhanam…..Jeevitham …..Antham ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s