పార్టీ ప్రక్షాళనకు భయమేల?

పార్టీ ప్రక్షాళనకు భయమేల బాబూ ? ఆంధ్రభూమి
అమరావతి, సెప్టెంబర్ 4: పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, తమ సొంత పార్టీ నేతలపై సాగిస్తున్న వేధింపులు చివరికి పార్టీ పుట్టిముంచే ప్రమాద దిశగా తీసుకువెళుతోందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీని ప్రక్షాళన చేయాలన్న తలంపు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను చూసి బాబు భయపడుతున్నారని, పార్టీ ఎమ్మెల్యేలకు అధినేత అంటే భయం పోవడానికి అదే కారణమని పార్టీ సీనియర్లు విశే్లషిస్తున్నారు.

దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేలపై విపరీతమైన ఆరోపణలున్నాయని, వీరిలో 30 శాతం మంది సొంత పార్టీ నాయకులనే వేధిస్తున్న పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు చంద్రబాబు, లోకేష్ వద్దకు వెళితే వినే సమయం ఎవరికీ ఉండటం లేదంటున్నారు.

ఇలాంటి సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేకపోతే, గత ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టి అభ్యర్థిని గెలిపించిన వాళ్లే రేపు అదే డబ్బుతో ఓడించడం సహజం. ఈ లాజిక్‌ను మా నాయకత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందో తెలియడం లేద’ని రాష్ట్ర పార్టీ నేత ఒకరు విస్మయం వ్యక్తం చేశారు

విశాఖ జిల్లాలో ఒక సీనియర్ మంత్రి అల్లుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటే, దాన్ని మరో మంత్రి కుమారుడు అడ్డుకుని, సెటిల్‌మెంట్ చేసుకుంటే తప్ప ప్రారంభించలేని దుస్థితిలో ఉంటే, ఇక ద్వితీయ శ్రేణి నేతల సంగతి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటున్నారు.

ప్రకాశం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే తీరుపై మండల, గ్రామ స్థాయి నేతలు విరుచుకుపడుతున్నారు. సదరు ఎమ్మెల్యేకి ఉన్న గ్రావెల్ క్వారీ తప్ప, పార్టీకి చెందిన వారి క్వారీలన్నీ గత మూడున్నరేళ్లుగా మూతపడి ఉన్నాయని, జిల్లా మైనింగ్ అధికారులు కూడా ఎమ్మెల్యే అనుమతి ఇవ్వమని చెబితే తప్ప ఇవ్వలేమని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు నియోజకవర్గ నేతలు రాష్ట్ర కార్యాలయానికి రాగా, ఆ ఎమ్మెల్యేకి ఎవరు చెప్పినా వినరని నిస్సహాయత వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకువచ్చిన ఒక మాజీ సర్పంచిని, ఇదే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, కేబుల్ వ్యవహారంలో వేధింపులకు గురిచేస్తూ ప్రత్యర్థిని ప్రోత్సహించిన వైనాన్ని మంత్రి, పార్లమెంటు ఇన్చార్జి పరిటాల సునీతకు తాజాగా ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలైనా కప్పం కడితే తప్ప పనులయ్యే పరిస్థితి లేదని, వచ్చే సారి గెలుస్తామో లేదో, టికెట్ ఇస్తారో లేదోనన్న ముందుచూపుతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

‘ఇప్పుడు ఇదే సిట్టింగు ఎమ్మెల్యేలతోనే ఎన్నికలకు వెళితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రేపు మా పార్టీలో ఈ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్న నాయకులే వాళ్లను ఓడించడం ఖాయమ’ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత విశే్లషించారు.

ఎమ్మెల్యేలపై తాము ఫిర్యాదు చేసేందుకు వెళుతుంటే బాబు, లోకేష్ సమయం ఇవ్వడం లేదని, జిల్లా ఇన్చార్జిలు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేస్తుంటే వినేందుకే భయపడుతున్నారని, పార్టీ కార్యాలయ నేతలేమో చేతులెత్తేస్తుంటే ఇక తాము మీడియాకే చెప్పుకోవలసి వస్తోందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప, గెలుపులో కీలకపాత్ర పోషించే మండల నాయకులను దగ్గరకు రానీయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రులు బాబు తమనేమీ చేయలేరని, తమను మార్చే ధైర్యం చేయరన్న ధీమాతో ఉన్నారంటే నాయకత్వం బలహీనంగా ఉందన్న సంకేతాలు వెళుతున్నాయంటున్నారు. ఈ పరిస్థితిని మారిస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

28 Comments

Filed under Uncategorized

28 responses to “పార్టీ ప్రక్షాళనకు భయమేల?

