బాబుకి ప్ర‌జ‌ల్లో ఎన్ని మార్కులు?

బాబుకి ప్ర‌జ‌ల్లో ఎన్ని మార్కులు? UpdateAP నిర్వ‌హించిన స‌ర్వే
చంద్ర‌బాబు పాలన
బాగుంది – 37 %
బాగాలేదు-51%
ఇంకా కొంతకాలం వేచి చూడాలి-12%

ఏపీ రాజ‌కీయాలు ఎల్ల‌ప్పుడూ వేడిగానే క‌నిపిస్తుంటాయి. ఇద్ద‌రు హేమీహేమీల‌యిన నేత‌ల మ‌ధ్య హోరా హోరీగా క‌నిపిస్తుంటాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కూడా అదే స్థాయిలో పోరు సాగింది. కానీ రాష్ట్ర విభ‌జ‌న తర్వాత ఏర్ప‌డిన ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌తో చంద్ర‌బాబు విజ‌యం సాధించారు. అప్ప‌ట్లో ఆయ‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం, మోడీ ఇమేజ్, రుణ‌మాఫీ స‌హా ప‌లు అంశాలు తోడ్ప‌డ్డాయి.

ఇక మూడేళ్ల పాల‌న త‌ర్వాత ఏపీలో చంద్ర‌బాబు పాల‌న‌తీరు మీద వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ, అన్ని వ‌ర్గాల్లోనూ ప్ర‌భుత్వ తీరు మీద అస‌హ‌నం, అసంతృప్తి ద‌శ దాటి వ్య‌తిరేక‌త స్థాయికి చేరుకున్నాయి. దాంతో దానిని అధిగ‌మించడానికి చంద్ర‌బాబు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్నిక‌ల టీమ్ అంటూ క్యాబినెట్ లో మార్పులు చేశారు. పార్టీ ప‌నికి ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. పార్ల‌మెంంట్ నియోజ‌వ‌క‌ర్గాల వారీగా ఇన్ఛార్జుల‌ను నియ‌మించారు. ప్ర‌చారం విష‌యంలో దూకుడుగా వెళ్లాల‌ని ఆదేశిస్తున్నారు. పార్టీలో ఉత్సాహం నింప‌డానికి శ్ర‌మిస్తున్నారు.

కానీ ఫ‌లితాలు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. బాబు ఆశించిన దానికి భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపు కొత్త చిచ్చు పెట్టింది. ఎంతో ఆశ‌తో పార్టీలో చేరిన కొంద‌రు అసంతృప్తితో క‌నిపిస్తున్నారు. ఆనం బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హారం దానికో ఉదాహ‌ర‌ణ‌. ఇక క్యాబినెట్ కూర్పు టీడీపీలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.ఇప్పటికీ కుదుట ప‌డిన‌ట్టుగా లేదు. ముఖ్యంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త పెర‌గ‌డం క‌మ్మ వ‌ర్గంలో కూడా అసంతృప్తిని పెంచింది. సీనియ‌ర్లు చిట‌పట‌లాడే ప‌రిస్థితి క‌నిపించింది. ఇక అన్నింటికీ మించి చిన‌బాబు ప్ర‌మోష‌న్ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. పార్టీ యావ‌త్తు ఆయ‌న వెంట ఉన్న‌ప్ప‌టికీ ప‌దే ప‌దే చేస్తున్న పొర‌పాట్లు లోకేష్ ప‌రువును మంట‌గ‌లుపుతున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌నే ఇప్పుడు సెటైర్ల‌కు సెంట‌ర్ పాయింట్ అయిపోవ‌డంతో సీఎంకి ఏమాత్రం సంతృప్తినివ్వ‌డం లేదు.

