తనకు కొంచెం .. “తన” వారికి కొంచెం ..!

తనకు కొంచెం .. “తన” వారికి కొంచెం ..! శ్రీపాద శ్రీనివాసు విశ్లేష‌ణ
ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుగారి పాలన తీరు ఎట్లా ఉంది అంటే గ్రామం చివరిలో ఉన్న కొండను నా భూజాలపై మోస్తాను చుడటానికి రండి అని ప్రజలను అందరిని అక్కడకు పిలిచి, మీలో ఎవరైనా ఆ కొండను మోసుకొచ్చి నా భూజాలపై పెట్టండి మోసి చూపిస్తాను అన్నట్టు గా ఉంది. ఇంతకీ ఆ కొండను ఎవరు ఎత్తగలరు అనేదే ఇక్కడ ఉన్న సమస్య ..! క‌నక చంద్రబాబు గారు ఏమాంటారు .. అంటే కొండను ఎవరూ కూడ మోసుకొచ్చి నా భూజాల మీద పెట్టలేదు కనుక నేను నా భూజాలపై ఆ కొండను మోసి చూపలేక పోయాను అని చెప్ప‌ద‌లుచుకున్నారా అనే ప్ర‌శ్న జ‌న‌లో ఉంది.

విజయవాడ చుట్టూ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం అంటూ పాలకపక్షం ఆపాసోపాలు పడుతోంది. ఆ ముసుగులో తనకు కొంచెం-తన వారికి మరికొంత కొంచెం లాభం కలిగే విధంగా వ్యవహారిస్తున్నట్టుగా ఉంది. ఈ తెరచాటు వ్వవహారాలను గమనించబట్టే న్యాయస్దానాలు సైతం రాజధాని నిర్మాణ వ్యవహారాలకు సంబంధించిన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుపట్టాయి.

పాలకులు రాజధాని నిర్మాణం మరియు ఆ చుట్టుప్రక్కల పోర్టుల నెపంతో రైతులనుండి బలవంతంగానైనా భూములను లాక్కోవాలని విశ్వప్రయత్నాలను చేస్తోంది.ఇదంతా ఆ ప్రాంతంలో అధికార పక్షం వారికి దగ్గరైన వారికి, వారి బీనామి ఆస్తుల విలువ పెరగాడానికి ఉపయుక్తంగా ఉంటుందికాని సమాజానికి ఒరిగేది ఏమి ఉండదు.అంటే రైతులు తమ భూములను కొల్పోవాలి, వ్యవసాయ రంగం కుదేలు అవ్వాలి కాని తమవారి బినామి ఆస్తుల విలువ పెరగాలి. నిజంగా ఇది ఎంత అన్యాయం ..? అసలు వీరి ఆస్ధుల విలువ పెరగాడానికే రహస్య ఒడంబిడికలు చేసుకుని రాష్ట్రాన్ని విడగొట్టడం, ఈ ప్రాంతంలోనే రాజధానిని నిర్ణయించడం చేశారేమోనని అనుమానం స‌గ‌టు సామాన్యుల‌కు క‌లుగుతోంది.

నది ఒడ్డునే రాజధాని నిర్మాణం అనేది సాంకేతిక,పర్యావరణ కారణాల దృష్ట్యా ఏ మాత్రం అమోద యోగ్యం కాదు. ఎందుకంటే రాజధాని నిర్మాణం కారణంగా భవిష్య్తత్తులో ఏర్పడే కాంక్రీట్ జంగిల్ కారణంగా ఆ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ఇంకిపోయేందుకు అవకాశం ఉండదు. అంతే కాకుండా వివిధ భవనాలు, ఫ్యాక్టరీలు తదితర నిర్మాణాల నెపంతో నది క్యాచ్ మెంట్ ఏరియా ఆక్రమణలకు గురి అవుతుంది. అప్పుడు కృష్ణా నది తన ప్రవహాపు మార్గాన్ని మార్చుకుంటే మాత్రం ఈ ప్రాంతమంతా ముంపుకు గురి అవ్వడం ఖాయం. తన వారి ఆస్తుల విలువ పెరగడం కోసం ఇంత బరితెగింపు విధానాలు సమర్థ‌నీయమా .. కాదో ఒక్కసారి పాలకపక్షం ఆలోచించాలి. ఈ పరిణామాలను అన్నింటిని చూస్తే పోతూలూరి వీర బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలోని ఒక్క అంశం గుర్తుకు వస్తోంది. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కును కృష్ణానది తాకినపుడు సృష్టి పరిసమాప్తం అవుతుందని అన్నారు. బహుశ మన పాలక పక్షాలు పాలన పేరుతో చేస్తున్న చేష్టలు కాలజ్ఞానంలో పేర్కొన్న అంశాలకు నిజమవుతాయయి అనడానికి ముందస్తు హెచ్చరికమేమో ..!

http://www.newspillar.com/post/Sripada-Srinivas-Analysis-on-AP-Capital-City-Amaravathi-Construction

2 Comments

Filed under Uncategorized

2 responses to “తనకు కొంచెం .. “తన” వారికి కొంచెం ..!

 1. Veera

  బొత్స సూటి ప్రశ్నలు
  1.2014-15లో రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల హెక్టార్లు, 2015-16లో 13 లక్షల హెక్టార్లు, 2016-17లో 9.40 లక్షల హెక్టార్లు మాత్రమే భూమి సాగులో ఉందన్నారు. పట్టిసీమ ద్వారా అదనంగా 10 లక్షల ఎకరాల భూమి సాగులోకి తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గడం గురించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
  2.విదేశాలతో ఎంవోయులు చేసుకున్నామని చెబుతున్న ప్రభుత్వం నేటికీ ఒక్క కంపెనీకైనా శంకుస్థాపన చేసిందా అని ప్రశ్నించారు.
  3.అధికార పార్టీకి చెందిన గుంటూరు జడ్పీ ఛైర్మన్‌ తనకు మంత్రి రావెల వల్ల ప్రాణహాని ఉందని స్వయంగా జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారంటే శాంతి భద్రతలు పరిస్ధితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.

 2. Veera

  భారత్ లో 95 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు-ASSOCHAM,Deloitte
  మరి క్యాష్ లెస్ ఎకానమీ ఎలా సాధ్యం?
  ఇక్కడ బాబు ఏమో 2018 లో భ్రమరావతి లో తొక్కుడు బిళ్ళ ఒలంపిక్స్ పెడతా అంటాడు, ఎవరు ఎవరిని కాపీ కొడుతున్నారో అర్ధం కావడం లేదు
  [వివిధ దేశాల్లో ట్రాన్సాక్షన్స్ తీరు
  సింగపూర్ -61% ప్లాస్టిక్, 39% క్యాష్
  అమెరికా-54% ప్లాస్టిక్, 46% క్యాష్
  చైనా-10% ప్లాస్టిక్, 90% క్యాష్
  ఇండియా-2% ప్లాస్టిక్, 98% క్యాష్
  -Dr.తులసి రెడ్డి , కాంగ్రెస్ ప్రతినిధి]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s