  • Rishi Kapoor ✔ @chintskap
   So don’t bullshit people on “Dynasty” You have to earn people’s respect and love through hard work not zabardasti and gundagardi.
   5:42 PM – Sep 12, 2017
   301 301 Replies 1,235 1,235 Retweets 3,459 3,459 likes

 1. @ Chiddu garu …

  Dongalu antha mee family lo pettukoni ..Italy Madam cheppindhi ani
  YS Family ni badha petti nandhuku Devudu siksha ?

  http://www.sakshi.com/news/national/karti-owns-25-properties-abroad-506376?pfrom=home-latest-story

  You reap what you sow .

 2. Akkada vunna …Manasantha nuvva Babu ?

  Use Socia Media …Expose these caste fanatics ..SAVE AP before it rots.

  http://www.sakshi.com/news/andhra-pradesh/lagadapati-rajgopal-met-chandrababu-naidu-506432?pfrom=home-top-story

 3. Dabbulatho …Bedhirimpulatho votes konavadu nayakudu kadu kaledu …
  Pajala madhya Putti Perigi vari kosam Poradavadu ..PRAJA NAYAKUDU

  http://www.sakshi.com/news/vedika/samanya-kiran-on-ysrcp-fighting-spirit-506331?pfrom=home-election-top-story

 4. Some people restore faith in Humanity …
  None of the organ receivers belonged to her community .

  http://www.bbc.co.uk/news/health-41187008

 5. Babu vastha Job vasthundhi ani mosa poyana students
  Sadly ……Pakka Rastraniki poyi thannulu thinalsi vasthundhi ?

  http://www.sakshi.com/news/andhra-pradesh/local-candidates-fuss-during-the-karnataka-banking-exam-505834?pfrom=home-top-story

 6. One IT minister gets an an award …neighbouring IT minister is busy with crook politics to buy votes and MLA’s
  One IT minister seem to help everyone …neighbouring IT minister seem to be a caste fanatic who throws biscuits at others and distributes the cake for his community
  One IT minister come into politics through the front door …the other from the back door
  One IT minister loves Social media …the other hates Social media

  Well done KTR . Thanks for kicking out the yellow caste fanatics from Telangana politics (beware -there is one from Khammam who still works for KDP ).

  http://www.sakshi.com/news/telangana/ktr-receives-it-minister-of-the-year-award-505667?pfrom=home-latest-story

 7. For those narrow minded caste fanatics living in foreign land …
  If you can’t love your own people then you can’t really complaint about racism .

 8. Hope the learners from this Driving school don’t run over poor people sleeping on the pavement ?
  Wearing Being Human T shirt might not mean that we really are .

  http://www.ndtv.com/entertainment/the-irony-of-salman-khan-inaugurating-a-driving-school-hasnt-been-lost-on-twitter-1747565?pfrom=home-topstories

 9. BJP Kanduva …… KDP gajji

  Telusukuntunna Modi and Amit Shah ?
  90 % Telugu Prajalu appudu
  telusukuntaro ??

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2984:2017-09-07-15-13-27&Itemid=665

 10. Kondharu kastapadina jobs ravu …
  Mari kondharu kastpadakundana Kamma ga Kotlu dochukuntaru ?
  Rajyaniki Raju Donga aitha ? Inka Rajyam ??
  GOD SAVE AP.

  http://www.sakshi.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-cheating-in-ap-people-505296?pfrom=home-top-story

 11. Veera

  జ్యోతి MD రాధాకృష్ణ పలుకు
  ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి బాగా పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు విస్తృతంగా జరిగింది. ఎంతలా అంటే చంద్రబాబుకు తన పరిస్థితిపై తనకే అపనమ్మకం ఏర్పడేలా ఈ ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రముఖ దర్శకుడు(Read తమ్మారెడ్డి భరద్వాజ చౌదరి) ఏబీఎన్‌ స్టూడియోకు వచ్చారు. ప్రోగ్రాం అయిన తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతూ ‘ఏపీలో చంద్రబాబు పరిస్థితి అంత బాగా లేదంట కదా!’ అని ప్రశ్నించారు. ‘

  అలా ఏమీ లేదే- అయినా తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని మీకు ఎవరు చెప్పారు?’ అని నేను ప్రశ్నించగా, ‘మీరు ఒక్కరే చంద్రబాబుకు ఢోకా లేదంటున్నారు గానీ నన్ను కలిసిన తెలుగుదేశం నాయకులు గానీ, విజయవాడకు చెందినవారు గానీ పరిస్థితి బాగా లేదనే చెబుతున్నారు’ అని సదరు దర్శకుడు చెప్పుకొచ్చారు.

