భ్రమరావతి నిర్మిస్తామంటున్న సింగపూర్ కంపెనీల గుట్టు
-VVR కృష్ణంరాజు,ప్రజాశక్తి , Jan 2,2017
రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపికచేయడానికి చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి సలహాకు ప్రాధాన్యతనిచ్చి సారవంతమైన భూములున్న అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాక రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఎటువంటి పారదర్శకత లేకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ సింగపూర్ సంస్థలను గుడ్డిగా ఆహ్వానించారు.
సింగపూర్ ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణానికి ముందుకు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. చైనా రాజధాని బీజింగ్‌కు 150 కిలో మీటర్ల దూరంలో తియాన్జిన్ ఇకోసిటీ అనే నగర నిర్మాణంలో నేరుగా పాలుపంచుకున్న సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే చేతులు కాల్చుకుంది. అమరావతి లాగా ఈ నగర ప్రధాన లక్ష్యం కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం. ఈ నగరాన్ని 50:50 శాతం భాగస్వామ్యం ప్రాతిపదికన చైనా, సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అమరావతి నగరానికి మాస్టర్ ప్లానర్స్‌గా ఉన్న జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా సంస్థలే తియాన్జిన్ నగరానికి కూడా మాస్టర్ ప్లానర్స్‌గా ఉండడం విశేషం. సింగపూర్ – చైనా సంయుక్తంగా 2009 జులైలో ఈ నగర నిర్మాణాన్ని ప్రారంభించాయి. 2020 కల్లా 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడు సంవత్సరాల్లో ఈ రెండు దేశాలూ కేవలం నాలుగు చదరపు కిలో మీటర్ల పరిధిలోనే నగరాన్ని నిర్మించగలిగాయి. వచ్చే మూడేళ్ళలో మిగిలిన 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరాన్ని నిర్మించాల్సి ఉండగా అది మరో ఇరవై ఏళ్ళకు కూడా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. ఈ నగర నిర్మాణానికి సుమారు 970 కోట్ల అమెరికన్ డాలర్ల వ్యయం అంచనా వేయగా అది ఇప్పుడు 3,700 కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. చైనా, సింగపూర్ ప్రభుత్వాలు కేవలం 30 చదరపు కిలో మీటర్ల పరిధిలో కొత్త నగరాన్ని నిర్మించడానికి గత ఏడు సంవత్సరాలుగా ఆపసోపాలు పడుతుంటే ఆ దేశాలనే చంద్రబాబు నాయుడు తరచుగా గొప్పగా పొగుడుతుంటారు.
తియాన్జిన్ నగర నిర్మాణం కోసం సింగపూర్ – చైనా మంత్రులతో ప్రత్యేక కమిటీ వేశారు. తర్వాత అధికారుల స్థాయిలో ఆరు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. యాభై శాతం సమాన వాటాలతో చైనా, సింగపూర్‌లు ”సైనో-సింగపూర్ తియాన్జిన్ ఇకో-సిటీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్”(ఎస్‌ఎస్‌టిఇసి) అనే సంస్థను ఏర్పాటు చేసి నగర నిర్మాణాన్ని ప్రారంభించాయి. అవసరమైన నిధులు కూడా సమకూర్చాయి. అయినప్పటికీ ఈ నగర నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకూ పూర్తి చేసిన నగర ప్రాంతం చైనా ప్రజల ఆదరణను కూడా పొందలేక నిర్మానుష్యంగా బావురుమంటోంది. మూడున్నర లక్షల మంది నివసించాల్సిన ప్రాంతంలో ప్రస్తుతం పది వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. వేయికిపైగా వ్యాపార సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకరించినప్పటికీ 98 మాత్రమే నగరానికి వచ్చాయి. ఈ నగరం ద్వారా ఐదేళ్ళలో వస్తుందనుకున్న ఆదాయంలో 25 శాతం కూడా రాలేదని తియాన్జిన్ ఇకో సిటీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ మాజీ సిఇఒ తాంగ్‌యన్ చెప్పారు. ఈ నగరం ఒక వైఫల్యంగా మారడంతో గత నెల ఆయన ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పుడు ఆయన స్థానంలో సింగపూర్‌కు చెందిన తే లిమ్‌హెంగ్ నియమితులయ్యారు. ఈ నగర వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ సింగపూర్ మాస్టర్ డెవలపర్స్ మాత్రం అమరావతిలో 56 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, వందలాది వ్యాపార సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు చేపడతాయని చెబుతున్నారు.
