ప్రభుత్వానికి చలి జ్వరం

ప్రభుత్వానికి చలి జ్వరం
-అమరావతిపై కృష్ణారావు ఏం వెల్లడిస్తారోనని ఆందోళన
రాజధాని ఎంపిక నుండి దానికి అవసరమైన కంపెనీల నియామకం వరకూ ఏ దేశంలో ఏమి జరిగిందనే అంశంపైనా కృష్ణారావుకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాజధానిలో జరిగిన అక్రమాలపై పుస్తకాన్ని ప్రచురిస్తానని చెప్పడంతో ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సింగపూర్‌ ప్రతినిధులతో జరిపిన చర్చలకు కృష్ణారావే సాక్షి. దీంతో ఆయన ఏం చెప్పినా అది సంచలనం అవడంతోపాటు, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. సింగపూర్‌ కన్సార్టియానికి ఏకపక్షంగా సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా అభివృద్ధిని అప్పగించడం వెనుక ఉన్న కుట్రనూ బయటపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధుల సమావేశం అనంతరం పిచ్చాపాటిగా ఆయన ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు రెండేళ్లపాటు ఆయనే సిఎస్‌గా ఉన్నారు.

జన్మభూమి కమిటీల వ్యవహారం, పింఛన్లు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, సంక్షేమ పథకాలు పదవుల కేటాయింపుల, ఉద్యోగుల మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహారం, దుబారా ఖర్చులు, సిఎం నివాసాల పేరుతో ఖర్చులు, అనవసరపు ప్రయాణాలు తదితర అంశాలన్నిటిపైనా కృష్ణారావు అసలు విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

అలాగే జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసాలనూ కృష్ణారావు వెల్లడించే అవకాశాలున్నాయి. దీంతో టిడిపి ప్రభుత్వానికి కృష్ణారావు ఫీవర్‌ పట్టుకుంది.

మరోవైపు కృష్ణా రావు తొలగింపు ఏకక్షంగా సాగిందని, ఒకే ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యేనైన తనతో మాట్లాడితే తప్పేంటని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రశ్నించారు. పేద బ్రాహ్మణులకు రుణాలు రాకుండా జన్మభూమి కమిటీల పేరుతో అడ్డుకుంటున్నారని, దీన్ని కృష్ణారావు ప్రశ్నించారని రఘుపతి తెలిపారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినం దుకు పదవి నుండి ఏకపక్షంగా తొలగించడంతోపాటు, పార్టీని అంటగడుతున్నారని, రెండేళ్లు సిఎస్‌గా పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని వైసిపి అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ప్రశ్నించారు.

ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడం ఎంతవరకు సమంజసమని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నూతన చైర్మన్‌గా నియమితులైన ఆనంద్‌ సూర్య ప్రశ్నించారు.ఈ వ్యవహారం మొత్తం ప్రభుత్వానికి చుట్టుకునే విధంగా ఉండటంతో ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1937719

15 Comments

Filed under Uncategorized

15 responses to “ప్రభుత్వానికి చలి జ్వరం

  1. Pedhavalla gundello cheragani mudhra ….Dr.YSR

  2. Human greed and its consequences …
    Building cities on agricultural lands and rivers.

  3. Real Héros and Reel héros

    • Some act and others live the character …

      Attempted murderer gets his daughter married to the son of the man who killed his father with stress…….reel Hero
      The Son who stood by the millions of people who loved his father, against all odds…..Real Hero

  4. For those who play TANA thandhana on foreign land …
    Beware …this is what you get.
    Racism and Fanatism are two sides of hatred.

  5. Aluperagani Praja poratam ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s