పోలవరం అవినీతి పై బాబు కు 8 ప్రశ్నలు వేసిన KVP

1.2015 మార్చిలో పిపిఎ అధికారులు పోలవరం అంచనాలను ప్రస్తుత ధరలకు సవరించి ఇవ్వాలని కోరగా, ఒక నెలలో ఇస్తామని చెప్పిన మీరు 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ప్యాకేజి ప్రకటించే నాటికి కూడా ఇవ్వకుండా ఎందుకు నాటకాలు ఆడారు?

2.పిపిఎ అధికారులు 2014 మార్చి 31కి ముందు ప్రాజెక్ట్‌పై చేసిన ఖర్చును రాష్ట్ర వాటాగా భావిస్తామని, అదేవిధంగా.2014 ఏప్రిల్‌ 1 తరువాత ప్రాజెక్ట్‌పై అయ్యే ఖర్చులో ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందని పదేపదే స్పష్టం చేసింది. అయినా ఎందుకు ప్రతి సమావేశంలో పాత ఖర్చులు, ఇతర జాతీయ ప్రాజెక్ట్‌లకు వలే 90శాతం నిధులివ్వాలని డిమాండ్‌ చేశారు?

3.జీవో నెంబర్‌ 22 జారీ చేసిన తరువాత, అదనంగా లేబర్‌, యంత్రాలు, ఇతర మెటీరియల్‌ ధరల తేడాలు ప్రభుత్వమే భరిస్తే..కాంట్రాక్టర్లకు నష్టం వచ్చే అవకాశం ఎక్కడున్నది?

4.కేంద్రమిచ్చిన ప్యాకేజీలో.2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారమే నిధులు ఇస్తామనే షరతుకు మీరేందుకు అంగీకరించారు?

5.2018 జనవరి 11న జరిగిన పిపిఎ ఏడో సమావేశంలో అధికారులు పునరావాస కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో కావలసిన నిధులు ఎలా సమకూర్చుకొంటారని అడిగినప్పుడు, కేంద్రమే ఇవ్వాలని తేల్చి చెప్పకుండా, పునరావాసం ఫేజ్‌ల వారీగా చేస్తామని ఎందుకు చెప్పారు?

6.ఏప్రిల్‌లో నిపుణుల కమిటీకి ప్రాజెక్ట్‌ అంచనాలు రూ.46,926 కోట్లుగా చెప్పిన మీరు, ఆగష్టు నాటికి అంచనాలను రూ.58,319 కోట్లకు ఎలా పెంచారు?

7.పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనికి 2015-16 అంచనాల ప్రకారం రూ.5,535 కోట్లు ఖర్చుగా పేర్కొంటూ 2016 సెప్టెంబర్‌ 8న జీవో 96 జారీ చేసిన మీరు, అదే హెడ్‌వర్క్స్‌ మిగిలిన పనికి 2013-14 అంచనాల ప్రకారం రూ.11,638 కోట్లు ఖర్చుగా పేర్కొంటూ కేంద్రానికి ఎలా పంపారు?

8.పోలవరం పూర్తి ఖర్చును విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించాలని మీరు ఇప్పటికీ అనుకొన్నట్లైతే..అదే విషయాన్ని హైకోర్లులో తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్‌ ద్వారా తెలియపరిచేందుకు ఎందుకు భయపడుతున్నారు?

18 Comments

Filed under Uncategorized

18 responses to “పోలవరం అవినీతి పై బాబు కు 8 ప్రశ్నలు వేసిన KVP

  1. The LEADER …

    Scences never witnessed before in the history of Indian politics and possibly world politics too .
    One Daring Young man fighting against all odds to restore Democratic values

  2. Day 108 …. The LEADER

  3. The Leader ….
    Day 103 …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s