  దీన్నిబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షానికి చెందిన నాయకులు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్పష్టమవుతోంది

  ముందుగా TDP పార్టీ శాసనసభ్యులను కట్టడి చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యులు, మంత్రులలో సగం మందికి పైగా బరి తెగించారు. ఆయా నియోజకవర్గాలలో గాలి పీల్చుకోవాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలకు మేలు చేద్దామని ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే అందులో కూడా బొక్కుతున్నారు. మంత్రులలో బాధ్యతారాహిత్యం పెరిగిపోయింది.

  ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వారికి ఫ్యాషన్‌గా మారిపోయింది. పార్టీపైన, ప్రభుత్వంపైన చంద్రబాబు పట్టు కోల్పోయారన్న అభిప్రాయం కూడా బలంగా ఏర్పడింది.

  ప్రభుత్వ యంత్రాంగంలో రెడ్‌ టేపిజం పెరిగిపోయింది. లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఉంది.

  చంద్రబాబు కూడా తన సమయాన్ని అంతా అధికారిక సమీక్షలకే కేటాయిస్తూ, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది. పార్టీ కార్యకర్తలకు సాంత్వన చేకూర్చేవారే కరువయ్యారు. పోలీసు శాఖను కూడా ప్రక్షాళన చేయాలి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులలో అలసత్వం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి బాగా కష్టపడుతున్నారన్న సానుభూతి ప్రజలలో ఉంది గానీ, ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదన్న అభిప్రాయం మాత్రం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది చివరిలోనే జరుగుతాయని అంటున్నారు కనుక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లపై దృష్టి సారించడం అవసరం. సమష్టి కృషి ఉంటేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ప్రభుత్వ విషయంలో గానీ, పార్టీ విషయంలో గానీ ఇందుకు మినహాయింపు ఉండదు. ప్రభుత్వ అధికారులు ఎన్నికలలో ఓట్లు వేయించరు. అలాగే పార్టీ శ్రేణులు గుడ్‌ గవర్నెన్స్‌కు ఉపయోగపడరు. ఈ రెండు విభాగాలను సమన్వయం చేసుకుని ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాలి.

  Source-ఏపీలో అదీ సంగతి! అయితే…(జ్యోతి, 03-09-2017)

  Note: నాకో డౌటు రాదక్రిష్ణా, శ్రీమాన్ నిప్పు బాబు గారేమో నంద్యాల లో వీధి లైట్ లు వెలుగుతున్నాయో లేదో కూడా చూడగలను అన్నాడు కదా మరి MLA లు మంత్రులు ఇంత తింటుంటే ఆయనకు తెలీదంటారా?
  లేకపోతె 30% అందుతుంది కదా అని ఊరికే ఉన్నారా?

 12. Veera

  నంద్యాల గెలుపు డబ్బుతో మోసం తో వచ్చింది అని చెప్పకనే చెప్పిన ఆంధ్ర జ్యోతి
  YCP ని ఓడించ‌టం కోసం MLAల‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుండి ఏం చెప్పిందీ..MLAలు ఎలా వ్య‌వ‌హ‌రించిందీ..ఖ‌ర్చు విష‌యంలోనూ MLAల మ‌ధ్య ఏ ర‌కంగా పోటీ వాతావ‌ర‌ణం సృష్టించిందీ…గెలిచిన త‌రువాత అధికార పార్టీ MLAల‌కు ఏ ర‌కంగా ..ఎక్క‌డ విందుల‌ను ఏర్పాటు చేసిందీ…త‌న క‌ధ‌నంలో స్ప‌ష్టంగా వివ‌రించింది ఆంధ్ర‌జ్యోతి. మ‌రి..అధికార పార్టీ నంద్యాల గెలుపు నిజ‌మైన గెలుపేన‌ని..ప్ర‌జా విజ‌య‌మ‌ని ఇంకా ప్ర‌జ‌ల మ‌ధ్య దైర్యంగా చెప్పుకోగ‌ల‌రా…

  నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని YCP బ‌లంగా ఉన్న గోస్పాడు మండ‌లంలో అధికార పార్టీ ఎవ‌రెవ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించిందీ..ఎంత మొత్తంలో ఖ‌ర్చు చేయాలో ఎలాంటి సూచ‌న‌లు చేసిందీ స‌వివ‌రంగా వివ‌రించింది. TDP MLAలు ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్‌..చీరాల నుండి గెలిచి TDPలో చేరిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు గోస్సాడు మండలంలోని గ్రామాల బాధ్య‌త‌ల‌ను పార్టీ అప్ప‌గించింది. వీరికి ఇన్‌ఛార్జ్‌గా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి అక్క‌డ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను కేటాయించింది. అయితే, వీరికి గెలుపు కోసం పార్టీ ఆఫీసు నుండి ఎలాంటి ఆదేశాలు వ‌చ్చాయో..ఈ క‌ధ‌నంలో స్ప‌ష్టం చేసింది.

  గోస్పాడు మండ‌లంలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త‌న 40 మంది కీల‌క అనుచ‌రుల‌తో పార్టీ గెలుపు బాధ్య‌త‌లు స్వీకరించారు. ఎన్నిక స‌మ‌యంలో పార్టీ కేంద్ర కార్యాల‌యం నుండి గోస్పాడు లో ఖ‌ర్చు గురించి ఫోన్ వ‌చ్చిందంటూ జ‌రిగిన సంభాష‌ణ రాసారు. మీ ప‌ని తీరు బాగుంది. కానీ, డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌టం లేదు. ఆ విష‌యంలో వెనుక‌డుగు వేయ‌కుండా ముందుకు వెళ్లండి అంటూ అదేశాలు వ‌చ్చాయ‌ని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లోనే స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఇక‌, స‌హ‌చ‌ర MLA ఇప్ప‌టికే 1.25 కోట్లు ఖ‌ర్చు చేస్తే..మీరు ఇంకా 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసార‌ని..డ‌బ్బు విష‌యంలో వెనక్కు త‌గ్గ‌వ‌ద్ద‌ని సూచించిన‌ట్లు ఆంధ్ర‌జ్యోతి క‌ధ‌నంలో స్ప‌ష్టంగా పేర్కొంది. ఇక‌, ఫ‌లితం రాగానే..ముఖ్య‌మంత్రి త‌ర‌పున మిమ‌ల్ని అభినందిస్తున్నామంటూ ఆయ‌న‌కు MLC జ‌నార్ద‌న్ ఫోన్ చేసార‌ని..YCPకి కీల‌క‌మైన గోస్పాడు లో గెలిపించిన మీకు ..మీ అనుచ‌రుల‌కు విందు ఏర్పాటు చేసామ‌ని..క్రియాశీల‌కంగా ప‌ని చేసిన అనుచ‌రుల‌తో గోవా వెళ్లేందుకు నిర్ణ‌యించామ‌ని వివ‌రించిన‌ట్లు ఆంధ్ర‌జ్యోతి క‌ధ‌నంలో స్ప‌ష్టం చేసారు.

  ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికే TDP చేసిన ఖ‌ర్చు గురించి.. ఇంత వివ‌రంగా పేర్కొంటే..ఇదే స‌మ‌యంలో..మ‌రి నంద్యాల బాధ్య‌త‌లు పంచుకున్న మిగిలిన మంత్రులు-MLA లు ఏ ర‌కంగా టార్గెట్ల వారీగా ఖ‌ర్చు చేసారో..ఎలా వ్య‌వ‌హ‌రించారో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి..నంద్యాల విజ‌యం వెనుక అస‌లు క‌ధ‌ను ఆంధ్ర‌జ్యోతి బ‌ట‌య పెట్ట‌టంతో ఇప్పుడు అధికార పార్టీ నంద్యాల విజ‌యం పై ప్ర‌చారాన్ని త‌గ్గించిన‌ట్లు క‌నిపిస్తోంది.

 13. Veera

  Conquering the opponent, winning the war-Hans India(HMTV)
  High voter turnout and the edge that Brahmananda enjoyed across the constituency, barring a few pockets here and there, indicated a clear wave in his favour. It is unlikely that the wave was in favour of Naidu’s rule because there are no tell-tale signals that suggest that his government has done exceptionally well so as to warrant a positive wave. Of course, it is not to say that there was no contribution from Naidu in the win.

