విజ‌య‌సాయి రెడ్డి విశ్వ‌రూపం..!

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్సీపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌త్యేక హోదాపై ఇప్ప‌టికే ప్రైవేటు బిల్లు ప్ర‌వేశ‌పెట్టింది. దానికితోడుగా ఇత‌ర అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ఏపీ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తోంది. కేంద్రం ముందు ప‌లు అంశాలు తీసుకొస్తోంది. ఈ విష‌యంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి త‌న అవ‌గాహ‌న‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రుస‌గా ప్ర‌తీ రోజూ అనేక అంశాల‌ను స‌భ ముందుకు తీసుకొస్తున్నారు. ఏపీలో వైఎస్సార్సీపీకి ఏకైక రాజ్య‌స‌భ స‌భ్యుడాయ‌న‌. అయిన‌ప్ప‌టికీ దానికి త‌గ్గ‌ట్టుగానే కొత్త‌వాడైన‌ప్ప‌టికీ ప‌రిణ‌తితో కూడిన తీరును చాటుతున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్ర‌ప్ర‌తి ప్ర‌సంగంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న సుదీర్ఘ ఉపన్యాసం ఆక‌ట్టుకుంది. ఆడిట‌ర్ గా ఉన్న అవ‌గాహ‌న‌తో విద్యావంతుడైన ఈ నేత అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని మ‌రోసారి చాటిచెప్పారు. స‌భ ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌ను స‌భ ముందుకు తీసుకెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు. అంకెలు, లెక్క‌లు ఆధారంగా అభివృద్ధికి హోదా ప్రాధాన్య‌త‌ను, ఆవ‌శ్యాన్ని వివ‌రించ‌డంతో ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా విజ‌య‌సాయిరెడ్డి ఉప‌న్యాసాన్ని మెచ్చుకోవ‌డం విశేషం.

అంతేగాకుండా కేవ‌లం త‌న ఉప‌న్యాసం, చ‌ర్చ‌ల్లో పాల్గొనే అంశాల‌తో స‌రిపెట్ట‌కుండా ప‌లు స‌మ‌స్య‌ల‌ను వివిధ రూపాల్లో స‌భ ముందుంచ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. స్వైన్ ఫ్లూ స‌మ‌స్య రాష్ట్రంలో పెరుగుతున్న విష‌యాన్ని పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావిచండం ద్వారా ఏపీలో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వం తీసుకోబోయే చ‌ర్య‌ల గురించి, కేంద్రం స్పంద‌న గురించి ఆయ‌న నిల‌దీయ‌డంతో స్వైన్ ఫ్లూ మీద చ‌ర్య‌ల‌కు సిద్ధం కావాల్సి వ‌చ్చింది. అంతేగాకుండా ప‌లు ప్ర‌శ్న‌ల‌ను ఆయ‌న ప్ర‌తీ రోజు సంధిస్తున్నారు. ఇప్పటికే పోల‌వ‌రం అంచ‌నాల విష‌యంలో , ప్రాజెక్ట్ భ‌విష్య‌త్తు అంశంలో ఆయ‌న కేంద్రం మీద సంధించిన ప్ర‌శ్న పోల‌వ‌రానికి సంబంధించిన వాస్త‌వ స్థితిని చాటిచెప్పింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పెంచిన అంచ‌నాలు ఇప్ప‌టికీ కేంద్రానికి నివేదించలేద‌ని ప్ర‌భుత్వం రాత‌పూర్వ‌కంగా చెప్ప‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇరుకున ప‌డింది.కేవ‌లం 1981 కోట్లు మాత్ర‌మే నాబార్డ్ నుంచి అప్పులు ఇవ్వ‌డం ద్వారా ప్రాజెక్ట్ ఎలా పూర్త‌వుతుంద‌న్న ప్ర‌శ్న‌కు కూడా పోల‌వ‌రం బాధ్య‌త త‌మదేనని కేంద్రం స‌భ సాక్షిగా అంగీక‌రించ‌డ‌మే కాకుండా, పూర్తిస్థాయిలో నాబార్డ్ ద్వారా స‌హాయం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేయాల్సి వ‌చ్చింది.

ఇక వాటితో పాటు చంద్ర‌బాబు చెప్పుకుంటున్న ప్యాకేజీ వ్య‌వ‌హారం కూడా విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న ద్వారా బ‌హిర్గ‌త‌మ‌య్యింది. ప్యాకేజీకి ఓ రూపం రాలేద‌ని కేంద్ర‌మే అంగీక‌రించాల్సి వ‌చ్చింది. క్యాబినెట్ కి కూడా నోట్ త‌యారు కాలేద‌ని తేలిపోయింది. వాటితో పాటు రైల్వే జోన్ వ్య‌వ‌హారం కూడా త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని కేంద్ర‌మంత్రి స‌భ‌కు మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇచ్చే ప‌రిస్థితిని విజ‌యసాయి తీసుకొచ్చారు. మొత్తంగా ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో విప‌క్ష నేత‌గా వైఎస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌య‌త్నాల ద్వారా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు స‌భ ముందుకు రావ‌డం ఆశావాహ‌మే. టీడీపీ నుంచి ప‌లువురు ఎంపీలు ఉన్న‌ప్ప‌టికీ వారంతా మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డం, కేంద్రాన్ని నిల‌దీసే ప‌రిస్థితి చంద్ర‌బాబు కి లేక‌పోవ‌డంతో వారేమీ ప్ర‌య‌త్నాలు చేయ‌లేక‌పోతున్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీల‌లో చిరంజీవి పూర్తిగా సినిమాల‌లో బిజీగా ఉండ‌డం, కేవీపీ కొన్ని అంశాల‌కే ప‌రిమితం అవుతుండ‌డంతో విజ‌య‌సాయిరెడ్డి త‌న హ‌వా ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ద‌క్కుతోంది. మొత్తంగా పార్ల‌మెంట్ లో ప‌ర్స‌న్ ఆఫ్ ది ఏపీగా విజ‌య‌సాయి ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించే ఛాన్స్ ద‌క్కుతోంది.

http://telugu.updateap.com/politics/vijayasai-reddy-one-man-show-in-rajyasabh/

5 Comments

Filed under Uncategorized

5 responses to “విజ‌య‌సాయి రెడ్డి విశ్వ‌రూపం..!

 1. Roja arrested ……Brahmini allowed to talk at the ladies meeting .
  The 95 % Public should be ashamed of watching these dramas by yellow caste fanatic dramas in AP.
  Spare sometime……Use Social Media…Expose this 5 % unethical fanatics to the rest of the world.

  http://www.sakshi.com/news/andhra-pradesh/ambati-rambabu-fires-on-chandrababu-over-mla-roja-detention-449121?pfrom=home-top-story

  Target the TDP leaders in KDP. Write to them and let them know how they are being fooled.

 2. Thandrina chapina vyakthi kumarudiki ….Pilla nicchi
  Thandri meedha cinema theesthunna antadu……. Reel Hero and Attempted Murderer ??
  Chee…..chee…kondhari brathukulu….verri malla kula gajji fans okati ??

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2633:2017-02-10-09-44-22&Itemid=665

  Use the Social media and expose this 5 % rotting AP.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s