రాష్ట్ర హైకోర్టు అభ్యంతరాలు చెప్పినప్పటికీ అడ్డదారుల్లో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి నగర నిర్మాణాన్ని సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ డెవలప్‌మెంట్ సంస్థలకు అప్పగించాలన్న కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. అయితే కేవలం 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తియాన్జిన్ ఇకో నగరాన్ని నిర్మించడానికి చైనా, సింగపూర్ ప్రభుత్వాలే నానా తంటాలు పడుతుంటే అంతకన్నా దాదాపు ఏడు రెట్లు ఎక్కువైన అంటే 217 చదరపు కిలోమీటర్ల నగరాన్ని నిర్మించి అభివృద్ధి పర్చడం సింగపూర్ ప్రయివేట్ సంస్థలకు సాధ్యమయ్యే పనేనా? అసలు ఈ సంస్థలకు ఒక మహానగరాన్ని నిర్మించే సామర్థ్యం ఉందా?
మొదట అమరావతి నగర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి దానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా సంస్థలు ఆసక్తి చూపాయి. (గతంలో విశాఖలో ఒక చిన్న టౌన్‌షిప్‌ను నిర్మించలేక మధ్యలోనే కాంట్రాక్ట్‌ను వదులుకున్న ఘనత జురాంగ్ ఇంటర్నేషనల్ కంపెనీది) అయితే అనూహ్యంగా చంద్రబాబు మిత్రుడు, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ గత ఏడాది జులై 20న తాను డైరక్టర్‌గా ఉన్న, తనకు ఆర్థిక ప్రయోజనాలున్న సెంబ్‌కార్ప్ డెవలప్‌మెంట్ అనే ప్రయివేట్ సంస్థతో పాటు అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ అనే మరో ప్రయివేట్ కంపెనీ పేరును తెరపైకి తెచ్చారు. ఈశ్వరన్ 2013 జనవరి 13 నుంచి సెంబ్‌కార్ప్ డెవలప్‌మెంట్‌కు డైరక్టర్‌గా ఉంటున్నారు. వివిధ కాంట్రాక్టులు ఈ కంపెనీకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించడం డైరక్టర్‌గా ఆయన ప్రధాన కర్తవ్యం. ఆయన సలహా మేరకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంస్థలతో స్విస్ ఛాలెంజ్ పద్ధతిన బిడ్‌లు దాఖలు చేయించింది.
అమరావతి నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన కంపెనీల్లో ఒకటైన సెంబ్‌కార్ప్‌పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ బ్రెజిల్‌లో 12 డ్రిల్లింగ్ రిగ్గుల నిర్మాణ కాంట్రాక్ట్ పొందడానికి పెట్రో బ్రాస్ అధికారులకు 95కోట్ల అమెరికన్ డాలర్ల లంచం ఇచ్చి బ్రెజిల్ న్యాయస్థానంలో దోషిగా నిలబడింది. ఈ కుంభకోణం తర్వాత ఈ కంపెనీ షేర్ల విలువ బాగా పడిపోయింది. ఎస్ ఈశ్వరన్ సింగపూర్ మంత్రిగా ఉంటూ తాను డైరక్టర్‌గా ఉన్న ఒక కళంకిత కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు.
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్ పేరుతో కళంకితమైన ఆ దేశ ప్రయివేట్ కంపెనీని అమరావతి నగర నిర్మాణానికి ఆహ్వానిస్తోంది.
అమరావతి నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన సంస్థల్లో మరొకటైన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ సంస్థ ఛైర్మన్ వాంగ్‌కాన్ సెంగ్ సింగపూర్ ప్రభుత్వంలో గతంలో డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన 2011 నుంచి అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఆయన సింగపూర్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు ఆయన మంచి మిత్రుడని, ఈ కంపెనీల్లో ఈశ్వరన్ కుటుంబానికి వాటాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ కంపెనీల నేపథ్యం, అమరావతి నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే చంద్రబాబు- ఈశ్వరన్ మధ్య మ్యాచ్ ఫిక్స్‌ంగ్ జరిగిందనే అనుమానాలు కలగడం సహజమే. స్వార్థపూరిత నిర్ణయాలు, అసమర్థ, కళంకిత కంపెనీలతో మ్యాచ్ ఫిక్సింగ్‌లు, ఇన్వెస్టర్ల నిరాసక్తత వంటి కారణాల వల్ల భవిష్యత్‌లో అమరావతి నగరానికి కూడా తియాన్జిన్ నగరానికి పట్టిన గతే పట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.
Charithra lo Anthima Vijayam ………Dharmanika
http://www.sakshi.com/news/top-news/ys-jagan-comments-on-cm-chandrababu-439273?pfrom=home-top-story
Chillari Dongalaki …..Charithra lo sthanam ledhu .
Chanipoya mundhu …Vari meedha varika asahyam vesthundhi.
Kulanni …..Kalanni addam pettukuni rastranni dochukuntunna Gajji dongalu..
Aluperagani Prajaporatam chesthunna …..Oke Okkadu
JAGAN in Atmakur …
Neethimalina Jathi ……Siggumalina panulu
AP ki pattina cheeda .
http://www.sakshi.com/news/state/fake-doctor-438869?pfrom=home-top-story
Please use the Social media to expose these unethical caste fanatics.
