భాగస్వామ్య ప్రహసనం-ప్రజాశక్తి

విశాఖలో భారీ హంగులు, ఆర్భాటాల మధ్య మూడు రోజుల పాటు సాగిన భాగస్వామ్య సదస్సు పిసి సర్కార్‌ మ్యాజిక్‌ షోను తలపించింది. వందల్లో అవగాహనా ఒప్పందాలు, లక్షల కోట్లలో పెట్టుబడులు, ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనల హోరు, వాటినే పరమ సత్యాలుగా ప్రచార బాకాలు మోత మోగించిన తీరు చూస్తే పెట్టుబడులు సునామీలా వచ్చి పడబోతున్నాయని, ఇక నిరుద్యోగ సమస్య అనేదే వుండదనేంతగా ప్రచారం సాగింది.

ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందితే సంతోషించనివారెవరుంటారు. విభజన తరువాత రాష్ట్రం వ్యవసాయ, పారిశ్రామిక, సేవలు తదితర రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందాలని, అందరికీ ఉపాధి దొరకాలనేదే అయిదు కోట్ల మంది ఆంధ్ర పజల ప్రగాఢ ఆకాంక్ష. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే ఎవరూ ఆక్షేపించాల్సిన పని లేదు.

కానీ విశాఖ భాగస్వామ్య సదస్సులో గతంలో మాదిరిగానే పాత ప్రతిపాదనలకే కొత్త ఎంఒయు ముసుగులేయడం, రాని పెట్టుబడులను వచ్చినట్లు, లేని ఉద్యోగాలు కల్పించేసినట్లు భ్రమలు కల్పించడమే అభ్యంతరకరం.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యు ఇఎఫ్‌) తరహాలో సిఐఐతో కలిసి మన రాష్ట్రంలో ప్రతి ఏటా ఇటువంటి సదస్సులు నిర్వహించి పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇందుకోసం విశాఖలో ఓ బ్రహ్మాండమైన అంతర్జాతీయ సమావేశ కేంద్రం, అయిదు నక్షత్రాల హోటల్‌, షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు దుబాయికి చెందిన లూలూ గ్రూపు సంస్థతో ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. విలాసవంతమైన సమావేశ మందిరాలు, ఖరీదైన హోటళ్లు, భారీ షాపింగ్‌ మాల్స్‌ కడితే పెట్టుబడిదారులు ఆంధ్ర ప్రదేశ్‌కు క్యూ కడతారనేది భ్రమ.

విశాఖలో గత మూడేళ్లలో ఈ భాగస్వామ్య సదస్సుల కోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు వెచ్చించి అనేక హంగులు, ఆర్బాటాలు చేసినా, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, ఉన్నతాధికారుల బృందం విదేశీ యాత్రలు, రోడ్‌ షోలు ఎన్ని నిర్వహించినా పెట్టుబడులు వచ్చింది చాలా తక్కువ.

పెట్టుబడికి కావాల్సింది లాభం. ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందనుకుంటే అక్కడికి అది పరుగులు తీస్తుంది. పెట్టుబడి స్వభావమే అంత. అంతేకాదు పెట్టుబడులు రావడంతోనే ఉపాధి దానంతటది పెరుగుతుందనుకోవడం కూడా పొరపాటు. ఆ పెట్టుబడులు ఏ రంగంలో వస్తున్నాయన్నది కూడా ముఖ్యం. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఉపాధి రహిత అభివృద్ధి అనేది ఒక పెద్ద సమస్యగా ముందుకొస్తున్నది. ఆధునిక టెక్నాటజీతో వస్తున్న పెట్టుబడులు కొత్త ఉద్యాగాలిస్తున్నది చాలా తక్కువ కానీ స్థానిక ప్రజల జీవనోపాధిని పెద్ద ఎత్తున దెబ్బ తీస్తున్నాయి. దాంతో మొత్తంగా ఈ పెట్టుబడుల వల్ల నిరుద్యోగం పెరుగుతున్నదే గానీ తగ్గం లేదు.

మరో ఏడాదిలో రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలకు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. తాజా భాగస్వామ్య సదస్సు వల్ల 4లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నట్లు, దీనివల్ల పదకొండు లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నట్లు త్రీడీ చిత్రం చూపిస్తున్నారు.

ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెంచేందుకు కృషి చేయకుండా, కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి పూర్తి పన్ను రాయితీ కల్పించే ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా భాగస్వామ్య సదస్సుల పేరుతో 2016లో 4.76 లక్షల కోట్లు, 2017లో 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ప్రభుత్వం చూపే లెక్కలన్నీ కాగితాలపై బాగానే కనిపిస్తున్నా, వాటిలో కార్య రూపం దాల్చినవి చాలా తక్కువ.

1991-2014 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ సంస్థలతో 8,96,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటిలో 4.67 శాతం మాత్రమే ఆచరణ రూపం దాల్చాయి.

సిఐఐ భాగస్వామ్య సదస్సులు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అక్కడ పాల్గొన్న పెట్టుబడిదారులే ఇక్కడా పాల్గొంటారు. ఒకే విధమైన వ్యాపార అంశంపై విభిన్న ఎంఓయులను కుదుర్చుకుంటారు. ఇది నిత్యం జరుగుతున్న తంతు. విశాఖలోనూ అదే పునరావృతం అయింది.

మరోవైపు రాని పరిశ్రమలను సాకుగా చూపి ప్రభుత్వం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోంది. ఏళ్లు గడిచినా పరిశ్రమ రాదు. భూములు, రాయితీలు, బ్యాంకు రుణాలు మాత్రం కార్పొరేట్‌ సంస్థలకు దక్కుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేవలం పెట్టుబడులపై ఆధారపడితే చాలదు. ప్రజల వద్ద కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలి.

మరోవైపు రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అభిస్తే కొంతమేరకైనా పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తాయి. ఈ దిశగా కృషి చేయకుండా ప్రచారార్భాటంతో ప్రజలను వంచించబూనుకోవడం క్షంతవ్యం కాదు.

http://www.prajasakti.com/Article/Sampaadkeyam/2014248

12 Comments

Filed under Uncategorized

12 responses to “భాగస్వామ్య ప్రహసనం-ప్రజాశక్తి

 1. Padayatra in Podili ….

 2. Veera

  40 ఏళ్ల ‘బాబు’ చరిత్రంతా నీచమే-భూమన కరుణాకర్‌రెడ్డి
  [డబ్బులుండి కూడా స్నేహితుడి జేబులో రూ.2 దొంగిలించాడు
  పార్టీ ఇచ్చిన పెట్రోల్‌ను అమ్మేసుకున్నాడు .
  నిజంగా చంద్రబాబు మూలాలు ఎలాంటివో నాకు తెలుసు. ఆయన కంటే నేను నాలుగైదేళ్లు చిన్నవాడిని.
  నేను కూడా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నా. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో ఆర్‌ఎస్‌యూ ప్రారంభమైంది. ప్రారంభ సభ్యుల్లో నేనూ ఒకడిని. ఆర్‌ఎస్‌యూ నడపడానికి 1974 డిసెంబర్‌ 8న మేము ఒక సినిమాను బెనిఫిట్‌ షోగా ప్రదర్శించేందుకు టికెట్లను రూ.2 ధర చొప్పున విక్రయించాం. ఇదే సమయంలో ఎ–బ్లాకులో ఉంటున్న చంద్రబాబు గదికి వెళ్లి టికెట్‌ కొనాలని కోరితే ఆయన వద్ద డబ్బులుండి కూడా ఇవ్వడానికి మనస్కరించలేదు.

  అలాగని లేదని చెప్పే ధైర్యం లేకపోయింది. అదే గదిలో నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో నుంచి రూ.2 దొంగిలించి నా చేతికి ఇచ్చారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు పునాది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు

  అలాగే 1977లో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. చిత్తూరు స్థానానికి రాజగోపాల్‌నాయుడు ఎన్నికల్లో నిలబడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. చంద్రబాబే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. జీపు ఇచ్చి 200 లీటర్ల పెట్రోల్‌ను బ్యారెల్‌ నిండా నింపి, చంద్రగిరి నియోజకవర్గమంతా తిరిగి రమ్మని చెబితే మరుసటి రోజు ఉదయమే అన్నా పెట్రోల్‌ మొత్తం అయిపోయిందని చెప్పాడట చంద్రబాబు. ఈ పెట్రోల్‌ను కాంగ్రెస్‌ పార్టీ నేత వీరరాఘవులు నాయుడికి చెందిన బంకులో అమ్మేశాడట! ఈ విషయాన్ని స్వయంగా వీరరాఘవులునాయుడే నాకు చెప్పాడు. చంద్రబాబు మూలాలు ఇంత నీచంగా ఉంటే నీతి నిజాయితీకి పునాదిలా ఉన్నాడంటూ పతాక శీర్షికలతో రాయడం బాధాకరం.

  వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తానే ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించానని చంద్రబాబు చెప్పాడు. వాస్తవం ఏమిటంటే మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబుకు స్థానం కల్పించేలా రాజశేఖరరెడ్డి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పదవి ఇప్పించారు. ఇలాంటి చంద్రబాబా.. రాజశేఖరరెడ్డికి టికెట్‌ ఇప్పించేది? ఎవరైనా వింటే నవ్విపోతారు.

  -భూమన కరుణాకర్‌రెడ్డి, సాక్షి

 3. Veera

  అన్నం వండి ఆర్సెనిక్‌ వార్చేయండి!
  (వరి బియ్యాన్ని ఆరు రెట్లు ఎక్కువ నీరు పోసి ఉడికించి… గంజి వార్చి పారబోస్తే అన్నంలోని ఆర్సెనిక్‌ చాలా వరకు పోతుంది.

  కొర్రలు వంటి చిరుధాన్యాలు థయామిన్‌ అధికపాళ్లలో కలిగి ఉంటాయి గాకీ ఆర్సెనిక్‌ను ఏమాత్రం కలిగి ఉండవు

  బంగాళదుంప చిప్స్‌లో ఆర్సెనిక్‌ విషం పాళ్లు ఎక్కువగా ఉంటాయి.
  బంగాళదుంపను కోసి బాగా కడిగితే ఆర్సెనిక్‌ పోతుంది.
  కడగకుండా అలాగే వేపితే ఆర్సెనిక్‌ అందులోనే ఉండిపోతుంది.
  -నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఓ. జి. బి. నంబియార్‌, సాక్షి పత్రిక )

  వరి అన్నంలో ఆర్సెనిక్‌ విషం ఉంటుందంటున్న నిపుణులు
  రసాయనిక ఎరువుల, పురుగుమందుల విస్తృత ఉపయోగంతో మనం తినే వరి అన్నం, బంగాళదుంపలు తదితర ఆహార పదార్థాల్లోకి విషం… అందునా ప్రమాదకరమైన ఆర్సెనిక్‌ విషం చేరే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్‌ వ్యాధులు వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు పుణేలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఓ. జి. బి. నంబియార్‌.

  మనం తినే ఆహారంలోని విషపదార్థాలపై అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు. మన దేహం నుంచి వ్యర్థాల రూపంలో విసర్జితమైపోయే ఆర్సెనిక్‌తోపాటు మనకు అవసరమైన థయామిన్‌ పోషకం దేహం నుంచి అతిగా బయటకు వెళ్లిపోతుండడం వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే దీనికి విరుగుడు కూడా ఆయన సూచిస్తున్నారు.

  వరి అన్నం వండినప్పుడు గంజి వార్చితే బియ్యంలోని ఆర్సెనిక్‌ విషం చాలా వరకు పోతుందని ఒక పరిష్కారం చెబుతున్నారు. అయితే మరికొన్ని ప్రత్యామ్నాయ ఆహారాలను ఆయన సూచిస్తున్నారు.

  థయామిన్‌ పుష్కలంగా ఉండే కొర్రలు వంటి చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటే ఆర్సెనిక్‌ బాధ తప్పుతుందని, థయామిన్‌ కొరత ఉండదు కాబట్టి డయాబెటిస్‌ సమస్య కూడా రాకుండా ఉంటుందని ఆయన అంటున్నారు.

  ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రకృతి ఆహారోత్సవంలో పాల్గొన్న డాక్టర్‌ నంబియార్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు.. ఆయన మాటల్లోనే..

  ►మనిషి దేహంలోకి వరి అన్నం, బంగాళదుంపల ద్వారా ఆర్సెనిక్‌ విషం ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించే ఆ ఆర్సినిక్‌ రక్తంలోని థయామిన్‌ను మూత్రం ద్వారా అతిగా బయటకు వెళ్లిపో యేలా చేస్తుం టుంది. ధయామిన్‌ మనకు ఉపయోగకరమైన, అత్యంత కీలకమైన పోషకం. అది పోవడం మనకు నష్టం.

