నంద్యాలలో బాబు మోసాలు

బాబు వరాల జల్లులతో నంద్యాల ఓటర్లను ముంచెత్తారు. ఆ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికే రు. 1,200 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. 15 వేల పక్కా గృహాలను మంజూరు చేశారు. రోడ్ల పనులు, పెన్షన్లు, డ్వాక్రా రుణాలు – ఇలా అన్ని రకాలుగా ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పూనుకున్నారు.

ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి రు. 1,200 కోట్లు ఖర్చు చేసినట్టుగానే రేపు రాష్ట్రం అంతటా ఖర్చు చేయాల్సి వస్తే 175 నియోజక వర్గాలకు గాను 2 లక్షల 10 వేల కోట్లు కావాలి. ఒక నియోజకవర్గానికి 15 వేల ఇళ్లు నిర్మిస్తే 175 నియోజకవర్గాలకు 26 లక్షల 25 వేల ఇల్లు నిర్మించాలి. ఇంటికో లక్ష చొప్పున లెక్క వేసుకున్నా అందుకు 26 వేల ,250 కోట్ల రూపాయలు కావాలి.

ఒక పక్కన కరువు సహాయం కోసం వెయ్యి కోట్లయినా మంజూరు చేయమని కేంద్రాన్ని ప్రాధేయ పడుతూ… ఇంకో పక్క అదే కరువు సీమలో ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలోనే రు. 1200 కోట్ల పనులు ప్రారంభించడం అంటే ప్రజల్ని మోసం చేయడం కాదా? రాజధాని నిర్మాణానికి నిధులు లేవు. పోలవరం నిర్వాసితులకు చెల్లించడానికి నిధులు లేవు. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి నిధులు లేవు అంటున్నారే? మరి ఎన్నికలొచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్థికమంత్రి ‘జిఎస్‌టి వల్ల రెండు వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి’ అని ఒక రోజు, ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయాలు ఆశించినట్టు లేవు’ అని ఇంకొక రోజు చెప్తున్నారు. దేనికోసం అడిగినా… బడ్జెట్‌ శాంక్షన్‌ లేదనో, ఆర్థికశాఖ ఆమోదం లేదనో సమాధానం నిత్యం వస్తోంది. మరి నంద్యాల అభివృద్ధి నిధులకు బడ్జెట్‌ శాంక్షన్‌ ఏది? హఠాత్తుగా రాష్ట్రానికి నిధుల వరద ఏమైనా వచ్చిందా?

రాష్ట్ర మంత్రి వర్గమంతా దాదాపుగా నంద్యాలలోనే తిష్టవేశారు. పలు విధాలుగా ఓటర్లను ఒత్తిడికి గురిచేస్తున్నారు. డబ్బు పంచి ప్రలోభ పెట్టడం సరేసరి. నోటిఫికేషన్‌ విడుదలకు ముందే డబ్బు పంపిణీ మొదలు పెట్టేశారు. ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి పూనుకున్నారు.

15 వేలకు పైగా ఓట్లను జనవరి తర్వాత చేర్పించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అంత పెద్ద ఎత్తున కొత్తగా ఓటర్లు చేరడం అసాధారణం. కచ్చితంగా ఇది తప్పుడు ప్రయత్నమే. అందుకే ఎన్నికల కమిషన్‌ ఆ 15 వేల ఓట్లనూ జాబితా నుండి తొలగించింది.

-ప్రజాశక్తి

19 Comments

Filed under Uncategorized

19 responses to “నంద్యాలలో బాబు మోసాలు

 1. Neethimalina Jathi …….Sigumalina panulu

  http://www.sakshi.com/news/andhra-pradesh/metro-sridharan-resigned-to-the-post-of-adviser-497540?pfrom=home-top-story

  Please use the Social Media to expose them to the rest of the world.

 2. Good bye BOLT ….The World will miss you LEGEND.

 3. Puli bidda appatiki ……..Puli Bidda
  This is how our Ethical journey began and we will continue to Fight wIth the same spirit.

  SUPPORT JAGAN…….SUPPORT YSRCP

 4. What you do to others comes back to haunt you …
  Chidambaram garu ….Do you remember sending the CBI after JAGAN because he did not listen to your Italian Madam ?
  By the way …JAGAN has wiped out the 120 yr old Cong from AP since then.
  And where are you hiding now ??

  http://www.ndtv.com/india-news/cbi-issues-lookout-notice-for-p-chidambarams-son-karti-he-moves-madras-high-court-1733533?pfrom=home-lateststories

 5. Aa Matham theesukunna chivaraku Dharmama gelusthundhi … YS JAGAN

  The ETHICAL BATTLE HAS STARTED.
  Every ethical Telugu person should be a part of it in whaterever way they can.
  Use SOCIAL MEDIA to expose the Yellow caste fanatics looting AP.

 6. Telugu prajalu Andhariki Manchi rojulu vasthunnai …
  Neethimalina kula picchi Gajji / Gaja dongalaki time deggara padindhi .

  Please use the SOCIAL MEDIA to expose the unethical Yellow media.
  THIS IS A BATTLE BETWEEN ETHICAL AND UNETHICAL VALUES IN POLITICS AND LIFE.
  SUPPORT JAGAN AND YSRCP.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s