అవినీతిపై అరుపులే

అవినీతిపై అరుపులే! ప్రజాశక్తి , Sep 29,2017
టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రఘు ఆయన బినామీల వద్ద ఇప్పటికైతే కనుగొన్న ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైమాటేనని ఎసిబి అధికారులు చెపుతున్నారు. ఒక టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ (డిటిసిపి), తన వద్ద పని చేసే జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌… ఇద్దరూ కలిసి ఇన్ని వందల కోట్ల అవినీతి సొమ్ము పోగేయడం సాధ్యమేనా అనే సందేహాలు కలగక మానవు. ఒక ఐఎఎస్‌ అధికారి అండతో రఘు చెలరేగిపోయారన్న అరోపణలు ఒక ఎత్తయితే ఈ మూడేళ్లల్లోనే ఆయన, ఆయన బినామీల ఆస్తులు వృద్ధి అయ్యాయని ఎసిబి గుర్తించింది. అంటే నవ్యాంధ్రలో చంద్రబాబు అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు టముకు వేసుకుంటున్న సమయంలోనే సదరు అధికారి అవినీతి అప్రతిహతంగా సాగింది.

మున్సిపల్‌ శాఖలో చీమ చిటుక్కుమన్నా ఆ శాఖ మంత్రి నారాయణకు ఇట్టే తెలిసిపోతుందన్నది ప్రభుత్వవర్గాల్లో నానుడి. ఒకరికి రావాల్సిన డిటిసిపి పోస్టును అవినీతి సామ్రాట్టు రఘు దక్కించుకున్నారంటే మంత్రికి తెలీదని ఎలా అనుకోవాలి?

ముఖ్యమంత్రి నేతృత్వంలో సిఆర్‌డిఎ నడుస్తోంది. వారానికోసారి సిఎం సమీక్షిస్తున్నారు. సిఆర్‌డిఎలో లే అవుట్లు సహా ఎన్నో అనుమతులకు రఘు భారీగా ముడుపులు వసూలు చేశారు. సిఆర్‌డిఎ వారాంతపు సమీక్షల్లో ఈ వ్యవహారాలు చంద్రబాబు దృష్టికి రాలేదా? వచ్చినా పట్టించుకోలేదా?

ఈ నెలాఖరుకు రిటైరవుతున్న రఘు తన శాఖలో 54 మందికి పదోన్నతులు కల్పించి భారీగా వసూళ్లు చేశారు. ఈ విషయం మున్సిల్‌ మంత్రికి అస్సలు తెలియకపోవడమేంటి? ఇంతకాలం చూస్తూ ఊరుకొని రేపోమాపో రిటైరవుతున్న రఘుపై ఎబిసి దాడులు చేయడంపై అనుమానాలు కలగడం కద్దు.

పంపకాల్లో తేడా వస్తేనో, ‘పెద్దల’ మాట వినకపోతేనో రఘు వంటి వారి అవినీతి పుట్ట పగులుతోంది. లేకపోతే ఎంచక్కా రాచమార్గంలో అక్రమాలు సాగిపోతాయి.

అవినీతిని ఉపేక్షించనంటున్న చంద్రబాబు జమానాలోనే ప్రాజెక్టుల్లో రాత్రికిరాత్రి అంచనాలు పెరుగుతున్నాయి. ఇసుక, మట్టి దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పలువురు మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు అందివచ్చినకాడికి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. సర్కారీ పెద్దలే అవినీతిలో నిండా మునిగాక సిబ్బంది ఊరుకుంటారా? ఇద్దరూ జమిలిగా లంచాలు మేస్తున్నారు. వీరి చెలిమితో ఎసిబి వంటివి పెట్టిన నామమాత్రపు కేసులు నీరుగారిపోతున్నాయి. నింతులకు శిక్షలు చాలా అరుదు. పైగా ప్రభుత్వమే ఎసిబి, విజిలెన్స్‌ ఎంక్వయిరీలను మూసేసి అవినీతి పరులకు మద్దతిస్తోంది.

8 Comments

Filed under Uncategorized

8 responses to “అవినీతిపై అరుపులే

 1. Aluperagani Praja Poratam …..
  With No compromise on Ethical values.
  Seen Never before in Indian politics
  An Inspiration for generations to come .

  https://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-non-stop-fight-special-status-and-partition-act-guarantees-ap-942051

 2. Kula Mathalaku Athitham ga ….
  Viluvalu Viswasaneeyatha tho …..
  Telugu Prajalu andhariki Manchi jarige rojulu deggara paddayi .

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=3031:2017-10-06-07-27-28&Itemid=665

 3. Abba nee theeyani debba ….Antha Kamma ga vundhi royi abba ?
  Reel Héros …………Real Villains ?

 4. Antha kula picchi vuunantha mathrana ?
  AP rajadhani oka cinema set ala avuthdundhi ??

  Please use the Social media to expose these unethical fanatics .

  https://m.sakshi.com/news/andhra-pradesh/director-boyapati-srinu-meets-cm-chandra-babu-940814

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s