Kula gajji thappa …..manava viluvalu theliyani
Ee Neethimalima jathini ….Social media lo andagattandi
A murderer geta an award just beacuse he is from the same caste of another murderer who killed his own father in law for power ?
Shame …..shame ….shame….They will all Rot in Hell.
http://www.sakshi.com/news/top-news/how-accused-in-rohit-case-gets-award-by-modi-438179?pfrom=home-top-story
Post this article on Facebook , Twitter , You tube , Instagram etc.
Let the world know the facts of these 5% unethical narrow minded caste fanatics from AP.
Use Social media ……..Save AP.
Nobel Prize for Backstabbing your own father in law …
Nobel Prize for being caught red handed buying Telangana MLA’s …
Kulanni ……Kalam ni addam pettukuni …AP ni KAMMA ga dochukuntunnu Gajji / Gaja dongalu andhariki ……Nobel Prizes’s ???
Chee ….chee….kondhariki jeevitham lo siggu lajja anevi vundavu ??
http://www.ndtv.com/andhra-pradesh-news/100-crores-reward-for-anyone-from-state-who-wins-nobel-prize-andhra-pradesh-chief-minister-1645193?pfrom=home-south
బాబు పట్ల మంత్రులూ అధికారులలో అనాసక్తి-తెలకపల్లి రవి, Jan 2
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తారా అని ఆశగా ఎదురు చూసిన సీనియర్ నేతలు, ఆశావహులలో ఇప్పుడు తీవ్ర నిరాసక్తత నెలకొన్నది. అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటున్నారు. లోకేశ్ చెప్పినట్టు మంత్రులు వినాల్సి వస్తున్నది.
కేంద్రం ఇస్తున్న నిధులు అంతంతమాత్రం. మన వనరులు అసలే చాలవు. ఇలాటి పరిస్థితుల్లో మంత్రులమై మాత్రం చేసేదేముందని ఇటీవల కలిసిన కొంతమంది నిర్లిప్తంగా మాట్లాడారు. ఏదైనా చెప్పడానికే అవకాశం వుండటం లేదని నిరంతరం ప్రచార కార్యక్రమాలలో మునిగిపోయి పాలనను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు వినడం వల్లనే ఇదంతా జరుగుతుందని కొందరు అంటుంటే ఆయన తన స్థానం కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఫణం పెడుతున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాను మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం దండగని విరమించుకున్నానని ఒక సీనియర్ నేత అన్నారు.ఉన్నవారు ఉద్ధరిస్తున్నదేమిటి?
నారాయణ తప్ప మిగిలిన వారంతా ఉత్సవ విగ్రహాలై పోయారని కీలక పదవిలో వున్న మరో నాయకుడు చిరాకు పడ్డారు. నారాయణ మాట మీద నెల్లూరులో ఎంఎల్‌సి అభ్యర్థిగా నిలబెట్టిన వ్యక్తి ఓడిపోవడం తథ్యమని ఆ పార్టీ ప్రతినిధి ఒకరన్నారు. నారాయణ కూడా ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని అమలు చేసే నమ్మకస్తుడే తప్ప అన్నీ ఆయనే నిర్ణయించడం లేదని మరొకరు వివరించారు.
ముఖ్యమంత్రిని సంతోషపెట్టడం కోసం జగన్‌పై విపరీతంగా దాడి చేసిన మంత్రులు కూడా తమ పాత్రను పెద్దాయన గుర్తించడం లేదని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి బాహాటంగానే అసంతృప్తి వెలిబుచ్చి ఆపైన సర్దుకున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి హౌం శాఖ బాధ్యుడు కూడా అయిన చినరాజప్ప ఆ పదవికి తగిన ి నిర్ణయాత్మక పాత్ర నిర్వహించలేకపోతున్నారని ఆయన అనుయాయులే అంటున్నారు. ఇలాగే మిగిలిన మంత్రులపైనా రకరకాల అసంతృప్తులూ వున్నా ముఖ్యమంత్రి పనిచేసేవారిని చేయని వారిని ఒకే గాట కడుతున్నారనే బాధ చాలామందిలో కనిపిస్తుంది.
ఇవన్నీగాక జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు చెప్పకుండా చేసేదేమీ వుండటం లేదు. ఆయన తండ్రి కన్నా టఫ్‌గా వుంటారు. ఇంకేం చేస్తాం అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
మంత్రులే గాక అధికారులు కూడా అదే విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రచారానికి పెద్దపీట వేస్తూ వాస్తవంగా ప్రజలకు మేలు చేసే అంశాలు వెనక్కు పోవడానికి కారకులవుతున్నారని ఐఎఎస్‌లు, జిల్లా స్థాయి అధికారులు ఉదాహరణలతో సహా చెబుతున్నారు. మరి చంద్రబాబు వీటిపై ఎప్పటికైనా దృష్టిపెడతారో లేదో!