వైయస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సచివాలయంలో అయిదో దో ఆరవదో అంతస్తులో ఉన్న ఆయన ఆఫీస్ కు వెళ్ళడానికి ప్రత్యేకం గా ఒక లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టు లను ఆపేసే వారు. వైయస్ఆర్ తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టు లు మళ్ళీ పని చేసేవి.
వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఒకే ఉద్యోగి లిఫ్టు ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి వైయస్ఆర్ తో కొంచెం చనువు ఉండేది.వైయస్ఆర్ కూడా అతనిని రోజూ చూస్తుంటారు కాబట్టి నవ్వుతూ బాగున్నావా అని అడిగేవారు.
ఒకరోజు వైయస్ఆర్ ఆఫీస్ లో ఉండగా సాయంత్రం ఆ ఉద్యోగి వైయస్ఆర్ ఆఫీస్ లోకి వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ సమయం లో అప్పటి సభాపతి, మరి కొందరు ఉన్నారు.వైయస్ఆర్ ఆశ్చర్యంగా అతణ్ణి చూసి “ఏమిటి?” అని అడిగాడు.
“సార్..నేను ఈ సాయంత్రం తో రిటైర్ అవుతున్నాను. మా యూనియన్ వారు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరి సారిగా మీకు చెప్పి వెళదాం అని” చెప్పాడు అతను.
వైయస్ఆర్ ఆశ్చర్యంగా చూసి ” అరే..పొద్దున్న చెప్పలేదే? ఉండు” అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి అర్జెంట్ గా ఒక శాలువా, బోకే తెమ్మని ఆదేశించారు. ఈ లోపల ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు లేదని, పెళ్ళి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకుని సెక్రెటరీ ని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో ఒక ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతం లో రెండు ఎకరాల భూమి కీ పట్టా కాగితాలు అరగంట లోపల సిద్దం చెయ్యమని ఆదేశించారు.
ఇంతలో శాలువా, బోకే, స్వీట్స్ వఛాయి. వైయస్ఆర్ ఆ ఉద్యోగి కి స్వయంగా సన్మానం చేసి, తన జేబులోంచి కొంత నగదు తీసి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరం అయితే కలవమని చెప్పి పంపించారు.
ఆనందబాష్పములు రాలుస్తూ వెళ్ళిపోయాడు ఆ ఉద్యోగి. ప్రచారానికి నోచుకోని ఇలాంటి కోణాలు వైయస్ఆర్ లో ఎన్నో ఉన్నాయి.
-ఇలపావులూరి మురళీ మోహన్ రావు
MLA’s ni market lo pasuvulu kontunnatlu kontu …
Addam ga doriki …..KAMMA ga court nundi bhayatapdevaru kuda vuchitha salahalu isthunnaru ??
http://www.sakshi.com/news/top-news/chandrababu-fires-on-nris-441445?pfrom=home-top-story
Nara vare palle Nakka jathiki …….manushulaki theda ledha ??
Mana Samajika vargam thappa jeevitham lo ami arugani ….
Neethimalina variki …..Samajika seva gurinchi matladaniki siggu ledha ??
He had a heart of gold….I still have tears in my eyes when I think of him…