అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగేనా? ప్రజాశక్తి
గడిచిన రెండున్నరేళ్లుగా బాబు పాలనలో అనేక వింతపోకలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి చాలా వరకూ ఇంకా అమలుకు నోచుకోలేదు. అమలుచేసిన కొన్ని హామీలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షణగా నిలిచాయి. చంద్రబాబుకున్న రాజకీయ అనుభవం కొత్త రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుందని ప్రజలు విశ్వసించారు. అందుకే అధికారం కట్టబెట్టారు. అయితే రెండున్నరేళ్లుగా నవ్యాంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజలు ఆశించిన స్థాయిలో లేదు. అధికారంలోకిచ్చిన ఏడాదిలోపే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఆరంభమైంది. ముఖ్యంగా రైతులు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి ఈ వ్యతిరేకత రోజురోజుకు పెరుగు తోంది. ప్రజలు నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం దాన్ని అణచివేసే ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తోంది.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపిని దెబ్బతీయాలంటే ఆ పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించటమే మొదటి లక్ష్యంగా ఎంచుకుని టిడిపి విజయం సాధించింది. ఈ షాక్ కొద్ది రోజులపాటు వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిని వెంటాడింది. దీన్నుంచి వెంటనే కోలుకున్నారు. టిడిపిపై ప్రత్యక్ష దాడికి దిగకపోతే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేమని, ఇప్పటికే ఉన్న ప్రజాబలం కూడా కోల్పోవాల్సిన ప్రమాదం కూడా పొంచి ఉందని జగన్ గుర్తించారు. వెంటనే వ్యూహాన్ని రూపొం దించటం, తక్షణం కార్యాచరణలోకి దిగటం జరిగిపోయాయి.
ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెచ్చారు. వైసిపి ఎంపీలను రాజీనామా చేయిస్తానని ప్రకటించి జగన్ రాజ కీయ వాతావరణాన్ని వేడెక్కించారు.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో విద్యార్థులు తలపెట్టిన ‘ప్రత్యేక హోదా శాంతియుత’ నిరసన కార్యక్రమానికి జగన్ హాజరయ్యేందుకు వెళ్లటం, వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచే జగన్‌ను హైదరాబాద్‌కు తరలిం చటంతో వైసిపి రాజకీయ మైలేజ్ పెరిగింది. ఇది అధికార పార్టీకి మైనస్‌గా మారింది.
అనంతరం జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరవ్వటానికి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన వైసిపి ఎమ్మెల్యే రోజాను బలవంతంగా మార్గ మధ్యంలోనే పోలీసులు అడ్డుకుని తిరిగి ఆమెను హైదరా బాద్‌కు తరలించటంతో వైసిపి ప్రజలకు మరింత చేరువ కాగలింది.
గుంటూరులో నిర్వహించిన ‘యువభేరి’ కార్య క్రమం యువతను ఆకర్షించేలా మారింది. ఇటీవల కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు దగ్గర జరిగిన బస్ ప్రమాదంలోని క్షత గాత్రులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లటం వంటి అంశాలు వివాదమయ్యాయి. అయితే ఇవి తెలుగుదేశం ప్రభు త్వానికి మైనస్‌గా, వైసిపికి ఫ్లస్‌గా మారాయి.
దశలవా రీగా వైసిపి తన రాజకీయ మైలేజ్‌ను పెంచుకోవటా నికి ఇటీ వల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలుగు దేశం ప్రభు త్వంపై నిత్యం ఎదురుదాడులు పెంచుతూనే గుక్కతిప్పు కోనీయ కుండా చేస్తోంది. వైఎస్ జగన్‌పై కేబినెట్ సమావేశం తీర్మా నం చేయటం వంటి అంశాలు వైసిపికి రాజకీయ మైలేజ్‌ను పెంచే విధంగానే ఉన్నాయి.
అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించు కుంటూ 2019 ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో మార్చి 6వ తేదీ నుంచి జరిగే ఎపి అసెంబ్లీ సమావేశాల్లో అనుక్షణం అధికార పార్టీని ప్రశ్నించటం, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందు లు, సమస్యలను సభా దృష్టికి తేవడం ద్వారా సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు వైసిపి సన్నద్ధ మైంది.అయితే ప్రజాధనంతో అసెంబ్లీ సమావేశాలు జరుగు తాయ. ప్రతి నిమిషం చాలా విలువైందే. అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు, పట్టింపులకు పోకుండా, రాజకీయప రమైన లాభాపేక్షతో కాకుండా ప్రజా సమస్యలను పరిష్క రించే విధంగా సమావేశాలు జరిగేలా చూడాలి. రాష్ట్రంలో అనేక సమస్యలు నిత్యం వేధిస్తున్నాయి. అత్యధిక శాతం ప్రజలు కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడు తున్నారు. వీటన్నిటిపై సమగ్రంగా చర్చించటం, పరిష్కా రమార్గాలను అన్వేషించే దిశగా ఎపి అసెంబ్లీ సమా వేశాలు జరగాలి. ఈ దిశగా ఉభయ పార్టీలూ వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు.
– కంచల జయరాజ్ (వ్యాసకర్త 10టీవీ డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, విజయవాడ)
http://www.prajasakti.com/Article/Neti_Vyasam/1901920
The fate of AP ruled by a dacoit caught red handed ….
http://www.sakshi.com/news/top-news/chandra-babu-cant-escape-from-cash-for-vote-case-ponnavolu-sudhakar-reddy-455822?pfrom=home-top-story
http://www.sakshi.com/news/national/india-has-highest-incidence-of-bribery-in-asia-pacific-survey-456399?pfrom=home-election-top-story