వ్యూహం – ప్రతి వ్యూహం

నంద్యాల ఉప ఎన్నికలకోసం బాబు చేయించుకున్న సర్వే లో వ్యతిరేకంగా వచ్చింది -ప్రజాశక్తి
[వ్యూహం – ప్రతి వ్యూహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నంద్యాల ఉపఎన్నికల వాతావరణం వచ్చాక రెండు పర్యాయాలు పర్యటించి నాలుగు రోజులు మకాం వేసి కార్యకర్తలకు దిశ దశ నిర్దేశం చేశారు. 14 మంది సీనియర్‌ ఎమ్మెల్యేలను, దాదాపు మంత్రులందరిని నం ద్యాలపై దృష్టి సారిం చారు.

ఉప ఎన్నికల నేపథ్యంలో సర్వే చేయించి మరీ టిడిపికి వ్యతిరేకంగా రిపోర్టు రావడంతో ఎలాగైనా నంద్యాల ఉప ఎన్నికల లో నెగ్గి 2019 ఎన్నికలకు వెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు నంద్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

నంద్యాలలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులకు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టారు.

పేదలకు 13వేల ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వీటితో పాటు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్‌ కార్డులను, పింఛన్లను మంజూరు చేయిస్తున్నారు.

ముఖ్యమంత్రే నాలుగు రోజులు నంద్యాలలో మకాం వేయగా ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహాన్‌రెడ్డి, భూమా అఖిలప్రియలు పర్యటిస్తూ టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.

నంద్యాల పట్టణంలో సామాజిక తరగతుల వారీగా ఓటర్లను ఆకట్టుకొనేందుకు నాయకులను రంగంలోకి దింపింది. చాలాకాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న టిడిపి సీనియర్‌ మైనార్టీ నాయకులు ఎస్‌ఎండి ఫరూక్‌ ఎంఎల్‌సి పదవి ఇచ్చారు. నౌమాన్‌ కాంగ్రెస్‌ నుంచి టిడిపిలోకి చేరి వారం తిరగకముందే ఉర్దూ అకాడమి ఛైర్మెన్‌ పదవిని కట్టబెట్టారు.

వైశ్యులను మచ్చిక చేసుకొనేందుకు టిజి వెంకటేష్‌ను, సోమిశెట్టి వెంకటేశ్వర్లును రంగంలోకి దింపింది.

గణనీయంగా ఉన్న కాపుల మద్దతును కూడగట్టేందుకు రూ.కోట్లతో కమ్యూనిటీ హాల్‌ కట్టేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.

వ్యాపారుల మద్దతు కూడగట్టేందుకు ఎంపి, ఎస్‌పివైరెడ్డిని, ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డిని రంగంలోకి దింపింది.

మొత్తంగా టిడిపి వార్డుకు నాయకుడు చొప్పున ఇన్‌ఛార్జిని నియమించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

అధికార పార్టీకి ధీటుగా వైసిపి కూడా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రముఖ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ టీం నంద్యాలలో మకాం వేసి వ్యూహాలకు పదును పెడుతోంది.
వార్డుల వారీగా, గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను తెప్పించుకొని వాటికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే వైసిపి తరుపున ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపిలు అవినాష్‌రెడ్డి, నితిన్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు నంద్యాలలో ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టారు.

వైసిపి కూడా వార్డుల వారీగా ఎమ్మెల్యేలను, సీనియర్‌ నాయకులను కేటాయించి తాము అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తామంటూ పెద్దఎత్తున ప్రచారాన్ని చేస్తున్నారు.

వైసిపి, టిడిపికి ధీటుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రచారంలో ముందుకెళుతోంది. ఇప్పటికే నంద్యాలలోని ఓటర్ల ఫోన్‌ నెంబర్లను తీసుకొని వాటికి వాట్సప్‌ను లింక్‌ చేసి సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాలను మొదలు పెట్టింది.]

2 Comments

Filed under Uncategorized

2 responses to “వ్యూహం – ప్రతి వ్యూహం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s