కీల‌క హామీల విష‌యంలో కూడా ప్ర‌భుత్వానికి నిరాశ ఎదుర‌వుతోంది. ప్ర‌త్యేక హోదా పార్టీకి పెద్ద శాపంగా మారింది. కేంద్రంతో పోరాడ‌లేక‌, ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌జెప్ప‌లేక వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేక‌పోవ‌డం కూడా చిక్కుల్లో నెడుతోంది. ఇక రాజ‌ధాని వ్య‌వ‌హారంలో ఎటూ పాలుపోవ‌డం లేదు. నిజంగానే భ్ర‌మ‌రావ‌తిగా మిగిలిపోతుందా అనే ప‌రిస్థితి ఉంది. సింగ‌పూర్ కంపెనీల‌కు స్విస్ ఛాలెంజ్ విష‌యంల ఎంత ఆతృత‌ప‌డినా అడుగుముందుకు ప‌డే అవ‌కాశం లేదు. అసెండాస్ సింగ్ డామ్ కంపెనీల కోసం కేటాయించిన భూముల్లో లింగాయ‌పాలెం రైతుల‌కు చెందిన 160 ఎక‌రాలు ఇప్ప‌టికీ రైతుల చేతుల్లో ఉన్నాయి. వారు స‌సేమీరా అంటున్నారు. రైతులు అంగీక‌రించ‌కుండా ప్రాజెక్ట్ ముందుకెళ్లే ప‌రిస్థితి లేదు. దాంతో ఏపీ రాజ‌ధాని తాత్కాలిక నిర్మాణాల‌తో స‌రిపెట్టుకోవాల్సిందే అన్న‌ట్టుగా మారిపోతోంది.

పోల‌వ‌రం స్ప‌ష్ట‌త లేదు. రైల్వేజోన్ వ‌స్తుందో రాదో తెలీదు. కేంద్రం నిధులు ఎండ‌మావులే అన్న‌ట్టుగా ఉంది.ఇసుక స‌హా అన్ని విష‌యాల్లోనూ మాఫియాలు చెల‌రేగిపోవ‌డం మామూలు జ‌నాల‌కు మంట‌రేపుతోంది. మొత్తంగా ఏపీ లో చంద్ర‌బాబు పాల‌న మూడేళ్లు ముగిసిన త‌ర్వాత ఎవ‌రికీ మింగుడుప‌డ‌ని స్థాయిలో ఉంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీలోనే అసంతృప్తి స్వ‌రాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అనేక చోట్ల కుమ్ములాట‌లు నిత్యం క‌నిపిస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నిక‌లు ఏడాదిలోనా, రెండేళ్ల‌లోనే అన్న స్ప‌ష్ట‌త ఇంకా రాక‌పోయిన‌ప్ప‌టికీ కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ప్ర‌జా వ్య‌తిరేక‌త అంతా చ‌ల్లారిపోతుంద‌నే అంచనాలో టీడీపీ ఉంది. అదంత సులువు కాద‌ని మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబు కి ప్ర‌ధాన ఆయుధం కేవ‌లం ప‌ట్టిసీమ మాత్ర‌మే క‌నిపిస్తుండ‌డం విశేషం. దాంతో మూడేళ్ల చంద్ర‌బాబు పాల‌న మీద ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి దిశ‌గా సాగుతున్నారు. బాబు పాల‌నా తీరు ను ఏమాత్రం సంతృప్తి లేద‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌ను స‌మ‌ర్థించిన వారు కేవ‌లం 37 శాత‌మే ఉండ‌డం విశేషం. మ‌రో 51 శాతం మంది బాగోలేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రో 12 శాతం మంది మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాల‌న్న‌ట్టుగా చెప్పుకొచ్చారు. దాంతో ఈసారి బాబు కి అనుభ‌వం అనే ఇమేజ్ కూడా డ్యామేజ్ కావ‌డం, అవినీతి వ్య‌వ‌హారాల‌తో పార్టీ నేత‌లంతా ప్ర‌జ‌ల‌కు దూరం కావ‌డం కూడా వీటికి కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. ఏమ‌యినా తాజాగా అప్ డేట్ ఏపీ నిర్వ‌హించిన స‌ర్వేలో చంద్ర‌బాబు కి అత్తెస‌రు మార్కులు మాత్ర‌మే ద‌క్క‌డం విశేషం. ప్రజాభిప్రాయాన్ని బ‌ట్టి గ‌మ‌నిస్తే ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు కి పెద్ద‌గండ‌మే పొంచి ఉంద‌న్న‌ది మాత్రం స్ప‌ష్టం. సూటిగా చెప్పాలంటే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే చంద్ర‌బాబు మునిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

