నిర్మాణంపై నివేదిక ఇచ్చే బదులు నిరర్థక దీక్షలు! తెలకపల్లి రవి
ఆంధ్ర ప్రదేశ్ విభజన, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మూడేళ్లలో చేసిన నిర్మాణాలపై నివేదిక ఇచ్చేబదులు నవ నిర్మాణ దీక్ష ప్రహసనం నడపటం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా ప్రచార కాండ ఇది.
అమిత్ షా వచ్చి నానా అంకెలూ కలిపి లక్షా 75 వేల కోట్లు ఇచ్చామని ప్రకటిస్తే లేదని ముఖ్యమంత్రి గాని ఆర్థిక మంత్రిగాని ఆక్షేపించరు. తెలంగాణ ముఖ్యమంత్రి 67 వేల కోట్లు మాత్రమే వచ్చాయని సాంకేతిక వాదనతో అమిత్‌షాపై దాడి చేసి రాజకీయంగా మోడీకి మోకరిల్లారు. కాని చంద్రబాబు లేదా ఆయన ఆర్థిక మంత్రి సూటిగా ఖండించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఫణం పెట్టారు. విభజిత రాష్ట్రంలో చాలా సంస్థలు హైదరాబాదులో వుండిపోయినందున ఎపిలో ప్రారంభించాల్సిన అగత్యం వుంది. ఇవేవీ లేని నవ నిర్మాణ దీక్ష దేనికి? ఎవరిపై?
రాజధాని.. సింగపూరార్పణం
కీలకమైన రాజధాని అమరావతికి కేంద్రం నుంచి ఇంతవరకూ వచ్చిన నిధులు పరిమితం. వాటికీ లెక్కలు రాలేదంటుంది కేంద్రం. కాగారాష్ట్ర ప్రభుత్వం వాటికోసం సింగపూర్ సంచారం, విదేశీ విహారం చేస్తుంది. సమీకరణలో సమస్యలు పరిష్కరించకుండా పరిహారాలు పేరబెట్టి భూమిని విదేశీ కంపెనీకి స్టార్టప్ పేరిట అప్పగిస్తుంది.అక్కడ వందల ఎకరాలు వారికి ధారాదత్తం చేస్తే ఎవరికి ఎంతకు అమ్ముకుంటారనేది ఇష్టారాజ్యమే. వారికోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు కూడా చేసే ప్రభుత్వం మాత్రం అతి పరిమితమైన వాటానే పొందుతుంది. అంటే భూమి వారిది కాదు, పూర్తి డెవలపర్స్ వారు కాదు.. కేవలం గ్లోబల్ దళారుల రూపంలో అమ్మిపెడతారంతే. దానికీ కాల వ్యవధి లేదు. ఈలోగా ఇతరుల భూముల అమ్మకాలపై ఆంక్షలు పెట్టి వూరించిన కోట్లు రాకుండా చేస్తారు. ప్రైవేటు బిల్డర్లే వందల వేల భవనాలు అవలీలగా కట్టేస్తున్న ఈ కాలంలో నిక్కీ నీల్గి కట్టిందేమంటే తాత్కాలిక సచివాలయం, శాసనసభ మాత్రమే!
ఇప్పటికి ఆకృతులు అనబడే డిజైన్లు కూడా ఖరారు కాలేదు. బాహుబలి సినిమాలూ గ్రాఫిక్స్‌తోనడిపించే దర్శకులకు కూడా ఈ నిర్మాణంలో పాత్ర వుందంటే ఏమనాలి? అంతా అలా పేరబెట్టి మరోసారి ఈ ప్రభుత్వం వస్తేనే రాజధాని పూర్తవుతుందని ప్రచారం చేసుకోవాలనేది ఆలోచన. అంతేగాని ఇంతటి చారిత్రిక సంధిదశలో ఒక్క అఖలపక్షమైనా జరిపింది లేదు.
ఇదంతా ఒక రాజకీయ దగా.
ఓటుకు నోటు దెబ్బతో టిఆర్‌ఎస్ ముందు తెలుగుదేశం నోరెత్తలేని స్థితి నదీజలాలపై ఇరు రాష్ట్రాలు వేడివేడిగా పోట్లాడుకోవడం సర్దుకోవడం తప్ప సహేతుక ప్రమాణాలు ఏర్పాటు చేసుకోవడం లేదుఎపిలో పట్టిసీమ, పురుషోత్మపట్నం అంటూ కొత్తప్రాధమ్యాలు తీసుకొస్తున్నారే తప్ప క్రమపద్దతిలో నిధులను బట్టి పురోగమించడం లేదు.రాయలసీమ ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన కెబికె ప్యాకేజీ నిరాకరించి ఏవో పరిమిత నిధులు విదిలిస్తున్నా మాట్లాడ్డం లేదు.పోలవరమే సర్వస్వం అన్నట్టు చెబుతున్నారు గాని దానికీ నిధులు అంతంత మాత్రమే. కేంద్రం కూడా నదీజలాలపైన 9.10 షెడ్యూళ్లపైన చొరవ చూపడం లేదు. ఇద్దరూ కీచులాడుకుంటే తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నది.
