తవ్వేకొద్దీ కబ్జాలు

తవ్వేకొద్దీ కబ్జాలు-ఆంధ్రభూమి
-రాష్ట్రంలో ఇప్పటి వరకూ వెలుగుచూసిన కుంభకోణాల్లో విశాఖ భూకబ్జా కుంభకోణమే అతి పెద్దది
విశాఖలో విలువైన భూములు ఏ దిక్కునున్నా మాఫియా వదిలిపెట్టలేదు. భూకుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి బంధువులు, అనుచరులు ఈ మాఫియాకు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మాఫియాలకే మాఫియా అన్నట్టు అక్రమార్కులు విశాఖ భూములను మింగేశారు. వందల ఏళ్లనాటి భూరికార్డులను కేవలం ఏడాది వ్యవధిలో నచ్చినట్టు మార్చేసుకున్నారు. సర్వే నెంబర్లను టాంపర్ చేశారు. వీరికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, పోలీస్ శాఖ అండగా నిలవడంతో కనిపించిన ఖాళీ స్థలాలను కబ్జా చేసేశారు. అమాయకులను బెరించారు. ఎదురు తిరిగిన వారిని డబ్బుతో కొనేశారు. స్థానికంగా లేని భూయజమానుల పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించారు. ఆయా భూములను తమతమ పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నారు.

మరికొంతమంది అడుగు ముందుకేసి, కబ్జా చేసిన భూములను బ్యాంకులో తనఖాపెట్టి రుణాలు పొందారంటే అధికార మాఫియా ఏవిధంగా జడలు విప్పిందో అర్థం చేసుకోవచ్చు. వీరి లీలలు చూసి న్యాయ నిపుణులు సైతం అవాక్కవుతున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రంలో ఇప్పటి వరకూ వెలుగుచూసిన కుంభకోణాల్లో విశాఖ భూకబ్జా కుంభకోణమే అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు.

వాదరహిత నగరంగా పేరు తెచ్చుకున్న విశాఖకు మాయని మచ్చని తెచ్చిపెట్టింది మాఫియా. ధరలు పెరగడమే కారణం. విశాఖలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో అధికార పార్టీ నాయకుల కళ్లు భూములపై పడ్డాయి. త్వరలోనే విశాఖ అంతర్జాతీయ నగరంగా మారబోతోందని తెలిసి కబ్జారాయుళ్లంతా విశాఖను చుట్టుముట్టారు. ప్రభుత్వం మనదే కదా! ఏదైనా చేయచ్చన్న ధీమాతో అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై రెవెన్యూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డులను గోల్‌మాల్ చేశారు. తహశీల్దార్ ఇళ్లనే కార్యాలయాలుగా మార్చి రికార్డులను టాంపర్ చేశారు. పేదవారివే కావు, కొద్దిపాటి పలుకుబడి ఉండి స్థానికంగా లేని వారి భూములనూ ఆక్రమించారు. తన పేరునున్న భూమిని సాగు చేసుకుంటున్న రైతుకే తెలియకుండా రికార్డులు మార్చేసి, భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగిన దాఖలాలు ఉన్నాయి. భీమిలి, ఆనందపురం, పెందుర్తి, విశాఖ రూరల్ మండలాల్లో భూమాఫియా ఏడాదికాలంగా వెళ్లూనుకుని అడ్డూ అదుపు లేకుండా కబ్జాలకు పాల్పడింది

ఏడాది కిందట మాఫియా మళ్లీ జడలు విప్పింది. మాఫియాకి అధికారం తోడైంది. తమకు అనుకూలంగా ఉన్న తహశీల్దార్లను, ఆర్డీఓలను ఎక్కడికక్కడ నియమించుకున్నారు. తను చెప్పిన పనులు చేయడం లేదని జిల్లాకు చెందిన ఒక మంత్రి విశాఖ ఆర్డీవోను బదిలీ చేయించాలని పట్టుబట్టారు. మరో మంత్రి ఆయనను బదిలీ చేయొద్దని పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వమే జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేసింది. అయితే, ప్రభుత్వం కొత్త ఆర్డీవోను నియమించినప్పటి నుంచి మాఫియా కబ్జాలకు రెడ్‌కార్పెట్ పరిచినట్టయింది.