http://telugu.updateap.com/politics/openion-on-chandrababu-rule/

25 Comments

Filed under Uncategorized

25 responses to “బాబుకి ప్ర‌జ‌ల్లో ఎన్ని మార్కులు?

 1. Akkada adagu vestha …..akkada neerajanam .
  Pulivendula Puliki …..Naravarepalle nakka ki theda ledha ???

 2. Kula Gajji Paccha media battalu vippi prapanchaniki valla
  Gajji choopinchandi.
  Use Social media to expose the unethical yellow weed …Save AP

  Neethimalina Jathi …..Siggumalina panulu

 3. ps rao2 weeks ago
  మా అమ్మ ప్రాణాలు కాపాడిన దేవుడు మా రాజన్నా ఇప్పడికి మా ఇంట్లో దేవుడి ఫొటో పక్కన ఈ దేవుడు ఫోటో ఉంది ఐ మిస్ యు రాజన్న

  Read the comments for this video on You Tube .

  Kulam ….Matham…..Pranthalaku athitham ga
  Andhariki manchi chesina …..Dr.YSR
  A Real Hero.

 4. Vennu potlu …Donga hameelu….cheekati chestalu kondhariki venna tho pettina vidhya ?

  http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-is-not-available-to-anyone-in-delhi-for-six-hours-475609?pfrom=home-top-story

  Puli ki ……Nakka ki theda ledha ??

  • Storing bombs in the hospital ….what a Doctor !!
   Harassing daughter in law ……what a Human !!
   Sitting in a Speaker’s chair …..what an Actor ??

 5. Pajala kosam …Rajyam ni vadilesina Gauthama Buddhudi sakshi ga
  Amaravathi ni ammukuntuuna …Gajji / Gaja donaglu.

  http://www.sakshi.com/news/opinion/kadalika-editor-imam-writes-on-amaravathi-475437?pfrom=home-top-story

  Veeri papam pandedhi appudu ??

 6. Good job Vijay Sai garu …..
  Alluri was a Real hero and not a reel hero.

  http://www.sakshi.com/news/national/alluri-statue-in-parliament-475160?pfrom=home-election-top-story

  Some educated caste fanatics are busy building statues in their back garden on foreign land !! Then they get it unveild by the man who had backstabbed him !!
  No wonder Americans are fed up with immigrants ?

 7. Manam ….Kulam….Dhanam…Jeevitham….Maranam
  Aa Desam agina …andhu kalidina pogadara mana Kulanni ?

  These are the values some parents teach their children .
  Veeru mundhu puttara lekha veeri kulam mundhu puttindha ???
  Shame….shame…..shame.

  http://telugu.greatandhra.com/politics/gossip/pravasandrula-kulagaziki-anthuleda-80354.html

  Please use the Social media to expose this yellow weed to the rest of the world.

   • Some people from the same community who are broadminded and can see life beyond caste and money …

    I say only 5 % caste fanatics in my posts because there are some people from the same community who have ethical and human values . This includes some of my friends.
    Do good to all before you die. Even if you can’t then atlas support the people who can truly help others.
    Life is short and it is not all about caste and money. You take nothing with you when you die.

 8. Aula gaiji Pachha media Picchi rathalu …

 9. Prajala kosam portam cheyavalisinvaru challa ga ..Kamma ga USA yathra ..
  Akkadu avaru pattinchukovatam ledhu ani avathali vari meedha nindhalu !!

  AP kosam Aluperagani portam chesthunna ….Oke Okkadu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s