బాబు మరింత మారాలి!

బాబు మరింత మారాలి! ABN /జ్యోతి MD రాధాకృష్ణ
ముఖ్యమంత్రి పదవి కోసం హోరాహోరీగా తలపడిన చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డిలలో పూర్వ అనుభవానికి పట్టం కట్టిన ప్రజలు చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేశారు

ఏపీలో ప్రభుత్వంపై ముఖ్యమంత్రికి పట్టు తప్పుతోందన్న భావన వ్యాపించింది. అదే సమయంలో దారీతెన్నూ లేని రాష్ర్టాన్ని గట్టెక్కించాలన్న ఆతృతతో పార్టీ వ్యవహారాలను పట్టించుకోకపోవడంతో, కార్యకర్తలలో అసంతృప్తి నెలకొనడంతోపాటు నాయకులలో క్రమశిక్షణారాహిత్యం చోటుచేసుకుంది. మంత్రులు, శాసనసభ్యులలో జవాబుదారీతనం లోపించింది. అన్నింటికీ చంద్రబాబు మాత్రమే కర్త– కర్మ– క్రియగా మారారు. ఫలితంగా కింది స్థాయిలో అవినీతి పెచ్చరిల్లింది.

దిద్దుకుంటేనే భవిత!
ఇప్పుడు చంద్రబాబు వైఫల్యాలు, సరిదిద్దుకోవలసిన అంశాల విషయానికి వద్దాం.
తెలంగాణతో పోల్చితే ఏపీలో అవినీతి ఎక్కువ అన్న విమర్శ ఢిల్లీ వరకు వ్యాపించింది.

ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల కొంతమంది మంత్రులతోపాటు శాసనసభ్యులూ డబ్బు సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గడచిన మూడేళ్లుగా పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల పార్టీలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లింది. కొంత మంది మంత్రుల కుమారులు సిండికేట్‌గా ఏర్పడి స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి వారు తమ కార్యకలాపాలకు లోకేశ్‌ పేరును యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిదాంట్లో చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలలో లోకేశ్‌ పాత్ర ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో లోకేశ్‌ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది.

చంద్రబాబును వెంటాడుతున్న మరో సమస్య కాపుల రిజర్వేషన్‌! తమకు రిజర్వేషన్లు కావాలనీ, తమను బీసీలలో చేర్చాలనీ కాపులు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయినా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.ఎన్నికల ప్రచార సమయంలో కాపులకు ఈ విషయంలో హామీ ఇచ్చినందున ఆ సమస్య ఇప్పుడు ఆయనకు గుదిబండగా మారింది. ‘కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం’ అన్నట్టుగా అటు బీసీలకు, ఇటు కాపులకు అసంతృప్తి కలగకుండా ఈ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత చంద్రబాబుదే! ఆలస్యం అయ్యేకొద్దీ ముద్రగడ పద్మనాభం వంటి వారికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది.

అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు కూడా ఎన్నో అడ్డం- పొడవు ప్రకటనలు చేశారు. ఎక్కడపడితే అక్కడ ఓడరేవులు, విమానాశ్రయాలు కడతామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. నిజానికి ప్రజలెవ్వరూ అలాంటివి కోరుకోవడం లేదు. వాటి అవసరం కూడా లేదు.

తొలినాళ్లలో అర్ధరాత్రి వరకు అధికారులతో సమీక్షలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. దీంతో కాస్త తగ్గిన చంద్రబాబు, ఇప్పుడు టెలికాన్ఫరెన్స్‌లతో బోరు కొట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమయ పాలన పాటించకపోవడం చంద్రబాబులోని పెద్ద లోపం. మధ్యాహ్నం అనుకున్న సమావేశాలు రాత్రికి కూడా జరగని పరిస్థితి ఉంది. అధికారులను, ఇతరులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలే తప్ప ప్రయోజనం ఉండదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రజల్లో ఎన్నో ఊహలు, ఆశలు చిగురింపజేశారు. మూడేళ్లు పూర్తి అయినా నిర్మాణాలు మొదలు కాకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది.

నీడ కావాలనుకుంటే ఒక చెట్టు కూడా కనిపించని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించారు. అది చూసిన వారెవ్వరికైనా అసలు రాజధాని ఎప్పటికి నిర్మాణం జరగాలి? అన్న సందేహం తలెత్తక మానదు. శని, ఆదివారాలు వచ్చాయంటే ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోతోంది.

ముఖ్యమంత్రి పదేపదే చెప్పుకొంటున్నట్టు రాజధాని నిర్మాణం అనేది దేవుడు ఆయనకు ఇచ్చిన వరమే! మంచి రాజధానిని చంద్రబాబు నిర్మించగలరని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే ఆలస్యం అయ్యేకొద్దీ వారిలో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆ పరిస్థితి వచ్చేలోపే నిర్దిష్ట కార్యాచరణతో పనులు మొదలుపెట్టడం మంచిది.

ఇకపోతే అధికార పార్టీకి చెందిన వారితోపాటు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులలో కూడా అవినీతి విపరీతంగా ఉంటోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవల జరిపిన పలు దాడులలో దొరుకుతున్న వారి వద్ద లభిస్తున్న సంపద చూస్తే ఏపీలో ఇంత అవినీతి ఉందా? అన్న అనుమానం కలుగకుండా ఎలా ఉంటుంది?

అయితే తెలంగాణలో పది రూపాయలతో అయ్యే పనికి ఏపీలో వంద రూపాయలు వసూలు చేస్తారు. దీంతో ప్రజలు భరించలేని స్థితికి చేరుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మరింత కఠినంగా వ్యవహరించడం అవసరం.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయి జవాబుదారీతనం లోపిస్తోంది. ఉద్యోగులు, అధికారులతో స్నేహంగా ఉండటం వేరు. ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అనుమతించడం వేరు. ఈ తేడాను చంద్రబాబు గమనించాలి.

7 Comments

Filed under Uncategorized

7 responses to “బాబు మరింత మారాలి!

  1. Thappu ki Voppu ki theda theliyani Nippu
    Sadly some people do not spare even rape victims for Publicity ?
    Shame ……Shame.

    http://english.sakshi.com/news/2017/06/14/ap-cm-uploads-rape-victims-photo-on-twitter-removes-after-being-trolled

  2. Some act ….Others Live the character
    Reel Héroes.. ….Real Heroes

  3. RIP ….CNR guru

    Kula Mathalakanna Manavathvam mukhyam ani cheppina Kavi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s