గొప్ప రాష్ట్రం… తప్పుడు పోకడలు
రాజధాని లేకపోవడం తప్పిస్తే ఎపికి నదులు రేవులు పంట భూములు వనరులూ అన్నీ వున్నాయి.చరిత్ర గల పట్టణాలున్నాయి.వాటిని అభివృద్ధి చేసుకునే అవకాశాలూ వున్నాయి. విద్యాధికులూ శ్రమజీవులకు కూడా లోటు లేదు.
కాని ఏదో మహౌపద్రవం జరిగిపోయిందని పదే పదే చెప్పి మరోసారి ఓట్లు తెచ్చుకోవాలనే తాపత్రయం ప్రభుత్వానిది. అణుబాంబు దాడిలో నాశనమైన హిరోషిమాలా వుందని కూడా మొదట్లో ముఖ్యమంత్రి అంటుండేవారు.
హైదరాబాద్ నేనే కట్టాను. హుద్‌హుద్ తర్వాత విశాఖను నేనే కాపాడాను, క్రిడా పేరిట కేటాయించిన భారీ కోస్తా ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేశానని చాటుకోవడం కోసం ఎపి పరిస్థితినిమరీ దీనంగా చిత్రిస్తుంటారు. దానికైనా కట్టుబడి వుంటారా అంటే ప్రపంచంలో అభివృద్ధిలో ముందున్నామని మరో పల్లవి పాడుతుంటారు. నవరస నటనా సార్వభౌములను మించిపోయి అంతగా ఏడిపించిన వారే హ్యాపీ సండేలు ఆనంద సూచికలు ఆవిష్కరిస్తారు. ఒక విధంగా సంప్రదాయిక రాజకీయ ప్రచారాలను దాటిపోయి వినిమయ వస్తు ప్రచార సరళికిి దిగజారింది ప్రభుత్వం.
వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఎపిలో ఆ దిశగా అభివృద్ధికి ప్రయత్నించకపోగా కరువుల దెబ్బకు విలవిలలాడే వారిపట్ల నిర్లక్ష్యం తాండవించింది. మిర్చి పసుపు కూరగాయాల రైతుల శోకాలు పట్టడమే లేదు.
నియామకాలూ అసలే నాస్తి. కాంట్రాక్టు నియామకాలు కార్పొరేట్ ఔట్‌సోర్సింగ్‌లే విధానంగా మారిన స్థితి.
చివరగా అభివృద్ధికి శొతిభద్రతలు కూడా అవసరం. కాని టిడిపి ప్రజా ప్రతినిధులే పోలీసులపై అధికారులపై బెదిరింపులకు దాడులకు దిగిన ఘటనలు అనేకం. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలే పరస్పరం హత్యలు చేసుకునే ఘోర పరిస్థితి. అయినా మేము క్రమశిక్షణకు మారుపేేరంటారు.. కాల్ మనీ ఇసుక లిక్కర్ భూమి మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగి ప్రాపకం పొందుతున్నాయి. ఫ్యాక్షన్ హత్యలు పునరావృతమవుతున్నాయి.
భూముల రక్షణ కోసం పరిహారం కోసం రైతులు ఉద్యమిస్తిే ప్రత్యేక హాదా రాజధాని నియామకాలు దేనిపై మాట్లాడినా ప్రభుత్వానికి అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా కనిపిస్తుంది. పోలీసులను వుసిగొల్పి ముందస్తుగానే అరెస్టులు అమానుష నిర్బంధాలు అమలు చేస్తారు
విభజన చట్టం సరిగ్గా అమలు చేయించుకోవడం, న్యాయంగా రావలసినవన్నీరాబట్టుకోవడం తప్ప ఇప్పుడు మరో కర్తవ్యం వుండదు. కాని ముఖ్యమంత్రి మాత్రం వచ్చే అన్ని ఎన్నికల్లోనూ గెలవడమే ప్రథమ కర్తవ్యమని సందేశమిచ్చారు తప్ప ఇలాటివి ప్రాధాన్యతగా లేకపోవడం దురదృష్టకరం. ఇప్పుడుజరగాల్సింది కుటిల రాజకీయాలను పక్కనపెట్ట్టిి సత్వర పునర్మిర్నాణం కోసం నడుం కట్టడమే.
Even having a small baby did not stop this religious fanatic from killing innocent people .
Fanatism turns humans into animals.
http://edition.cnn.com/2017/06/05/europe/london-attackers-who-are-they/index.html
http://www.sakshi.com/news/top-news/ts-muslim-jac-lodged-complaint-on-ap-cm-chandrababu-481766?pfrom=home-top-story
Viluvalu vadhili thoti prajalanu kamma ga dochukuntunna rojullo
http://www.ndtv.com/hyderabad-news/with-no-money-for-funeral-hyderabad-man-dumps-body-of-daughter-in-drain-1707583?pfrom=home-cities
http://www.sakshi.com/news/andhra-pradesh/kvp-fires-on-chandrababu-naidu-481692?pfrom=home-featured-stories
Religious and Caste fanatism turn humans into animals .
Result is destruction of humanity.
http://edition.cnn.com/2017/06/03/europe/london-bridge-incident-live-blog/index.html
Do not let the fanatics win.