10 లక్షల కోట్ల పరువు తీసేసిన ఒకే ఒక్క ఫోటో…
పాపం… చంద్రబాబు కూడా ఇది ఊహించి ఉండడు… ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, ఒక్క సూదిపోటు ఎంత పెద్ద బెలూన్నయినా గాలి తీసేసినట్టు… ఒకే ఒక్క ఫోటో మొత్తం పదిన్నర లక్షల కోట్ల పెట్టబడుల ప్రహసనాన్ని, 22 లక్షల ఉద్యోగాల నాటకాన్ని బట్టలిప్పేసింది… ఎడాపెడా, చెడామడా… జనాలు వస్తున్నారు… సంతకాలు పెట్టేస్తున్నారు… లక్షలు, కోట్లు… లక్షల కోట్లు… పెట్టుబడులు, ఉద్యోగాలు… పెట్టండి, పెట్టేయండి త్వరగా, సంతకాలు చేసేసి, అక్కడ క్యూలో నిలబడి బాబు దగ్గర ఫోటో దిగండి… అంతే… బయట దావోస్ మెస్ అని ఉంటుంది, అక్కడ పాలకూర పప్పు, కొత్తిమీర అన్నం తినేసి వెళ్లండి… అంతే… మీ పాత్ర అయిపోతుంది… అన్నట్టుగా… నవ్వులాటగా మార్చేశారు… గతంలోలాగే యెల్లో మీడియా సపోర్ట్‌తో ఏదో తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయాలనుకుంటే అత్యంత యాక్టివ్‌గా ఉన్న సోషల్ మీడియా కాస్తా మొత్తం బట్టలిప్పేసి వైజాగు బజారులో బరిబాతల నిలబెట్టేసినట్టయిపోయింది…
ఇంతకీ ఆ ఫోటో ఎవరిదీ అంటారా..? ఏవో సంతకాలు చేయించి, పంపించేస్తే సరిపోయేది… ఆదానీలు లేరు, అంబానీలు లేరు, రెడ్డీస్ లేరు, జీవీకే అడ్రెస్సు లేదు… జీఎంఆర్ వచ్చాడు గానీ పైసా హామీ ఇవ్వలేదు… స్టాల్ వార్ట్స్ ఎవరూ లేరు… మరి పదిన్నర లక్షల కోట్లు ఎలా వచ్చాయి..? అంతా తావీదు మహిమ…
ఈ ఫోటోల తంతు పెట్టడంతో, అందరూ ఫోటోలు దిగడం, స్టార్ట్ చేశారు… కాస్త తెలిసినవాళ్లు ఎవరెవరి వస్తున్నారో గుర్తుపట్టడమూ ఆరంభించారు.,.. అలా దొరికిపోయాడు ఓ పెద్దమనిషి… ఆయనది నర్సరావుపేట… కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తూ నాలుగు డబ్బులు కమీషన్లుగా తీసుకునే పీఆర్వో అట… పేరు దొడ్దల శ్రీధర్ అన్నారు… మరి తన దగ్గర చంద్రబాబుతో ఎంవోయూ కుదుర్చుకునే స్థాయిలో డబ్బులెక్కడివి..? ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు..? వందల కోట్ల పెట్టుబడి అట, వందల మందికి ఉపాధి అట… ఎంవోయూ అయిపోయింది… ఫోటో దిగుతూ దొరికిపోయాడు… ఒరేయ్, మన శ్రీధర్‌రా… అంటూ జనం చూసి నవ్వుకున్నారు…
ఏమో… విరించి టౌన్ షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ తనదేనేమో… వందల కోట్లతో ఏపీలో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడి పెట్టబోతున్నాడేమో… ఎవరిని తక్కువ అంచనా వేయగలం చెప్పండి అని సమర్థించాడు ఓ మిత్రుడు… కానీ సోషల్ మీడియా మాత్రం ఇజ్జత్ తీసిపారేసింది… అంతేకాదు, వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్స్ అయితే ఆ ఫోటోలు ఒక్కొక్కటీ చూస్తూ, వాళ్లెవరో, వాళ్ల జాతకాలేమిటో తీసే పనిలో పడిపోయింది… ఏయే కంపెనీలు గత సమ్మిట్‌లో కూడా ఎంవోయూలు కుదుర్చుకున్నాయో, ఏయే కంపెనీలు ఆల్ రెడీ ఉనికిలో ఉన్నాయో, ఏయే కంపెనీలు అసలు ఏ స్థోమతా లేకుండా ఈ డ్రామాలో పాలు పంచుకున్నాయో వివరాలు సేకరిస్తున్నది… మరీ ఆ ఐటీ కంపెనీల జాబితా అయితే ‘కేవలం ఏ వైజాగులోనో భూమి ఇస్తే కొట్టేద్దామనే కంపెనీల్లాగే’ ఉన్నాయి తప్ప ఒక్కటీ పేరొందిన కంపెనీ లేదు… చివరకు పెట్టుబడుల సదస్సులను ఈస్థాయికి నాటకాల కంపెనీ దశకు తీసుకొచ్చిన తీరు విచిత్రమే…
https://www.muchata.com/main-news/only-one-photo-collapsed-entire-drama/
KDP ignoring Modi – Veeraju
http://www.sakshi.com/news/andhra-pradesh/bjp-mlc-somu-virraju-comments-on-tdp-445816?pfrom=home-top-story