ఏపీ వైఎస్సార్సీపీ దే! ఆంధ్రా ఆక్టోపస్ వెల్లడి
చాలాకాలం తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లా పర్యటనలో తనను కలిసిన విలేకర్లతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో ఎన్నికల్లో ప్రధానమైన యూపీ గురించి ఆయన సర్వే వివరాలను తెలిపారు. బీజేపీ విజయం ఖాయమని తేల్చిచెప్పారు. నోట్ల రద్దును యూపీ వాసులు ఆహ్వానించారని ఆయన వెల్లడించారు. అది బీజేపీకి అదనపు బలంగా మారుతోందని తెలిపారు.
ఇక ఏపీ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం వైఎస్సార్సీపీదే పై చేయి అని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వైఎస్సార్సీపీకి తిరుగులేదన్నారు. సంపూర్ణ ఆధిక్యం కనిపిస్తోందన్నారు. పట్టణాల్లో మాత్రం టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య సమాన బలం ఉందన్నారు. మొత్తంగా ఏపీలో ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేకత మూలంగా వైఎస్ జగన్ కి సానుకూలత ఉందన్న విషయాన్ని రాజగోపాల్ రూఢీ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పూర్తిగా కుదేలయిపోయిందని వెల్లడించారు.
గతంలో వివిధ సర్వేలతో దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న లగడపాటి తాజాగా యూపీ లో బీజేపీ గురించి, ఏపీలో వైఎస్సార్సీపీ పుంజుకుందన్న విషయం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో కొద్దినెలల క్రితం లగడపాటి మిత్రులకు చెందిన ఫ్లాష్ సంస్థ సర్వే పేరుతో ఏబీఎన్ ఆధ్రజ్యోతి ప్రసారం చేసిన సర్వేకి భిన్నంగా ఇప్పుడు లగడపాటి వ్యాఖ్యలు ఉండడం విశేషం.
http://telugu.updateap.com/news/news-andhra/lagadapati-on-ap-politics/
Some Humanity in a world full of racism , religious fanatism , casteism etc ..
http://www.ndtv.com/offbeat/abandoned-toddler-accused-of-witchcraft-starts-school-a-year-after-rescue-1656223?pfrom=home-specialevent
Spiritualism is more powerful than fanatism ……Rajani
http://www.greatandhra.com/movies/movie-news/spiritualism-gives-you-power-rajinikanth-79857.html
mana paper konchem standard penchite bagundu
as indicated by this site.
https://www.muchata.com/main-news/too-many-blunders-in-sakshi-daily/