  ►ఆహారంలో ఆర్సినిక్‌ ఉన్నప్పుడు థయామిన్‌ ఎంత ప్రభావపూర్వకంగా పనిచేయాలో అంతగా పనిచేయదు. దాంతో మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్‌ కూడా ఎంత ప్రభావవంతగా ఉండాలో అంత ప్రభావవంతంగా తన కార్యకలాపాలు సాగించలేదు. ఫలితంగా ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’ వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిణామమే టైప్‌–2 డయాబెటిస్‌లోనూ ఉంటుంది.

  ►ఇక డయాబెటిస్‌ రోగుల దేహంలో వారి అవసరాలతో పోలిస్తే కేవలం 20% మాత్రమే థయామిన్‌ అందుబాటులో ఉంటుంది.

  ►థయామిన్‌ గ్లూకోజ్‌తో జత చేరినప్పుడే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అయితే థయామిన్‌ లోపం వల్ల జీవక్రియలు సక్రమంగా జరగకపోవడంతో పాటు అనేక వరస పరిణామాలు సంభవిస్తాయి.

  ►2012–15 మధ్యకాలంలో అమెరికాకు చెందిన ఎఫ్‌.డి.ఎ. 1200 రకాల వరి బియ్యంపై అధ్యయనం చేసి… వరి బియ్యంలో అధికపాళ్లలో ఆర్సెనిక్‌ విషం ఉందని నిర్ధారణ చేసింది.

  ►చాలా మంది ఆరోగ్యం కోసం పాలిష్‌ చేసిన బియ్యం కంటే పాలిష్‌ చేయని ముడిబియ్యాన్ని వాడుతుంటారు. పాలిష్‌ చేసిన బియ్యంలో పోషకాలు వెళ్లిపోతాయని, అదే ముడిబియ్యంలో పోషకాలు చాలావరకు పోవని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. అయితే పాలిష్‌ చెయ్యని ముడిబియ్యంలో ఆర్సెనిక్‌ విషం మరింత ఎక్కువగా ఉంటుంది. బియ్యం పైపొరలో ఆర్సెనిక్‌ విషం ఎక్కువగా ఉంటుంది.

  భయం లేదు… జాగ్రత్తలివే…
  ►కొర్రలు వంటి చిరుధాన్యాలు థయామిన్‌ అధికపాళ్లలో కలిగి ఉంటాయి గాకీ ఆర్సెనిక్‌ను ఏమాత్రం కలిగి ఉండవు. ఇలాంటి విషం లేని వాటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటే సమస్య ఉండదు. అయితే, వరి బియ్యం తినటం అనేది అనాదిగా మన ఆహారపు అలవాటు. వరి బియ్యం తినటాన్ని వెంటనే మానుకోలేం. కాబట్టి

  వరి బియ్యాన్ని ఆరు రెట్లు ఎక్కువ నీరు పోసి ఉడికించి… గంజి వార్చి పారబోస్తే అన్నంలోని ఆర్సెనిక్‌ చాలా వరకు పోతుంది.

  అయితే ఇలా వార్చిన గంజి పశువులకు కూడా మంచిది కాదు.

  వరి మొక్కల వేళ్ల మారిదిగానే బంగాళదుంప మొక్కల వేళ్లు కూడా ఆర్సెనిక్‌ విషాన్ని మట్టి నుంచి ఎక్కువగా గ్రహిస్తుంటాయి. బంగాళదుంపల్లో 70 శాతం నీరుంటుంది.

  బంగాళదుంప చిప్స్‌లో ఆర్సెనిక్‌ విషం పాళ్లు ఎక్కువగా ఉంటాయి.
  బంగాళదుంపను కోసి బాగా కడిగితే ఆర్సెనిక్‌ పోతుంది.
  కడగకుండా అలాగే వేపితే ఆర్సెనిక్‌ అందులోనే ఉండిపోతుంది.

  ∙గర్భవతులు వరి బియ్యంతో వండిన అన్నం అసలు తినకుండా చిరుధాన్యాలు తదితర ఆహార ధాన్యాలు తినటం మంచిది. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వరి అన్నం తినిపించకుండా ఉంటేనే మంచిది. వారికి మొదటినుంచి చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినిపించడం మంచిది.

 4. Padayatra …..100 days

 5. @ Chidhambaram …..

  Do you remember what you did to JAGAN a few years ago in a pact with Sonia and Chandrababu ??
  Now your sins have come to haunt your son ….Good Luck.
  Some animals have better values than unethical human beings.

  https://www.ndtv.com/india-news/in-karti-chidambaram-case-indrani-mukerjea-spoke-of-7-lakh-bribe-1818283?pfrom=home-topscroll

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s