  TDP’s victory in Nandyal is largely due to a sympathy wave for the Bhuma family. On his part, Jagan did employ aggressive tactics to blunt the ruling party’s virulent diatribe and sympathy wave, but eventually he could only reduce the margin. The gap (27,466 votes) between Brahmananda Reddy and YSRCP’s Silpa Mohan Reddy is huge. Taken from the other side, Jagan’s nominee polled just 12,500 votes less than the 82,194 secured when Bhuma Nagi Reddy contested on its ticket in 2014, which implies that there has been no substantial erosion in YSRCP’s core base. This factor ought to worry the TDP strategists, next time around.

  Contrary to the perceptions of Naidu and his poll managers, it’s the sympathy wave that did the trick for TDP. Otherwise, YSRCP would have won more than one counting round. Nandyal by-poll has once again proved that 2019 would be a straight battle between the two leaders with no chance whatsoever of a third player popping into the sweepstakes.

 14. Veera

  ఓట్ల కొనుగోలు కంపెనీ సిఈవో చంద్రబాబు! డాక్టర్‌ కత్తి పద్మారావు
  తెలుగుదేశం పార్టీ నంద్యాలలోను, కాకినాడ లోను ఎన్నికల్లో గెలవడంతో చంద్రబాబు ముఖం కళకళలాడుతోంది. కానీ ప్రజాస్వామ్యం సిగ్గుపడింది. నిజానికి ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధమైన ప్రేరణ లేకుండా తమకు ఇష్టం వచ్చినవాళ్ళని ఎన్నుకోవడం.

  ఓటు కొనడంలో, ఓటర్లను ప్రభావితం చేసే అబద్ధపు ప్రకటనలు ఇవ్వడంలో తనకు తానే సాటి అని చంద్రబాబు నాయుడు నిరూపించు కున్నారు. ఎలక్షన్‌కు అర్థాన్ని మార్చేశారు.

  భూమా నాగిరెడ్డి మొదట వై.ఎస్‌.ఆర్‌.సి.పిలో గెలిచారు. తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఆయన మరణానంతరం ఆయన కుమార్తెకు, వారసుడికి సీట్లు ఇప్పించి ఆ సెంటిమెంట్‌ను కూడా వాడుకున్నారు.

  చంద్రబాబు తన మంత్రులు అందరినీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, ప్రతి మండలానికి డబ్బులు పంచే బ్రోకర్లుగా వినియోగించారు. నంద్యాల, కాకినాడలలో మద్యం ఏరులై పారింది.

  ప్రజలు కూడా ‘గెలిచి వీళ్ళు ఏం చేయటం లేదు. ఎలక్షన్‌ అప్పుడే డబ్బు తీసుకుందా’మనే భావనకు వచ్చారు. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు చర్చిల అభివృద్ధికి అని, మసీదుల అభివృద్ధికి అని సంఘాలు సంఘాలుగా డబ్బులు తీసుకుంటున్నారు. వ్యక్తులుగా కూడా డబ్బులు తీసుకుంటున్నారు.

  ఇదివరకు కింద కులాల్లో పేదవాళ్ళే డబ్బు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఓటరు డబ్బు తీసుకుంటున్నారు.

  డివిజన్లకు డబ్బులు పంచేవాళ్ళే రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. మరీ ముఖ్యంగా రౌడీషీటర్లను జైళ్ళ నుంచి తీసుకువచ్చి బూత్‌ కాప్చర్‌ టీములుగా ముందే తయారు చేస్తున్నారు. రౌడీలకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్తున్నారు. ఫ్యాక్షనిజాన్ని అంతర్గతంగా పోషిస్తున్నారు.

  క్రైస్తవులు తమ చర్చీల కోసమని డబ్బు యాచించి … ఏసుక్రీస్తు చెప్పిన సిద్ధాంతాలను విడనాడి మతాన్ని రాజకీయాలకు తాకట్టు పెడుతున్నారు. అంబేద్కర్‌ విగ్రహాలు వేయటం కోసమని అంబేద్కర్‌ యువజన సంఘాలు రాజకీయ నాయకుల దగ్గర డబ్బు అడుక్కుంటున్నారు. దళిత దళారులు అనేక పదవులు పొంది దళిత వాడల్లో తిరిగి సబ్‌ ప్లాన్‌ నిధులను దళితులకు వాడని చంద్రబాబును గెలిపించటానికి కృషి చేస్తున్నారు. ఓటు ఒక వ్యక్తిగా, ఒక సంస్థగా అమ్ముడుపోవడం ప్రారంభించింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s