ధిక్కార స్వరాలు- టిడిపిలో రాజుకుంటున్న అసమ్మతి

ధిక్కార స్వరాలు- టిడిపిలో రాజుకుంటున్న అసమ్మతి
– వరుస రాజీనామాలు, నిరసనలు
– నిన్న రామసుబ్బారెడ్డి, కేశినేని, నేడు శివప్రసాద్‌
– మంత్రి పదవుల విషయంలో నరేంద్ర, బోండా, బుచ్చయ్య ఫైర్‌
– మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో శివప్రసాద్‌పై సిఎం ఆగ్రహం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:
టిడిపిలో అసమ్మతి సెగ మొదలైంది. రెండేళ్లుగా ఓపిక పట్టిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతోపాటు సామాజిక తరగతుల వారీగా నాయకత్వమూ తమ అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు.

మూడేళ్లలో తాము చేసిందేమీ లేదని, కేవలం ప్రచారంతోనే నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా వ్యక్తమవుతున్న నిరసనలతో పార్టీ అంతర్గత వ్యవహారం రచ్చకెక్కింది.

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరు ఎంపి నారమల్లి శివప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నేరుగా స్పందించారు. టెలీకాన్ఫరెన్స్‌ పెట్టి మంత్రులతో మాట్లాడారు. శివప్రసాద్‌ వ్యక్తిగత ఏజెండాతో వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై ఆయన కూడా అదే రీతిలో స్పందించారు. తాను కుప్పం ఓట్లతో గెలవలేదని, సొంతంగానే గెలిచానని, ఏం చేసినా పార్టీ కోసమే చేస్తున్నానని చెప్పారు. తానెవరికీ భయపడాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేశారు. ఎన్నికల సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ నాయకత్వంలో అసమ్మతి పెరుగుతోంది. ఎవరికివారు బయటపడుతున్నారు. జిల్లాల నాయకత్వంలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినా పెద్దగా స్పందన ఉండటం లేదు. శివప్రసాద్‌ ఒకడుగు ముందుకేసి తన పోటీని ఎవరూ ఆపలేరనీ వ్యాఖ్యానించారు. తనపైనే మంత్రులతో చర్చించడం సరైన పద్ధతికాదన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఎలాగన్నారు.

అంతకు ముందు మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ వివిధ జిల్లాల్లో వ్యతిరేకత వచ్చింది. గుంటూరు జిల్లాల్లో ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన సొంతూరులో రోడ్డుపైనే టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తామో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

టిడిపి నాయకత్తం చుట్టూ కోటరీ చేరిందని, దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బహిరంగంగా లేఖ రాశారు.

కడపలో రామసుబ్బారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ప్రసుత్తం శిల్పామోహన్‌రెడ్డి కూడా అదేబాటలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమా కాపు కులానికి అన్యాయం చేస్తున్నారన్నారు. తమ పార్టీ పూర్తి క్రమశిక్షణతో ఉంటుందని నిరంతరం వల్లె వేస్తున్నప్పటికీ నాయకత్వం ఇలా బయటపడటంతో చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. దీంతోపాటు పలువురు ఎంపిలు కూడా పార్టీ నష్టం తెప్పిస్తున్నారు.

గతంలో ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై సిఎం రమేష్‌, గల్లా జయదేవ్‌ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఇటీవల రవాణా వ్యవహారంలో విజయవాడ ఎంపి కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. తాను ప్రభుత్వంలో ఉన్నా ఏమీ చేయించుకోలేకపోతున్నాని, అందువల్లే తన ట్రావెల్స్‌ను నిలిపేస్తున్నానని ప్రకటించారు. దీనిపై చంద్రబాబు పిలిచి మాట్లాడినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు.

అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి శైలే వేరు.. ఆయన చెప్పకనే పార్టీ స్థితిని చెప్పేస్తుంటారు. కేంద్రంలో ఏమీ చేయలేకపోతున్నారని గతంలో వ్యాఖ్యానించారు. ప్రసుత్తం అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారాయణకు అంత ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలోనే అనేకసార్లు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు.

మరోవైపు నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులేమీ సాగటంలేదు. నిరంతరం సమీక్షలు తప్ప ఫలితాలు కనిపించడం లేదు. మరో ఐదు నెలలు గడిస్తే ఎన్నికల సంవత్సరంలోకి వెళ్లిపోతారు. దీంతో ఎవరికి వారు బయటపడుతున్నారు. తమకు చేస్తున్నదేమీ లేదని చెప్పకనే చెబుతున్నారు. ఈ వ్యహారం పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుండటంతోనూ చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తున్నారు. బయటపడితే ఊరుకోబోనని గతంలో శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నాయకత్వానికి ప్రత్యేక సమావేశాలు పెట్టి సిఎం హెచ్చరించారు. అయినా జిల్లాలో ఉన్న వ్యతిరేకత నెమ్మదిగా బయటపడుతోంది.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1915750

6 Comments

Filed under Uncategorized

6 responses to “ధిక్కార స్వరాలు- టిడిపిలో రాజుకుంటున్న అసమ్మతి

  1. Poradithe poyedhi ami ledhu ….
    Gajji / Gaja dongalanu prapanchaniki telupandi.
    Please use the Social media in whatever country you are to expose these unethical yellow caste fanatics .
    It is 95% Public Vs 5 % narrow minded people who know nothing but caste and money in life . Bring them to justice.
    You tube, Twitter, Instagram , etc etc. If they close one website we create another the next day. Write to all National media and National leaders about these people.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jaganmohan-reddy-call-on-social-media-470220?pfrom=home-top-story

    Suryudu asthaminchani Samrajyala sankanaki poyayi …
    Ee Chillari dongalu antha ??