కంప్యూటరైజేషన్ పేరుతో అక్రమాలు
ల్యాండ్ రికార్డులను కంప్యూటరైజ్ చేసే ప్రక్రియ చాలాకాలంగా జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే విశాఖ రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించారు. రెవెన్యూ శాఖకే తెలియనన్ని అక్రమాలు ఇక్కడ జరిగిపోయాయి. రికార్డులను కంప్యూటరీకరించే సమయంలో సదరు భూయజమానులు దగ్గరుండాలి. వారి అభ్యంతరాలేమైనా ఉంటే తీసుకుని, పరిశీలించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. కంప్యూటరైజేషన్ చేశామని చెప్పి రికార్డులను కనబడకుండా చేశారు. కంప్యూటరీకరణ సమయంలో ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టే రెవెన్యూ శాఖ అధికారులు నడుచుకున్నారు.

భీమిలి తహశీల్దార్ ఆఫీసే అడ్డా
భీమిలి తహశీల్దార్ కార్యాలయం అడ్డాగా వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇక్కడ పనిచేసిన ఏ తహశీల్దార్లనైనా తమవైపు తిప్పుకోవడమే మాఫియా లక్ష్యం. ఇక్కడ భూముల విలువ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దాన్ని చేజిక్కించుకోడానికి మాఫియా తహశీల్దార్లను తమ దారిలోకి తెచుకున్నారు. విశేషం ఏంటంటే, ఇక్కడ పనిచేసిన తహశీల్దార్లలో చాలామంది ఏసిబికి చిక్కినవారే కావడం గమనార్హం.

ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేసిన రామారావు లీలలు అన్నీ ఇన్నీ కావు. 2002-03లో 23 ఎకరాలను దొంగ రికార్డులు చూపించి ఒక మహిళ ఆ భూమిని రిజిస్టర్ చేయించుకుంది. ఆమెకు 23 ఎకరాలు దక్కితే, రికార్డులను తారుమారు చేసి 35 ఎకరాలను వేరొకరికి విక్రయించిన వ్యవహారం వెలుగు చూసింది. వాస్తవానికి ఆ మహిళ పేరున ఉన్నది 14 ఎకరాలు మాత్రమే. ఇందులో 40 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన యజమాని వెళ్లి తహశీల్దార్‌ను ప్రశ్నిస్తే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రెవెన్యూ రికార్డుల్లో ఆ వ్యక్తి ఫొటోను తీసేసి, అక్కడ ఇంకు పూసేసి ఉంది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయన కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. ఇది జరిగి ఆరు నెలలైనా ఇప్పటికీ ఆయనకు న్యాయం జరగలేదంటే రెవెన్యూ శాఖ ఎంత వన్‌సైడ్‌గా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

చివరగా ఆయన మళ్లీ తహశీల్దార్‌ను కలిస్తే, ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల వత్తిడి ఉన్నందువలన తానేమీ చేయలేనని చెప్పాడంటే, అధికారులు అధికార పార్టీకి ఎలా దాసోహమయ్యారో స్పష్టమవుతుంది.

14 Comments

Filed under Uncategorized

14 responses to “తవ్వేకొద్దీ కబ్జాలు

  1. Fear Not JAGAN we will be with you till the end of the battle for Justice that has never been witnessed in Indian politics …
    Your Fighting spirit against all odds and crooks is an Inspiration for generations to come.
    GOOD days will return for ALL Telugu people .
    History will NEVER forget fighters. Others come and go.

    JAI JAGAN ……JOHAR YSR

  2. Dogs can show greater Loyalty than some power and money hungry politicians who take nothing with them when they die .

  3. AP lo Gajji / Gaja dongalu paddaru ….

    Veeri Papam pandedhi appudu ?
    Please use the Social Media to expose this Yellow Weed.

    http://www.sakshi.com/news/andhra-pradesh/rs-1-000-crore-to-the-cm-relative-482971?pfrom=home-top-story

    • Please watch tis disgusting act by some narrow minded Religious fanatics.

      Religious and caste fanatism turns humans into animals.

      Saudi Arabia football team refuses to stand for one minute silence in memory of the victims of the LONDON terrorist attack …

  4. AP lo Gajji / Gaja dongalu kattina Bramaravathi !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s