గెలిచి ఓడామా! ఓడి గెలిచామా?

గెలిచి ఓడామా! ఓడి గెలిచామా? ఆంధ్రభూమి, March 22
మనం గెలిచి ఓడామా? ఓడి గెలిచామా?’.. ఇదీ నేడు తెలుగుదేశం నేతల్లో సాగుతున్న అంతర్మథనం.
శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి మూడు సీట్లలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి టీచర్, పట్ట్భద్రుల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకావడం షాకిచ్చింది. మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ప్రధానంగా కడపలో ఘన విజయం మూటకట్టుకోవటంతో సోమవారం ఉదయం అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సంబరాలు చేసుకోగా, రాత్రికి వెలువడిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పరాజయం పాలుకావడంతో పరిస్థితి గంభీరంగా మారింది. ఈ ఓటమి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతంగా గుర్తించి దిద్దుబాటు చర్యలకు దిగకపోతే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు, సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన దానికి, ప్రజలు నేరుగా పాల్గొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకూ తేడా ఉన్న విషయాన్ని విస్మరించకూడదని వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తం 9 జిల్లాల పరిధిలో జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల్లో కొన్ని లక్షల మంది టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఓట్లు వేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ముందు తొలిసారి ప్రత్యక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. దీంతో తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపతోనే సంతృప్తిచెందాల్సి వచ్చిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఒకరకంగా ఇవి శాంపిల్ ఎన్నికలు. స్థానిక ఎన్నికలంటే జెడ్పీటీసీల నుంచి కౌన్సిలర్ల వరకూ అందరినీ మేనేజ్ చేయవచ్చు.

ప్రజలు నేరుగా ఓట్లేసిన టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల్లో ఫలితాలు మొత్తం మాకు వ్యతిరేకంగా రావడమే ఇబ్బందికరం. అంటే ఉద్యోగులకు ఎంతచేసినా ఇంకా వారిలో టిడిపిపై వ్యతిరేకత పోలేదని తేలిపోయింది. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మేం మోసం చేశామన్న జగన్, ఆయన మీడియా ప్రచారాన్ని గ్రాడ్యుయేట్లు నమ్మి మాకు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. 9 జిల్లాల్లో మాకు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. దీనిపై ఆత్మవిమర్శ చేసుకోకపోతే మరింత నష్టపోతాం’ అని ఓ సీనియర్ నేత హెచ్చరించారు. ఈ రెండున్నరేళ్లలో భజనపరులు, కార్పొరేట్లు, దళారీలను పక్కకుపెట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేశాయని విశే్లషిస్తున్నారు

5 Comments

Filed under Uncategorized

5 responses to “గెలిచి ఓడామా! ఓడి గెలిచామా?

 1. Veera

  Public Talk
  కాకినాడ నుంచి తుని వెళ్లే ప్యాసింజర్ రైల్ లో 30 మంది ప్రయాణికుల అభిప్రాయం
  దాదాపు ౩౦ మంది బాబు ను తిట్టారు , అసలు పాలనా లేదూ పాడు లేదు
  జగన్ ను మాట్లాడివ్వకుండా తిట్టిస్తున్నారు అసెంబ్లీ లోో అని కూడా అన్నారు
  -Va Sam.
  KPHB లో ఒక టీ స్టాల్ వద్ద ముగ్గురు గోదావరి జిల్లా యువకుల సంభాషణ
  ఈ సారి ఎట్టి పరిస్థిలో బాబు రాడు,ఒక్క హామీ నెరవేర్చలేదు, అంతా మోసం వచ్చేది జగన్
  పోయినసారి కూడా బాబు వచ్చేవాడు కాదు కానీ చివర్లో పవన్ సపోర్ట్ చేయడం వలన బాబు వచ్చాడు అని మాట్లాడుకొంటున్నారు
  -ఇది KPHB మిత్రుడు నాకు ఫోన్ చేసిన చెప్పిన సమాచారం
  -FB

 2. Neethimalina Nara Jathi ki ….time deggara padindhi .

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2696:2017-03-24-07-20-07&Itemid=665

  These caste fanatic. unethical crooks will be caught in GOD’s court.

 3. Maa Kamma ni judges Supreme Court lo pettanu …
  Cases nundi thappinchtaniki ??

  Please use the Social media.

  Ee Gajji / Gaja dongalanu pattinchandi.

  http://www.sakshi.com/news/andhra-pradesh/cm-chandrababu-comments-on-461165?pfrom=home-top-story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s