  2. Will this man be arrested as well please ??
    He was caught red handed by Telangana police . His voice was confirmed by the forensic lab.

    https://www.change.org/p/honorable-chief-justice-of-india-prosecute-mr-chandrababu-naidu-in-cash-for-vote-case

    If 5 % yellow caste fanatics try to stop one website ….hundred more will pop up . Thanks for creating more publicity for the websites and the world will no the true colours of these unethical people runing AP.

  3. @ Yellow caste fanatics ..

    Kulam…….Manam………Dhanam……Jeevitham kadhu
    You neither take your crores nor your caste with you when you die.
    Stop looting your own people and start doing good.

  4. Veera

    టిడిపిలో పెరుగుతున్న అంత:కలహాలు-తెలకపల్లి రవి, సీనియర్ విశ్లేషకులు
    తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గ విస్తరణ వాస్తవానికి అంతర్గత వివాదాలను పెంచడానికే దారితీసింది. ఆ పార్టీలో గతంలో లేని స్థాయిలో తిరుగుబాటు స్వరాలు వినిపించాయి. ఇవన్నీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలీలగా సర్దుబాటు చేస్తారని అనుకున్నారు గాని ఒకవైపు మంట ఆర్పుతుంటే మరోవైపు రగులుకుంటున్నది. ఎందుకంటే దీనికి వెనక అంతర్గత కారణాలు బలంగానే వున్నాయి.

    మొదటనుంచి నమ్మకంగా చేసిన వాగ్దానాలు భగం చేశారన్న కోపం ఒకటి. తమను కాదని మరో పార్టీ నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారనేది మరొకటి. సామాజిక సమీకరణాలు కూడా పక్కనపెట్టి సర్కారును కీర్తించినా ఫలితం లేదనే బాధ కొందరిది. తమ కంటే ఎక్కువగా మాట్లాడిన వారిని వదలిపెట్టి తమకే ఎందుకు నీతులు చెబుతున్నారనే ఆగ్రహం ఇంకొందరిది.

    బొజ్జల గోపాల కృష్ణారెడ్డి రాజీనామా వెనక్కు తీసుకున్నా ఆయనలో ఎంత నిరసన వున్నదీ ఈ వారం రోజులలోనూ బయిటపెట్టేశారు.అక్కడే ఇప్పుడు తిరుపతి ఎంపి శివప్రసాద్‌ తిరుగుబాటు మొదలైంది.

    శివప్రసాద్‌ ఉదంతమే తీసుకుంటే ఆయన వ్యాఖ్యల్లో అసంతృప్తితో పాటు ఆవేదన కూడా వుంది. కొన్ని తరగతులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను భగం చేశామన్న విమర్శ వుంది. తాము ఏదైనా చెప్పాలనుకుంటే సమయం ఇవ్వడం లేదనే ఫిర్యాదూ వుంది.వాటికి ప్రభుత్వం నుంచి జవాబు లేదు. సీనియర్‌ ఎంపికే దిక్కు లేకపోతే మా సంగతి ఏమిటని తక్కిన తెలుగుదేశం నేతలు అనుకుంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు శివప్రసాద్‌పై చర్య తీసుకుని మిగిలిన వారిని కూడా దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు గాని ఒక దళితనేతపై చర్య వల్ల కలిగే పరిణామాలు చాలా వుంటాయని ముఖ్యమంత్రికీ తెలుసు.

    ఈ సమయంలోనే నంద్యాలలో శిల్పా మోహనరెడ్డి,తూగో జిల్లాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసమ్మతి రాగాలే వినిపిస్తున్నారు.

    పొద్దుటూరులో ఓటమి భయంతో మునిసిపల్‌ ఎన్నికను మరోసారి వాయిదా వేయడంపైనా నిరసన వ్యక్తమవుతున్నది.

    విజయవాడలో ఎంపి కేశినేని ఆపేసిన బస్సులు తీసుకోవడానికి ఆర్టీసి నిరాకరించడంపై ఆయన కోపంగా వున్నారట. అధికారికంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తిప్పేది లేదని ప్రకటిస్తున్నారు.

    ఇక ఎంఎల్‌ఎ బోండా ఉమామహేశ్వరరావు కాపుల గొంతు కోశారని తాను ఎన్నడు అన్నానో చెప్పాలని సవాలు చేస్తున్నారు, ఈలోగా మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ వెళ్లి కలసి రావడం వాతావరణాన్ని మరింత దిగజార్చింది.

    ఇవన్నీ చాలనట్టు ఇప్పుడు ఎంపి జెసి దివాకరరెడ్డి రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబుకు మంత్రి నారాయణకు స్పష్టత లేదని విమర్శించారు, ముందుగా ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎందుకు ఇళ్లు కట్టించడం లేదని నిలదీశారు, నిజానికి అమరావతిలో ఏం జరుగుతుందో తమకే తెలియడం లేదని మంత్రులు కూడా వాపోవడం నిత్యకృత్యంగా వుంది. అమరావతిలో అసైన్డ్‌ భూముల సమస్య కూడా చినికి చినికి గాలి వానగా మారే అవకాశాలున్నాయి. బిజెపి నేతలు కూడా ఎప్పటికప్పుడు రాజధాని అంశంపై విడగొట్టుకుంటూనే వున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s